ఈ రోజు స్టాక్ మార్కెట్ 29-08-2012
రేపు గురువారం డేరివేటివ్స్ కాంట్రాక్ట్ ముగింపు కావున ఈ రోజు రేపు మార్కెట్ లో ఉగిసలాట అధికంగా ఉండగలదు. మనం ఇది వరకే చెప్పుకున్నట్టుగా 5305 వద్ద సపోర్ట్ కలదు ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ జరిగినచో మొదటగా 5248 వరకు దిగాజారగలదు. రెసిస్టన్స్ 5348 వద్ద కలదు.
స్టాక్ మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే సెన్సెక్స్ అంటే ఏమిటి?
సెన్సెక్స్ లేదా
సెన్సిటివ్ ఇండెక్స్ ( SENSEX-or SENSitve index ) ను జనవరి 1 1986 రొజూ ముంబాయి స్టాక్ ఎక్సేంజీ ద్వారా పరిచయం
చేసారు.ఇది ఇండియా లో గల ప్రముఖ ఇండేక్స్లలో ఒకటి .ఈ సెన్సెక్స్ మొత్తం మార్కెట్
ను ప్రతిబంబించేలా రూపొందించబడినది.దీనిలో బాగా పేరొందిన , స్థిరపడిన , ఆర్ధికంగా
బాగా బలమైన పునాదులు కలిగినటువంటి
ముప్పై పెద్ద కంపెనీలతో ఏర్పాటు
చేయడం జరిగినది.సెన్సెక్స్ లెక్కించడం కోసం ఆ కంపీనీ మార్కెట్ కాపిటలైజేషన్
లెక్కలోకి తీసుకోవడం జరిగినది. అధిక కాపిటలైజేషన్ కలిగిన కంపెనీకి అధిక వెయిటేజీ
ఇవ్వడం జరిగినది.అదే విధంగా 1978-79వ సంవత్సరం ను బెస్ సంవత్సరంగా , 100 ను బెస్
ఇండెక్స్ వాల్యుగా పరిగణలోకో తీసుకోవడం జరిగినది.అంటే సెన్సెక్స్ నిర్మాణ సమయంలో
మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ విలువ 100 తీసుకోవడం
వలన మరుసటి రోజూ మార్కెట్ కాపిటలైజేషన్ 10%
పెరిగితే ఇండెక్స్ కూడా 10% పెరిగి 100 నుండి 110 అవుతుంది. 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా తీసుకోవడంలో
ముఖ్య ఉద్దేశం లెక్కించడానికి సులభంగా ఉంటుంది అనే ఆలోచనే. సెన్సెక్స్ లో
ఎన్నుకొనే కంపెనీలు క్వాలిటీ పరంగా మరియు క్వాంటిటీ పరంగా మంచి లక్షణాలు కలిగిఉంటాయి.
ఇప్పుడు
సెన్సెక్స్ ఇండెక్స్ యే విధంగా నిర్మిస్తారో ఒక్కసారి చూద్దాం.మార్కెట్ లో ఒక
స్టాక్ మాత్రమే ఉంటే దానిలో పెరుగుదల కాని, పతనం కాని సులభంగా అర్ధం చేసుకోవచ్చు.
బెస్ ఇండెక్స్ విలువ 100 కాబట్టి ఒక
స్టాక్ యొక్క ధర 200 నుండి 240 వరకు పెరిగితే ఆ స్టాక్ లో పెరుగుదల 20% నమోదు ఐతే ఇండెక్స్ లో కూడా పెరుగుదల 20% ఉండి
ఇండెక్స్ 100 నుండి 120 కి చేరుకుంటుంది.
మరుసటి రోజు ఆ స్టాక్ యొక్క ధర 10% పతనం
జరిగి 216 కు చేరుకుంటే సెన్సెక్స్
ఇండెక్స్ కూడా 10% తగ్గడంతో 110 కి చేరుకుంటుంది.ఈ విధంగా సెన్సెక్స్ లో
ఒకే స్టాక్ ఉండటం వలన ఇండెక్స్ విలువ మనం
లెక్కించడం సులభంగా జరిగినది. మరి ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు స్టాక్ లు ఉంటే యే
విధంగా లెక్కించాలో చూద్దాం.
