Financial Planing


భవిష్యత్తులో బంగారం ధర ఏ విధంగా  ఉంటుందో  ఎలా అంచనా వేయాలి ?
భవిష్యత్తులో బంగారం ధర ఏ విధంగా  ఉంటుందో లెక్కించడం , అంచనా వేయడం  ఏ మాత్రం కష్టమైన పని కాదు. నిజం చెప్పాలి అంటే  మనం బంగారం అసలు ధర భవిష్యత్తులో ఎంత ఉంటుంది అని ఉహించడం కాదు ,US  గోల్డ్ రిజర్వు యొక్క విలువ కనుగొంటున్నాం. దీనిని స్కూల్ కి వెళ్ళే బాలుడు కూడా చేయవచ్చు. ఇది సాదారణ అల్జీబ్రిక్ మ్యాథ్స్ .దీనిని క్రింది విధంగా లెక్కించవలసి ఉంటుంది. ఉదాహరణకి ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం అమెరికా వద్ద 8673.5 (మార్చి 2011 ) టన్నుల గోల్డ్ రిజర్వు ఉంది. . US మానిటరీ బేస్ (జూన్ 2011) 2.6 ట్రిలియన్ల డాలర్లు    లేదా  2600  బిలియన్ల డాలర్లు గా ఉంది.  ఆగస్టు 2011 లో బంగారం ధర  అవున్స్ ( ounce)1784  డాలర్లు గా ఉంది. మీరు ఎప్పుడు కూడా బంగారం భవిష్యత్తు  గురించి ధర అంచనా వేయాలి అంటే మీకు మూడు  విషయాలు తప్పకుండా తెలియాలి.అవి
లేటెస్ట్ గోల్డ్ రిజర్వ్ డేటా .
లేటెస్ట్ US మానిటరీ బేస్
ప్రస్తత బంగారం ధర అవున్స్ ( ounce) కి ఎంత ఉంది అనే విషయాలు ముందుగా మీరు తెలుసుకోవాలి. పై మూడు విషయాలు తెలిస్తే మీరు బంగారం ధర సులభంగా అంచానా వేయవచ్చు.
ఉదాహరణకి పై మూడు విలువలు

The US Monetary Base (Aug 2011) is US $ 2.6 Trillion ($ 2600 Billion)
• The Gold Price in Aug 2011 is US $ 1784 per ounce &
• The US Reserve Gold in March 2011 was 8673 Tonnes
So,
8673 Tonnes Gold = $ 2600 Billion ($ 2.6 Trillion)
So 01 Tonne Gold = $ 0.29978 Billion. = $ 299.78 Million
Now, 1 Tonne = 1000 KG = 1000000 Grams
Now, 1 Ounce = 28.3495 Grams = 0.0283495 KG
Now, 28.3495 Grams = 1 Ounce
1000000g = 35273.9620 Ounce.

 So 1 Tonne = 35273.9620  Ounce
So Approx. 1 Tonne = 35273Ounce.
Now, 35273 Ounce (1 Tonne) Gold = $ 299.78 Million
So 1 Ounce Gold = $0.0084985181 Million = $ 8498.518
So 1 Ounce Gold = $ 8498.518
The current price (Aug 2011) of Gold is $ 1784 per 1 Ounce.
The difference is $ 6714.518
This is 4.76 Times price Hike.
 కావున  బంగారం ధర ఇంకా 4.76  రేట్లు పెరగడానికి అవకాశం  ఉంది. ఉదాహరణకి ఇండియా లో బంగారం ధర 10gr రూ 32000 ప్రస్తుతం ఉంటే   రూ 152300 లకు లేదా అంతకంటే ఎక్కువకు చేరడానికి అవకాశం ఉంది. ఎప్పుడు చేరుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. కాని చేరడానికి గల అవకాశాన్ని కొట్టిపారేయలేం.బంగారం ధర పెరగడం అనేది US మానిటరీ బేస్ పై  ఆధారపడి ఉంటుంది కదా ?

బంగారం ధర ఎప్పుడు  ఎందుకు పెరుగుతుంది.  ఎప్పుడు ఎందుకు తగ్గుతుంది.?.
మీరూ ఇదివరకే గోల్డ్ స్టాండర్ట్ గురించి తెలుసుకున్నారు కదా ? ఇప్పుడు US మానిటరీ బేస్  గురించి తెలుసుకోండి. సాదారణ పరిబాషలో సులభంగా అర్ధం అయ్యేలా చెప్పాలి  అంటే మానిటరీ బేస్ అనగా చలామణిలో ఉన్న కరెన్సీ  లేదా మనీ సప్లై . US మానిటరీ బేస్  అనగా  ఆ దేశ ప్రభుత్వం కాలానుగుణంగా  ముద్రించినటువంటి  కరెన్సీ.

మీరు పై చార్ట్ గమనించినట్టు ఐతే 2007 వరకు US మానిటరీ బేస్   800 బిలియన్ డాలర్లు  మాత్రమే. కాని 2011 వచ్చే సరికి US మానిటరీ బేస్   2.6 ట్రిలియన్లు లేదా  2600 బిలియన్ డాలర్ల కు చేరుకుంది. అంటే కేవలం నాలుగు సంవత్సరాలలో 1.8 ట్రిలియన్లు లేదా  1800 బిలియన్ల డాలర్లు ముద్రించడం జరిగినది.1970 తర్వాత ఎప్పుడయితే  గోల్డ్ స్టాండర్డ్ తీసివేయడం జరిగినదో  అప్పటి నుండి  US వారి అవసరానికి అనుగుణంగా కరెన్సీ నోట్లు ముద్రించుకుంటుంది. 1970 నుండి వాస్తవంగా  బంగారానికి , డాలర్ కి మధ్య ఎలాంటి సంభందం లేదు. నిజం చెప్పాలి అంటే బంగారం  నిజమైన మనీ. దీని ధర   US మానిటరీ బేస్   కి అనుగుణంగా  మారుతుంది. మీకు ఇది వరకే తెలియచేయడం జరిగినది కదా ?. US ప్రభుత్వం ఎప్పుడూ కావాలి అంటే అప్పుడు  కరెన్సీ నోట్లను ముద్రించుకుంటుంది కదా ?  ఈ విధంగా ముద్రించిన కరెన్సీ నోట్లు చలామణిలోకి రావడంతో వాటి కనుగోలు శక్తి తగ్గిపోతుంది కదా ?  అప్పుడు బంగారం ధర ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అంటే డాలర్ బలహీనపడటం. బంగారం బలపడటం జరుగుతుంది. ఎప్పుడయితే US మానిటరీ బేస్  పెరుగుతుందో అప్పుడు ప్రపంచంలో డాలర్ల చలామణీ అధికం కావడం  వలన  దానికి అనుగుణంగా బంగారం ధర పెరుగుతుంది.   US మానిటరీ బేస్   పెరగడం వలన  ప్రజల వద్ద అధిక డాలర్లు ఉండటంతో  బంగారాన్ని అధిక ధరల వద్ద కనుగోలు చేస్తారు. దానితో బంగారం ధర పెరుగుతుంది.వాస్తవంగా చెప్పాలి అంటే  బంగారం ధర పెరగడం లేదు.డాలర్ మరియు ఇతర కరెన్సీల విలువ తగ్గుతుండటం  జరుగుతుంది. ప్రభుత్వాలు కొత్తగా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకరావడం  వలన కరెన్సీ కనుగోలు శక్తి తగ్గిపోతుంది దాని వలన బంగారం ధర పెరుగుతుంది అనే విషయం మీకు తెలిసినది కదా ? అదే విధంగా  బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. చలామణి లో ఉన్న అధిక కరెన్సీ నోట్లను ప్రభుత్వం ఎప్పుడైతే ఉపసంహరించుకుంటుందో ఆప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి.కరెన్సీ నోట్లను ప్రభుత్వం ఉపహరించుకోవడం వలన ప్రజల వద్ద తక్కువ మనీ ఉండటంతో బంగారాన్ని కనుగోలు చేయడం తగ్గుతుంది. దాని వలన బంగారం ధర తగ్గుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. US మానిటరీ బేస్   కి , బంగారం ధరకి అవినాభావ సంభందం ఉంది.  US మానిటరీ బేస్   పై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి.అంతే కాని పెళ్ళిళ్ళ సీజన్, పండుగల సీజన్ , దీపావళి , అక్షయ తృతీయ  ఇలాంటివి ఏవి బంగారం ధరను ప్రభావితం చేయలేవు.చేసినా ఒక్కశాతం మించి చేయలేవు. తర్వాతి ఆర్టికల్స్ లో బంగారం ధర  ఏవిధంగా  అంచనా వేస్తారో , ఎంత వరకు ధర పెరగడానికి అవకాశం ఉందో తెలుసుకుందాం.

కరెన్సీ నోట్లు కావలసినంత ముద్రించుకోవడానికి  బంగారంతో ఏమైనా సంభందం ఉందా ?
 పైన చూస్తున్న బంగారు నాణేలు దీ గ్రేట్ అలెగ్జాండర్  330 B.C  కాలానికి  సంభందించినవి.
ఈ ఆర్టికల్ యొక్క ముఖ్యఉద్దేశం  ఎవరైనా సరే  భవిష్యత్తులో  వృద్ది ( appreciate in future ) చెందడానికి అవకాశం ఉండే ఆస్తులు మాత్రమే సంపాదించుకోవాలి  కాని  తరుగుదల ( Depreciating in future) ఉండే ఆస్తులను సంపాదించుకోవడం కాని,కొంత కాలానికి విలువ కోల్పోయే ( purchasing power)నగదును కాని నిల్వ చేసుకోవడం వలన ఎలాంటి లాభం ఉండదు అని  తెలియచేయడం ఈ ఆర్టికల్ ఉద్దేశం.
1970   కంటే ముందు  USA  మరియు  ఇతర ప్రపంచ దేశాలు  కరెన్సీ నోట్లు ముద్రించడానికి బంగారాన్ని ప్రామాణికంగా పరిగణించేవారు.అంటే ఒక డాలర్ లేదా కరెన్సీ ముద్రిస్తున్నారు అంటే అంతే విలువ కలిగిన బంగారాన్ని నిల్వ చేసేవారు . దీనినే గోల్డ్ స్టాండర్డ్ అని పిలిచేవారు.ఉదాహరణకు ఒక డాలర్ ముద్రిస్తున్నారు అంటే  దానికి సమానంగా విలువ కలిగిన గోల్డ్ అంటే 0.693 ounce బంగారం నిల్వ చేసేవారు. ఖచ్చితంగా ఎంత బంగారం అని తెలియదు కాని  కొంత బంగారాన్ని మాత్రం ప్రామాణికంగా నిల్వ చేసేవారు. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు ప్రభుత్వ  వ్యవస్థ మీదా విశ్వాసం లేనప్పుడు ,ద్రవ్యోల్బణం పెరిగి ,  డాలర్ లేదా ఇతర కరెన్సీ వలన  వారి  కనుగోలు శక్తి తగ్గినా సమయంలో  వారి వద్ద ఉన్న కరెన్సీ  నోట్లతో బంగారాన్ని మార్పిడి చేసుకొనే అవకాశం ఉండటం. దీనినే   గోల్డ్ స్టాండర్డ్  అని అంటారు.
ఈ గోల్డ్ స్టాండర్ వలన ప్రభుత్వం ఎప్పుడైనా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకరావాలి అంటే ముందుగా ప్రభుత్వం అంతే విలువ కలిగిన బంగారాన్ని నిల్వ చేసుకోవాలి.దాని తర్వాత మాత్రమే  కరెన్సీ నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకరావదానికి వీలు కలుగుతుంది.
ఈ గోల్డ్ స్టాండర్డ్ అనే పదం ఎప్పటి నుండి ఎక్కడి నుండి  వాడుకలోకి వచ్చినది అని ఆలోచిస్తున్నారా ? ఇది  కొన్ని శతాబ్దాల క్రితమే ప్రారంభం కావడం జరిగినది. వీటిని ప్రజలు వారి  వస్తువులు , ఆస్తులు, సేవలు  పొందే సమయంలో మార్పిడి క్రింద బంగారాన్ని  ఉపయోగించేవారు.కొన్ని సంవత్సరాల తర్వాత  ప్రజలూ ఈ విధంగా  బంగారం తో మార్పిడి చేయడం రిస్కు అని భావించి నగరంలో పేరొందిన బంగారు వ్యాపారస్తుడి వద్ద బంగారం పెట్టి దాని బదులు అతని వద్ద  హామీ పత్రం తీసుకొనేవారు. అంటే ఆ పత్రాన్ని ఎవ్వరూ తీసుకవచ్చిన బంగారం ఇచ్చే విధంగా. ఈ విధంగా  ఈ హామీ పత్రాల చలామణీ ప్రజలకు చాలా సౌకర్యవంతంగా  ఉండేది.ఒకరకంగా చెప్పాలి అంటే ఈ విధంగా కరెన్సీ నోట్ల చలామణి వాడుకలోకి వచ్చినది.

కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బంగారు వ్యారస్తులు ఈ హామీ పత్రాలను ప్రింట్ చేసి వారి వద్ద బంగారం నిల్వ చేసి హామీ పత్రాల కోసం వచ్చే వారికి ఇచ్చేవారు.ఈ విధంగా కరెన్సీ నోట్ల ముద్రణ ప్రారంభం కావడం జరిగినది. కాని ఎప్పుడైనా చలామణి లో ఉండే  కరెన్సీ నోట్లలో పెరుగుదల ఉంటే వాటి కనుగోలు శక్తి తగ్గుత్న్ది అనే విషయం మీకు తెలుసుకదా ? కొన్ని సంవత్సరాల తర్వాత ప్రబుత్వం ఈ పద్ధతి మీదా అజమాయిషీ తీసుకొని ద్రవ్య  సరఫారా ను నియంత్రణలోకి తీసుకోవాలని భావించడం జరిగినది. దానినే  మోడరన్ గోల్డ్ స్టాండర్డ్ అని పిలువడం జరిగినది.
మరికొన్ని సంవత్సరాల తర్వాత  అంటే   1970 లో    USA ప్రభుత్వం  గోల్డ్ స్టాండర్డ్ కి ఎందుకు కట్టుబడి ఉండాలి అనే ఉద్దేశంతో చాలా తెలివిగా ఈ గోల్డ్ స్టాండర్డ్ ను రద్దు చేయడం జరిగినది. అంతే కాకుండా  USA ప్రభుత్వం  తన ప్రజలకి కరెన్సీ కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ హామీ ఇస్తుంది అని తెలియచేయడం జరిగినది.
ఈ విధంగా USA ప్రభుత్వం  గోల్డ్ స్టాండర్డ్ రద్దు చేయడమే కాకుండా  అదనంగా కావలసినంత కరెన్సీ ఎప్పుడూ కావాలంటే అప్పుడు ప్రింట్ చేయగలం అని పరోక్షంగా తెలియచేయడం జరిగినది. 1970 నుండి    USA ప్రభుత్వం  ప్రతి సంవత్సరం కరెన్సీ నోట్లు ముద్రించి చలామణి లోకి తీసుకవస్తుంది. ఈ విధంగా అధిక కరెన్సీ నోట్లు చలామణిలోకి రావడం వలన కరెన్సీ నోట్ల యొక్క కనుగోలు శక్తి తగ్గిపోవడం తో ఇన్ఫ్లేషన్ కూడా పెరగడం మొదలైంది. మీ చేతిలో ఉన్న కరెన్సీ నోటు ఎలాంటి ఇంట్రెన్సిక్  విలువ లేనటువంటి కాగితం మాత్రమే. దానిపై ఎప్పుడో చనిపోయిన ఒక నాయకుడి  ఫోటో మాత్రమే ఉంటుంది. అందువలనే ఈ కరెన్సీ నోట్ యొక్క కనుగోలు ప్రతి సంవత్సరం దారుణంగా తగ్గిపోతుంది.ఈ ఆర్టికల్  నుండి మీరూ తెలుసుకోవలసినది ఏమిటంటే మీరు కరెన్సీ నోట్లను దాచుకోవడం కంటే ఆస్తులు కూడగట్టడం  చాలా మంచిది. మీ దగ్గర అవసరానికి మించి డబ్బూ ఉంటే , కొంత కాలం దానితో పని లేకపోతే  బ్యాంక్ లో  లేదా బీరువాలో దాచే బదులు ఏవైనా  విలువ పెరిగే ఆస్తులు కనుగోలు చేయండి.  అంటే షేర్లు , లాండ్స్ , బాండ్స్,  ఏవైనా కావచ్చు.మీరూ కేవలం డబ్బూ దాచుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటె దాని విలువ కొంత కాలంలో తగ్గిపోతుంది అని మీకు తెలుసుకదా ? ఇప్పుడు ఉన్న కరెన్సీ నోటు  ఏదైనా కాని డాలర్, యూరో , రూపాయి  ఏదైనా సరే ఎలాంటి   ఇంట్రెన్సిక్   వాల్యూ లేనటువంటి కాగితం  నోటు అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. కాబట్టి దానిని దాచి పెట్టుకొనే బదులు ఆస్తులు కనుగోలు చేయండి.



