ప్రీమియం తిరిగి
చెల్లించే టర్మ్ ఇన్సురెన్స్ పాలసీల వలన లాభమా ? నష్టమా ?
టర్మ్
ఇన్సురెన్స్ పాలసీలకు మీరు చెల్లించే
ప్రీమియం తిరిగి రాదు అనే విషయం మీకు తెలుసు కదా ? సంపాదనపరుడై , తన మీదా ఆధారపడిన
వారూ ఉన్నప్పుడు స్ర్తీ లేదా పురుషుడు ఎవరైనా సరే తప్పనిసరిగా ఉండవలసిన
,తప్పనిసరైన ఇన్సురెన్స్ పాలసీ టర్మ్ ఇన్సురెన్స్
పాలసీ. కాని , చాలా మంది టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ కి చెల్లించే ప్రీమియం తిరిగి
రాదు అనే ఒకే ఒక కారణంతో ఈ టర్మ్ ఇన్సురెన్స్
పాలసీకి దూరంగా ఉంటారు. ఐతే ఇప్పుడు టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలలో కూడా ప్రీమియం
తిరిగి చెల్లించే పాలసీలు వచ్చాయి. వీటి వలన లాభమా అని చాలా మంది అడుగుతున్నారు.
ఒకసారి మనం పరిశీలిద్దాం.ఈ విధంగా ప్రీమియం తిరిగి చెల్లించే టర్మ్ ఇన్సురెన్స్
పాలసీలను
Return of premium term insurance లేదా
ROP అంటారు. టర్మ్ ఇన్సురెన్స్ పాలసీల కంటే దీనిలో ఉన్న ఇతర
సదుపాయం ఏమిటంటే పాలసీ గడువు తీరిన తర్వాత పాలసీ హోల్డర్ జీవించి ఉన్నట్టు ఐతే
చెల్లించిన ప్రీమియం మొత్తం ఎలాంటి వడ్డీ లేకుండా తిరిగి వాపసు ఇవ్వబడుతుంది. మీరు
అనుకుంటుండవచ్చు. గడువు తర్వాత ఏమి తిరిగి రాని పాలసీ కంటే ప్రీమియం తిరిగి
వస్తున్న పాలసీ మంచిది కాదా ? అని కాని, అసలు విషయం ఏమిటంటే మీరు సాదారణంగా
చెల్లించే టర్మ్ ఇన్సురెన్స్ పాలసీల
ప్రీమియం కంటే మీరు ఈ Return of premium term insurance లేదా
ROP పాలసీలకు చెల్లించే ప్రీమియం రెండింతలు లేదా
మూడింతలు ఉంటుంది. ఉదాహరణకు మీరు ఇరవై
సంవత్సరాల కాల వ్యవధి కలిగిన సాదారణ టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ కొరకు ప్రతి సంవత్సరం Rs 6000 ప్రీమియం
చెల్లించవలసి ఉంటే ఈ ROP పాలసీ లలో Rs12000 నుండి Rs15000 చెల్లించవలసి
ఉంటుంది. Rs15000 చెల్లించాల్సి ఉంది అనుకోండి. దాని బదులు Rs 6000 పెట్టి
సాదరణ టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకొని
మిగిలిన Rs 9000
లేదా నెలకు Rs 750 రూపాయలు మీ పాలసీ గడువు అంటే ఇరవై సంవత్సరాల
వరకు PPF లేదా మ్యుచవల్ ఫండ్ లో సిప్ ద్వారా జమ చేయండి. PPF లో 9% రాబడి వచ్చిన మీకు గడువు తర్వాత వచ్చే
మొత్తం సుమారు Rs 500915 ,మ్యుచవల్ ఫండ్ లో 12% రాబడి వచ్చిన మీకు వచ్చే మొత్తం Rs 741942. మీరు Rs15000 పెట్టి ROP పాలసీ
తీసుకున్న మీకు ఇరవై సంవత్సరాల తర్వాత
మీకు తిరిగి వచ్చే మొత్తం కేవలం Rs 300000 కాని
మీరు PPF లో చేస్తే Rs 500915 , మ్యుచవల్
ఫండ్ లో చేస్తే Rs 741942. అందుకుంటారు.కాకపోతే మీరు ROP పాలసీ కొరకు
ఒకే సారి ప్రీమియం చెల్లిస్తే మ్యుచవల్ ఫండ్ కొరకు మీరు ప్రతి నెల కొద్ది మొత్తం
చెల్లించాలి.మీకు వచ్చే రాబడితో పోలిస్తే మీరు తీసుకొనే కొద్ది శ్రమ ఏపాటిది కాదు.
ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకొండి .ఇన్సురెన్స్ అంటే కేవలం రక్షణ కవచం మాత్రమే
అంతే కాని పెట్టుబడి సాధనం కాదు. అందుకే ప్రతి వ్యక్తీ సరియైన ఫైనాన్సియల్
ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవాలి .ఈ రోజు
ముఖ్య గమనిక :మీరు టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి ఎంచుకొని దానినే స్థిరంగా మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు
డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్
మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే
ఎర్నింగ్ సాధ్యం అవుతుంది. http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html