షేర్ మార్కెట్ లో కి ప్రవేశిస్తున్నారా:
ఒక్క క్రికెట్ అటగాడు అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించినప్పుడు అతడి ప్రదర్శన మీద అతడి భవిష్యత్తు ఎలా ఆధారపడి ఉంటుందో షేరు మార్కెట్ లో కి ప్రవేశించే చిన్న ఇన్వెస్టర్ కు కూడా ఇదే వర్తిస్తుంది. మొదటి సారి కొన్న షేరు మంచి లాభాలు ఇవ్వకపోయినా కనీసం నష్టాల బారిన పడవేయకుండా ఉంటే చిన్న ఇన్వెస్టర్ మరోసారి మార్కెట్ లో కి అడుగు పెడతాడు . ఫలితం దీనికి భిన్నంగా ఉంటే షేరు మార్కెట్ అంటే భయపడతాడు. మార్కెట్ అంటేనే జూదశాల అంటూ శాపనార్ధాలు పెట్టె వారి జాబితాలోకి చేరి పోతాడు. మార్కెట్ రేసులో విజేతగా నిలవడమా, పరాజయం పాలవటమా అన్నది చాలా సందర్బాలలో అది మీ చేతులలోనే ఉంటుంది.
సమయం కేటాయించాగాలరా:
షేర్లకు , ఇతర పెట్టుబడి సాధనాలకు ఎంతో భేదం ఉంది. షేర్లు కోఎసి కొన్నాళ్ళు వాటి గురుంచి మరఛిపోదాం అంటే కుదరదు. మీరు కొన్న షేరు ధరలను , వాటిని ప్రభావితం చేసే పరిణామాలను ప్రతి రోజూ గమనిస్తూ ఉండాలి. అందుకే మొట్టమొదటి సారి షేర్ల కొనుగోలుకు దిగేముందు తన పెట్టుబడులను నిరంతరం పర్యవేక్షించడం కోర్కి ఎంత సమయం కేటాయించగమన్న విషయాన్ని తేల్చుకోవాలి. కనీసం వారానికి ఒక్కసారి ఐన ధరలను గమనించకపోతే లాభాల అవకాశాలు చేజారిపోతాయి.
షేరు మార్కెట్కు , ఆర్ధిక పరిస్తుతులకు చాల దగ్గరి సంభందం ఉంది. ఆర్ధిక రంగం లో జాతీయంగా, అంతర్జాతీయముగా జరిగే అనేక పరిమాణాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి.స్టాకు మార్కెట్ లో నిలదొక్కుకోవాలంటే ఈ అంశాలపై ఆవగాహన కలిగి ఉండటం తప్పనిసరి . కనీసం షేర్ల ధరలను . ప్రభావితం చేసే అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆ విషయాలలో మీ గురుంచి మీరు సంతృప్తి చెందితే షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రయంతించవచ్చు.
మీఋ తప్పకుండా సమాచార సేకరణ తప్పనిసరిగా చేయాలి.ఫలానా షేరు కొంటె లాభాల పంటేనంటూ ఊరించే టిప్స్ కూ లోటూ లేదు.వీటిని చూసిన ఇన్వెస్టర్ కు మార్కెట్ అంటే లాభాల గనిలా అనిపిస్తుంది. లాభాలకు దారి చూపేది మీ అవగాహనా మాత్రమేనని తెలుసుకోవాలి.
“First learn and then earn”
Share మార్కెట్ ట్రేడింగ్ మరియు ఇన్వేస్టింగ్ అనునది చేయడానికి సరైన విజ్ఞానం అవసరం, కావునముందు తగినంత పరిజ్ఞానం పొందిన తర్వాత మార్కెట్ లో మీరు సంపాదించడం మొదలు పెట్టండి. ముందుగా మీరు స్టాకు మార్కెట్ గురుంచి లెర్నింగ్ చేయండి.ఈ లెర్నింగ్ ద్వారా మీరు స్టాకు మార్కెట్ లో ఏర్నింగ్ చేయవచ్చు.మీరు తప్పకుండా ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఏ రంగం లో ఐనా “లెర్నింగ్ లేకుండా ఏర్నింగ్ సాధ్యం కాదు” .కాబట్టి మీరు లెర్నింగ్ ప్రారంభించండి.