Income Tax


TDS అంటే ఏమిటి ?
TDS అంటే మీరు పొందుతున్న ఆదాయం మూలం వద్దనే  ఆదాయపు పన్ను కోత  విధించడం .ఒకరకంగా చెప్పాలి  అంటే  పరోక్షంగా ఆదాయపు పన్ను వసూలు చేయడం . అంటే ఇది  pay as you earn అనే పద్దతిలో జరుగుతుంది.సాదారణంగా మీరు ఉద్యోగాస్తులతే మీ ఆదాయం పన్ను మినహాయింపు పరిధి కంటే అధికంగా ఉంటే  మీ యాజమాన్యం మీ వద్ద  TDS వసూలు చేస్తుంది. మీ యాజమాన్యం TDS వసూలు చేసే ముందు మీరు ఆదాయపు పన్ను మినహాయింపు అర్హత గల వాటిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మీ ఆదాయం లో నుండి తగ్గించుకొని మీ ఆదాయానికి వర్తించే స్లాబ్స్ కి అనుగుణంగా  TDS వసూలు చేస్తారు. కాబట్టి మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ వివరాలు మీ యాజమాన్యం కు తెలియచేయడం తప్పనిసరి. ఒకవేళ మీరు బ్యాంక్ వడ్డీ ఆదాయం Rs 10000 కంటే అధికంగా వడ్డీ పొందితే ,వడ్డీ ఆదాయంలో 10 % TDS రూపంలో మీ వద్ద  బ్యాంక్ వసూలు చేస్తుంది. మీకు కేవలం బ్యాంక్ వడ్డీ ఆదాయం మాత్రమే ఉన్న  లేదా మీ మొత్తం   ఆదాయం  పన్ను పరిధి కంటే తక్కువగా ఉంటే మీరు బ్యాంక్ వారికి 15G & 15 H అందచేసి మీ వద్ద TDS వసూలు చేయకుండా చూసుకోవచ్చు. ఆదాయపు పన్ను విషయంలో పెన్షన్ ను కూడా సాలరీగానే పరిగణిస్తారు. .ఈ విధంగా వసూలు చేసిన TDS ను ఆదాయపు పన్ను శాఖ వారికి చెల్లిస్తారు. అదే విధంగా మీకు TDS సర్టిపికేట్ కూడా అందచేస్తారు. మీ దగ్గర  TDS వసూలు చేస్తే మీరు  TDS  సర్టిపికేట్ తీసుకోవడం మీ భాద్యత  అదే విధంగా  TDS  సర్టిపికేట్ ఇవ్వడం TDS వసూలు చేసిన వారి బాధ్యత . TDS   కేవలం సాలరీ , బ్యాంక్ వడ్డీ ఆదాయం మాత్రమే కాకుండా మీ ఆదాయం క్రింద ఇవ్వబడిన దానిలో యే విధంగా ఉన్న TDS వసూలు చేస్తారు.

రాష్ట్ర ప్రభుత్వాలు VAT విధించి  ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఏ విధంగా కారణం అవుతాయో తెలుసుకుందాం?
మీకు అవగాహన ఉందో లేదో తెలియదు కాని ప్రభుత్వాలు ప్రజల  నుండి వివిధ రూపాలలో  ఇరవై  రకాల పన్నులను వసూలు చేస్తున్నాయి . వాటిలో అత్యంత ప్రముఖమైనవి ఇనకం టాక్స్ , సర్వీస్ టాస్క్ .ప్రజల వద్ద నుండి ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం తో దేశాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు ,రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు మొదలగునవి  సమకూర్చుకోవడానికి వినియోగిస్తారు.

ఈ రోజు  ప్రజలూ సంపాదిస్తున్న మొత్తంలో అధిక శాతం టాక్స్ లు చెల్లించడానికే  పోతుంది. సాదారణంగా ప్రజలూ వారూ చెల్లించే పన్నుల ద్వారా దేశాభివృద్ది జరుగుతుంది అని ఆశిస్తారు. కాని ఈ పన్నులు ఒక ప్రజల యొక్క ఆర్ధిక పరిస్థతి ని చాలా దారుణంగా ప్రభావితం చేస్తున్నాయి.  
ముందుగా మీరు ఇన్ఫ్లేషన్ గురుంచి అర్ధం చేసుకోండి. ఈ ఇన్ఫ్లేషన్ మరియు టాక్స్ లు ప్రజల ఆర్ధికస్థితి పై ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం. మీకు ఇన్ఫ్లేషన్ గురుంచి వివరంగా తెలుసుకోవాలి అంటే క్రింద ఇవ్వబడిన లింక్స్ పై క్లిక్ చేసి చదవండి.