 మీరు  ఆర్ధికంగా ఎదగాలన్న , ఆర్ధికంగా దివాళా తీయాలన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ (చక్రవడ్డీ )  ఏ విధంగా ముఖ్య పాత్ర వహిస్తుందో   తెలుసుకోండి?   
ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ మాటల్లో చక్రవడ్డీ  ఆర్ధిక అభివృద్దికి తోడ్పడే ప్రపంచంలోనే  అత్యుత్తమ సాధనం.అంతేకాకుండా  మరొక సందర్భంలో  చక్రవడ్డీ గురించి   అల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తూ ఇది ప్రపంచంలోనే ఎనిమిదవ వండర్  అనడం జరిగినది.   
చక్రవడ్డీ యొక్క బేసిక్స్ ముందుగా మీరు అర్ధం చేసుకుంటే ఈ చక్రవడ్డీ ఆర్ధిక అభివృద్దికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుస్తుంది.ముందుగా చక్రవడ్డీ అంటే ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం. అయితే చక్రవడ్డీ గురించి తెలుసుకోవడానికంటే ముందు సాదారణ వడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ మీరు చిన్నప్పుడు చదువుకొని ఉండవచ్చు. కాని అవి నిత్య జీవితంలో  మన ఆర్ధిక అభివృద్దికి ఏ విధంగా  తోడ్పాటు అందిస్తాయో తెలుసుకోవాలి.  సాదారణ వడ్డీ లో , వడ్డీ మీరు మొదట ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై మాత్రమే వడ్డీ పొందుతారు. ఉదాహరణకు మీరు    రూ. 100 లను  10% సాదారణ వడ్డీకి ఇన్వెస్ట్ చేస్తే మీరు సంవత్సరం తర్వాత తిరిగి పొందే వడ్డీ రూ 10.  అంటే మీరు సంవత్సరం తర్వాత తిరిగి పొందే మొత్తం రూ 110 (రూ 100 అసలు  + రూ 10వడ్డీ ). రెండు సంవత్సరాల తర్వాత ఐతే రూ 110+10 = రూ 120.  అదే పది సంవత్సరాల తర్వాత అయితే  మీరు పొందే మొత్తం రూ .100 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 = రూ .200 .సాదారణ వడ్డీ లో మీరు 10% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరం రూ 10 లను వడ్డీ రూపంలో పొందుతున్నారు.
చక్రవడ్డీ విషయానికి వస్తే  ప్రతి సంవత్సరం అంతకు ముందు ఉన్న బ్యాలన్స్ అమౌంట్ పై వడ్డీ పొందుతారు. అంతే కాని మొదట ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై కాదు. దీనిని సాదారణ పరిబాష లో  వడ్డీ పై వడ్డీ అని కూడా అంటారు.
ఉదాహరణకి మీరు  రూ. 100 లను  10%  చక్ర వడ్డీకి సంవత్సరానికి ఒక్కసారి లెక్కించే విధంగా ఇన్వెస్ట్ చేస్తే మీరు సంవత్సరం తర్వాత తిరిగి పొందే వడ్డీ రూ 10. అంటే సంవత్సరం తర్వాత మీ వద్ద  గల బ్యాలన్స్  రూ 110 (రూ 100 అసలు  + రూ 10వడ్డీ). రెండవ సంవత్సరం తర్వాత మీ వడ్డీ లెక్కించడానికి మీరు ముందు ఇన్వెస్ట్ చేసిన రూ. 100  ను కాకుండా  ఇప్పుడు ఉన్న బ్యాలన్స్  రూ 110 ని పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు. అంటే రెండో సంవత్సరం తర్వాత మీరు పొందే మొత్తం రూ .110 + రూ .11 (10% of 110) = రూ .121.  మూడు సంవత్సరాల తర్వాత  మీరు పొందే మొత్తం రూ  121 +రూ . 12.1 (10% of 121) =రూ . 133.1, నాలుగు సంవత్సరాల తర్వాత పొందే మొత్తం రూ .133.1 + రూ . 13.31 (10% of 133.1) = రూ . 146.41 మిగితా సంవత్సరాలు కూడా ఇదే విధంగా వడ్డీని లెక్కిస్తారు.పది సంవత్సరాల తర్వాతః పొందే మొత్తం రూ 285.31. మీరు రూ. 100 లను  10%  సాదారణ వడ్డీ కి పది సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే, పది సంవత్సరాల తర్వాత  పొందే మొత్తం  రూ 200.  అదే రూ. 100 లను  10% చక్రవడ్డీకి పది సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే, పది సంవత్సరాల తర్వాత  పొందే మొత్తం  రూ 285.31  అంటే మీరు    రూ. 100 లను  సాదారణ వడ్డీ మరియు చక్రవడ్డీ లలో ఇన్వెస్ట్ చేస్తే సాదారణ వడ్డీ కంటే చక్రవడ్డీ ద్వారా  రూ .85.31 ఎక్కువగా రాబడి పొందుతున్నారు .ఇదే చక్రవడ్డీ యొక్క మహత్యం .ప్రారంభం లో వడ్డీ లో పెరుగుదల తక్కువగా ఉన్నప్పటికీ కాలం గడుస్తున్న కొలది ఈ వడ్డీ లో పెరుగుదల చాలా భారీగా ఉంటుంది. మీరు  ఉదాహరణలో కేవలం  సంవత్సరానికి ఒక్కసారి లెక్కించే విధానాన్ని మాత్రమే చూసారు. కొన్ని ఆర్ధిక సాధనాలు మూడు నెలలకు ఒక్కసారి, ఆరునెలలకు ఒక్కసారి లేక్కిస్తాయి. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వలన రాబడి అధికంగా ఉంటుంది.

మీరు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా లోన్  తీసుకుంటే  చక్రవడ్డీ ద్వారా వడ్డీ లెక్కించడం వలన మీరు ఆర్ధికంగా  చాలా దెబ్బతినడమే కాకుండా చివరకు దివాళా కూడా తీయవలసి వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు చక్రవడ్డీ వలన మీరు  ఆర్ధికంగా ఎదగడానికి ఎంత  లాభం పొందుతారో క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా లోన్   అంతే నష్టపోతారు.
మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం పై చక్రవడ్డీ ద్వారా కాలక్రమేణా ఆసాదరణ లాభాలు అందుకుంటారు.. చక్రవడ్డీ వలనే  ప్రపంచంలో ధనవంతులు ఇంకా ధనవంతులు కావడం జరుగుతుంది.

చివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరూ ఎప్పుడయితే చక్రవడ్డీ ద్వారా పొదుపు లేదా పెట్టుబడి చేయడం మొదలు పెడతారో  మీ డబ్బే మీ కోసం కష్టపడటం ద్వారా కొంత కాలానికి మీరూ ఆర్ధికంగా ఎదగడానికి  ఎంతో సహాయపడుతుంది. మీరూ  ఎప్పుడయితే లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారో అప్పుడు అదే చక్రవడ్డీ మిమ్ములను అర్దికంగా పతనం చేసి చివరకు దివాళా కూడా తీయుస్తుంది. అందుకే ఆర్ధిక వేత్తలు. ఫైనాన్సియల్ అడ్వయిజర్ ఇచ్చే సలహా ఏమిటంటే మీ చిన్న వయస్సులో  అంటే సంపాదన మొదలైన తొలినాళ్ళలోనే మీరు సేవింగ్ , ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే  కొంత కాలంలో మీరు ఆర్ధికంగా ఉన్నత స్థితికి చాలా సులభంగా ఎదగవచ్చు. మీరూ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కాదు ముఖ్యం . ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చాలా  చాలా ముఖ్యం. అందుకే ఇన్వెస్ట్ వెంటనే ప్రారంభించండి.   


బంగారం ధర పెరుగుదల పై అపోహలు.
మనదేశంలో బంగారం ధర పెరుగుదలపై అనేక అపోహలు ఉన్నాయి.అవిఎమిటో ఒక్కసారి చూద్దాం.
దీపావళి పండుగ దగ్గరలో ఉంది కాబట్టి ప్రజలూ అధిక బంగారం కనుగోలు చేస్తారు కావున బంగారం ధర పెరగడానికి అవకాశం ఉంది.
పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం కాబోతుంది . కాబట్టి   బంగారం ధర పెరగడానికి అవకాశం ఉంది.
దీపావళి అనంతరం బంగారం ధరలు పడిపోతాయి . ఎందుకంటే  డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి.
బంగారం ధర పైకే వెళ్ళుతుంది. ఎందుకంటె భారతీయులు బంగారం అధిక కనుగోలు చేస్తారు కావున .
ఇప్పుడు బంగారం పది గ్రాములకు ముప్పైవేలు ఉంది కాబట్టి ప్రజలూ కొనడం మానేస్తారు . అందువలన బంగారం ధరలు పడిపోతాయి.
అక్షయ తృతీయ వస్తుంది కావున , బంగారం అధికంగా కనుగోలు  చేస్తారు కావున బంగారం ధర పెరుగుతుంది.
  
వాస్తవం 
పైన పేర్కొన్నవన్ని కేవలం అపోహలు మాత్రమే. పైనవన్ని కలిపి కూడా బంగారం ధరపై కేవలం  ఒక్క శాతం మాత్రమే ప్రభావం చూపగలవు.బంగారం ధర సాదారణంగా అమెరికా మానీటరీ పాలసీ కి అనుగుణంగా పెరగడం , తగ్గడం జరుగుతుంది. మనదేశంలో బంగారం ధరను  రూపాయి బలహీనపడటం, బలపడటం కూడా ప్రభావితం చేస్తుంది.   


మీరు లేదా మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -3
మిలియనీర్లు, బిలియనీర్లు  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురుంచి అధికంగా ఆలోచిస్తారు.వారూ ఎప్పుడైనా  కొత్త  బిజినెస్ ప్రారంభించడం లేదా వారి డబ్బూ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సాధనంలో  ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  ఏ విభాగం లో ఐతే వారూ పెట్టిన డబ్బూ అధిక రాబడి ఇస్తుందో,  అని ఆలోచిస్తారు.  కాని మధ్యతరగతి వారి దగ్గరికి వచ్చేసరికి  ఇలాంటి ఆలోచన ఏ మాత్రం ఉండదు. మీరు లేదా మీ పిల్లలు  జీవితంలో మిలియనీర్లు లేదా బిలియనీర్లుగా ఎదగాలి అంటే తప్పనిసరిగా ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురించి తప్పనిసరిగా ఆలోచించాలి.కనీసం ఇప్పటినుండైనా   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురించి తెలుసుకోవడం చేయండి. అదే ధనవంతుల విషయానికి వచ్చే సరికి వారి పిల్లలకు చిన్నప్పటి  నుండే తెలియచేయడం వలన వారూ పెరిగి పెద్దయ్యాక ఆర్ధిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.మధ్యతరగతి వారూ  ఆర్ధికంగా ఎదగపోవడానికి ముఖ్య కారణం ఈ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  అవగాహన లేకపోవడమే. వారికి అవగాహన లేకపోవడంతో వారూ కూడా ,వారి పిల్లలకు ఏ విధమైన  ఆర్ధిక పరమైన  విషయాలను పంచలేకపోతున్నారు. అదే ధనవంతుల పిల్లలు ఎప్పుడూ  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురుంచి ఆలోచిస్తుంటారు. ధనవంతులైన , ధనవంతులు కావాలి అనుకుంటున్నవారూ ఎవరైనా సరే తప్పకుండా   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  గురుంచి తెలుసుకోవాలి.
దురదృష్టావశాత్తూ మన స్కూల్స్ లేదా కాలేజీలు ఈ  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  పై ఎలాంటి భోధన చేయడం లేదు. స్కూల్స్ లేదా కాలేజీలు అనేవి కేవలం ఎంప్లాయిస్ లేదా సెల్ఫ్  ఎంప్లాయిస్ లను తయారు చేసే విధంగా మాత్రమే రూపకల్పన చేయబడ్డాయి.వీరూ ధనవంతుల యొక్క వ్యాపారాలను నడుపుటకు ఉపయోగపడతారు. ఒకవేళ  స్కూల్స్ లేదా కాలేజీలు ప్రతి ఒక్కరికి  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ బేసిక్స్ నేర్పించినట్టు ఐతే ధనవంతుల యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని బానిసలాగా కస్టపడి ముందుకు నడిపించేవారూ ఎవ్వరూ? అందువలనే ఈ   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురించి  స్కూల్స్ లేదా కాలేజీలలో నేర్పించరు. ఆ పదాన్ని మన ఉద్దేశ పూర్వకంగానే తొలగించడం జరిగినది.కొన్ని శతాబ్దాల క్రితమే ధనవంతులకు తెలుసు ఆర్ధికంగా ఎదగాలి అంటే ముందుగా  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురుంచి తెలుసుకోవాలి అనే విషయం.
మీరు జీవితంలో మిలియనీర్లు, బిలియనీర్లు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి.  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  అనేది మీరు  మిలియనీర్లు, బిలియనీర్ల క్లబ్ లోకి ప్రవేశించే ప్రవేశ ద్వారం వంటిది.చాలా మంది ఆర్ధిక సలహాదారులు మీరు ఈ మ్యుచవల్ ఫండ్స్ పథకం లేదా ఫలానా షేర్లలో ఇన్వెస్ట్ చేయండి అని సలహా ఇస్తుంటారు తప్పితే ముందుగా మీ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురుంచి ఆలోచించండి అని కాని , మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ మీ    ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ప్రకారం మీకు అనుకూలంగా ఉంటుందా లేదా అని ఆలోచించమని మాత్రం చెప్పరు.ప్రతి పెట్టుబడి మిమ్ములను ధనవంతులను చేయాలని లేదా ప్రతి పెట్టుబడి సాధనం ధనవంతులను చేయగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుంది అని అనుకోవడానికి ఎంత మాత్రం వీలు లేదు.మీరు   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురుంచి తెలుసుకోకుండా   ఫైనాన్షియల్ పొడక్ట్ కొనడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. అదే ధనవంతులూ మాతరం వారూ వారి జీవితంలో చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ముందు తప్పనిసరిగా  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గురించి తెలుసుకున్నతర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వయూ పెట్టె పెట్టుబడులు ఎప్పుడు మంచి రాబడిని మాత్రమే అందిస్తాయి. 


మీరు లేదా మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -2
బిలియనీర్లు ఆర్ధిక వ్యవస్థలో సంపదను స్ప్రుస్టించే స్ప్రుస్టికర్తలు 
బిలియనీర్ల ఆలోచనా విధానం  మధ్యతరగతి వారికి మరియు మిలియనీర్ల కంటే కూడా వేరే విధంగా ఉంటుంది.నిజం చెప్పాలి అంటే వీరూ  ఆర్ధిక వ్యవస్థ లో సంపదను స్ప్రుస్టిస్తారు . బిలియనీర్లు , మధ్యతరగతి వారిలా డబ్బూ కోసం పని చేయడం కాని, మిలియనీర్లలా మనీ ని వారి కోసం పనిచేసే విధంగా చేయడం చేయరు. అంటే వీరూ ఇన్వెస్ట్మెంట్ చేయరని కాదు .ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాని వీరి ఇన్వెస్ట్మెంట్ పద్ధతి వేరే విధంగా ఉంటుంది.బిలియనీర్లు వారికి అవసరమైన మనీని  ఆర్ధిక వ్యవస్థలో చట్టబద్దంగా ముద్రించుకుంటారు.
సరే ఆయితే  వీరూ ఆర్ధిక వ్యవస్థలో సంపద ఎలా  స్ప్రుస్టిస్తారు? చట్టబద్దంగా ఆర్ధిక వ్యవస్థలో వారికి కావాల్సిన మనీని ఏ విధంగా ముద్రించుకుంటారు అనే కదా ? మీ సందేహం. ముందుగా వీరు  ఒక వ్యాపారాన్ని ప్రారంభించి దానిని విజయవంతమైన వ్యాపారంగా తీర్చిదిద్ది ,దానిని ప్రజల వద్దకు పబ్లిక్ ఆఫర్ రూపంలో తీసుకవచ్చి, వారి వ్యాపారంలో కొంత వాటా లేదా షేర్స్ ని మిలియన్ల కొద్ది  ప్రజలకు అమ్మడం ద్వారా  ప్రజలకు  సంపదను స్ప్రుస్టించి వారూ కూడా బిలియనీర్లుగా మారతారు.
మీరు ఇప్పటి  వరకు మధ్యతరగతి, మిలియనీర్లు , బిలియనీర్ల ఆలోచనా విధానం , సంపాదనా విధానం  ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు.ఇకనుండి మీకు చెప్పబోయే ఆర్ధిక పరమైన విషయాలు చక్కగా చదివి అర్ధం చేసుకోండి. ఒకే ఆర్ధిక పరమైన విషయాన్ని మధ్యతరగతి వారూ, మిలియనీర్లు, బిలియనీర్లు  ఏ విధంగా అర్ధం చేసుకొని  ,ఏ రీతిలో  ఉపయోగిస్తారో  తెలుసుకోండి.
ఫైనాన్షియల్ స్టేట్ మెంట్
మీరు ఇదివరకే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ అనే పదం చాలా సార్లు వినే ఉంటారు. దాని గురుంచి మీకు కొద్దో గొప్పో అవగాహన ఉండటం లేదా అసలు ఏమాత్రం అవగాహన కూడా ఉండకపోవచ్చు.మీరు క్రింద ఇవ్వబడిన చిత్రాన్ని చూడండి.మీరు మీ కాలేజీ  నుండి బయటకు వచ్చే సరికి మీ దగ్గర ఉండే  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్  మీ మార్కుల షీటు మాత్రమే.మీరు మీ కాలేజీలో నేర్చుకున్న దాని ప్రకారమే  మీ జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.అదే మిలియనీర్ల , బిలియనీర్ల పిల్లలు చిన్నతనం నుండే  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ పై అవగాహన వారి కుటుంబ సభ్యులనుండే పొందుతారు. అదే మధ్యతరగతి వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చే సరికి   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ గురుంచి చెప్పేవారే ఉండరు. అందుకే మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ఎప్పుడూ మధ్యతరగతి గానే  మిగిలిపోతున్నారు.అయినా ఒక మధ్యతరగతి వ్యక్తీ తన పిల్లలకు  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ గురుంచి , ఆర్ధిక వ్యవహారాల గురుంచి ఏ విధంగా తెలియచేస్తాడు? స్వయంగా అతనికి లేదా ఆమెకే ఏమాత్రం ఆర్ధిక వ్యవహారాలపై అవగాహనలేనప్పుడు.

ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ అంటే ఏమిటి? మీరు  మీ జీవితంలో ధనవంతులు కావాలంటే అది ఎందుకు అతి ముఖ్యమో  సాదారణ బాషలో తెలుసుకుందాం .మీ ఆదాయం , మీ ఖర్చులు, మీఅస్తులు , మీ అప్పులు  మొదలగు వాటి వివరాలు పేపర్ పై నమోదు చేస్తే దానినే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ అంటారు.

         FINANCIAL STATEMENT
                   INCOME STATEMENT
INCOME
EXPENSE
CASH FLOW

                  BALANCE SHEET
ASSETS
LIABILITY
పైన చిత్రంలో చూపించిన విధంగా   ఫైనాన్షియల్ స్టేట్ మెంట్  రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఒక్కటి ఇన్ కమ్ స్టేట్ మెంట్ , రెండవది బ్యాలన్స్ షీట్ . 
ఇన్ కమ్ స్టేట్ మెంట్ లో మీ సాలరీ , వడ్డీ ఆదాయం, డివిడెండ్ ఆదాయం,రెంటల్ ఆదాయం, బిజినెస్ ఆదాయం,ఇతర ఆదాయాలతో పాటు,  మీ ఖర్చుల వివరాలు అంటే, మీరు చెల్లించే టాక్స్ , మీరు జీవించడానికి పెట్టె ఖర్చులు అంటే ఆహారం, బట్టలు మొదలగు వాటికి పెట్టె ఖర్చులు, మీ క్రెడిట్ కార్డ్ బిల్స్, మీ ఈ ఏం  ఐ లు మొదలగు వాటి వివరాలు ఉంటాయి.
బ్యాలన్స్ షీట్ కూడా రెండు భాగాలను కలిగి ఉంటుంది. మొదటిది  అసెట్ కాలమ్  , రెండవది లయబిలిటీ కాలమ్. సాదారణంగా మధ్యతరగతి ప్రజలూ  ఒకే  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్  ఉంటుంది. అది వారి స్వంతది అనే అపోహలో ఉంటారు.కాని వాస్తవంగా ఒక్కో ఆర్ధిక సాధనానికి , ఒక్కో  ఫైనాన్షియల్ స్టేట్ మెంట్  ఉంటుంది. అదే  మిలియనీర్లు, బిలియనీర్లు మనీ తో  మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్  తో కూడా ఆటలు ఆడతారు.


















