మీ సంపాదన లేక మీ జీతంలోలో 10%-15% తగ్గుదల ఉంటే ఇప్పటి మీ జీవితాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా గడపగలరా !


మీ సంపాదన  లేక  మీ జీతంలోలో  10%-15%  తగ్గుదల ఉంటే ఇప్పటి మీ జీవితాన్ని ఎలాంటి  ఇబ్బంది లేకుండా గడపగలరా !
ఈ ప్రశ్న మీకు మీరే  ఒక్కసారి స్వయంగా వేసుకొని జవాబు నిజాయితీగా చెప్పుకోండి. ప్రస్తుత మీ సంపాదన లేదా జీతం కాని పది నుండి పదిహేను శాతం తక్కువ కాని వస్తే ప్రస్తుత మీ జీవిత విధానంలో ఏమైనా తీవ్ర ఇబ్బందులు ఉంటాయా! లేకపోతే  సాదరణంగానె  ఉంటుందా !   అంటే ఇంటి అద్దె , ఇంట్లో సామాను, పిల్లల ఫీజులు  మొదలగు వాటిలో ఇబ్బంది లేకుండా !  నాకు తెలిసి మీ సంపాదనలో తగ్గుదల ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తప్పించి ఎప్పటిలాగే జీవితాన్ని గడపవచ్చు. అవునా ?కాదా?. ఒకవేళ మరి ఇబ్బంది అనిపిస్తే  మీ ఖర్చులు కొద్దిగా తగ్గిస్తే సరిపోతుంది. నెలకు   మూడు సినిమాలు చూసే  బదులు , రెండు సినిమాలు, నెలకు  రెండు సార్లు బయట హోటళ్ళలో తినే బదులు ఒక్కసారి తినడం   ఇలాంటి  చిన్న చిన్న మార్పుల వల్ల సులభంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా జీవితాన్ని గడపవచ్చు. ఒక్కవిషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సాదరణంగా సంపాదనకు అనుగుణంగానే మీ ఖర్చులు  ఉంటాయి.. ఈ విధంగా మీ సంపాదన  తగ్గింది అని భావించడంతో మీకు మీ సంపాదనలో  సులభంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి  పది నుండి పదిహేను శాతం  అందుబాటులో ఉంది.ఇప్పుడు మీరు పది నుండి పదిహేను  డబ్బును మంచి రాబడి అందివ్వగల సాధనాలలో ఇన్వెస్ట్ చేయండి. ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి  నెలకు   నలభై వేలు సంపాదిస్తూ  అతని సంపాదనలో కనీసం పది శాతం  ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు ఐతే కనీస రాబడి 12%-16% నెలకు  వస్తుంది అనుకుంటే ఆ వ్యక్తీ రిటైర్మెంట్ నాటకి  పొందే మొత్తం సుమారు రెండున్నర కోట్ల రూపాయల నుండి ఆరు కోట్ల  వరకు ఉంటుంది. ఇక్కడ నేను మిమ్ములను పిసినారి లా బ్రతకమని చెప్పడం లేదు. కొన్ని ఖర్చులు తగ్గించుకోవడం వలన మీ రిటైర్మెంట్ లేదా పిల్లల అవసారల కోరకు  డబ్బు ఏ విధంగా సమకూర్చుకోవచ్చో  తెలుపడం జరిగినది. 

షేర్ మార్కెట్ లో హర్షద్ మెహతా చేసిన మోసం ఏమిటి ? షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.?


షేర్ మార్కెట్ లో హర్షద్ మెహతా చేసిన మోసం ఏమిటి ?
షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.?
 మీరు ఇంతకు ముందు  బుల్ మరియు బేర్ ఒక్క పంచదార పలుకు లేకుండా లక్షల వ్యాపారరం చేసారు అని తెలుసుకున్నారు కదా ? అయితే దీని మీదనే షేర్ల ధర ఆధారపడి ఉంటుంది. ఫలానా బుల్  మార్చి 31 వ తారీఖు నాడు పద్నాలుగు రూపాయలకు  లక్ష కిలోల పంచదార కొంటున్నాడన్న  వార్త  మార్కెట్ లోకి  పొక్కగానే  అతడు ఏయే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రేటు నిర్ణయించడా  అన్నది అందరూ  పరిశీలిస్తారు. ఆ విధంగానే బేర్ లు ఏ నమ్మకం తో ఆ అమ్మకానికి వప్పుకున్నడన్న  విషయం లెక్కలు వేస్తారు.ఇరుపక్షాల వైపు అటూ ఇటూగా విడిపోతారు.ఈ విధంగా ఒక షేరు ధర బుల్ల్స్ మరియు బెర్స్ మధ్య లావాదేవీలవల్ల  నిర్ణయించబడుతుంది. ముందే చెప్పినట్టు దీని వెనుక అపూర్వమైన తెలివితేటలు , దేశ రాజకీయ , సామాజిక ఆర్ధిక పరిస్థితులు  ఉంటాయి.

