Mutual fund

మ్యూచవల్ ఫండ్స్ అంటే ఏమిటి ?

మ్యూచవల్  ఫండ్ అంటే   ఒకే ఆర్ధిక లక్ష్యం కలిగి ఉన్న అనేక పెట్టుబడిదారుల పొదుపులను కూడకట్టడం కోసం ఏర్పడిన ట్రస్టు. ఒకే లక్ష్యం అనగా డబ్బును ఇన్వెస్ట్ చేయాలి దాని పై రాబడి రావాలి అని అనుకునే వారందరి దగ్గరి నుండి డబ్బును సేకరించి వివిధ పెట్టుబడి సాధనాలలో అనగా షేరు మార్కెట్ , బాండ్స్ ,ప్రభుత్వ సేక్యురిటిలు ,డిబెంచర్లు , బంగారం ,డేట్స్ మొదలగు వాటిలో పెట్టుబడి పెడతారు.  మ్యూచవల్  అని పేరు లోనే ఉన్నట్టుగా, కలిసి కట్టుగా పెట్టుబడి పెట్టడం . మ్యూచవల్  ఫండ్ లలో పెట్టుబడి పెట్టడానికి అదనపు డబ్బు ఉన్న వాళ్ళెవరైన , కొంచం డబ్బు అంటే కొన్ని వందల రూపాయల నుండి  మొదలుకొని  మీ పొదుపు సామర్ధ్యానికి అనుగుణంగా  మ్యూచవల్  ఫండ్ లలో పెట్టుబడి పెట్ట వచ్చు. ఈ మ్యూచవల్  ఫండ్ లు  ,పెట్టుబడికి సంబంధించిన వివిధ రకాల ఫండ్ లలో మీ డబ్బును పెట్టుబడి పెట్టి   మ్యూచవల్ ఫండ్ పథకాల యూనిట్లను కొంటారు.వీటిని ప్రపంచంలో కొన్ని భాగాలలో మ్యూచవల్  ఫండ్ లేదా యూనిట్ ట్రస్టు అని అంటారు
ఎవరికీ ఐతే స్టాకు మార్కెట్ నందు అనుభవం లేదో , షేర్ల ధరలను క్రమం తప్పకుండా పరిశీలించడానికి సమయం కేటాయించాలేరో ,ఒకే రంగం లోని షేర్లు కొంటే నష్టపోతాం కాని, వివిధ రంగాల షేర్లు కొనడానికి అధిక డబ్బు లేదు కదా అని అనుకొనేవారు ,పెట్టుబడి పై రిస్కు ఎక్కువగా తీసుకోలేని వారు, పెట్టుబడి పై అధిక రిస్కు తీసుకోగలరు  కాని అనుభవం లేకపోవడం, ఇలాంటి  వారందరికి  మ్యూచవల్  ఫండ్ అనుకూలమగా ఉంటుంది.  ఇలాంటి వారందరూ  మ్యూచవల్  ఫండ్ లో పెట్టుబడి పెడితే  మార్కెట్ నిపుణులు లేదా ఫండ్ మేనేజర్లు వాటిని వివిధ మ్యూచవల్ ఫండ్ పథకాల యందు పెట్టుబడిగా  పెడతారు.

 ఫండ్ మేనేజర్లు పెట్టుబడిని  వివిధ మ్యూచవల్ ఫండ్ పథకాలలో అనగా   షేరు మార్కెట్  మొదలుకొని వివిధ రకాల పెట్టుబడి  సాధనాలలో పెట్టుబడిగా పెడతారు..మీరు  పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఆధారంగా మీకు యూనిట్లు కేటాయిస్తారు . ఈ విధంగా పెట్టిన  పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయంను అనగా షేర్లలో పెట్టుబడి పెడితే వచ్చే డివిడెండ్ ,షేరు ధర పెరగడం వళ్ళ  కలిగే లాభం , ఇదే విధంగా వివిధ పధకాల ద్వారా వచ్చే ఆదాయం  మరియు ఈ పథకాల  వలన కలిగిన మూలధనం ( కాపిటల్) లోని పెరుగుదలను మీ వద్ద గల  యూనిట్ ల ఆధారంగా మీకు పంచుతారు. లేదంటే మీరు  మీ యూనిట్లను స్టాక్ మార్కెట్ లో కూడా అమ్ముకోవచ్చు.  ఈ విధంగా మ్యూచవల్  ఫండ్ , సామాన్య మానవునికి బాగా అనుకూలమైన పెట్టుబడి, ఎందుకంటే, ఇది వివిధి రకాల, వృత్తిపర నిపుణల ద్వారా నిర్వహించబడుతూ ,సెక్యూరిటీలలో తక్కువ ఖర్చుతో,తక్కువ పెట్టుబడితో  పెట్టుబడి చేయడానికి అవకాశం కలిగిస్తుంది.