మీరు ,మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -1

డబ్బు గురుంచి మిలియనీర్లు , బిలియనీర్లు వాళ్ళ పిల్లలకు నేర్పేది , పేద , మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ పిల్లలకు నేర్పలేనిది ఏమిటో తెలుసుకుందాం.
సాదారణంగా మీరు ఏ ఇంట్లో చూసిన ఏ తల్లిదండ్రులు అయినా వారి పిల్లలకు  పై క్రింది  నేర్పిస్తారు.మీరు జీవితంలో కనుక ధనవంతులు , మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే మాత్రం  కొన్ని ఆర్ధిక విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.  అవి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

MIDDLE CLASS TEACH
RICH TEACH
GO TO SCHOOL
FINANCIAL STATEMENTS
WORK HARD
ASSETS
GET GOOD GRADES
LAIBILITIES
GET A JAB
CASH FLOW
JOB SECURITY
GOOD & BAD DEBT
DO IT YOUR SELF
BUSINESS
NEVER THINK OF MONEY
INVESTMENTS
BUSINESS IS RISKY
CREATE JOBS
INVESTMENT IS RISKY
PASSIVE INCOME


అందరూ వారి జీవితంలో ఏదో ఒక్కరోజు ధనవంతులు కావాలి అని ఆశ పడుతూ కలలు కంటారు. ఆశపడటం , కలలు కనడంలో  ఎలాంటి తప్పు లేదు.కాని దురద్రుస్టావశాత్తు  మన విద్యా వ్యవస్థ డబ్బు గురుంచి ఎలాంటి భోదన చేయడం లేదు. అందువల్లనే  చాలా మంది విద్యార్థులు వారి కళాశాల విద్య అనంతరం జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. చివరకు వారం ప్రారంభంలో  సాలరీ కొరకు ఎదిరి చూడాల్సి వస్తుంది.పోనీ కనీసం తల్లిదండ్రులు అయినా  పిల్లలకు  డబ్బు గురుంచి, ఆర్ధిక విషయాల గురుంచి చిన్నప్పటి నుండి  నేర్పిస్తారా అంటే అది ఉండదు. ఇందులో పాపం వారి తప్పేం ఉంది. ముందుగా వారికి అవగాహన ఉండాలి కదా ?. అదే మిలియనీర్లు , బిలియనీర్లు  వారి పిల్లలకు చిన్నప్పటి నుండి డబ్బు గురుంచి,  ఆర్ధిక విషయాల గురుంచి చిన్నప్పటి నుండి నేర్పిస్తారు. ఎందుకంటె వారికి ఆర్ధిక విషయాల పట్ల పూర్తీ అవగాహన ఉంటుంది కాబట్టి. మీరు జీవితంలో ఆర్ధికంగా ఎదగాలి అంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఇక్కడ చెప్పే విషయాలను తప్పనిసరిగా నేర్చుకోవాలి. ముందుగా మీరు మధ్యతరగతి, మిలియనీర్లు, బిలియనీర్ల  ఆలోచనా విధానాలలో  గల తేడా తెలుసుకోండి.
మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం కష్టపడతారు.
మధ్యతరగతి వారి ఆలోచనా విధానం సాదారణంగా సెక్యూరిటీ గా ఉండే  ఉద్యోగం సంపాదించడం , ఆ ఉద్యోగంలో నెలవారీ జీతం కోసం కష్టపడటం , కొంత వయస్సు వచ్చాక అంటే అరవై , అరవై ఐదేళ్ళ వయస్సు వచ్చాకా రిటైర్ కావడం అనే విధంగా ఉంటుంది.
ఈ ఆలోచన విధానం వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల నుండి వస్తుంది. ఇప్పటికి కూడా వారి ఆలోచన విధానంలో తేడా ఎంత మాత్రం ఉండదు. ఉద్యోగం లేకపోవడం లేదా ఉన్న ఉద్యోగం పోవడం అనే ఆలోచనే వారికి భరింపరానిదిగా ఉంటుంది.  వీరికి డబ్బు సంపాదించడానికి చేతనైనది ఒక్కటే అది ఉద్యోగం చేయడం. వారి విలువైన జీవితాన్ని ఉద్యోగానికి అంకితం చేస్తూ ప్రతినెల మొదటి వారం రాగానే సాలరీ కొరకు ఎదిరిచూడటం మాత్రమే చేస్తారు.
మిలియనీర్లు వారి  మనీని వారి కోసం పనిచేసే విధంగా చేస్తారు.
సాదారణంగా మిలియనీర్లు వారి మనీ ని వారి కోసం పనిచేసే విధంగా చేస్తారు.అంటే వారూ అధికంగా కష్టపడకుండా  వారూ ఇదివరకే సంపాదించిన మనీ , ఇంకా వారి కోసం సంపాదించే విధంగా చేసుకుంటారు.వీరూ  మనీని మానేజ్ చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు.అంటే మనీని పెట్టుబడి పెట్టడం . వీరూ సాదారణంగా అనేక రకాలైన పెట్టుబడులు పెడతారు. అంటే షేర్స్ , రియల్ ఎస్టేట్ , గోల్డ్, బాండ్స్, మ్యుచవల్  ఫండ్స్, బిజినెస్ , వెబ్సైట్స్ మొదలగునవి. వీరికి ఇన్వెస్ట్మెంట్ చేయడం నైపుణ్యంతో కూడుకున్నది అనే విషయం బాగా తెలుసు, దాని వలన ఆర్ధికంగా చాలా త్వరగా ఎదగవచ్చు అనే విషయం కూడా బాగా తెలుసు. అందువల్లనే వారూ వారి  యుక్త వయస్సులో అంటే సంపాదన  మొదలైన తొలినాళ్ళ లోనే  వీరూ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారు. వీరి ఆలోచన విధానం ఒక్కటే .ఇన్వెస్ట్ చేసిన మొదటి రోజు నుండే వారి మనీ ,వారి కోసం  పని చేయడం మొదలు పెట్టి కొంత కాలానికి వారిని ఆర్ధికంగా ఉన్నత స్థితిలో నిలబెట్టి ధనవంతులు చేస్తుంది అని.  అంతే కాకుండా వీరూ  ,వారి పిల్లలకు చిన్నప్పటి నుండి  ఆర్ధికపరమైన పాఠాలు  , ఇన్వెస్ట్మెంట్ నైపుణ్యాలు నేర్పుతారు. అదే సమయంలో మధ్యతరగతి వారూ మాత్రం వారి పిల్లలకు బాగా చదివి  మంచి మార్కులు తెచ్చుకుంటే ,  సెక్యురిటీ ఉన్న మంచి ఉద్యోగం వస్తుంది.దానితో పాటు మంచి సాలరీ వస్తుంది అని పిల్లలకు నేర్పుతారు.


మీరు  సంపాదిస్తున్న ఆదాయం మంచిదా ? లేక చెడ్డదా ? అసలు ఆదాయం ఎన్ని రకాలు ? వాటిలో ఏ ఆదాయం మంచిది ? ఎందుకు మంచిది ?
ఆదాయం అంటే  ఉద్యోగం, బిజినెస్ ,ఇన్వెస్ట్మెంట్ ద్వారా  వచ్చే డబ్బు. ఈ ఆదాయం  మంచి ఆదాయం , చెడ్డ ఆదాయం ఏదైనా కావచ్చు. ఏంటి? ఆదాయంలో కూడా మంచి ఆదాయం , చెడ్డ ఆదాయం అని కూడా ఉంటాయి అని అనుకుంటున్నారా ?  అవును తప్పకుండా ఉంటాయి.మీ దృష్టిలో మంచి ఆదాయం అంటే మంచి సాలరీ , అధిక ఆదాయం ఉండటం , చెడ్డ ఆదాయం అంటే తక్కువ సాలరీ ఉండటం , తక్కువ ఆదాయం ఉండటం.అంటే మీరు పొందుతున్న ఆదాయం యొక్క పరిమాణం ను బట్టి అది మంచి ఆదాయం లేదా చెడ్డ ఆదాయం అనే నిర్ణయానికి వస్తారు.కాని ఇది ఎంత మాత్రం మంచిది కాదు.ఇప్పుడు ఒక్కసారి మనం ఆదాయం ఎన్ని రకాలు దానిలో మంచి ఆదాయం , చెడ్డ ఆదాయం ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.
ఆదాయం సాదారణంగా మూడు రకాలుగా ఉంటుంది.
ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్:ఈ ఆదాయం సాదారణంగా మీరు పని చేయడం వలన వచ్చే ఆదాయం.మీరు సాదారణంగా ప్రతి నెల అందుకొనే సాలరీ .దీనిలోనే మీ బోనస్ , కమీషన్ , ఓవర్ టైమ్ పని చేయడం వలన వచ్చే ఆదాయం కూడా ఉంటుంది. ఈ ఆదాయం మీరు ఎప్పుడైతే పని చేయడం అపేస్తారో, అప్పుడు ఈ ఆదాయం రావడం కూడా ఆగిపోతుంది.
పోర్ట్ఫోలియో ఇనకమ్ : ఈ ఆదాయం సాదారణంగా పేపర్ అస్తులవలన  లేదా ఎలక్ట్రానిక్ ఆస్తుల వలన వస్తుంది. అంటే  షేర్స్ ,బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మొదలగు వాటి ద్వారా వచ్చే ఆదాయం.
పాసివ్ ఇనకమ్:పాసివ్ ఇనకమ్ సాదారణంగా బిజినెస్ లేదా రియల్ ఎస్టేట్ మార్గాల ద్వారా వస్తుంది.అంతే కాకుండా మీ తెలివి తేటల మీదా వచ్చే రాయల్టీ ఇనకమ్ అంటే మీరు వ్రాసిన బుక్స్, సాంగ్స్ ,మొదలగు వాటిపై వచ్చేది.
పై మూడింటిలో పోర్ట్ఫోలియో ఇనకమ్, పాసివ్ ఇనకమ్ మంచి ఆదాయం ఆయితే , ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్  చెడ్డ ఆదాయం అవుతుంది. చాలా మందికి ఈ చేడ్డ ఆదాయం సంపాదించడం మాత్రమే చేతనవుతుంది.మంచి ఆదాయం సంపాదించే ప్రయత్నం కూడా చేయరు.చెడ్డ ఆదాయం కోసం మాత్రం  అధికంగా కష్టపడతారు. 
ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్ ఎందుకు చెడ్డ ఆదాయం.?
ఈ ఆదాయం కోసం మీరు నిరంతరం శ్రమ పడవలసి ఉంటుంది.
మీరు సంపాదించే ఆదాయం పై అధికంగా టాక్స్ చెల్లించవలసి ఉంటుంది.
మీ ఆదాయం పై మీకు ఎలాంటి  కంట్రోల్ ఉండదు. అంటే మీరు టాక్స్ చెల్లించగా మిగిలే ఆదాయం ను మాత్రమే మీకు ఇష్టమైన రీతిలో వాడుకోవచ్చు.
కొన్ని సమయాలలో మీకు కనీస ఆదాయం కూడా మిగలకపోవచ్చు.
ఈ ఆదాయానికి నిర్దిష్ట పరిమితి ఉంటుంది.
ఈ ఆదాయం నో వర్క్ , నో  పే  అనే కేటగిరికి చెందుతుంది.
ఈ ఆదాయం కోసం మీరు నిజంగా చెప్పాలి అంటే బానిసలాగా పని చేయవలసి ఉంటుంది.
ఈ ఆదాయం మీరు ఎంత ఎక్కువగా పొందుతుంటే మీరు అంత బానిసలాగా పని చేయవలసినదే. మీరు పని చేయడం ఒక్కసారి ఆపి వేసారు అంటే మీ ఆదాయం రావడం ఆగిపోతుంది. అంతే కాకుండా ఈ ఆదాయం కొరకు మీరు మీ విలువైన మీ సమయం మొత్తం కేటాయించవలసి ఉంటుంది. కొంత మంది ఈ ఆదాయం కోసం వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబానికి కనీస సమయం కూడా కేటాయించకుండా కష్టపడేవాళ్ళ ని చాలా మందిని చూస్తేనే ఉంటారు. ఈ కష్టం పాసివ్  ఇనకమ్ కొరకు కష్టపడితే వారి జీవితం ఆర్ధికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉండేది.
పాసివ్ ఇనకమ్ ఎందుకు ఆమంచి ఆదాయం.
పాసివ్ ఇనకమ్ కొరకు తక్కువగా పని చేయవలసి ఉంటుంది.
పాసివ్ ఇనకమ్ పై టాక్స్ తక్కువగా ఉంటుంది.
ఈ ఆదాయానికి టాక్స్ పరంగా కూడా చాలా మినహాయింపులు ఉంటాయి.
ఈ ఆదాయం సంపాదించడానికి ఎలాంటి నిర్దిష్ట పరిమితి ఉండదు. ఆకాశమే హద్దుగా మీకు చేతనయినంత ఆదాయం సంపాదించు కోవచ్చు. 
మీరు ఎంత ఎక్కువ మందికి సేవ అందించగలిగితే అంత ఆదాయం సంపాదించు కోవచ్చు.
ఒక్కసారి మీరు ఈ ఇనకమ్ సంపాదించడంలో మాస్టర్ అయితే ఇక మీ ఆదాయానికి తిరుగు ఉండదు.
సాదారణంగా బిజినెస్ ఓనర్స్ వారి ఆదాయం పై అధిక కంట్రోల్ కలిగి ఉంటారు. వీరు ఖర్చు పెట్టగా మిగిలిన దానిపై మాత్రమే టాక్స్ చెల్లిస్తారు. మీరు ధనవంతులు కావాలి అంటే మీరు తప్పకుండా పాసివ్ ఇనకమ్ కొరకు ప్రయత్నం చేయాలి.  కాని దురద్రుస్టావశాత్తు చాలా మంది చెడ్డ ఆదాయం కొరకు బానిసలాగా కష్టపడతారు.కనీసం మంచి ఆదాయం సంపాదించే ప్రయత్నం కూడా చేయరు.
ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్ ను 70% ఆదాయం అని కూడా అంటారు.ఎందుకంటె ఈ ఆదాయంలో మీరు తప్పనిసరిగా గరిష్ట  టాక్స్ 30% మీరు చెల్లించిన తర్వాత మిగిలిన ఆదాయం 70% ను మాత్రమే సాలరీ రూపంలో అంటే పే చెక్ రూపంలో అందుకోగలరు. అంటే కనీసం మీరు సంపాదించిన ఆదాయం మీ చేతికి కూడా రాక ముందే 30% పోతుంది. ఇకా మిగిలేది 70% ఆదాయం మాత్రమే కదా ?
జాబ్ చేయడం వలన సెక్యురిటీ ఉంటుంది అని చాలా మంది భావిస్తుంటారు. ఈ రోజుల్లో జాబ్ కి ఎంత సెక్యురిటీ ఉంటుందో మీకు ఎవ్వరూ చెప్పవలసిన  పనిలేదు. జాబ్ చేయడం వలన మీరు చాలా చాలా తక్కువ ఆదాయం పొందుతారు. కాని చాలా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది.ఈ రోజుల్లో తెలివైన వారూ చేసే పని తక్కువ కష్టపడటం , ఎక్కువ ఆదాయం పొందటం. దీనినే 80:20  రూల్ అంటారు . అంటే మీ  20% కష్టం తో 80% ఆదాయం రావాలి. ఇది కూడా మన జనాభాలో 20 % మాత్రమే అంటే పాసివ్ ఇనకమ్  కోసం మాత్రమే పని చేస్తారు . 80 % మాత్రం ఆక్టివ్ ఇనకమ్  లేదా ఎర్నేడ్ ఇనకమ్ కోసం పని చేస్తారు. ఏది ఎమైనా మీరు మీ స్వంత బిజినెస్ కోసం కష్టపడం వలన చాలా లాభాలు ఉంటాయి.

-
EMPLOYESS
BUSINESS OWNER
STEP 1
EARNS
EARNS
STEP 2
TAXED (TDS)
SPENDS
STEP 3
SPENDS WHAT IS LEFT
PAY TAX WHAT IS LEFT
ఉద్యోగస్తులూ , బిజినెస్ చేసే వాళ్ళు ఇద్దరూ  ఆదాయం పొందుతారు.కాని  ఉద్యోగస్తులూ ముందుగా వారూ సంపాదించిన దానికి టాక్స్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేసుకొనే అవకాశం కలిగి ఉంటారు. అదే వ్యాపారస్తులు ఐతే మాత్రం  సంపాదించిన ఆదాయం ముందుగా ఖర్చు చేసి మిగిలిన మొత్తం పై మాత్రమే టాక్స్ చెల్లిస్తారు. ఉద్యోగస్తుల కొరకు టాక్స్ లా  పరమ దరిద్రంగా ఉంటే , వ్యాపారస్తుల కోసం మాత్రం టాక్స్ లా   చాలా అనుకూలంగా ఉంటుంది.మీరు మీకున్న భాద్యతల వలన ఉద్యోగం తప్పనిసరి అయితే మీకున్న ఖాళీ సమయం ప్రెండ్స్ తో పనికి రాని కబుర్లు,  టి .వి చూడటం కంటే పార్ట్ టైం బిజినెస్ ప్రారంబించి  మంచి ఆదాయం పొందడానికి  కష్టపడండి.

