బంగారం ధర పెరుగుదల పై అపోహలు.
మనదేశంలో బంగారం
ధర పెరుగుదలపై అనేక అపోహలు ఉన్నాయి.అవిఎమిటో ఒక్కసారి చూద్దాం.
దీపావళి పండుగ
దగ్గరలో ఉంది కాబట్టి ప్రజలూ అధిక బంగారం కనుగోలు చేస్తారు కావున బంగారం ధర
పెరగడానికి అవకాశం ఉంది.
పెళ్ళిళ్ళ సీజన్
ప్రారంభం కాబోతుంది . కాబట్టి బంగారం ధర
పెరగడానికి అవకాశం ఉంది.
దీపావళి అనంతరం
బంగారం ధరలు పడిపోతాయి . ఎందుకంటే డిమాండ్
తగ్గిపోతుంది కాబట్టి.
బంగారం ధర పైకే
వెళ్ళుతుంది. ఎందుకంటె భారతీయులు బంగారం అధిక కనుగోలు చేస్తారు కావున .
ఇప్పుడు బంగారం
పది గ్రాములకు ముప్పైవేలు ఉంది కాబట్టి ప్రజలూ కొనడం మానేస్తారు . అందువలన బంగారం
ధరలు పడిపోతాయి.
అక్షయ తృతీయ వస్తుంది
కావున , బంగారం అధికంగా కనుగోలు చేస్తారు
కావున బంగారం ధర పెరుగుతుంది.
వాస్తవం
పైన
పేర్కొన్నవన్ని కేవలం అపోహలు మాత్రమే. పైనవన్ని కలిపి కూడా బంగారం ధరపై కేవలం ఒక్క శాతం మాత్రమే ప్రభావం చూపగలవు.బంగారం ధర
సాదారణంగా అమెరికా మానీటరీ పాలసీ కి అనుగుణంగా పెరగడం , తగ్గడం జరుగుతుంది.
మనదేశంలో బంగారం ధరను రూపాయి బలహీనపడటం,
బలపడటం కూడా ప్రభావితం చేస్తుంది.