ఇప్పుడు ఇండెక్స్ లో A మరియు B అనే రెండు కంపెనీల స్టాక్స్ ఉన్నాయి అనుకోండి. A స్టాక్ ధర 200 వద్ద ఉంది , B స్టాక్ ధర 150 వద్ద ఉంది.సెన్సెక్స్ ఇండెక్స్ ఏర్పాటు
చేయడంలో స్టాక్స్ యొక్క మార్కెట్ కాపిటలైజేషన్ పరిగణలోకి తీసుకొని దానికి
అనుగుణంగా ఆ కంపెనీకి ఇండెక్స్ లో వెయిటేజీ ఇస్తారు అని మనం ఇది వరకే
తెలుసుకున్నాం. మరి ఇప్పు ఈ రెండు స్టాక్ ల యొక్క వెయిటేజీ ఏవిధంగా తెలుసుకోవాలో
ఒక్కసారి చూద్దాం. ఒక కంపీనీ లో గల మొత్తం షేర్లను ఆ కంపెనీ షేరు లేదా స్టాక్ ధరతో
గుణించగా వచ్చేదే మార్కెట్ కాపిటలైజేషన్ . కంపెనీ A వద్ద 100,000 షేర్లు మరియు కంపెనీ Bవద్ద 200,000 షేర్లు ఉంటే కంపెనీ A కాపిటలైజేషన్
200 x 100000 =20000000 మరియు కంపెనీ B కాపిటలైజేషన్ 150 x 200000 = 30000000 అవుతుంది. మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ (200 x 100000 + 150 x 200000) Rs 500 lakhs అవుతుంది. ఈ మొత్తం సెన్సెక్స్ ఇండెక్స్ బెస్ విలువ 100 కి సమానం
అవుతుంది.ఇప్పుడు కంపెనీ A స్టాక్ ధర 260 (30% increase in price) కి చేరుకుంది.కంపెనీ B స్టాక్ ధర 135. (10% drop in price)కి చేరుకుంది.ఇప్పుడు మార్కెట్ కాపిటలైజేషన్ 260 x 100000 +135 x 200000= Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే
స్టాక్స్ ధరలలో మార్పు వల్ల మార్కెట్ కాపిటలైజేషన్ ) Rs 500 lakhs నుండి Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే 6%
పెరుగుదల నమోదు కావడం జరిగినది కావున సెన్సెక్స్ ఇండెక్స్ లో కూడా పెరుగుదల 6%
నమోదు కావడం జరుగుతుంది కాబట్టి సెన్సెక్స్ ఇండెక్స్ 100 to 106 మార్పు చెందడం జరుగుతుంది.ఈ విధమైన లాజిక్ ను సెన్సెక్స్ లో ఎంచుకున్న
స్టాక్స్ అన్నిటికి విస్తరించి లెక్కించడం జరుగుతుంది. అందుకే స్టాక్స్ యొక్క ధరల
మారౌకి అనుగుణంగా సెన్సెక్స్ కూడా మార్పు చెందడం జరుగుతుంది. ఐతే సెన్సెక్స్
ఇండెక్స్ ముప్పై ఆర్ధికంగా బలంగా ఉన్న
పెద్ద కంపెనీలను చేర్చడం ద్వారా లెక్కిస్తాయు అని తెలుసుకున్నాం. కాని ఒక్క విషయం
ఒక కంపెనీ యొక్క అన్ని షేర్లను పరిగణలోకి తీసుకోరు. కేవలం ఫ్రీ ప్లోటింగ్ ఉన్న
షేర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.ప్రీ ప్లోటింగ్ అంటే ఏమిటో మనం మరొక్క సారి
తెలుసుకుందాం
ఈ వారం స్టాక్ మార్కెట్ 27-08-2012
మనం గత వారం
అనుకున్నట్టుగానే నిఫ్టీ 5400 పై నిలబడలేకపోయినది.అంతేకాకుండా పై లెవల్లో బెరిష్
క్యాండిల్ స్టిక్ పాటర్న్ కూడా ఏర్పాటు కావడం జరిగినది.ప్రస్తుతం నిఫ్టీ కి 5348 దరిదాపులో సపోర్ట్ కలదు. అదే విధంగా నిఫ్టీ ఫిబోనస్సి రేషియో
ప్రకారం కూడా 78.6% 5448 వద్ద రెసిస్టన్స్ మరియు 5305 వద్ద సపోర్ట్
కలదు.అంతే కాకుండా 100 wsma 5375 వద్ద కలదు. అదే విధంగా ఈ వారం
డెరివేటివ్స్ ఎక్స్ఫైరీ వారం కావడం కూడా మార్కెట్ లో అధిక ఉగిసలాట ఉండటానికి అవకాశం
కలదు.ఏది ఏదిఏమైనప్పటికీ కూడా నిఫ్టీ 5400 బ్రేక్ చేసి నిలదోక్కుకున్నట్టు ఐతే 5448
వరకు తర్వాత 5500 వరకు ర్యాలీ జరిగే అవకాశం కలదు.అదే విధంగా 5348బ్రేక్ జరిగినచో 5305 వరకు దిగాజారగలదు. 5448 ముఖ్యమైన రెసిస్టన్స్ మరియు 5305 ముఖ్యమైన సపోర్ట్ .మార్కెట్
పరిస్తుతులకు అనుగుణంగా అప్ డేట్ చేయడం జరుగుతుంది.