నెంబర్ 72  మహత్యం 
సాదరణంగా చాలా మందిని ఒక సందేహం   ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అదేమిటంటే   వారి డబ్బు ఎంత కాలంలో రెట్టింపు అవుతుంది అనే విషయం. చక్రవడ్డీ తో మీరు పొదుపు చేసిన డబ్బు  ఎంతకాలంలో రెట్టింపు అవుతుంది తెలుసుకోవాలి అంటే  మీరు నెంబర్  72 గురించి తప్పకుండా తెలుసుకోవలసినదే. ఈ ఫార్ములా ని శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవిష్కరించెను . ఇది చాలా సులభం వడ్డీ రేటు తో 72 ను భాగిస్తే చాలు . మీ సొమ్మూ ఎంత కాలంలో రెట్టింపు అవుతుందో సులభంగా తెలిసిపోతుంది. ఉదాహరణకు వడ్డీ రేటు 12 శాతం అనుకుంటే మీ డబ్బు 6  సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.అదెలాగంటే  72/12=6.  ఈ విధంగా  72 సంఖ్యా ద్వారా మీ దబ్బు రెట్టింపు  జరిగే కాలాన్ని సులభంగా లెక్కించవచ్చు.వడ్డీ రేటు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమె ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది.మీరు రూ.  2,500  లను 9% శాతం వడ్డీ కి ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు  72/9= 8.  సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.
ధనవంతులు కావడానికి ఉన్న అవకాశాలు
ధనవంతులు  ఏ విధంగా కావచ్చు అని ఎవ్వరిని అడిగిన చెప్పే సమాధానం . బాగా సంపాదించు  లేదా కోరికలను తక్కువగా కలిగి ఉండి  అధికంగా అదా చేయడం అని చెప్తారు. కాని చాలా మంది రెండిటిలో దేనిలో కూడా ప్రావీణ్యం కలిగి ఉండలేరు.చాలా  మందికి  అధిక కోరికలు  ఉంటాయి కాని అధిక సంపాదన మాత్రం ఉండదు. చాలా మంది ఇతర  మార్గాలా ద్వారా ధనవంతులు  కావడం జరుగుతుంది.  మనం ఒక్కసారి ఆ మార్గాలు ఏమిటో పరిశీలిద్దాం.
మీరు ధనవంతులైన  అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. 
చాలా మందికి ధనవంతులు కావడానికి సులభంగా ఎన్నుకొనే మార్గం. ఈ రోజుల్లో దాదాపుగా ప్రతి పెళ్లి వెనుక డబ్బు ప్రముఖ పాత్ర వహిస్తుంది.కాని ఇక్కడ ఒక్క విషయం కేవలం డబ్బుపై ప్రేమతో అమ్మాయి లేదా అబ్బాయి పై ప్రేమ లేకుండా  పెళ్లి చేసుకోవడం వలన  జీవితంలో  ఇబ్బందుల పాలు తప్పకుండా పడతారు.
మోసగాడు లేదా నిజాయితీ లేని వ్యక్తిగా మారడం.
చాలా మంది లీగల్ గా నిజాయితీ తో ధనవంతులు కాలేము అనే ఉద్దేశంతో  ఇల్లీగల్ మారగాన్ని అంటే మోసపూరిత మార్గాన్ని ఎన్నుకుంటారు.  కాని ఈ మార్గంలో ఎప్పటికైనా జైలు కి వెళ్ళాక తప్పదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.ఈ మార్గం ఎన్నటికి అనుసరణీయం కాదు.
వంశ పారంపర్యంగా ధనవంతులు కావడం.
ఉదాహరణకు మీ తాత లేదా తండ్రిగారు ధనవంతులు ఐతే  , ఆ ఆస్థి వారసత్వంగా మీ వద్దకు చేరుకోవడం వలన కూడా ధనవంతులు  కావచ్చు. కాని  మీ సంపాదన ద్వారా  మీరు ధనవంతులు ఐతే ఉండే ఆనందం దీనిలో ఉండదు.అంతే కాకుండా ఇలా వారసత్వంగా ధనవంతులు కావడం అనేది అందరికి ఉండే అవకాశం మాత్రం కాదు.
లాటరీ గెలుపొందడం వలన ధనవంతులు కావడం.
ఈ మార్గం ద్వారా ధనవంతులు కావడం  మంచిదే. కాని ఈ విధంగా ధనవంతులు కావాలి అని మీరు ఎదిరి చూడటం గాలిలో దీపం లాంటిది.చాలా మంది లాటరీ గెలుస్తాం అనే ఆశతో లాటరీ టిక్కెట్లు కొనడం చూస్తేనే ఉంటాం. కాని  ఈ విధంగా ధనవంతులు కావదానికి ఉండే అవకాశం చాలా తక్కువ..
సినిమా స్టార్ లేదా గొప్ప స్పోర్ట్ స్టార్  కావడం
మీరు చాలా అందంగా ఉండి  మీ వద్ద టాలెంట్ ఉంటే మీరు సినిమా స్టార్ లేదా టి వి స్టార్  కావడం లేదా మీకు ఏదైనా ఆటలో మంచి ప్రావీణ్యం ఉంటే  గొప్ప స్పోర్ట్ స్టార్  కావడం వలన కూడా మీరు ధనవంతులు కావచ్చు.
ధనవంతులు కావాలి కోరిక మీలో అధికంగా ఉండటం.
కొంత మందికి ధనవంతులు కావలి అనే కోరిక చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి వారూ ,వారి లక్ష్యాల కోసం చాలా కష్టపడతారు. వారి లక్ష్యం కోసమా వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేయవలసి ఉంటుంది.
ఆర్ధికంగా పూర్తీ అవగాహన కలిగి  ఉండటం. 
కొంత మంది ఆర్ధిక విషయాల పట్ల పూర్తీ అవగాహన కలిగి ఉండి  సరియైన సమయంలో , సరియైన విధంగా ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకొని ధనవంతులు కావడం జరుగుతుంది. దీని కోసం మీరు ఆర్ధిక విషయాలు నేర్చు కోవలసి ఉంటుంది.
చాలా మందికి సేవ చేయడం.
ఇక్కడ సేవ చేయడం అంటే  సామాజిక సేవ చేయడం కాదు. మీరు ఉద్యోగస్తులూ  ఐతే మీ సర్వీసు కొంత మందికే మాత్రమే అందించ బడుతుంది దానికి మీరు జీతం అందుకుంటారు .అదే మీరు వ్యాపారస్తులూ ఐతే చాలా మందికి సేవ చేయవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారం సులభంగా అభివ్రుద్ది చెందడంతో మీ కోరిక నెరవేరుతుంది.కాని ఈ పద్దతిలో మీరు ధనవంతులో కావాలి అంటే మాత్రం మీరు మీ ఉద్యోగాన్ని వదిలి మీ స్వంత బిజినెస్ ప్రారంభం చేయాల్సి ఉంటుంది.


ఇన్ఫ్లేషన్ అనగా ఏమి ? దాని ప్రభావం మనపై ఏ విధం గా ఉంటుంది?  part -2
ఇన్ఫ్లేషన్ మీ ఆర్ధిక స్థితి గతులపై చాలా తీవ్రమైన ప్రభావం చూపెడుతుంది. ఇన్ఫ్లేషన్  అనేది ధరలలో  పెరుగుదలను కొలిచే ఒక సాధనం. ఇన్ఫ్లేషన్ కనుక  6% ఉంది  అంటే సగటున  ధరలలో 6%  పెరుగుదల  నమోదు ఐనట్టు  అంటే  వస్తువు కాని గత సంవత్సరం రూ  100 ఉంటే అదే వస్తువు ప్రస్తుతం రూ 106   లభ్యమవుతుంది. ఇన్ఫ్లేషన్  6%  మాత్రమే  నమోదు అవుతుంది  అనుకుంటే రోజు రూ  100 విలువ పది సంవత్సరాల తర్వాత Rs 53.86 గానూ ,ఇరవై సంవత్సరాల తర్వాత రూ  29.01 గానూ మాత్రమె  ఉంటుంది. అంటే రూపాయి విలువ దారుణంగా తగ్గిపోతుందిఅందుకే ఎప్పుడు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ పై రాబడి ఇన్ఫ్లేషన్ కంటే అధికంగా ఉన్నప్పుడే  మీరు నిజమైన రాబడి అందుకున్నట్టు.

సాదారణంగా మీరందరూ  బ్యాంక్ లో ఫిక్సెడ్ డిపాజిట్  చేసి దాని మీదా  8.5 % నుండి 9.0% వడ్డీ   వస్తుంది  అని చాలా మంది సంతోషపడుతుంటారు . మీకు 9.0% వడ్డీ   వస్తుంది అంటే సంవత్సరం తర్వాత మీ రూ  100  వడ్డీ తో కలిపి రూ  109  అవుతుంది బాగానే ఉంది మీ వంద పై తొమ్మిది రూపాయల రాబడి  వచ్చినది అనుకుంటున్నారు . కాని,   మీ బ్యాంక్ వడ్డీ పై సాదారణంగా   3% నుండి 3.5% టాక్స్ చెల్లించాల్సి వస్తుంది.  ఇక మిగిలినది రూ . 106 కాని, ఇన్ఫ్లేషన్    ఉండనే ఉంది.  అంటే మీరు గత సంవత్సరం వంద రూపాయలకు కొన్న వస్తువు ఈ రోజు నూట ఆరు రూపాయలు . ఇక మీకు వచ్చిన రాబడి ఎక్కడ ?
ఇన్ఫ్లేషన్ మీ కొనుగోలు సామర్ధ్యం ను తగ్గించి వేస్తుంది.సాదారణంగా సంప్రదాయ ఇన్వెస్టర్స్ రిస్కు లేకుండా  ఉండటానికి అని  బ్యాంక్ లేదా  డేట్  సాధనాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీకు వచ్చే రాబడి కేవలం  ఆరు నుండి ఏడు శాతం ఉండి , ఇన్ఫ్లేషన్ కూడా ఏడు శాతం వరకు ఉంటే మీకు వచ్చే రాబడి ఎమి ఉండదు.  అదే విధంగా సేవింగ్ ఖాతా లో చాలా మంది సొమ్మూ ఉంచేస్తారు. ఇది కూడా పద్ధతి కాదు . ఈ విధంగా చేయడం వలన మీ సొమ్మూ యొక్క విలువ తగ్గి పోతుంది తప్ప ఎట్టి పరిస్తుతులల్లో  విలువ పెరుగదు. కేవలం సేవింగ్ ఖాతాలో మీ ఎమర్జేన్సీ ఫండ్   తప్ప అంతకంటే అధిక సొమ్మూ ఉంచరాదు.  
ఇన్ఫ్లేషన్ అనగా ఏమి ? దాని ప్రభావం మనపై ఏ విధం గా ఉంటుంది?  part -1
మీ చిన్నప్పుడు కొన్న వస్తువు ఏదైనా  సరే ఇప్పుడు కూడా అదే ధరకు లభ్యమవుతుందా ! లేదా  ఈ రోజు  కొన్న వస్తువు ఏదైనా సరే , భవిష్యత్తులో అదే ధరకు లభిస్తుంది అని నమ్ముతున్నారా ! లేదు కదా ! మీ చిన్న వయస్సులో కిలో పది రూపాయలు ఉన్న  బియ్యం ధర ఈ రోజు కిలో ముప్పై రూపాయల పైననే . మీరు ఏ వస్తువైన తీసుకోండి  మీ చిన్నప్పటికి , ఇప్పటికి ఎన్నో రెట్లు ధరలు పెరిగాయి.దీనికి ముఖ్య కారణం ద్రవ్యోల్బణం . దీనిని  ఎక్కువగా ఇన్ఫ్లేషన్ అని అంటారు.ఇన్ఫ్లేషన్ పెరగడం వలన  డబ్బు యొక్క విలువ తగ్గిపోవడంతో  మీకు తక్కువ వస్తువులు కాని సేవలు కాని లభ్యమవుతాయి. అదేవిధంగా ఈ ఇన్ఫ్లేషన్  మీ యొక్క సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ పై చాలా ప్రమాదకర ప్రభావం చూపెడుతుంది. ఇన్ఫ్లేషన్ వలన ఒక వ్యక్తీ యొక్క కొనుగోలు సామర్ధ్యం తగ్గిపోతుంది. ఉదాహరణకు ఈ రోజు కిలో బియ్యం ఇరవై ఉంటే  అదే కిలో బియ్యం  సంవత్సరం తర్వాత ఇరవై ఐదు రూపాయలకు  లభిస్తుంది అంటే ధర ఇరవై ఐదు శాతం పెరిగినట్టు లేదా ఇన్ఫ్లేషన్ ఇరవై ఐదు శాతం నమోదు ఐనట్టు. మీరు మీ వద్ద గల వంద రూపాయలకు ఈ రోజు ఐదు కిలోలు కొనగలిగితే  సంవత్సరం తర్వాత మీరు కొనగలిగే  బియ్యం నాలుగు కిలోలే.అంటే ఇక్కడ ఏమి జరిగినది మీ వద్ద గల వంద రూపాయల కొనుగోలు శక్తి  తగ్గిపోయినట్టే కదా !  అదే విధంగా మీరు ఈ రోజు సేవింగ్ చేసిన లేక ఇన్వెస్ట్మెంట్ చేసిన వంద రూపాయల మీద కనుక రాబడి సంవత్సరానికి ఇరవై ఐదు శాతం పైన వస్తేనే మీకు నిజమైన రాబడి వచ్చినట్టు .ఎందుకంటె ఈ రోజు కొన్న ఐదు కిలోల బియ్యం  , సంవత్సరం తర్వాత కొనాలి అంటే నూట ఇరవై ఐదు రూపాయలు కావాలి కదా! ఇన్ఫ్లేషన్  లెక్కించడానికి అన్ని రకాల వస్తువులు మరియు సేవలను లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కేవలం ఉదాహరణ కొరకు మాత్రమే  బియ్యం తీసుకోవడం జరిగినది.   ఈ రోజు గల రూపాయి విలువ సంవత్సరం తర్వాత అదే విధంగా ఉండటం లేదు అంటే రూపాయి విలువ ప్రతి సంవత్సరం  తగ్గిపోతుంది .అదే విధంగా ఈ రోజు వంద రూపాయలు మీరు ఎవ్వరికైనా అప్పుగా ఇచ్చి సంవత్సరం తర్వాత కూడా వంద రూపాయలు తిరిగి పొందడం వలన లాభమా ! నష్టమా ! అంటే  మీకు నష్టమే .  ఇన్ఫ్లేషన్  కనుక పది శాతం  నమోదు అవుతుంటే  మీరు నూట పది రూపాయలు  తిరిగి పొందితేనే  మీకు ఎలాంటి నష్టం లేదు
ఈ రోజు  ఏదైనా ఉన్నత విద్య పూర్తీ చేయాలంటే కనీసం రెండు లక్షల రూపాయలు అవుతున్నాయి అనుకుంటే  ఈ రోజు   పది సంవత్సరాలు  వయస్సు ఉన్న మీ కూతురు మరో పది సంవత్సరాల తర్వాత ఇదే  ఉన్నత విద్య  పూర్తీ చేయుటకు అప్పుడు కూడా ఈ రెండు లక్షలే సరిపోతాయా ! మీ సమాధానం ఎట్టి పరిస్తుతులలో  కానే కాదు. ఇన్ఫ్లేషన్  కనుక ఎనిమిది శాతం నమోదు అవుతుంది అనుకుంటే కావలసిన మొత్తం రూ. 431785 . ఈ వధంగా పెరిగే ఖర్చులు తట్టుకోవాలి నాటే మంచి ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు  చేసుకోవాలి.

గోల్డ్  మరియు సిల్వర్ లలో దేనిలో పెట్టుబడి పెడితే అధిక రాబడి ఉంటుంది.

2012  లో అధిక రాబడి అందించిన ఇన్వెస్ట్మెంట్ సాధనం ఏమిటో చెప్పగలరా ? ఆలోచిస్తున్నారా ?  బంగారం , షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ అని  అనుకుంటున్నారా ? ఎంత మాత్రం కాదు. 2012  లో అధిక రాబడి  వచ్చినది సిల్వర్ లో మాత్రమే .సిల్వర్ ఇప్పటి వరకు 2012  లో 25.61% CAGR రిటర్న్ అందివ్వడం జరిగినది.1 jan 2012 రోజు సిల్వర్ రేటు  రూ   51043 kg  ఉంటే  ఇప్పుడు  20 sep 2012రోజు రూ  64116kg  రేటుకి పెరగడం జరిగినది.అంటే కేవలం  9 నెలలలో నమ్మశక్యం కాని విధంగా 25.61% రాబడి ఇవ్వడం జరిగినది. సిల్వర్ లో తొమ్మిది నెలల రాబడి చూసి మోసపోకండి పూర్తీగా చదవండి. సిల్వర్ లో స్మవత్సరం వారీగా రాబడి చూసుకుంటే  రాబడి సున్నా మాత్రమే. గత సంవత్సరం  sep 2011 లో కూడా సిల్వర్ ధర   64353 kg ఉండటం జరిగినది.
బంగారం పరిశీలిస్తే 2012  లో 16.63% CAGR రిటర్న్ అందివ్వడం జరిగినది. 1 jan 2012 నాడు రూ  27322 - 10gm  ఉంటే  20 sep 2012రోజున   31865-10gm ధర  ఉండటం జరిగినది.అంటే కేవలం తొమ్మిది నెలలలో 16.63% రాబడి అందించడం జరిగినది.
ఇన్వెస్టర్లలో బంగారం లో ఇన్వెస్ట్ చేయడమా ? లేక సిల్వర్ లో చేయడం  మంచిదా ? దేనిలో రాబడి అధికంగా ఉంటుంది అని సందేహం ఎప్పటి   నుండో ఉంది . ఒకసారి మనం ఈ అనుమానం తీర్చుకొనే ప్రయత్నం చేద్దాం.






మన దేశంలో బంగారం పై మక్కువ ప్రతి ఒక్కరికి ఉంది .ఇక స్త్రీలకయితే చెప్పవలసిన పని లేదు. ప్రతి శుభ సమయంలో స్త్రీలు ధరించేది అధికంగా బంగారు ఆభరణాలనే .అదే సిల్వర్ దగ్గరికి వచ్చేసరికి కొద్ది మందికి మాత్రమే  ఇష్టం ఉంటుంది. అది కూడా ఎవరికి అయితే బంగారం ధర భరించడం కష్టంగా ఉంటుందో వారికి. ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వచ్చే సరికి సిల్వర్ . ప్లాటినం కంటే బంగారం లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అధికంగా ఇష్టపడతాం.అందువలనే బంగారం ఎక్కువగా వార్తలలో  ఉంటుంది.
చరిత్రని బట్టి చూస్తే బంగారంలో రాబడి గత దశాబ్దం నుండి స్థిరంగా ఉంది.కాని బంగారంతో పోలిస్తే సిల్వర్ లో రాబడి నమ్మశక్యంగాని విధంగా ఉంది.  2009 లో బంగారం  19.3% రాబడి అందిస్తే సిల్వర్   42.4 %  ,2010 లో బంగారం  22.3% రాబడి అందిస్తే సిల్వర్   70.60% అందించినది..క్రింద పట్టికలో గత దశాబ్దకాలంలో  బంగారం మరియు సిల్వర్ అందించిన రాబడి వివరాలు ఉన్నాయి.