రోజు రోజుకి వస్తువులా ధరలు పెరుగుతున్నాయి   అనే విషయం మీ అందరికి తెలుసు. చాలా మంది ప్రభుత్వం ఈ ధరల పెరుగుదలని అరికట్టడానికి ఇన్ఫ్లేషన్  పెరుగుదలని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలి అని బావిస్తుంటారు.వాస్తవానికి ప్రభుత్వం ఏమైన  చర్యలు తీసుకుంటుందా. మీరు ఒక్కసారి గత పది సంవత్సరంల నుండి ఇన్ఫ్లేషన్ రేటు ఏ విధంగా ఉందో ఒక్కసారి క్రింది పట్టికలో చూడండి.
Year
Inflatation rate
Apr -03
5.12%
Apr -04
2.23%
Apr -05
4.96%
Apr-06
4.65%
Apr-07
6.67%
Apr-08
7.81%
Apr-09
8.70%
Apr-10
13.33%
Apr-11
9.41%
Apr-12
10.22%
  పై పట్టికను గమనిస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా  ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది.సాదారణ మధ్యతరగతి కుటుంబం ఒక్కప్పుడు ప్రతి నెల రూ 10,000 లతో ఇంటి ఖర్చులు సరిపెట్టుకుంటే ఇప్పుడు అదే కుటుంబానికి రూ .  30,000  లు కూడా సరిపోవడం లేదు. దీనికి ప్రభుత్వం చెప్పే సమాధానం లైఫ్ స్టైల్ లో మార్పు . కాని వాస్తవం వేరే  ఉంది. అదేమిటో ఒక్కసారి చూద్దాం.
VAT( value added tax ) అనేది రాష్ట్ర ప్రభుత్వం విధించే టాక్స్ .దాని పేరు లోనే ఉన్నట్టుగా వస్తువుకి  అదనపు విలువ కలవడం వలన వస్తువు ధర పెరిగి వస్తువు ధర మరింత అధికం  కావడానికి కారణం అవుతుంది.ఈ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళుతుంది. ఈ టాక్స్ రేటు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. మీరు వస్తువులపై  ఎంత వ్యయం చేస్తే అంత అధికంగా పన్ను చెల్లించవలసి ఉంటుంది.
సాదారణంగా పెట్రోలు , డిజీల్  మరియు గ్యాస్ ప్రతిఒక్కరికి అవసరమైనవి. ప్రస్తుతం ఇవి లేకుండా జీవితాన్ని ఉహించలేం . వస్తువులు రవాణా చేయడానికి ఇందనం తప్పనిసరి . ఈ ఇందనం ధర పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి వస్తువులా ధరలు పెరగడానికి కారణం అవుతాయి.అంటే ఇందన ధరలు పెరిగితే , వస్తువుల ధరలు పెరగడంతో , ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది.
ఉదాహరణకు ఒక వస్తువు ధర రూ 20 ఆయితే  ఇంధన ధరలు పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి ఆ వస్తువు ధర రూ 25 అవుతుంది.
మీకు తెలుసా ? ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం  దేశంలోకెల్లా అత్యధికంగా  34% టాక్స్  వసూలు  చేస్తుంది.ఉదాహరణకు లీటరు పెట్రోలు రూ 75 ఉంటే మీరు  చెల్లించే  డబ్బులలో రూ .25.50 ప్రభుత్వానికే వెళ్తాయి.అదే గోవాలో ఐతే కేవలం 0.1% మాత్రమే  పెట్రోలు పై వ్యాట్ విధిస్తున్నారు.దీనివలన రూ 11 తక్కువకే పెట్రోలు అక్కడ దొరుకుతుంది.గోవా ప్రభుత్వం ఈ విధంగా ప్రజలకోసం తక్కువ వ్యాట్ వసూలు చేస్తున్నప్పుడు మిగితా రాష్ట్రాలు ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నాయి.వివిధ రాష్ట్రాలలో వ్యాట్ ఏవిధంగా ఉందో ఒక్కసారి చూద్దాం .