ఒక్క సారి మీరు పైన ఇవ్వబడిన చార్టు ను గమనించండి. మ్యూచవల్  ఫండ్ ఏ విధంగా పని చేస్తున్నదో తెలుస్తుంది.  మ్యూచవల్  ఫండ్  మొదట ఇన్వెస్టర్స్  అనగా మీరు, మీ లాంటి వారి వద్ద  నుండి వివిధ రకాల ఫథకాల ద్వారా సేకరించిన మీ డబ్బును ఫండ్ మేనేజర్లు వివిధ రకాల సెక్కురిటీలలో ఇన్వెస్ట్ చేస్తారు.ఈ  సెక్కురిటీలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కలిగే లాభాలను మీకు మరియు మీలాగే ఇన్వెస్ట్ చేసిన వారందరికి పంచుతారు. ఈ విధంగా చేసినందుకు  మ్యూచవల్  ఫండ్ లు  మీ వద్ద కొంత రుసుం వసూలు చేస్తాయి.

మ్యూచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన కలిగే  ప్రయోజనాలు 

Professional Management

మ్యూచవల్  ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బును సరియైన పద్దతిలో ఇన్వెస్ట్ చేయడానికి అపారమైన అనుభవం  , నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్లు ఉంటారు. వారికి సహాయంగా మీ ఇన్వెస్ట్మెంట్ చూడాటానికి  టీం కూడా ఉంటుంది. వారు ఈక్విటీ ఫండ్స్  మరియు డేట్స్ ఫండ్స్  లలో ఇన్వెస్ట్ చేయడానికి ముందు రీసేర్చీ చేసి  పూర్తీ అవగాహన తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు.మీరు   మ్యూచవల్  ఫండ్స్ గత చరిత్ర ను ఇంతవరకు పరిశీలించిన వారు స్థిరమైన రాబడిని అందిస్తున్నారు.
Diversification

మీ ఫోర్ట్ ఫోలియోలో  డైవరిఫికేషన్ అనేది మీ పెట్టుబడికి రక్షణగాను  , దానికి స్థిరత్వం ఇచ్చేదిగా  ఉంటుంది.ఫండ్ మేనేజర్ మీ దగ్గర నుండి సేకరించిన డబ్బును వివిధ రకాల స్టాక్స్ మరియు సేక్యురిటిలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ వైవిధ్యమైన పెట్టుబడి ఇన్వెస్టర్స్ కు మంచి రాబడి అందిస్తుంది. అదే  మీరు స్వయంగా ఇన్వెస్ట్ చేస్టే  ఈ వైవిధ్యమైన పెట్టుబడి చేయడం మీకు సాధ్యం కాకపోవచ్చు. అంతే కాకుండా కొన్ని సమయాలలో మీ దగ్గర ఉన్న చిన్న మొత్తం ద్వారా ఇది అసలే సాధ్యం కాదు. కాని మ్యూచవల్  ఫండ్స్ కొంత మొత్తం ద్వారా కూడా సాధ్యం అవుతుంది.