పై పట్టికను చూసి దేనిలో ఇన్వెస్ట్ చేయాలో తెలియక తికమక పడుతున్నారా ? బంగారం తో పోలిస్తే  సిల్వర్  అధికంగా రాబడిని అందించినది వాస్తవమే అయినా  బంగారం స్థిరంగా రాబడి అందించినది. అదే సిల్వర్ లో  అధికంగా ఒడిదుడుకులు ఉన్నాయి.   సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే  అధిక రిస్కు తీసుకొనే వారికి మాత్రమే సూట్  అవుతుంది. సిల్వర్లో  అధికంగా స్పెక్యులేషన్ జరుగుతుంది. అంతే కాకుండా సిల్వర్ యొక్క ధరను అంచానా వేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అదే  బంగారం ధరలో మార్పు స్థిరంగా ఉంటుంది అది కూడా పెరగడమే . ధర పడిపోయిన తక్కువ శాతం  మాత్రమే పడిపోతుంది. అంతే కాకుండా ఇన్ఫ్లేషన్ తట్టుకొనే శక్తి బంగారం కి మాత్రమే ఉంది.  అందువలన ఇన్వెస్ట్మెంట్ కొరకు బంగారం లేక సిల్వర్ అనే  ఆలోచన వచ్చినప్పుడు బంగారానికి మీ  ఓటు వేయండి.  సిల్వర్ అధికంగా రిస్కు తీసుకొనే వారికి మాత్రమే పనికి వస్తుంది.

బంగారం లో పెట్టుబడి పెడుతున్నప్పుడు  ఏ గోల్డ్  ETF లో పెట్టుబడి పెట్టడం మంచిది?

ఇది వరకు నేను బంగారంపై  వ్రాసిన ఆర్టికల్స్ చదివిన తర్వాత కొంత మంది మిత్రులు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి వివిధ గోల్డ్  ETF లు అందుబాటులో ఉన్నాయి కదా ? అందులో వేటిలో  ఇన్వెస్ట్ చేస్తే మంచిది ? వాటి రాబడి  ఏ విధంగా ఉంది ? అని అడగడం జరిగినది. ఇప్పుడు వాటి గురుంచి ఒక్కసారి వివవరంగా తెలుసుకుందాం. గోల్డ్  ETF కనుగోలు చేస్తున్నాం అంటే బంగారాన్ని  ఎలక్ట్రానిక్  రూపంలో కనుగోలు చేయడం . గోల్డ్  ETFలు అందుబాటులోకి వచ్చాక బంగారంలో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభతరం అయింది. గోల్డ్  ETF లో రాబడి సాదారణంగా ఫిజికల్ గోల్డ్ ధరపై ఆధారపడిఉంటుంది.ఒక గోల్డ్ ETF సుమారు ఒక గ్రాం బంగారం తో సమానం. గోల్డ్  ETF లో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం . అంతేకాకుండా మీరు ఒక గ్రాం బంగారం కూడా కనుగోలు చేయవచ్చు. దాని వల్ల మీరు  కొంత కాలంలో మీకు  కావలసిన  బంగారం జమ అయ్యే వరకు ప్రతినెల  ఇన్వెస్ట్ చేయవచ్చు.వివిధ రకాల గోల్డ్ ETF ల రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయో క్రింది పట్టిక ద్వారా చూడండి.

S.No

ETF  Name


% of Returns For 1 Year
1
Axis
12.82
2
Birla sun life
13.15
3
Gs gold bees
12.98
4
HDFC
13.04
5
ICICI-pru
12.86
6
Kotak

12.99
7
Quantam
13.03
8
Reliance

13.08
9
Religare

13.12
10
Sbi
13.19
11
Uti

13.04
12
Physical gold

14.88
మీరు పై పట్టికను పరిశీలిస్తే వివిధ రకాల గోల్డ్ ETF లో రాబడిలో తేడా చాలా స్వల్పలంగా  ఉంది. దాదాపు గా అన్ని గోల్డ్ ETF లు ఒకే రకమైన రాబడి అందచేసాయి. రాబడిలో స్వల్ప తేడా కూడా నిర్వహణపరమైన ఖర్చుల వలన సంభవించినదే. అందువలన ఏ గోల్డ్ ETF లో  అయిన ఇన్వెస్ట్ చేయవచ్చు.కాకపోతే ఇప్పుడూ కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయవవచ్చా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అనడంలో ఎలాంటి సందేహం లేదు.  దాని గురుంచి బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ?  అనే  ఆర్టికల్ వివరంగా చదవండి.


జీవితంలో డబ్బు సంపాదించాలి ? ఆర్ధికంగా ఎదాగాలి అంటే ఆర్ధిక అక్షరాస్యత తప్పనిసరా ?
 ప్రతి మనిషికి ఆర్దిక అక్షరాస్యత అనేది చాలా అవసరమే కాకుండా అతి ముఖ్యం కూడా . ఈ రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే ఏ విధంగా చదువు రాని వారి క్రింద జమకడతారో   మీ అందరికి తెలుసు.  అదే విధంగా మీకు ఆర్ధిక అక్షరాస్యత లేకపోతే , వ్యక్తిగత ఫైనాన్స్ పై అవగాహన లేకపోతే  మీకు ఎన్ని ఉన్నత డిగ్రీలు ఉన్న, మీ రంగంలో మీరు ఎంత గొప్ప వారైనా  అర్దిక అక్షరాస్యత లేకపోతే  మీ జీవితచరమాంకం లోపు ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది పడక తప్పదు. ఆర్దిక అక్షరాస్యత లేకపోవడం వలన కోట్లు సంపాదించిన వారూ కూడా బికారులు అయిన వారూ ఎంతో మంది ఉన్నారు. చాలా మంది అనుకుంటారు మేము చాలా పెద్ద సాలరీ అందుకుంటూన్నాం , మాకు ఆర్ధిక అక్షరాస్యత అవసరమా అని? ముఖ్యంగా సాప్ట్ వేర్  ప్రోపెషనల్స్ . అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు మీరు ఏ రంగం లో ఉన్నా సరే.

దయచేసి ఒక విషయం తప్పక గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించడానికి , డబ్బు  మేనేజ్మెంట్ చేయడానికి చాలా తేడా ఉంది. రెండు వేరు వేరు భిన్న ద్రువాలు.మీరు ఎటువంటి వృత్తిలో ఉన్నా సరే  ఆర్దిక అక్షరాస్యత అనేది తప్పనిసరి. మీరు ఎంత కాలం ఇంకా మీ వ్యక్తిగత ఆర్ధిక నిర్ణయాల కొరకు   ఫ్రెండ్స్, బ్రోకర్స్, టి .వి అనలిస్ట్ లు  మొదలగు వారిపై ఆధారపడతారు.  మీరు మిలియనీర్లు ,బిలియనీర్లు కావడం అనేది మీ అర్దిక అక్షరాస్యత పై ఆధారపడి ఉంటుంది. మీరు ధనవంతులు కావడం అనేది మీరు  తీసుకునే అర్దిక పరమైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్దిక అక్షరాస్యత అంటే ఎంతో కష్టమైన స్టాక్ మార్కెట్  డేరివేటివ్స్  విశ్లేషణ , కరెన్సీ మార్కెట్ విశ్లేషణ కాదు. మీ వ్యక్తిగత ఫైనాన్స్ ప్లానింగ్ సరిగ్గా నిర్వహించడం.  ఆర్దిక అక్షరాస్యత పేద వారూ , డబ్బు ఉన్నవారూ  అని తేడా లేదు అందరికి కావలసినదే. చివరకు వంశపారంపర్యంగా  సంపద వారసత్వంగా వచ్చిన వారికి కూడా తప్పనిసరిగా కావలసినదే. ఎందుకంటె  వారసత్వంగా వచ్చిన  సంపదను నిలుపుకోవాలి అంటే కూడా ఆర్దిక అక్షరాస్యత కావాలి. ఆర్దిక అక్షరాస్యత అంటే మీ ఖర్చులను నియంత్రించుకోవడం , ఆస్తులు మరియు అప్పులకు మధ్య తేడా తెలుసుకోవడం, ఆస్తులను ఏవిధంగా పెంచుకోవాలో తెలుసుకోవడం , ఆర్ధిక పరంగా ముఖ్యమైన నిర్ణయాలను సమర్ధవంతంగా  తీసుకోగలగడం , మీరు సంపాదించిన సంపదను ,సంపద  స్ప్రుస్టించే సాధనలాలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవడం. సంపాదించిన సంపదపై ఆదాయపు పన్ను ఏవిధంగా   అదా చేయాలో తెలుసుకోవడం.
మీకు ఒక ఉదాహరణ చెప్తాను .మైక్ టైసన్ , మైఖేల్ జాక్షన్ మీ అందరికి తెలుసుకదా ? వారూ వారి రంగాలలో నెంబర్ వన్ గా ఉండటమే గాక ప్రపంచ వ్యాప్తంగా  కూడా  ఎంతో ప్రసిద్ది పొందడమే కాకుండా మిలియన్ల కొద్ది డబ్బు సంపాదించారు. కాని వారి ఆర్ధిక పరిస్థితి దారుణంగా దిగజారి దివాలా  తీసారు. దీనికి ముఖ్య కారణం వారికి   ఆర్దిక అక్షరాస్యత లేకపోవడమే. వారికి ఆర్దిక అక్షరాస్యత ఉంటే వారూ సంపాదించిన మిలియన్ల డబ్బు, బిలియన్లుగా మారేది. ఆర్దిక అక్షరాస్యత  ప్రతి ఒక్కరికి వయస్సుతో నిమిత్తం లేకుండా , చేస్తున్న వృత్తి , బిజినెస్ తో సంభందం లేకుండా ప్రతి ఒక్కరికి అవసరం. అమెరికాలోఒక   నివేదిక ప్రకారం bankruptcies 70 % మంది 25 సంవత్సరాలలోపు వారే . అదికూడా  80%  మంది వారి bankruptcies తెలియచేసిన ఒకే ఒక కారణం ఏమిటో తెలుసా ? క్రెడిట్ కార్డ్స్.పిల్లలు స్కూల్ వయస్సులో ఉన్నప్పుడే ఆర్ధిక అక్షరాస్యత మౌళిక  సూత్రాలు తెలుసుకొని ఉంటే వారూ కాలేజీలోకి  , యుక్త వయస్సులోకి వచ్చిన వెంటనే లేదా వారి సంపాదన మొదలైన కొత్తలో  అధిక , అనవసరమైన ఖర్చులు చేసేవారు కాదు.వారి సంపాదన మొదలు కాకముందే  వారికి మనీ మేనేజ్మెంట్ పై అవగాహన ఉంటే వారీ జీవితంలో డబ్బు కోసం అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే రాదు.  
పిల్లలు అధికంగా ఖర్చు చేసే చెడు  అలవాటు ఎక్కడి నుండి నేర్చు కొంటారో మీకు తెలుసా ? వారి స్నేహితుల నుండి అనుకుంటున్నారా ? తప్పు వారి  తల్లితండ్రుల నుండే నేర్చుకొంటారు. మీరు నమ్మండి , నమ్మకపొండి .ఇది ముమ్మాటికి వాస్తవం.పిల్లలు ఖరీదైన షాపింగ్ అలవాటు ,క్రెడిట్ కార్డ్ వాడకలు  వారి తల్లితండ్రుల నుండే నేర్చుకొని పెద్దయ్యాక వారి జీవితంలో ఒక భాగం చేసుకుంటారు.
దురదృష్టావశాత్తు  ప్రజలలో మరొక అపోహ కూడా ఉంది. వారి జీవితంలో అనుకోకుండా సంపద రావడం , సాలరీ లో భారీ పెరుగుదల ఉంటే వారి ఆర్ధిక అక్షరాస్యత పెరిగింది అనే అపోహలో  ఉండి ఆర్ధిక నిపుణుల అభిప్రాయం లేకుండానే ఆర్ధిక నిర్ణయాలు తీసుకోవడం వలన చివరకు ఆర్ధికంగా నష్టపోవడం తప్పా వారూ చేయగలిగేది ఏమి ఉండదు.ఎదిఎమైనప్పటికి జీవితంలో ఆర్ధికంగా ఎదగాలి , డబ్బూ సంపాదించాలి అంటే ప్రతి ఒక్కరికి ఆర్ధిక  అక్షరాస్యత అనేది తప్పనిసరి ముఖ్యంగా పిల్లలకు కూడా చిన్నప్పటినుండే  ఆర్ధిక  అక్షరాస్యత కల్పించాలి.ఇప్పటి సాప్ట్ వేర్  ఉద్యోగులలో అధిక శాతం ఎడా పెడా దొరికిన లోన్స్ , క్రెడిట్ కార్డ్స్ వాడేసి వచ్చే జీతం మొత్తం EMI లకు వెళ్ళడంతో కనీస సాలరీ కూడా సరిగా అందుకోలేని వాళ్ళను ఎంతో మందిని చూడటం జరిగినది. మీ పరిస్థితి, మీ పిల్లల పరిస్థితి  ఆ విధంగా జరగకుండా జాగ్రత్తపడండి.

బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ?

రానున్న మూడేళ్ళ కాలంలో బంగారం ధర  రెట్టింపు అవుతుంది అంటే అచ్చర్యపోతున్నారా ? మీరు బంగారం ధర గత కాలంలో ఎలా పెరిగినదో మీకు తెలుసుకదా ? మీరు బంగారం ధర ఒక్కసారి  పరిశీలిస్తే ఇండియా లో డిశంబర్ 2007  10gr బంగారం ధర  రూ .10,000  ఉంటే  డిశంబర్   2010 లో రూ 20,000 లకు చేరుకుంది.అంటే కేవలం మూడు సంవత్సరాలలో రెట్టింపు ధరకు చేరుకుంది . సెప్టెంబర్ 2009లో  రూ.16500 ఉంటే మూడు సంవత్సరాలో  అంటే 2012లో రూ.32500 కు చేరుకుంది ఇప్పుడు కూడా మూడు సంవత్సరాలలో రెట్టింపు ధరకు చేరుకుంది.
మనదేశం బంగారాన్ని అధిక శాతం విదేశాలనుండే  దిగుమతి చేసుకుంటుంది. అందువలన మన దేశంలో బంగారం ధర అంతార్జాతీయ ధర కి  అనుగుణంగా ఉండదు.
అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం 23 Aug 2011 $1900 గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మన దేశంలో బంగారం ధర రూ. 28600 ఉంటే ఇప్పుడు  అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం $ 1730 చేరుకుంటే  మనదేశంలో మాత్రం బంగారం రూ .32500 చేరుకుంది. అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం ధర తగ్గిన మనదేశంలో బంగారం ధర పెరగడానికి ముఖ్య కారణం డాలర్ బలపడటం , రూపాయి బలహీనపడటమే . అంతే కాకుండా రోజురోజుకి బంగారం పై ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరుగుతుండటం.

రెండు సంవత్సరాల క్రితం డాలర్ కి రూపయాయి మారకపు విలువ రూ 45ఉంటే ఇప్పుడు రూ   55 గా ఉంది.కేవలం రూ. 10తేడా  అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం ధర తగ్గిన మనదేశంలో బంగారం ధర పెరగడానికి కారణమైనది.అంతే కాకుండా అంతార్జాతీయంగా ఆర్ధికమాంద్యం , యూరో జోన్ పరిస్థితులు  హెడ్జ్ ఫండ్స్ ను బంగారంలో అధికంగా ఇన్వెస్ట్ చేయడానికి కారణమవుతున్నాయి.
ఈ బంగారం ధర పెరగడం ఫిజికల్ గా బంగారు అమ్మకాల పై ప్రభావం  చూపినప్పటికీ  గోల్డ్ ETF లో   ఇన్వెస్ట్ చేయడం మాత్రం తగ్గడం లేదు.అంతే కాకుండా దేశంలో వర్షాభావ పరిస్థితులు సాదరణంగానే నమోదు కావడం  నవరాత్రుల తర్వాత మంచి రోజులు ఉండటం .దీపావళి  మొదలగు పండుగల వలన మళ్ళీ బంగారం ఆభరణాలకు గిరాకీ పెరిగే అవకాశం కూడా ఉంది.బంగారం ప్రస్తుతం అధిక స్థాయిల వద్ద ఉన్నప్పటికీ కూడా  అంతార్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక పరిస్థితులు, ఇన్వెస్టర్ల నుండి ఉన్న డిమాండ్ , రూపాయి బలహీనత మొదలగు అంశాల ఆధారంగా బంగారం ధర ఇంకా పెరగడానికే అవకాశం ఉంది. మీరు చూస్తూ ఉండగానే బంగారం రూ .32500 నుండి రూ 65000 లకు 2015  కల్లా చేరుకునే అవకాశం అధికంగా ఉంది.
గమనిక : ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనం లో ఐనా సరే రిస్కు అనేది తప్పకుండా ఉంటుంది. రిస్కు లేకుండా రిటర్న్ అనేది ఉండదు. అందుకే ఎవరికి వారూ , వారూ భరించగలిగే రిస్కు  కి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడం చేయాలి. పైన బంగారం పై కేవలం నా  అభిప్రాయం తెలియచేయడం జరిగినది.
telugufinancialschool@gmail.com

ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఎమి చేయాలి    part 4 
మీరు ఎప్పుడైనా  రాష్ట్ర బడ్జెట్ , లేదా కేంద్ర బడ్జెట్ ప్రకటించినప్పుడు ఎప్పుడైనా దానిని చదివి అర్ధం చేసుకొనే ప్రయత్నం చేసారా ! రూపాయి రాకా లేదా రూపాయి పోక గురుంచి. చాలా మంది దీని గురుంచి మాకు ఏమి అర్ధం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ పేజీలు కూడా కనీసం  చూడరు. చివరకు పేపర్లో , కాని టీవీ లో వచ్చ్చే బిజినెస్ న్యూస్ చూడటం వలన ఐనా అర్దికంశాల పట్ల అవగాహన కలుగుతుంది. చాలా మంది  పేపర్ రాగానే మొదట చేసేది రాజకీయ వార్తలు , సినిమా వార్తలు లేదంటే క్రికెట్ గురించిన వార్తలు మాత్రమే చూస్తారు. రాజకీయాల గురుంచి భాద్యత గల పౌరుడిగా ఎలక్షన్  సమయంలో  మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఆలోచించండి. మీ అభిమాన హీరో సినిమా  మంచిగా ఉన్నా  , లేకున్న అతనికి మాత్రం డబ్బులు వస్తాయి . మీకు డబ్బులు దండగ  పైగా తలనొప్పి ఒక్కటి.ఇంకా చెప్పాలి అంటే అతని డైలాగ్ అతనిది కాదు , అతని పాట అతనిది కాదు, అతని డాన్స్ అతనిది కాదు.ఏది ఆ హీరోది  కానప్పుడు అతని సినిమా చూడటం అవసరమా !ఇకా కొంత మంది ఉంటారు క్రికెట్ వస్తుంటే నోళ్ళు వెళ్ళబెట్టి దాన్ని చూస్తారు తప్ప కనీసం బిజినెస్ న్యూస్ చూడటానికి కూడా ఇష్టపడరు. క్రికేట్ అంటే ఇష్టం ఉంటే చూడటం కాదు ఆడండి. దానివల్ల కనీసం బాడీ లో ఉన్న కొవ్వు కరుగుతుంది .ఆరోగ్యంగా ఉంటారు. మానవ సంభందాలన్ని ఆర్ధిక సంభాదాలైన  ఈ రోజుల్లో మీరు ఆర్ధికంగా ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. దానికి మీరు ఆర్ధిక అంశాల పట్ల అవగాహన  కలుగచేసుకోవాలి. మీకు అవగాహన ఉంటేనె  మంచి రాబడి అందించే సాధనాలలో  ఇన్వెస్ట్ చేయగలుగుతారు లేదంటే   ఇంకా సంప్రదాయ పొదుపు పథకాల  పట్టుకొని వేలాడుతూనే ఉంటారు.రానున్న కాలంలో ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్  ఏవిధంగా ఉన్నారో అదే విధంగా ప్రతి కుటుంబానికి  ఆర్ధిక నిపుణుడి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆర్ధిక  విషయాల పట్ల అవగాహన తప్పనిసరి.