State
Petrol
diesel
Andharapradesh
34%
23%
Arunachalapradesh
20%
20%
Assam
27.50%
16.50
Chattishgarh25%
25%
25%
Delhi
20%
20%
Goa
0.10%
19%
Gujarath
23%
21%
Haryana
20%
12%
Himachalapradesh
20%
14%
Madhyapradesh
30.04%
-
Maharasra
26%
24%
Punjab
32.69%
8.80%
Rajasthan
28.89%
18%
Tamilnaadu
33%
30%
Westbengal
26.87%
-
మనం పెట్రోలు పై మాత్రమే కాకుండా మనం కనుగోలు చేస్తున్న ప్రతి వస్తువుపై 5 % to 15%వరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తుంది. దీని వలన వస్తువు యొక్క ధర పెరగడమే కాకుండా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. అదే ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే ధరలు తగ్గి , ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. కాని రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిధంగా మాత్రం చేయవు. వాటికి ఇన్ఫ్లేషన్ పెరిగి ప్రజలూ ఇబ్బందులపాలు ఐనా పర్వాలేదు. కాని వాటి ఆదాయాన్ని పోగొట్టుకోవడానికి మాత్రం ఇష్టపడవు.ఇది మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం 12.36%  సర్వీసు  టాక్స్ కూడా వడ్డిస్తూనే ఉంది.
చాలా మంది ఇంతకు ముందు గోవాకి అక్కడి సుందర దృశ్యాలు. బీచ్ లు చూసి వస్తూ , వస్తూ కాజు కొనుక్కొని వచ్చే వాళ్ళు . ఇప్పుడు మాత్రం పెట్రోలు కూడా కొనుక్కొని వస్తున్నారు.పాన్ కార్డ్ అంటే ఏమిటి ?
పాన్ అంటే పర్మినెంట్ అకౌంట్ నంబర్ . ఈ నంబర్  పది డిజిట్లలో ఉంటుంది.  అది కూడా  ఆల్ఫా న్యూమరిక్ రూపంలో ఉంటుంది. ఈ నంబర్ ముద్రించిన ప్లాస్టిక్ లామినేటేడ్ కార్డ్ ను  ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్  అందచేస్తుంది. దీనినే పాన్ కార్డ్  అంటారు.ఇది మీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ సైజ్ లో ఉంటుంది. ఈ కార్డ్ పై మీ వ్యక్తిగత వివరాలు నమోదై ఉంటాయి .అంటే మీ పేరు , మీ తండ్రిపేరు , మీ పుట్టిన రోజు, పాన్ నంబర్ , మీ సంతకం  మరియు మీ ఫోటో ఉంటుంది.పాన్ కార్డ్ పై గల పది ఆల్ఫా న్యూమరిక్ రూపం లో ఉండే అక్షరాలలో  మొదటి  ఐదు అక్షరాలు ఆంగ్ల అక్షరాలు , తర్వాత గల నాలుగు అక్షరాలు సంఖ్యలు మరియు చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది.  ఈ పది అక్షరాలను ఐదు భాగాలుగా విభజించడమైనది. 1.మొదటి మూడు అక్షరాలుగా AAA to ZZZ ఉంటాయి .
2.నాలుగవ  అక్షరం పాన్ కార్డ్ హోల్దర్ యొక్క స్థితిని తెలియచేస్తుంది
  C — Company
• P — Person
• H — HUF(Hindu Undivided Family)
• F — Firm
• A — Association of Persons (AOP)
• T — AOP (Trust)
• B — Body of Individuals (BOI)
• L — Local Authority
• J — Artificial Juridical Person
• G — Government

3. .  ఐదవ అక్షరం పాన్ కార్డ్ హోల్దర్ ఇంటి పేరు లోని మొదటి అక్షరంను తెలియచేస్తుంది.
4. తర్వాత నాలుగు అక్షరాలు అంకెలలో 0001 నుండి 9999 వరకు ఉంటాయి .
5 .చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది.
పాన్ కార్డ్ ఎవ్వరికీ అవసరం
 మీ ఆదాయం ఇన్ కమ్ టాక్స్ చెల్లించే పరిమితిలో కనుక ఉంటే మీరు ఇన్ కమ్ టాక్స్ రిటర్న్ పైల్ చేయడానికి మీకు  పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. ఎందుకంటె మీరు మీ ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ లో మీ పాన్ కార్డ్ నంబర్  తెలియచేయవలసి ఉంటుంది.అంతే కాకుండా క్రింది సమయాలలో పాన్ కార్డ్  లేదా పాన్ నంబర్ తప్పనిసరి.