స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ట్రైనింగ్
స్టాక్
మార్కెట్ లో మీరు ఎప్పుడు నష్టాలనే పొందుతున్నారా ? లాభాలు ఎలా వస్తాయో మీకు
తెలియడం లేదా ?.ఇంకా ఎంత వరకు మీరు మార్కెట్
డైరెక్షన్ కోసం లేదా కాల్స్ కోసం ఇతరులపై ఆధారపడతారు.మీరే టెక్నికల్ అనాలసిస్
నేర్చుకోండి. మీకు టెక్నికల్ అనాలసిస్ తెలుగులో బేసిక్ నుండి నేర్పడమే కాకుండా యే
ట్రేడింగ్ స్ట్రాటజీ ఉపయోగించి లాభాలు అందుకోవచ్చో తెలుపడం జరుగుతుంది. టెక్నికల్ అనాలసిస్
అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్ అందులో ఏది అవసరమో కాదో తెలుసుకోవడం చాలా కష్టం. మేము మీకు
అవసరమైనవి తెలియచేయడమే కాకుండా నేర్చుకున్నవాటిని యే విధంగా ఉపయోగించాలో
తెలియచేస్తాం. చాలా ఇనిస్టిట్యూట్స్ సుమారు యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు వసూలు
చేస్తాయి. మీ ఇంటికి వచ్చి మీకు
నేర్పడం జరుగుతుంది. టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోండి .స్వయంగా లాభాలు
సంపాదించుకొండి. మీరు లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.లెర్నింగ్
లేకపోతే మీకు మార్కెట్ లో నష్టాలు సంభవించడం చాలా సర్వసాదారణం .ఈ ప్రపంచంలో ఏది
ఉచితంగా రాదు అనే విషయం తెలుసుకోండి.ఇంకా ఎంత కాలం స్టాక్ మార్కెట్ కోసం ఇతరుల
మీదా , టి .వి. అనలిస్టుల మీదా ఆధారపడతారు.స్టాక్ మార్కెట్ లో ఒక్కరి మీదా ఆధారపడే
వారూ ఎప్పుడు లాభాలు అందుకోలేరు.మీకు మేము స్టాక్ మార్కెట్ అనే అడవిలో లాబలతో బయట
పడటానికి కావలసిన రోడ్ మ్యాప్ యే విధంగా ఏర్పాటు చేసుకోవాలో నేర్పుతాం.మీకు స్టాక్
మార్కెట్ పై పూర్తీ అవగాహన లేకపోతే మీ వద్ద గల మొత్తం కాపిటల్ నష్టపోయే ప్రమాదం
అధికంగా కలదు.స్టాక్ మార్కెట్ నిన్న ఉంది, నేడు ఉంది , రేపు కూడా ఉంటుంది. కాని
ఒక్కసారి మీ కాపిటల్ లాస్ ఐతే మీరు చేయగలిగేడి ఏమి ఉండదు. అందువలన మీరు స్టాక్
మార్కెట్ పై ఇతరుల మీదా ఆధారపడకుండా స్వయం నిర్ణయం యీసుకొనే శక్తి సంపాదించుకొండి .