T20 క్రికెట్ కి, మరియు ఇన్వెస్ట్మెంట్ కి  మధ్యగల ఆసక్తికర సారూప్యతలు  part2

Strategic break

T20 క్రికెట్ లో పది ఓవర్ల తర్వాత విరామం తీసుకొని తర్వాత  ఆటలో అనుసరించవలసిన వ్యహాల గురుంచి ఏ విధంగా చర్చించుకుంటారో  అదే విధంగా మీరూ కూడా మీ ఫైనాన్సియల్ ప్లానింగ్  ను  మధ్య మధ్యలో సమీక్షీంచుకుంటూ  మీ ఆర్ధిక లక్ష్యాలు చేరుకోవడానికి  కావలసిన విధంగా మీ  ఆర్ధిక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి.
Balance
మీరూ 11 మంది బ్యాట్స్ మెన్  లేదా  11 మంది బౌలర్లతో క్రికెట్ అడలేరు. ఆటకి అనుగుణంగా  బ్యాట్స్ మెన్  మరియు బౌలర్లతో ఆటకి అనుగుణంగా జట్టును ఏర్పాటు చేసుకుంటారు. అదే విధంగా మీరూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ ను కూడా బ్యాలన్సేడ్ పోర్ట్పోలియో ఏర్పాటు చేసుకోవాలి.  ప్రతి ఇన్వెస్ట్మెంట్ సాధనం కూడా కొన్ని అనూకూల , ప్రతికూల లక్షణాలను కలిగి ఉంటుంది.

One bad over
కొన్ని సార్లు క్రికెట్ లో ఏ విధంగా బ్యాడ్ ఓవర్ వస్తుందో అదే విధంగా మన జీవితంలో కూడా బ్యాడ్ పీరియడ్ ఉంటుంది. ఆక్సిడెంట్ కావడం ,వైద్యపరంగా అత్యవసర పరిస్థితి రావడం, ఉద్యోగం కోల్పోవడం ,ఇంట్లో సంపాదించే వ్యక్తీ మరణం  మొదలగు సంఘటనల వలన ఆర్ధిక పరిస్థితి తలక్రిందులు అవుతుంది. అందువలన అలాంటి  సంఘటనలు సంభవించినప్పుడు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి.
Consistency gets rewarded
క్రమం  తప్పకుండా సిస్టామేటిక్ గా  దీర్ఘాకాలం చేసే ఇన్వెస్ట్మెంట్   మంచి లాభాలు అందించగలదు..
Coaching helps
ఒక క్రికెట్ అటగాడు మంచి క్రీడాకారుడిగా రూపొందడానికి కోచింగ్ ఏ విధంగా సహాయం చేస్తుందో  మీకు తెలుసుకదా ? అర్దిక పరమైన విషయాలాలో ఎవ్వరికీ వారూ స్వంత నిర్ణయాలు తీసుకొనే శక్తి ఉండదు. అందువలన తప్పనిసరిగా  ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సహాయం తప్పకుండా తీసుకోవాలి.
Distractions can be entertaining but ultimately the score matters
వ్యక్తీ గత జీవితంలో భావోద్వేగాలు చాలా సహజం . కాని మీరు మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కి వచ్చే సరికి తప్పనిసరిగా మీరు అత్యాశ, భయం. ఒకే ఇన్వెస్ట్మెంట్ సాధనం పై ప్రేమ మొదలగు వాటిని  మాత్రం తప్పకుండా నియంత్రించుకోవాలి.
Winning attitude
క్రికెటర్కి మ్యాచ్ గెలవాలి అనే  దృక్పథం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీకు ఇన్వెస్ట్మెంట్ లో తప్పనిసరిగా లాభాలు అందుకోవాలి  అనే దృక్పథం ఉండాలి. దానితో మీరు సరియైన ఆలోచనతో మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనాలలో ఇన్వెస్ట్ చేయగలుగుతారు

T20 క్రికెట్ కి, మరియు ఇన్వెస్ట్మెంట్ కి  మధ్యగల ఆసక్తికర సారూప్యతలు  part1
T20 క్రికెట్ కి,   ఇన్వెస్ట్మెంట్  మధ్యన  సారూప్యతలు  ఏంటి ? అని అచ్చర్యపోకండి .ఫైనాన్సియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్  మరియు  T20 క్రికెట్  కి మధ్యన ఉమ్మడి వ్యూహాలు చాలా ఉన్నాయి.క్రికెట్ మన  దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీద అనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్  T20 ప్రారంభం అయ్యాక చాలా ప్రజాదరణ పొందడమే కాకుండా అధిక లాభాలు కూడా అందుకొంటుంది. T20 క్రికెట్ లో ఆటగాళ్ళు అడే ఆటకి , వారూ తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు చేయడానికి పడే తపనకి  , మీ ఇన్వెస్ట్మెంట్ , మీ రిటైర్మెంట్  అనంతర జీవితం సాఫీగా గడపడానికి  మీరు చేసుకునే ఆర్ధిక ప్రణాళికకి మధ్య గల  సారూప్యతలు చాలా ఉన్నాయి. ప్రముఖ ఆర్ధిక నిపుణులు కార్తీక్ వర్మ చక్కని ఆసక్తి కరమైన విశ్గ్లేషణ చేయడం జరిగినది. అవి ఏంటో  మనం కూడా ఒక్కసారి  వివరంగా పరిశీలిద్దాం.అవి
1.    Start early
2.    Risk and Reward tradeoff
3.    Be ready for the unexpected
4.    Strategic break
5.    Balance
6.    One bad over
7.    Consistency gets rewarded
8.    Coaching helps
9.    Distractions can be entertaining but ultimately the score matters
10. Winning attitude
ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురుంచి వివరంగా తెలుసుకుందాం.

Start early

T20 క్రికెట్ లో బ్యాట్స్ మెన్  బాదడం లేదా బౌలర్  వికెట్లు తీసి మ్యాచ్ పై పట్టు సాధించడానికి  ప్రారంభంలోనే ప్రయత్నిస్తారు. అదే విధంగా మీరు కూడా మీ జీవితంలో ఆర్ధికంగా ఎదగాలి అంటే మీరూ పొదుపు చేయడం ,చేసిన పొదుపును ఇన్వెస్ట్మెంట్ గా మార్చడం ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.  మీరూ క్రమం తప్పకుండా , త్వరగా ఇన్వెస్ట్ చేస్తూ సరియైన ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవడం  వలన కౌమ్పౌన్డింగ్  గ్రోత్ వలన మంచి లాభాలు  అందుకోవచ్చు.
Start now, Save more, Retire rich.

Risk and Reward tradeoff
క్రికెట్ అట యొక్క ఫలితం కెప్టెన్ మరియు ఆటగాళ్ళు తీసుకొనే రిస్కు పై  అధారపడి ఉంటుంది అనే విషయం మీకు తెలుసుకదా ? మీకు వచ్చే లాభాలు ఎప్పుడూ కూడా మీరు తీసుకొనే రిస్కుపై , మీరూ చేసే ఇన్వెస్ట్మెంట్ పై ఆధారపడి ఉంటుంది.మీరూ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కూడా మీరూ రిస్కుకి సిద్దపడి లేకపోతే మీరూ మంచి రిటర్న్స్ అందుకోలేరు. అందుకే ముందుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు రిస్కు ఎంత వరకూ తీసుకోగలరు , ఆ రిస్కు వలన సంభవించే పరిణామాలను  ఎంత వరకు తట్టుకోగలరూ మొదలగు వాటిని నిర్ణయించుకోవాలి. రిస్కు లేకపోతే రిటర్న్ లేదని తెలుసుకోండి.
Be ready for the unexpected
ఉహించని సంఘటనలు జరిగిన కూడా తట్టుకోవడానికి సిద్దంగా ఉండాలి. క్రీజ్ లో నిలదొక్కుకొని బాగా ఆడుతున్న అటగాడు ఉహించని విధంగా  ఔట్ ఐనప్పటికి తర్వాత బ్యాట్స్ మెన్  తనపని తనూ చేసుకుంటాడు. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడూ  సాదారణంగా మనుషులకు రెండు లక్షణాలు ఉంటాయి. వాటిలో ఒక్కటి భయం  అంటే పెట్టిన ఇన్వెస్ట్ ఏమవుతుందో అని, ఇక రెండోది అత్యాశ అంటే కొన్నాళ్ళు ఆగితే ఇప్పటికంటే అధిక లాభం వస్తుంది అనే   అత్యాశ ద్వారా మొత్తం పోగోడుతారు. అందుకే మన పెట్టుబడి ఉహించని సంఘటనల ద్వారా నష్టపోయిన తట్టుకోవడానికి సిద్దంగా ఉండాలి. 

భారతీయులు ధనవంతులా లేక పేదవారా ?
ఎవరూ చెప్పారూ మీకు భారతదేశం పేద దేశం అని. భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం.భారతదేశంలో  అత్యధికులు పేదవారే అనడంలో కూడా ఎటువంటి  సందేహం లేదు. అంత మాత్రాన  భారతీయులలో ధనవంతులే లేరు అంటారా? ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ జాబితా పరిశీలించండి.ప్రతిసారి కనీసం  ఇరవై మంది పైననే బిలియనీర్లు  ఈ జాబితాలో ఉంటారు.ఈ జాబితాలో ఉన్న వాళ్ళు బిలియనీర్లు ఐనంతా మాత్రానా భారతదేశం ధనిక దేశం అవుతుందా ? దేశంలో  బిలియన్ పైన జనాభా ఉంది. మరి వారందరి పరిస్తితి ఏమిటి.? అది సరే ఇప్పుడు ఒక్క విషయం తెలుసుకోండి. భారతదేశం బంగారం వినియోగంలో ప్రపంచంలో ముందుంటుంది అనే విషయం మీ అందరికి తెలుసు .భారాతీయులు ప్రతి సంవత్సరం కొన్ని టన్నులకొద్దీ బంగారం కనుగోలు చేస్తారు..భారతీయుల వద్ద కనీసం 20,000టన్నుల బంగారం ఉంది అని ఒక అంచనా .దానిలో   95%  బంగారం ప్రజల వద్దనే ఉంది. భారత ప్రభుత్వం వద్ద కేవలం  5% మాత్రమే ఉంది.అదే అమెరికా లాంటి దేశంలో ఐతే ప్రజలవద్ద 5% ఉంటే ప్రభుత్వం  వద్ద 95%  బంగారం ఉంటుంది.భారతీయులకు కొన్ని వందల సంవత్సరాల నుండి  బంగారం చాల విలువైన లోహం అని తెలుసు. అందువలనే భారతీయులు బంగారం అధికంగా కూడబెడతారు. ఒకవేళ భారత దేశ ప్రజలందరి వద్ద ఉన్న  95%  బంగారం ను అమ్మివేస్తె అమెరికా దేశంలో గల న్యూయార్క్ లాంటి నగరానికంటే  మూడు ,నాలుగింతల  పెద్దదైన  నగరాన్ని కనుగోలు చేయవచ్చు. ఇప్పుడు చెప్పండి భారతదేశం పేదదేశమా ?భారతీయులలో చాలా మంది దారిద్ర్యరేఖ కంటే క్రింద  ఉన్నారూ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత మాత్రానా భారతీయులు అందరూ పేదవారూ మాత్రం కాదు. దానికి ముఖ్య కారణం మన వారికి బంగారం పై ఉన్న మక్కువే.

ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఎమి చేయాలి    part 3
ప్రస్తుతం మీ వయస్సు ముప్పై సంవత్సరాలు అనుకుంటే మీరు అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ అవుతారు అనుకుంటే మీరు తక్షణం బయట తాగే టీ ఒక్కటే మానేస్తే ఎంత మిగులుతుందో చూద్దాం. టీ ఒక్కటి ఖరీదు  ఐదు రూపాయలు అనుకున్న  నెలకు  నూట యాభై రూపాయలు మిగులుతుంది. ఈ డబ్బును ప్రతి నెల ఎనిమిది శాతం వడ్డీ వచ్చేలా కనీసం బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్ పథకంలో  మీ  రిటైర్మెంట్ వరకు ఎంత అవుతుందో తెలుసా !    Rs 222639 అవుతుంది . నిజమే ఇది క్రమం తప్పకుండా పొదుపు చేయడం వలన సాధ్యం అవుతుంది.మీరు కేవలం టీ మానివేయడం వల్ల వచ్చిన మొత్తం . ఇంతకంటే పెద్ద పెద్ద అనవసరమైన ఖర్చులు మానేస్తే ఎంత మొత్తం మిగులుతుందో చూద్దాం .  
రోజుకి ఒక సిగరేటు ప్యాకెట్ ఖరీదు Rs  50
నెలకు       Rs 1500 
ఈ డబ్బును మీరు ప్రతి నెల క్రమం తప్పకుండా బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ చేస్తే, వడ్డీ ఎనిమిది  శాతం వస్తుంది అనుకుంటే మీ రిటైర్మెంట్ నాటికి  మీకు చేతికి వచ్చే మొత్తం Rs 2226392
  ఒక వేళ మీరు దీనిని ఏదైనా మ్యుచవల్ ఫండ్ పథకంలో సిప్ పద్ధతి ద్వారా పెట్టుబడిగా  క్రమం తప్పకుండా ప్రతి నెల మీరు సిగరెట్ మానేయడం వలన  అదా చేసిన Rs 1500    లను మీ రిటైర్మెంట్  వరకు కొనసాగించినచో  ఎంత వస్తుందో చూద్దాం . స్టాక్ మార్కెట్ దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తుంది అనే విషయం మీ అందరికి తెలిసిన విషయమే కదా !స్టాక్ మార్కెట్ సాలీనా   సుమారు  18 % వృద్ది కనబరుస్తుంది . మనం ఇక్కడ మరీ అత్యాశకి పోకుండా  కేవలం  12మాత్రమే  వృద్ది సాధిస్తుంది అనుకుంటే మీరు సిప్ పద్ధతి లో  Rs 1500  పెట్టుబడిగా  మీ రిటైర్మెంట్   సమయానికి మీరు అందుకొనే డబ్బూ Rs 4578019 . అవును అక్షరాల ఇది మూమ్మటికి  నిజం .





అదే విధంగా ఒక కుటుంబం ఈ రోజుల్లో ఒక సినిమాకు వెళ్తే ఎంత లేదన్న కనీసంరెండు వందల రూపాయలు అవుతుంది.ఈ రెండు వందలను కూడా   క్రమం తప్పకుండా బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ చేస్తే, వడ్డీ ఎనిమిది  శాతం వస్తుంది అనుకుంటే మీ రిటైర్మెంట్ నాటికి  మీకు చేతికి వచ్చే మొత్తం  Rs .296852 ఈ రెండు వందలను బ్యాంక్ లో కాకుండా  సిప్ పద్ధతి ద్వారా క్రమం తప్పకుండా మ్యుచవల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే  మీ రిటైర్మెంట్ నాటికి  మీకు చేతికి వచ్చే మొత్తం    Rs 610402  . అదే విధంగా కొంత మంది అదే పనిగా షాపింగ్ కి తిరగడం  అవసరం లేకున్న దుస్తులు కొనడం చేస్తుంటారు. మీరు ఖర్చు చేస్తున్నప్పుడు చాలా  చిన్నమొత్తం డబ్బే కదా అనుకుంటారు . కాని, ఈ చిన్న మొత్తమే కొన్ని సంవత్సరాల తర్వాత ఎంత  పెద్ద మొత్తం  అవుతుందో తెలియచేయాడమే నా ఉద్దేశం.  ఇక్కడ నేను మీ కోరికలు చంపు కోమని చెప్పడం కాదు నా  ఉద్దేశం .కొన్ని అనవసరమైన  ఖర్చులను  తగ్గించుకోని దానిని సరియైన పద్దతిలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభం కలుగుతుందో మీకు తెలియచేయడమే నా ఉద్దేశం  . ముందు మీకు కావలసినది అవగాహన    . అవగాహన  ఉంటే ఆలోచన అదే వస్తుంది. ఆ మంచి ఆలోచనతో పొదుపు చేయడం ప్రారంభించండి. చేసిన పొదుపును  మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనాలలో ఇన్వెస్ట్ చేయండి. మన దేశంలో ప్రజలు   సంప్రాదాయ పథకాలో  పొదుపు చేస్తున్నారే తప్ప ఇన్వెస్ట్మెంట్ సాధనాల వైపు చూడలేకపోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఆర్ధిక అంశాల పట్ల సరియైన అవగాహన లేకపోవడమే.
ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఎమి చేయాలి    part 2
బ్యాంక్స్ తర్వాత అధిక శాతం మందికి నమ్మకమైనది భీమా . జీవిత భీమా పైననే అధిక  శాతం  నమ్మకాన్ని కలిగి ఉంటున్నారు.ఈ విషయం లో క్రెడిట్ అంతా కూడా భారత జీవిత బీమా సంస్థ కే   చెందుతుంది. తాను మరణించినప్పుడు కుటుంబానికి ఆర్ధిక రక్షణ కల్పించేందుకే  బీమాను  చాలా మంది ఎన్నుకుంటున్నారు.బీమాను పెట్టుబడి సాదనంగా చూస్తున్నవారు కూడా చాలా తక్కువ . ఒకవేళ భీమా   సంస్థలో పెట్టుబడి పెట్టిన కూడా అది కేవలం టాక్స్ మినహాయింపుల కోసమే చేస్తున్నారు తప్పు  అది నిజమైన పెట్టుబడి కాదు.

