పెట్టుబడి (ఇన్వెస్టింగ్ ) అనగానేమి?


పెట్టుబడి (ఇన్వెస్టింగ్ ) అనగానేమి?
రేపటి జీవనం ఎలాంటి ఒడిదోడుకులులేకుండా సాగాలంటే భవిష్యత్తు లో వచ్చే ఆదాయం కోసం  మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను  పెట్టుబడిగా పెట్టి మరింత సంపదను పొందడమే పెట్టుబడి.ఈ పెట్టుబడి అనునది మనం స్తిరాస్తి , బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం , అద్దె ఆదాయం , షేర్స్ ,మ్యూచువల్ ఫండ్స్,బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్ట్ ఆఫీసు ఫథకాలు, బంగారారం  మొదలగు వాటిలో పెడతాం.మన పెట్టుబడి ఒక్క ముఖ్య ఉద్దేశం  సంపద సృష్టించడం , దానితో పిల్లల కళాశాల ఫీజులు. పెళ్ళిల్లు, సెలవులలో  సరదాగా  గడపడం, మంచి జీవన ప్రమాణానికి,రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరుగుటకు , మీ అనంతరం ఈ సంపద మీ తరాల వారికి  చేర్చటం,ఈ పెట్టుబడి వల్ల వచ్చే  రాబడి పెరుగుతున్న  ద్రవ్యోల్బణం  కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపదను కాపాడటం మరియు దానిని అభివృద్ధి చేయడం అనేది ఒక్క కళ.
స్టాకు మార్కెట్ లో పెట్టుబడి వల్ల మీరు మిగితా వాటిలో  పొందిన రాబడి కంటే అధిక రాబడి పొందగలరు.కాని దీనికి మీకు స్టాకు మార్కెట్ పై  పరిపూర్ణ జ్ఞానం, దీర్గాకాలిక  పెట్టుబడి వ్యూహం ,సరియైన స్టాకు ను ఎన్నుకోవడం మొదలగు వాటి మీద ఆధారపడి ఉంటుంది. మీరు పెట్టుబడి  అనునది మీ సంపాదన మొదలైన తొలినాళ్ల నుండే  క్రమ పద్దతిలో దీర్గాకాలిక  వ్యూహంతో  మొదలు పెట్టాలి.మీరు తొలినాళ్ళ నుండే మొదలు పెడితే అనుకోకుండా జరిగే ఎలాంటి రిస్కులను ఐనా తట్టుకోగలరు .అంతే కాకుండా ఒక్కవేళ  మీరు మీ రిటైర్మెంట్ నాటికి యాభై లక్షలు సంపాదించడం మీ లక్ష్యం ఐతే మీరు  మీ సంపాదన తొలినాళ్ల  నుండే  పెట్టుబడి మొదలు పెడితే  మీ లక్ష్యం  చేరుకోవటం చాలా సులభం అవుతుంది.మార్కెట్లో పెట్టుబడులు అంటే రిస్క్ అంటారు.స్తిరాస్తి , బంగారం  , చివరకు మనకు అన్నం పెట్టె రైతన్న చేసే వ్యవసాయం లో కూడా ఎంతో రిస్కు ఉంది.పండించే పంట చేతికి వచ్చే వరకు అనుక్షణం రిస్కు వానలు లేకపోవడం . అధిక వానలు, విద్యుత్తు సమస్య ,పురుగులు పట్టడం , మద్దతు ధర మొదలగు రూపాలలో రిస్కు  ఉంటుంది. ఇదే విధంగా మీరు  ఏ రంగం తీసుకున్న రిస్కు అనేది తప్పకుండా ఉంటుంది.
స్టాకు మార్కెట్ లో పెట్టుబడులంటే ఏమిటి? అనిసాదారణ పౌరుడిని ప్రశ్నిస్తే  జూదం , లాటరీ , పేకాట గుర్రపు పందెం లాంటి సమాధానాలు రావచ్చు.కాని నిజానికి అది అపోహ మాత్రమే . లాటరీ , గుర్రపు పందేలు గెలవడానికి  అదృష్టం కావాలి కాని స్టాకు మార్కెట్లో  డబ్బు సంపాదించడానికి అవగాహన ,మార్కెట్ రిస్కులను ముందే పసిగట్టగల కాసింత జ్ఞానం కావాలి. స్టాకు మార్కెట్ అనేది మంచి పెట్టుబడి సాధనం . చక్కటి ప్రణాళిక ద్వారా , క్రమపద్దతిలో సమర్దవంతంగా  పెట్టుబడి పెడితే చట్టబద్ధంగా స్టాకు మార్కెట్ లో సంపాదించిన సంపదను ఇంకా దేనిలోనూ సంపాదించలేము.స్టాకు మార్కెట్ అంటే జూదం అన్న భావన విడనాడి పెట్టుబడులకు ఉపయోగమైన వేదికగా భావించాలి.