మీ ఆదాయ పన్ను  వ్యవహారాలలో ,
ఐటి డిపార్ట్ మెంట్ తో ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుటకు 
అన్ని రకాల చలాన్స్ కట్టే సమయంలో
డిమ్యాట్  అకౌంట్ ప్రారంభించడానికి
ఏదైనా ఆస్థి అమ్మ్మడం లేదా కనుగోలు చేయు సమయంలో
కారు కొనే సందర్భంలో
యాభై వేల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపే సమయంలో
బ్యాంక్ లో ఖాతా  ప్రారంభించడానికి
మ్యుచవల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయు సమయంలో         
యాభై వేల కంటే పైన డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొనుటకు 
అంతే కాకుండా వివిధ సందర్భాలలో  పాన్ కార్డ్ మీ వ్యక్తిగత గుర్తింపు కార్డ్ గా కూడా ఉపయోగపడుతుంది.
ఇన్ కమ్ టాక్స్ అనగా ఏమి ?
ప్రభుత్వానికి  ప్రజల సౌకర్యం కోసం చాలా  డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది.  అనగా  రహదారులు నిర్మించడం  ,ప్రజా రవాణా సౌకర్యాలు  ఏర్పాటు చేయడం , తాగు , సాగు నీటి కోసం రిజర్వాయర్లు  నిర్మించడం ,ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చేయడం , ఇంకా ఎన్నో రకాలుగా ప్రభుత్వం ఖర్చు పెట్టుతుంది.ఈ విధంగా ప్రభుత్వానికి కావలసిన డబ్బు కోసం వస్తువులు , సేవలు  మరియు ఆదాయం పై వివిధ రకాల పన్నులు  విదిస్తుంది.పన్నుల ద్వారా సేకరించిన మొత్తాన్ని ప్రజల కోసం ఖర్చుపెడుతుంది. ఈ విధంగా ప్రభుత్వం విధిస్తున్న పన్నులలో అతి ముఖ్య మైనది ఇన్ కమ్ టాక్స్ . ఇన్ కమ్ టాక్స్ అనగా ఒక ఆర్ధిక సంవత్సరంలో  మీరు సంపాదించిన ఆదాయంపై  ప్రభుత్వం విధించే పన్ను.ఈ ఆదాయం మీరు ఏ మార్గంలో సంపాదించిన సరే . అంటే  జీతం ,  అద్దె ఆదాయం, వడ్డీ ఆదాయం , ప్రోపెషనల్ ఆదాయం ,లాటరీ గెలుపొందడం మొదలుకొని ఏ రూపంలో ఐనా ఉండవచ్చు.ఈ విధమైన టాక్స్ ను ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్  వసూలు చేస్తుంది. దీనిని ఐ టి డిపార్ట్ మెంట్  అని కూడా అంటారు. ప్రభుత్వం నిర్ణయించిన  నిర్ణీత ఆదాయం కలవారు ఎవరైనా సరే  ఇన్ కమ్ టాక్స్ చెల్లించవలసినదే. ఈ విధంగా టాక్స్ చెల్లించడం అనేది మీరు వచ్చే ఇన్ కమ్ స్లాబ్ ప్రకారం ఉంటుంది. అంటే మీరు పొందే ఆదాయాన్ని వివిధ స్లాబ్స్ గా విభజిస్తారు. ఒక్కో స్లాబ్ ఆదాయంలో ఉండే వారికి ఒక్కోరకంగా వారు  చెల్లించవలసిన  టాక్స్ ఉంటుంది. ఒక స్లాబ్ లో ఉండే వారు ఎవరైనా సరే  వారికి ఒకే రకమైన టాక్స్ శాతం ఉంటుంది. ఆదాయం పెరుగుతున్న కొలది టాక్స్ శాతం కూడా పెరుగుతుంది.అదే విధంగా ఇన్ కమ్ స్లాబ్స్ కూడా పురుషులకు , స్త్రీలకు , సీనియర్ సిటజన్స్ కు వేరు వేరు గా ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలు, సీనియర్ సిటజన్స్ కు టాక్స్ చెల్లించడం లో కొంత ఉపశమనం ఉంటుంది.ఐతే మీరు ఎంత మొత్తం ఇన్ కమ్ టాక్స్ చెల్లించడం అనేది మీరు ఆ సంవత్సరంలో సంపాదించిన ఆదాయం , మీరు ఆ సంవత్సరంలో తీసుకున్న టాక్స్ సేవింగ్ చర్యల పై ఆధారపడి ఉంటుంది.