బ్యాంకులపై ప్రజలకు చాలా నమ్మకం ఉంది.చాలా మంది బ్యాంక్ లో పెట్టుబడులకు డోకా ఉండదు అనే భావనతోనే చాలా మంది ఉన్నారు. జాతీయ బ్యాంకు లలో ని మొత్తం డిపాజిట్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అని నమ్మే వారు చాలా ఎక్కువ . కాని ఇది తప్పు . ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఇవ్వదు . ఏ బ్యాంక్ డిపాజిట్లకు ఐనా డిపాజిట్ ఇన్సురెన్స్ కార్పోరేషనే   భీమా రక్షణ కల్పిస్తుంది. ఆది  కూడా  కేవలం లక్ష రూపాయల వరకే పరిమితం అనే విషయం గుర్తుంచుకోవాలి.
రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవనాన్ని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తారు.చాలా మంది   రిటైర్మెంట్ తర్వాత తమ పిల్లలు వారి భాద్యత తీసుకుంటారు అనే భావనతోనే ఉంటున్నారు తప్ప వారి జీవితానికి ఎలాంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం లేదు.
ఇక చాలా మంది కి పెట్టుబడులపై ఎలాంటి అవగాహనా ఉండటం లేదు. పెట్టుబడుల విషయంలో ఎవరి సలహాలు , సూచనలు లేకుండా నిర్ణయాలు తీసుకొనే వారు కొందరైతే , స్నేహితులు , ఏజెంట్ల వల్ల కొంత మంది నిర్ణయాలు తీసుకుంటూన్నారు. మీరు మీ పెట్టుబడుల పై తప్పనిసరిగా మీ ఫై నాన్సియాల్ ప్లానర్ లేదా ఆర్ధిక నిపుణులను ను సంప్రదించడం  చాలా మంచిది.  


మీకు పొదుపు చేయాలి  అని ఉంది . అదే విధంగా దాని ప్రాధాన్యం కూడా మీకు తెలుసు . భవిష్యత్తును బాగు చేసుకోవాలన్న ఆలోచన ఉంది .అదే విధంగా ఆర్ధిక లక్ష్యం కూడా   ఉంది.కాని వచ్చిన చిక్కల్లా వచ్చే  నెలా  జీతం మీదనే .వచ్చే జీతం మొత్తం నెల వారి ఇంటి ఖర్చులకే పూర్తిగా సరిపోవడం లేదు . ఇక పొదుపు చేయడానికి మా దగ్గర ఏం  మిగులుతుంది  అనే వారే చాలా ఎక్కువ . ఈ పొదుపుగిదిపు  అనేది లక్షలు  సంపాదించే వారికి కాని మాలాంటి వారికి ఎందుకు అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు.  బిందువు , బిందువు కలిస్తేనే  సింధువు అన్నట్టుగా కాస్తంత పొదుపు వల్ల ఎంతో ప్రయోజనం .   పెద్ద ఉద్యోగాలు , భారీ ఆదాయం ఉంటే ఎవరైనా పొదుపు చేయవచ్చన్న మాట ఎంత నిజమో , మిగులు ఆదాయం లేకపోయినంత మాత్రాన పొదుపు అసాధ్యం మాత్రం కాదు. పొదుపు చేయాలన్న దృడ సంకల్పం ఉంటే చాలు అనేక మార్గాలు కన్పిస్తాయి. మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా.  మీరు పొదుపు చేయాలి అంటే ముందు మీరు మీ ఆదాయ వ్యయాల వివరాలతో బడ్జెట్ తయారుచేసుకోండి.  దాని వల్ల మీరు ఆదాయాన్ని  పెంచుకోలేకపోయిన కనీసం ఎలాంటి ఖర్చులు తగ్గించుకోవచ్చో, ఎలాంటి వృదా ఖర్చులు చేస్తున్నారో తెలుస్తుంది.   వృదా ఖర్చులు పూర్తిగా అరికట్టడం , ఖర్చులు తగ్గించుకోవడం అనేది మీ చేతిలోని పని .అవసరమైన ఖర్చుల్లో కొంత మిగులు సాధించటం , అనవసర ఖర్చులు పూర్తిగా తగ్గించటం . అవసరమైన ఖర్చులు అంటే కాఫీ , టీ, సినిమాలు , బట్టలు  ఈ కోవలోకి వస్తాయి. మీ కోరికలను కొద్దిగా అదుపులో పెట్టుకుంటే చాలు దానితో పొదుపు చేయవచ్చు.ఇక అనవసరమైన  ఖర్చులు . మీరు మీ బడ్జెట్ ను పరిశీలిస్తే దాని వలన తక్షణావసరాలు , తప్పించుకొనే లేదా వాయిదా వేసుకొనే  ఖర్చులు  సులభంగా గుర్తించవచ్చు.కనీసం కొన్ని ఐనా అనవసరపు ఖర్చులు తేలుతాయి.సిగరెట్ , వక్కపొడి, పాన్ మసాలా  ,మందు లాంటి వ్యసనాలు వీటిలో తప్పకుండా కన్పిస్తాయి.వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా అనవసరపు ఖర్చు , అనారోగ్యం  దానితో వైద్యానికి ఖర్చులు.   వీటిని కనుక మీరు మానేయగలిగితే ఎంతో సొమ్మూ మిగులుతుంది ఆరోగ్యమూ బాగుపడుతుంది. కొన్ని సంవత్సరాలనుండి  ఉన్న అలవాట్లు మానుకోవాలి అంటే కొంచెం కష్టమే కాని , ప్రయత్నిస్తే , పొదుపు చేయాలి అనే ఆలోచన కూడా ఉంటే తప్పకుండా సాధ్యం అవుతుంది.కనీసం మీ వినియోగాన్ని సగానికి సగం తగ్గించి దానిని పొదుపు చేసిన చాలు.  మీరు ఇప్పుడు భావిస్తున్న చిన్న మొత్తమే కదా అని భావిస్తున్న ఈ డబ్బూ సక్రమ పద్దతిలో పొదుపు చేస్తే మీకు వచ్చే రాబడి ఎంతో చూస్తే మీరు నమ్మలేరు.ఈ డబ్బూ మీ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా  అండగా    నిలుస్తుంది.

ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఎమి చేయాలి    part 1
ఏడాదికి మూడు లక్షలకు పైగా సంపాదించే ఉన్నత మధ్య తరగతి ఆదాయ వర్గాల్లో కూడా ఆర్ధిక వ్యవహరాల్లో  సరియైన అవగాహన కోరవడినది. నిజం చెప్పాలి అంటే ఎవరికి వారు, వారి వారి వృత్తులలో ఎంతో  నైపుణ్యం కనబరిచినప్పటికీ కూడా ఆర్ధిక వ్యవహారాలలో మాత్రం నైపుణ్యం చూపలేరు.పెట్టుబడులకు ఈ రోజుల్లో అనేక సాధనాలు ఉన్నప్పటికి ఎక్కువ శాతం మంది మాత్రం సాంప్రదాయ సేవింగ్ పథకాలైనటువంటి బ్యాంక్ డిపాజిట్లు , బీమా , బంగారం , ఇళ్ళ స్థాలాలనే నమ్ముకుంటున్నారు.వీటితో పోలిస్తే స్టాక్ మార్కెట్ , మ్యుచవల్ ఫండ్స్ ను విశ్వసించే వారు తక్కువగానే ఉన్నారు.వివేకంతో పెట్టుబడి పెడితే స్టాక్ మార్కెట్ మంచి రాబడి అందిస్తుంది అని చాలా కొద్ది మందికే అవగాహన ఉంటుంది.నిజం చెప్పాలి అంటే చాలా మంది జాతీయ బ్యాంకులలో డిపాజిట్ చేస్తే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అని నమ్ముతున్నారు అంటే వారి అవగాహన  ఏ పాటిదో అర్ధం చేసుకోండి .  ఆదాయానికి హామీ ఇస్తాయన్న నమ్మకంతోనే చాలా మంది మ్యుచవల్ ఫండ్స్  ఎన్నుకుంటున్నారు. కాని ఒక్క విషయం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి.రాబడి  అనేది మార్కెట్ పరిస్తితి పై ఆధారపడి ఉంటుంది. క్యాపిటల్ ప్రొటక్షన్ ఫండ్స్ పెట్టిన పెట్టుబడికి హామీ ఇస్తాయి అంటే అవి చాలా వరకు రిస్క్ లేని  డేట్ పథకాలలో ఇన్వెస్ట్ చేస్తాయి . మీరు లక్ష రూపాయలు ఈ  క్యాపిటల్ ప్రొటక్షన్ ఫండ్స్ లలో ఇన్వెస్ట్ చేస్టే అవి ఎనభై వేలు డేట్ పథకాలో   ఇన్వెస్ట్ చేసి మిగితా ఇరవై శాతం ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. డేట్ పథకాలలో  పెట్టిన ఎనభై వేల పెట్టుబడి కొంత కాలానికి లక్ష రూపాయలు అవుతుంది.ఈక్విటీ లలో పెట్టిన పెట్టుబడిలో నష్టం వచ్చిన డేట్ పథకంలో వచ్చిన లక్ష ద్వారా మీ అసలు మొత్తం అదే విధంగా ఉంది. ఒకవేళ   ఈక్విటీ లలో మంచి రాబడి వస్తే ఇంకా మంచిదే కదా! మ్యుచవల్ ఫండ్స్ లో  పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అని కొంత మంది అనుకుంటారు. అలాగే మ్యుచవల్ ఫండ్స్ యూనిట్   ఏన్ ఏ వి  పది కంటే తగ్గదూ  అని కొంత మంది అపోహ పడుతుంటారు.   మ్యుచవల్ ఫండ్స్ లలో పెట్టుబడి పెడుతున్న వారిలో కూడా వారు ఎంచుకున్న పథకం ఏమిటి ? ఆ ఫథకం  వేటిలో ఇన్వెస్ట్ చేస్తుంది అనే విషయం పై కూడా అవగాహనా ఉండటం లేదు.  

డబ్బుని అదా చేసే  విధానం.
ఈ టాపిక్ ని చాలా జాగ్రత్తగా చదవండి ఎందుకంటే ఇది డబ్బుని ఏ విధంగా అదా చేయాలో తెలియచేస్తుంది.ఒక్కసారి ఉహించుకోండి.మీరు మీ షెల్ప్స్ సర్దుతున్నసమయంలో పాత పుస్తకాల మడతలలో ఎప్పుడో  కొన్ని నెలల క్రితం పెట్టి మరిచిపోయిన  Rs 1000 ల నోటు కనబడితే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. చాలా ఎగ్జయిట్మెంట్ గా ఉంటుంది కదూ ! మీరు ఆ డబ్బూ ఎప్పటికి కనగోనక పోయినప్పటికీ కూడా  మీరు మీ పర్సులో ఉన్న డబ్బూతో  ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ జీవితం సాఫీగా సాగేది కదా ?
ఇదంతా మీకు ఎందుకు చెప్పుతున్నాను అంటే మీ ఆదాయం నుండి  పొదుపు చేయడానికి వెనుక ఉన్న మూల సూత్రం. మీరు మీ ఆదాయం లో నుండి ఎంత మొత్తం పొదుపు చేయాలి అనుకున్నారో అంత మొత్తం ప్రక్కన పెట్టి దాని గురుంచి మర్చి పోయి మిగిలిన దానితో మీ జీవితం  వేల్లదీయండి. ఇది ఆలోచించడానికి మీకు కొద్దిగా కష్టంగానే ఉండవచ్చు. కాని అసాధ్యం మాత్రం కాదు. ఇప్పటికయినా  మించిపోయినది ఏమిలేదు ప్రయత్నించండి. ఇప్పటికి చాలా మంది పొదుపు అంటే ఆదాయం (జీతం ) – ఖర్చులు
( పొదుపు=ఆదాయం –ఖర్చులు ) అని మాత్రమే అనుకుంటారు. మీరు ఇలా భావిస్తే మీరు ఎన్నటికి పొదుపు చేయలేరు. మీ జేబులో డబ్బు ఉన్నప్పటికీ కూడా మీరు పొదుపు చేయలేకపోవడం మీకు ఇదివరకే అనుభంలోకి వచ్చి ఉంటుంది. ఎందుకంటె మీరు వివిధ రకాల అడ్వర్టయిజ్మెంట్ లేదా వివిధ రకాల డిస్కౌంట్ పథకాల ద్వారా బట్టల మీదా , గాడ్జెట్స్ మీదా వివిధ రకాలుగా  టెంప్ట్ అయ్యి ప్రతి సారి అవసారానికంటే ఎక్కువగానే ఖర్చు పెడుతూ ఖర్చులను నియంత్రించుకోలేకపోతున్నారు.అందువన మీరు పొదుపు చేయాలి అనుకున్న చేయలేకపోతున్నారు. మీరు వాస్తవంగా ప్రతి నెల కనీసం మీ అదాయంలో పది నుండి ఇరవై శాతం  తప్పనిసరిగా   అదా చేయాలి అంటే మీరు రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్  అనే పుస్తకంలో రాబర్ట్ 

పొదుపు లేదా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి?

మీరు రూపాయి అదా చేసారంటే  రూపాయి సంపాదించినట్టే   అని బెంజిమేన్ ప్రాంక్లిన్ ఏనాడో చెప్పాడు.మీరు ఎందుకు పొదుపు చేయాలి అనుకుంటున్నారు అంటే చాలా మంది సమాధానం చెప్పక పోవచ్చు. కేవలం పొదుపు చేయడం వలన ఎలాంటి లాభం ఉండదు. మీరు చేసిన పొదుపును ఇన్వెస్ట్మెంట్ గా తప్పని సరిగా మార్చాలి . తగ్గుతున్న రూపాయి విలువ , పెరుగుతున్న ద్రవ్యోల్బణం.భవిషత్తు అవసరాల కొరకు అని చాలా చాలా సమాధానాలు చెప్తాం., మన పెట్టుబడి ఒక్క ముఖ్య ఉద్దేశం  సంపద సృష్టించడం , దానితో పిల్లల   చదువులు ,కళాశాల ఫీజులు. పెళ్ళిల్లు, సెలవులలో  సరదాగా  గడపడం, మంచి జీవన ప్రమాణానికి,రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరుగుటకు , మీ అనంతరం ఈ సంపద మీ తరాల వారికి  చేర్చటం,
ఈ పెట్టుబడి వల్ల వచ్చే  రాబడి పెరుగుతున్న  ద్రవ్యోల్బణం  కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపదను కాపాడటం మరియు దానిని అభివృద్ధి చేయడం అనేది ఒక్క కళ.  మీ దగ్గర ఉన్న వంద రూపాయలు ద్రవ్యోల్బణం ఎనిమిది  శాతం ఉంటే  సంవత్సరం తర్వాత దాని విలువ తొంభై రెండు రూపాయలు మాత్రమె పది సంవత్సరాల తర్వాత కూడా ద్రవ్యోల్బణం ఎనిమిది  శాతం ఉంటే  మీ వంద రూపాయల విలువ కేవలం   నలభై ఆరు రూపాయలు మాత్రమె అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు చేసే మీ  పెట్టుబడి మంచి రాబడి అందించేదిగా  ఉండాలి.
ఇన్వెస్ట్మెంట్ సాధనాలు.

మీరు  సాదారణంగా ఇన్వెస్ట్ చేయడానికి . పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ , షేర్ మార్కెట్, మ్యుచవల్  ఫండ్స్ ,బ్యాంక్ డిపాజిట్లు , వివిధ పోస్టాపీసు పథకాలు, రియల్ ఎస్టేట్స్ , బంగారం, గవర్నమెంట్ బాండ్స్, ట్రెజరీ బిల్ల్స్,  మొదలగునవి కలవు. వీటి గురుంచి మనం  తర్వాత వివరంగా తెలుసుకుందాం. 
బంగారంలో పెట్టుబడి ఎంత శాతం ఉండాలి ?