పెద్ద పెద్ద ఇన్స్టిట్యుట్స్ వేలు , లక్షల ఫీజు తీసుకుంటాయి. మీరు క్లాసు రూం లో
కాని , సెమినార్ లో కాని మీకు వచ్చిన సందేహాలు లేదా మీరు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తే లాభాలు
అందుకోగలరో తెలియచేయరు. కాని మేము మీకు వ్యక్తిగతంగా తెలుగులో మీకు కాన్సెప్ట్ అర్ధం అయ్యేలా నేర్పడం వలన మీకు స్టాక్ మార్కెట్ పై గల అపోహలు
అన్ని పోతాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్ అంటే మీరు సరియైన
మార్గంలో అనాలసిస్ చేయగలిగితే సంపద స్ప్రుటించే సాధనం.మీరు ఏదో షేర్లు కొన్నాం , అమ్మాం అంటే తప్పకుండా నష్టాలే వస్తాయి. అలా కాకుండా
మీరు స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించాలి అంటే మీకు పూర్తీ అవగాహన అవసరం. మీరు
ఒక బిజినెస్ లో డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడతారో స్టాక్
మార్కెటులో సంపాదించాలి అంటే కూడా దానిని కూడా ఒక బిజినెస్ గానే చూడాలి. అందువలన
మీరు స్టాక్ మార్కెట్ పై పట్టు సాధించాలి
అంటే మేము మీకు నేర్పించే స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ట్రైనింగ్
తీసుకోండి.గురువు
లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా మీరు
టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోవడానికి
ట్రైనర్ లేదా మెంటర్ తప్పనిసరి. మీరు
ఒక్కరోజు స్టాక్ మార్కెట్ లో పొందే నష్టంతో టెక్నికల్ అనాలసిస్ నేర్చుకున్నట్టు
ఐతే మీరు తర్వాత నుండి విజయవంతమైన ట్రేడర్ కాగలరు. మీరు టెక్నికల్ అనాలసిస్ నేర్చుకున్న
తర్వాత కేవలం యాభై వేల రూపాయల పెట్టుబడితో
సంవత్సరం తిరిగే సరికల్లా ప్రతినెల లక్ష రూపాయలు యే విధంగా సంపాదిన్చావచ్చో
మీకు వివరంగా తెలియచేయడం జరుగుతుంది.
వివరాలకు telugufinancialschool@gmail.com
చాలా మందికి ఫైనాన్సియల్ ప్లానింగ్ లేదా ఆర్ధిక ప్రణాళిక అదో అర్ధం కాని వ్యవహారంగా భావిస్తుంటారు. ఎవరైనా సరే దేనినైతే అర్ధం కాదు అనే భావనతో దాని గురుంచి తెలుసుకోవడం చేయకపోతే దాని వలన కలిగే లాభాలను కోల్పోతున్నట్టే. మీరు యే రంగంలో ప్రవేశిస్తున్న దాని గురుంచి పూర్తీ వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రవేశిస్తే మీరు మంచి లాభాలను అందుకోగలుగుతారు. మీకు ఆర్ధిక వ్యవహరాలపై యే మాత్రం పట్టు లేనట్టు ఐతే మీరు ఆర్ధికంగా ఎదగడం చాలా కష్టం.దానికి కావలసినది ఫైనాన్సియల్ ప్లానింగ్. మీరు జీవితంలో చాలా మంది ఉన్నత స్థితికి ఎదిగి చివరి రోజులలో ఆర్ధికంగా దారుణమైన స్థితిని అనుభవించిన వారిని ఎందరినో చూసి ఉంటారు.దానికి ముఖ్య కారణం సరియైన ఆర్ధిక ప్రణాళిక లేకపోవడమే. మనలోనే ఎంతో మంది వారి వారి రంగాలలో ఎంత ఉన్నత స్థితికి ఎదిగిన , ఎంత గొప్ప వారైనా , ఎంత ఉన్నత చదువులు చదివిన ఫైనాన్సియల్ ప్లానింగ్ లో సరియైన అవగాహన చాలా తక్కువగా ఉంది అనడంలో యే మాత్రం సందేహం అవసరం లేదు. దీనికి ముఖ్య కారణం ఆర్ధిక అక్షరాస్యత లేకపోవడమే. అందువలన ప్రతి ఒక్కరికి ఆర్ధిక అక్షరాస్యత తప్పని సరి అనడంలో యే మాత్రం సందేహం అవసరం లేదు. మీరు ఈ బ్లాగ్ రెగ్యులర్ గా చదివినట్టు ఐతే ఆర్ధిక విషయాలపై పట్టు సులభంగా సాదించవచ్చు. ఇందులో మీరు సేవింగ్, ఇన్వెస్ట్మెంట్ , ఫైనాన్సియల్ గోల్స్, షేర్ మార్కెట్, ఫండమెంటల్ అనాలసిస్ , టెక్నికల్ అనాలసిస్ , ఇన్కంటాక్స్, ఇన్సురెన్స్ , ట్రేడింగ్ మొదలగు విషయాలపై పట్టు సాదించవచ్చు. వాస్తవంగా చెప్పాలి అంటే ఒక మనిషి కి కావలసిన ఆర్ధిక విషయాలపై సంపూర్ణ అవగాహన కలుగ చేయడమే ఈ బ్లాగ్ ముఖ్య ఉద్దేశం. ఇందులో పొందు పరిచే పోస్టుల వలన ఉపయోగం ఉంది అని మీరు భావిస్తే ప్రతి పోస్టు తప్పకుండా చదవగలరు.
telugufinancialschool@gmail.com