ఆర్ధిక క్రమ
శిక్షణ ,అర్దిక అక్షరాస్యత పై అవగాహన
ఏడాదికి మూడు
లక్షలకు పైగా సంపాదించే ఉన్నత మధ్య తరగతి ఆదాయ వర్గాల్లో కూడా ఆర్ధిక
వ్యవహరాల్లో సరియైన అవగాహన కోరవడినది.
నిజం చెప్పాలి అంటే ఎవరికి వారు, వారి వారి వృత్తులలో ఎంతో నైపుణ్యం కనబరిచినప్పటికీ కూడా ఆర్ధిక
వ్యవహారాలలో మాత్రం నైపుణ్యం చూపలేరు.పెట్టుబడులకు ఈ రోజుల్లో అనేక సాధనాలు
ఉన్నప్పటికి ఎక్కువ శాతం మంది మాత్రం సాంప్రదాయ సేవింగ్ పథకాలైనటువంటి బ్యాంక్
డిపాజిట్లు , బీమా , బంగారం , ఇళ్ళ స్థాలాలనే నమ్ముకుంటున్నారు.వీటితో పోలిస్తే
స్టాక్ మార్కెట్ , మ్యుచవల్ ఫండ్స్ ను విశ్వసించే వారు తక్కువగానే
ఉన్నారు.వివేకంతో పెట్టుబడి పెడితే స్టాక్ మార్కెట్ మంచి రాబడి అందిస్తుంది అని
చాలా కొద్ది మందికే అవగాహన ఉంటుంది.నిజం చెప్పాలి అంటే చాలా మంది జాతీయ బ్యాంకులలో
డిపాజిట్ చేస్తే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అని నమ్ముతున్నారు అంటే వారి అవగాహన ఏ పాటిదో అర్ధం చేసుకోండి . ఆదాయానికి హామీ ఇస్తాయన్న నమ్మకంతోనే చాలా మంది
మ్యుచవల్ ఫండ్స్ ఎన్నుకుంటున్నారు. కాని
ఒక్క విషయం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి.రాబడి
అనేది మార్కెట్ పరిస్తితి పై ఆధారపడి ఉంటుంది. క్యాపిటల్ ప్రొటక్షన్ ఫండ్స్
పెట్టిన పెట్టుబడికి హామీ ఇస్తాయి అంటే అవి చాలా వరకు రిస్క్ లేని డేట్ పథకాలలో ఇన్వెస్ట్ చేస్తాయి . మీరు లక్ష
రూపాయలు ఈ క్యాపిటల్ ప్రొటక్షన్ ఫండ్స్
లలో ఇన్వెస్ట్ చేస్టే అవి ఎనభై వేలు డేట్ పథకాలో
ఇన్వెస్ట్ చేసి మిగితా ఇరవై శాతం ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాయి.
డేట్ పథకాలలో పెట్టిన ఎనభై వేల పెట్టుబడి
కొంత కాలానికి లక్ష రూపాయలు అవుతుంది.ఈక్విటీ లలో పెట్టిన పెట్టుబడిలో నష్టం
వచ్చిన డేట్ పథకంలో వచ్చిన లక్ష ద్వారా మీ అసలు మొత్తం అదే విధంగా ఉంది.
ఒకవేళ ఈక్విటీ లలో మంచి రాబడి వస్తే ఇంకా
మంచిదే కదా! మ్యుచవల్ ఫండ్స్ లో పెట్టిన
పెట్టుబడికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అని కొంత మంది అనుకుంటారు. అలాగే
మ్యుచవల్ ఫండ్స్ యూనిట్ ఏన్ ఏ వి పది కంటే తగ్గదూ అని కొంత మంది అపోహ పడుతుంటారు. మ్యుచవల్ ఫండ్స్ లలో పెట్టుబడి పెడుతున్న
వారిలో కూడా వారు ఎంచుకున్న పథకం ఏమిటి ? ఆ ఫథకం
వేటిలో ఇన్వెస్ట్ చేస్తుంది అనే విషయం పై కూడా అవగాహనా ఉండటం లేదు.