ఈ మధ్య నేను తరచుగా అందుకుంటున్న మెయిల్స్ లో అధిక భాగం  బంగారంలో పెట్టుబడి  గురుంచే అధికంగా ఉంటున్నాయి. దానికి ముఖ్య కారణం ఈ మధ్య బంగారం రేటు అధికంగా పెరగడం కూడా ఒక కారణం. నేను అందుకున్న మెయిల్స్ లో అధిక భాగం వారి వద్ద ఉన్న పెట్టుబడిలో బంగారంలో ఎంత శాతం పెట్టుబడిగా పెట్టాలి ?  బంగారం లో పెట్టుబడి పై మీ ఉద్దేశం ఏమిటి ? లాంటి  ప్రశ్నలు అధికంగా ఉన్నాయి.దీనికి నా సమాధానం వ్యక్తిగతంగా నా పోర్ట్ ఫోలియో లో 5% కంటే అధికంగా పెట్టుబడి ఉండటానికి నేను అసలు ఇష్టపడను. అదే విధంగా ఇన్వెస్టర్లను కూడా వారి  పోర్ట్ ఫోలియో లో  10%  కంటే అధికంగా పెట్టుబడి పెట్టడాన్ని ఎంత మాత్రం మంచిది కాదు అనే హెచ్చరిస్తాను. ఎందుకంటె ఒక ఆర్ధిక నిపుణుడిగా బంగారం పై నాకంటూ ఒక నిచ్చిత అభిప్రాయం ఉంది. నేను కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ అసెట్ తరగతులను నిశితంగా విశ్లేషించడం జరిగినది.వాటిలో బంగారం యొక్క విలువను లెక్కించడానికి సరియైన పద్దతంటూ లేదు. మనం సాదారణంగా దేనిలో అయినా పెట్టుబడి పెడుతున్నాం అంటే   దాని యొక్క ప్రస్తుత విలువను, ఆదాయ వ్యయాలను, బ్యాలన్స్ షీట్ మొదలగు వాటిని పరిశీలించి దాని భవిష్యత్తు ను అంచానా వేస్తాం. కాని బంగారం మాత్రం ఎలాంటి ఆదాయాన్ని ఇవ్వదు. అందువలన దాని విలువను ఖచ్చితంగా అంచనా  వేయడం మాత్రం ఆచరణాత్మకంగా సాధ్యం కాదు.   
సాదారణంగా బంగారం ధర అమెరికా మానిటరీ పాలసీ తో ప్రత్యక్ష సంభందం కలిగి ఉంటుంది. అమెరికా మానిటరీ పాలసీ లో పెరుగుదల లేదా తగ్గుదల బంగారంపై  ప్రభావం కలిగి ఉంటుంది.బంగారం విలు కట్టడానికి అనేక సిద్దాంతాలు ప్రతిపాదిన్చాబడ్డాయి. వాటిలో. అమెరికా మానిటరీ పాలసీ , ద్రవ్యోల్భణం. ముడిచమురు ధరలు మొదలగునవి ఉన్నాయి. కాని ఇవి ఏవి కూడా ఖచ్చితమైనవి  కావు.ఎందుకంటె బనగారాం ఎలాంటి ఆదాయాన్ని ఉత్పత్తి కానీ  , జనరేట్ చేయడం కాని చేయదు.అందువలన బంగారం యొక్క  విలువ ఖచ్చితంగా అంచానా వేయడం సాధ్యం కాదు. అందువలన నేను నా పెట్టుబడిలో 5% కంటే అధికంగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడను. అదే విధంగా ఎవ్వరిని కూడా 10%  కంటే అధికంగా పెట్టుబడి పెట్టడానికి సలహా ఇవ్వను.ఐతే కొంత మంది నాతో విభేదించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ఈక్విటీ మార్కెట్ కంటే అధిక ప్రతి ఫలం అందిస్తుంది కదా ? అని. రెండు మూడు సంవత్సరాల నుండి  ఈక్విటీ మార్కెట్  తక్కువ ప్రతి ఫలం అందించిన దీర్ఘకాలంలో మాత్రం  ఈక్విటీ మార్కెట్  కంటే అధిక రాబడి అందించే సాధానాలు లేవనే చెప్పాలి. కాకపోతే  ఈక్విటీ మార్కెట్  లో మంచి అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం చేయాలి. అంతే కాని ఎవ్వరో చేప్పారని, ఎవ్వరో ఇన్వెస్ట్ చేసారని కాకుండా మీరు స్వయంగా విశ్లేషించే సామర్ధ్యం తప్పకుండా కలిగి ఉండాలి.స్టాక్ మార్కెట్ పై మీకు ఏ మాత్రం అవగాహన లేకున్న నష్టాలపాలు కావడం చాలా సర్వసాదారణం. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆర్ధిక విషయాలపై అవగాహన కలుగ చేసుకోవాలి. Learn to earn    
రూపాయి పతనం వలన  మన పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది.
రూపాయి  విలువ పతనం  వలన  మన పై చాలా ప్రభావం ఉంటుంది. ముందుగా రూపాయి విలువ పడిపోవడం వలన లాభపడేది  ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం  .
ఎగుమతి దారులు సాదారణంగా వారూ ఎగుమతి చేసిన వస్తువులకు లేదా  అందించిన సేవలకు  వారి  పేమెంట్ డాలర్ లేదా విదేశీ కరెన్సీ రూపంలో అందుకొని వాటిని మన రూపయలలోకి మార్చుకుంటారు.రూపాయు పతనం వలన వారూ మార్చుకొనే డాలర్ లేదా విదేశీ కరెన్సీ కి అధిక రూపాయలు రావడం వలన లాభం కలుగుతుంది.
NRI లు  విదేశాల నుండి తరుచుగా వారి కుటుంబ సభ్యులకోరకు డబ్బులు పంపిస్తుంటారు. రూపాయు పతనం వలన వారూ పంపించే డాలర్ కి అధిక రూపాయలు రావడంతో NRI లు మరియు వారి కుటుంబ సభ్యులు లాభం అందుకుంటారు.
కొంత మంది కొన్ని విదేశీ కంపెనీల కొరకు మన దేశంలో నుండి  అన్ లైన్ జాబ్ చేయడం జరుగుతుంది. దీనికొరకు వారూ విదేశీ కరెన్సీ రూపంలో పేమెంట్ అందుకోవడం జరుగుతుంది. వారూ కూడా లాభ పడతారు. ఉదా : Ad sense
ఇప్పుడు  రూపాయి విలువ పడిపోవడం వలన నష్టపోయేది ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం  .
దిగుమతిదారులు వారూ దిగుమతి చేసుకున్న వస్తువులకు లేదా పొందిన  సేవలకు పేమెంట్ డాలర్ లేదా విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించవలసి ఉంటుంది.
విదేశాలకు వెళ్ళే టూరిస్టులు, విదేశాలలో చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులు వారి ప్రయాణానికి , విదేశాలలో అవసరమైన డాలర్లు పొందడానికి రూపాయి పతనం వలన అధిక రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
పైన పేర్కొన్న వారూ మాత్రమే కాకుండా సాదారణ ప్రజానీకంపై రూపాయి పతనం చాలా ప్రభావం కలుగచేస్తుంది. ముఖ్యంగా మన దేశం ఆయిల్ దిగుమతి చేసుకోవడం  వారి పేమెంట్ డాలర్ల రూపంలో జరపవలసి ఉండటం వలన  అధిక విదేశీకొరకు అధిక రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అంతర్జాతీయ    మార్కెట్ లో ఆయిల్ ధరలు పెరగడానికితోడు , అదే సమయంలో మన రూపాయి విలువ పతనం కావడం వలన సామాన్యుడిపై  పెట్రోలు, డిజిల్ , గ్యాస్  ధరలు పెరగడం జరుగుతుంది. వీటి ధరలు పెరగడం వలన మిగితా వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యుడిపై అధిక భారం పడుతుంది.అదేవిధంగా ఇతర దిగుమతి కంపెనీల పై అధిక భారం పడటం వలన అవి నష్టాలపాలు కావడమే కాకుండా కంపెనీలు మూసివేయాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. దీనివలన చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన  పరిస్థితులు ఏర్పాటు అవుతాయి.రూపాయి పతనం వలన  ఎగుమతిదారులు మరియు NRI లు తప్ప మిగితా ప్రజల పై తీవ్ర ప్రాభవం ఉంటుంది. ఏది ఎమైనప్పటికి కూడా రూపాయి పతనం కావడం దేశానికి ఎల్లప్పూడూ మంచిది కాదు.

ప్రీమియం తిరిగి చెల్లించే టర్మ్ ఇన్సురెన్స్ పాలసీల వలన లాభమా ? నష్టమా ?
టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలకు  మీరు చెల్లించే ప్రీమియం తిరిగి రాదు అనే విషయం మీకు తెలుసు కదా ? సంపాదనపరుడై , తన మీదా ఆధారపడిన వారూ ఉన్నప్పుడు స్ర్తీ లేదా పురుషుడు ఎవరైనా సరే తప్పనిసరిగా ఉండవలసిన ,తప్పనిసరైన  ఇన్సురెన్స్ పాలసీ టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ. కాని , చాలా మంది టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ కి చెల్లించే ప్రీమియం తిరిగి రాదు అనే ఒకే ఒక కారణంతో  ఈ టర్మ్ ఇన్సురెన్స్ పాలసీకి దూరంగా ఉంటారు. ఐతే ఇప్పుడు టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలలో కూడా ప్రీమియం తిరిగి చెల్లించే పాలసీలు వచ్చాయి. వీటి వలన లాభమా అని చాలా మంది అడుగుతున్నారు. ఒకసారి మనం పరిశీలిద్దాం.ఈ విధంగా ప్రీమియం తిరిగి చెల్లించే టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలను   Return of premium  term insurance  లేదా  ROP అంటారు.  టర్మ్ ఇన్సురెన్స్ పాలసీల కంటే దీనిలో ఉన్న ఇతర సదుపాయం ఏమిటంటే పాలసీ గడువు తీరిన తర్వాత పాలసీ హోల్డర్ జీవించి ఉన్నట్టు ఐతే చెల్లించిన ప్రీమియం మొత్తం ఎలాంటి వడ్డీ లేకుండా తిరిగి వాపసు ఇవ్వబడుతుంది. మీరు అనుకుంటుండవచ్చు. గడువు తర్వాత ఏమి తిరిగి రాని పాలసీ కంటే ప్రీమియం తిరిగి వస్తున్న పాలసీ మంచిది కాదా  ? అని  కాని, అసలు విషయం ఏమిటంటే మీరు సాదారణంగా చెల్లించే  టర్మ్ ఇన్సురెన్స్ పాలసీల ప్రీమియం కంటే మీరు ఈ Return of premium  term insurance  లేదా  ROP పాలసీలకు చెల్లించే ప్రీమియం రెండింతలు లేదా మూడింతలు ఉంటుంది. ఉదాహరణకు మీరు  ఇరవై  సంవత్సరాల కాల వ్యవధి కలిగిన సాదారణ టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ కొరకు  ప్రతి సంవత్సరం Rs 6000 ప్రీమియం చెల్లించవలసి ఉంటే  ఈ ROP పాలసీ లలో Rs12000 నుండి Rs15000 చెల్లించవలసి ఉంటుంది. Rs15000 చెల్లించాల్సి ఉంది అనుకోండి. దాని బదులు Rs 6000 పెట్టి సాదరణ  టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకొని మిగిలిన Rs 9000  లేదా నెలకు Rs 750  రూపాయలు మీ పాలసీ గడువు అంటే ఇరవై సంవత్సరాల వరకు PPF లేదా మ్యుచవల్ ఫండ్ లో  సిప్ ద్వారా జమ చేయండి.   PPF లో 9% రాబడి వచ్చిన మీకు గడువు తర్వాత వచ్చే మొత్తం సుమారు Rs 500915 ,మ్యుచవల్ ఫండ్ లో 12% రాబడి వచ్చిన  మీకు వచ్చే మొత్తం Rs 741942. మీరు Rs15000 పెట్టి ROP పాలసీ తీసుకున్న మీకు ఇరవై సంవత్సరాల తర్వాత  మీకు తిరిగి వచ్చే మొత్తం కేవలం Rs 300000 కాని  మీరు  PPF లో చేస్తే Rs 500915 , మ్యుచవల్ ఫండ్ లో చేస్తే Rs 741942. అందుకుంటారు.కాకపోతే మీరు ROP పాలసీ కొరకు ఒకే సారి ప్రీమియం చెల్లిస్తే మ్యుచవల్ ఫండ్ కొరకు మీరు ప్రతి నెల కొద్ది మొత్తం చెల్లించాలి.మీకు వచ్చే రాబడితో పోలిస్తే మీరు తీసుకొనే కొద్ది శ్రమ ఏపాటిది కాదు. ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకొండి .ఇన్సురెన్స్ అంటే కేవలం రక్షణ కవచం మాత్రమే అంతే కాని పెట్టుబడి సాధనం కాదు. అందుకే ప్రతి వ్యక్తీ సరియైన ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవాలి .ఈ రోజు
ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html

పోదుపు, పెట్టుబడి  అంటే ఏమిటి?
మీలో చాలా మందికి డబ్బును అదా చేయాలి  అని ఉంటుంది. ఒక వేళ అదా చేసిన దానిని సాదారణంగా  సేవింగ్ బ్యాంక్ ఖాతాలో ఉంచుతారు.అసలు  ముందుగా మీకు  సేవింగ్ కి , ఇన్వెస్ట్మెంట్ కి గల తేడా ఏమిటి.అనే విషయం తెలియాలి. ఈ  రెండింటి మధ్య గల కీలకమైన తేడా తెలిస్తేనే మీరు చేస్తుంది సేవింగ్ న లేక ఇన్వెస్ట్మెంట్ న అనే విషయం తెలుస్తుంది.సేవింగ్ అనగానే పొదుపు అని ,ఇన్వెస్ట్మెంట్ అనగా పెట్టుబడి అని దానికి అర్ధం తెలియడం కాదు . రెండింటి మధ్య గల వాస్తవిక తేడా తెలియాలి.సాదరణంగా మీరు ప్రతి నెల మీ బడ్జెట్ రూపొందించుకోవడం అలవాటు చేసుకోండి.. బడ్జెట్ అంటే ఏదో బ్రహ్మాండమైన విషయం ఏమికాదు. మీకు వస్తున్న ఆదాయం ఎంత  ? మీ ఖర్చులు ఎంత ? మీకు మిగులుతున్నది ఎంత ?  అదాయానికి  , వ్యయానికి మధ్య గల తేడా మీ మిగులు బడ్జెట్ . సాధారణంగా మీ మిగులు బడ్జెట్ ను క్రమ పద్దతిలో పక్కన పెట్టడం సేవింగ్ . దీనిని మీరు సాదారణంగా బ్యాంక్ ఖాతాలో ఉంచుతారు ఇక్కడ మీరు పొదుపు చేసిన డబ్బులో పెరుగుదల ఉండదు . ఒకవేళ ఉన్నా అది అతిస్వల్పం  . వీటిని భద్రత  అధికం గల  పథకాలలో మాత్రమె ఇన్వెస్ట్ చేస్తారు.వీటిలో నష్టభయం చాలా తక్కువ.ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు పొదుపు చేసిన డబ్బును మంచి రాబడి అందివ్వగల సాధనాలలో పెట్టుబడిగా పెట్టడం.ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏ ఏయే సాధనాలలో ఇన్వెస్ట్ చేయాలి  అనే విషయం తెలుసుకోవాలి.సేవింగ్ లో ఎప్పుడు రిస్క్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ లో రిస్కు ఉంటుంది. కాని ఒక్క  విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి  రిస్కు లేకుండా రాబడి మాత్రం ఉండదు.ప్రతి వ్యాపారంలో లాభనష్టాలు అనేవి సహజం అంత మాత్రాన వ్యాపారం చేయడం మానేస్తారా! కాకపోతే మీరు చేయాల్సినది  మీరే స్వయంగా  మార్కెట్లోని వివిధ విభాగాలలో అవగాహన  పెంపొందించుకొని  , మంచి పెట్టుబడి విధానాన్ని క్రమశిక్షణతో అనుసరించాలి.    ఇక్కడ మీరు చేయాల్సినది రిస్కును బేరీజు వేసుకుంటూ మంచి రాబడి అందివ్వగల  సాధనాలలో పెట్టుబడి  చేయడం. సేవింగ్ అనేది చిన్నవయస్సు నుండే అలవాటు కావాలి . ఇన్వెస్ట్మెంట్ అనేది మీ సంపాదన మొదలైన రోజు నుండే ప్రారంభం కావాలి. ఇన్వెస్ట్మెంట్స్ ని ఎక్కువగా స్టాక్ మార్కెట్, బాండ్స్ , మ్యుచవల్   ఫండ్స్ , రియల్ ఎస్టేట్, బంగారం మరియు కమోడిటీస్  వంటి వాట్లో ఎక్కువగా చేస్తారు.

ఒక తాత తన మనవడైన శ్రీ రాం కి , వాడి   బర్త్ డే సందర్భంగా వంద రూపాయలు బహుమతిగా ఇచ్చెను . అప్పుడు శ్రీ రాం సంతోషంగా తన తల్లి వద్దకు వెళ్లి నేను ఈ డబ్బుతో చాక్లెట్లు  కొనుకుంటాను  అని చెప్తాడు. అప్పుడు  శ్రీ రాం వాళ్ళా  అమ్మ  చాక్లెట్ల వల్ల దంతాలు యేవిధంగా  పాడు అవుతాయో వివరించి ఆ డబ్బులు చాక్లెట్ల కొనుక్కోవడానికి బదులుగా గల్లాగురిగి లో దాచోకోమని చెప్తుంది. దానికి శ్రీరం అయిష్టంగానే అంగీకరిస్తాడు.ఈ విధంగా శ్రీ రాం తనకి ఎవ్వరూ చాక్లెట్లు  కొనుక్కోవడానికి  డబ్బులు ఇచ్చిన వాటిని గల్లాగురిగి లోనే దాచుకోనేవాడు. కొన్నాళ్ళకి ఈ గల్లాగురిగి  నిండి పోవడంతో  శ్రీ రాం మరియు శ్రీ రాం తల్లి దానిని పగులగొట్టి  అందులోని డబ్బులు లెక్కించగా వారు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉండటంతో చాలా సంతోషపడతారు.ఇప్పుడు శ్రీ రాం తల్లి ఈ డబ్బులు బ్యాంక్ లో వేయడం వలన శ్రీ రాం కి బ్యాంక్ గురుంచి కూడా వివరంగా తెలుస్తుంది అని , బ్యాంక్ కి వెళ్లి ఆ డబ్బును బ్యాంక్ లో డిపాజిట్ చేపిస్తుంది.అప్పుటి   నుండి శ్రీ రాం  బ్యాంక్ లో డబ్బు  డిపాజిట్  చేయడం మొదలు పెడతాడు. శ్రీ రాంకి    ఎ విధంగా  సేవింగ్  చేయడం అలవాటు కావడం  అతని తల్లి ఎంతో గర్వ పడుతుంది.ఒక భాద్యత గల తల్లిగా  తన కొడుక్కి సేవింగ్ చేయడం అలవాటు చేసినది.ఇది సాదారణంగా చాలా ఇళ్లలో జరుగుతున్నదే. ప్రపంచంలో అత్యధికంగా సేవింగ్ చేస్తున్నది మనదేశంలోనే .భారతీయుల్లో సేవింగ్ చేయడం అనేది వారి జీవితంలో ఒక భాగం .ఇంతగా  పొదుపు చేసే అలవాటు ఉన్న  మన దేశం  ఇంకా పేద దేశంగా ఉండటానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసా !  మీ దగ్గర ఉన్న ఈ పొదుపు చేసిన మొత్తాన్ని మంచి రాబడి అందివ్వ గల పెట్టుబడి సాధనాలలోకి మళ్ళించకపోవడమే.

5 comments:

  1. good analysis,keep the blog up to date.

    ReplyDelete
  2. baga chepparu sir....

    ReplyDelete
  3. its really really helpful information. Please update the blog and continue your suggestions.

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.