Convenient Administration

మీరు మ్యూచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం  ఎంతో సులభం . మీరు మ్యూచవల్  ఫండ్ పథకాన్ని నిపుణుడి సహాయంతో  ఎన్నుకొని ,దరఖాస్తు ఫారాన్ని  నింపి ,వారి పేరు మీదా చెక్కు  జారీ చేసి రావడమే .ఇది మొత్తం రెండు నిమిషాల పని . అదే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ తిరిగి తీసుకోవడం కూడా చాలా సులభం.
Return potential

మ్యూచవల్  ఫండ్స్ లో   మధ్య కాలం నుండి దీర్ఘ కాలం కొరకు ఇన్వెస్ట్ చేసినచో మంచి రాబడి అందిస్తాయి.ఎందుకంటే వారు వివిధ పథకాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి.   


Low cost

కాబట్టి.   మీరు ఎటైనా ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో వెళ్ళిన దానికంటే మీ స్వంత వాహనంలో వెళ్ళితే అధిక ఖర్చు   ఏ విధంగా  అవుతుందో అదే విధంగా ఇక్కడ కూడా  మ్యూచవల్  ఫండ్స్ పథకాలలో కొన్ని వేల మంది ఇన్వెస్ట్ చేయడం వలన ఫండ్ నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. దానితో  మీకు కూడా తక్కువ ఖర్చు అవుతుంది. 
Liquidity

మ్యూచవల్  ఫండ్స్ పథకాలలో నుండి మీరు ఎప్పుడు కావలి అంటే అప్పుడు ఉపసంహరించుకోవచ్చు.మీరు ఉపసంహరణ దరఖాస్తూ సంతకం చేసి ఇచ్చిన రెండూ మూడు రోజులలో మీ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.   ఒక వేళ ప్రతేకంగా ఆ పథకానికి లాక్ ఇన్ పిరియడ్ , టాక్స్ సేవింగ్ పథకం ఐతే మాత్రం  సాధ్యం కాదు.ఓపెన్ ఎండెడ్ పథకాలనుండి ఎప్పుడైనా బయటకు రావచ్చు. క్లోజ్ ఎండెడ్ పథకాల యూనిట్స్ ని స్టాక్ ఎక్సేంజీ లో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు.  మీకు   టాక్స్ సేవింగ్   అవసరమైతే తప్ప లేనిచో టాక్స్ సేవింగ్ పథకాల వైపు వెళ్ళవద్దు.
Transparency

పారదర్శకత  అనేది మ్యూచవల్  ఫండ్స్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం .ఒక ఇన్వెస్టర్ గా మీ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబడినది , ప్రస్తుతం దాని విలువ ఎంత ఉన్నది మొదలగు వివరాలు మీకు క్రమం తప్పకుండా తెలియచేయబడతాయి.

Choice of schemes
మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా , మీరు తీసుకొనే రిస్కు స్వభావానికి అనుగుణంగా , మీరు నిర్ణయించుకున్న నిర్ణీత కాలానికి అనుగుణంగా  , మీ అవసరాలకు అనుగుణంగా ,మీరు వివిధ రకాల మ్యూచవల్  ఫండ్స్ పథకాలను ఎంచుకొనే  అవకాశం కలదు. మీకు  ఈక్వీటీ   మార్కట్ , డేట్ మార్కెట్ , మనీ మార్కెట్ , ఈ టి ఫ్స్  , గోల్డ్ ఈ టి ఫ్స్, టాక్స్ సేవింగ్ ,  ఇలా  వివిధ రకాల పథకాలు  మీకు అందుబాటులో ఉంటాయి.

Well regulated

మీ అన్ని మ్యూచవల్  ఫండ్స్ కూడా సేబీ వద్ద రిజిస్టర్ కాబడి , సెబీ నిబందనల ప్రకారం పనిచేయబడతాయి. ఈ మ్యూచవల్  ఫండ్స్ ను సేబీ రెగ్యులర్ గా మానిటర్ చేస్తుంది.

Tax benefits
మ్యూచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా  టాక్స్ మినహాయింపులు పొందవచ్చు. ఈ మినహాయింపులు సమయానుకూలంగా  మారుతుంటాయి. మనం దీని గురుంచి మరో చాప్టర్ లో చదువుకుందాం.