మోసం ఎలా జరుగుతుంది.
జనవరి ఒకటో తారీఖున మీరు వెళ్లి బేర్ ని మార్చి  31 న నాకు కిలో  పద్నాలుగు రూపాయల చొప్పున లక్ష కిలోల పంచదార కావాలి అన్నారు అనుకోండి. బేర్ దానికి ఒప్పుకున్నారు అనుకోండి. బయట ఎక్కడో స్నేహితుడి దగ్గర  పది లక్షలు అప్పు తెచ్చి ఆ డబ్బుతో లక్ష కిలోల పంచదార కొనేసి ఆ స్టాక్ బ్యాంక్ లో పెట్టి దాని మీదా పది లక్షలు అప్పు తీసుకున్నారు అనుకోండి. దాంతో మళ్ళీ ఇంకో లక్ష కిలోల పంచదార కొన్నారు అనుకోండి. బ్యాంక్ మార్జిన్ లేకుండా అప్పు ఇచ్చినది అనుకుందాం.మీ చర్య వలన ఈ లోపులో పంచదార డిమాండ్ పెరిగి వారం రోజుల్లో కిలో పంచదార  పద్నాలుగు రూపాయలు అవుతుంది. ప్రస్తుతం మీ దగ్గర  రెండు లక్షల కిలోల పంచదార ఉంది. స్నేహితుడి దగ్గర అప్పుచేసి లక్ష  కిలోల  పంచదార కొంటే , దానిని బ్యాంక్ లో కుదవ పెట్టి మరో లక్ష  కిలోల  పంచదార కొనడం జరిగినది.ప్రస్తుతం ఈ రెండు లక్షల కిలోల పంచదార విలువ ఇరవై ఎనిమిది లక్షలు.మీ బ్యాంక్ అప్పు పది లక్షలు.మిగితా విలువకి బ్యాంక్ మళ్ళీ అప్పు ఇస్తుంది.ఆ డబ్బుతో  మీరు మరో 1.25 లక్షల  కిలోల పంచదార కొంటారు. మార్కెట్ లో పంచదార దొరకటం లేదు. కిలో ధర ఇరవై ఐదు రూపాయలు అయింది. ఇంతలో    మార్చి  31మీకు గుర్తుందా ? ఆ రోజు మీకు లక్ష కిలోల పంచదార పద్నాలుగు రూపాయల చొప్పున మీకు సప్లయ్ చేస్తానని బేర్ మీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగినది.ప్రస్తుతం ధర ఇరవై ఐదు రూపాయలు. మీతో బేరం కుదుర్చుకున్న బేర్  బావురుమని ఏడుస్తూ మీకు పదకొండు లక్షల రూపాయలు ఇచ్చాడు.(25-14  రూపాయలు x లక్ష కిలోలు ) . దాంతో మీరూ మీ స్నేహితుడు అప్పు తీర్చేసారు. ప్రస్తతం మీ దగ్గర 3.25 లక్ష కిలోల పంచదార ఉంది. దాని ధర కిలోకి 25  చొప్పున 81,25,000 . మీరూ చేస్తున్న వ్యాపారం చూసి బ్యాంక్ చైర్మన్స్ కూడా విస్తూపోయారు.  మీరూ తమ బ్యాంక్ లో లావాదేవీలు పెట్టుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నారు. మీరు వడ్డీ కరెక్ట్ గా చెల్లిస్తున్నారు. మూడు నెలలో పంచదార కిల్ప్ పది రూపాయలనుండి , పాతిక రూపాయలు కావడం తో జనం బంగారం దాచుకోవడం బదులు పంచదార వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. పెళ్లాల మంగళ సూత్రాలు అమ్మి పంచదార కొంటున్నారు.దాంతో పంచదార ధర 30 రూపాయలు అయింది .అంటే ప్రస్తుతం మీ దగ్గర  కోటి రూపాయల విలువగల స్టాక్ ఉంది.దానిని కుదువ పెట్టుకొని బ్యాంక్ మీకు మరో కోటి రూపాయలు అప్పు ఇచ్చినది.మీరు మరో 3.30 లక్షల కిలోల  పంచదార కొన్నారు.దానిని కూడా బ్యాంక్ కి కుదవ పెట్టారు. కానీ బ్యాంక్ చైర్మన్ ఇక్కడే పొరపాటు చేసాడు. సెక్యురిటీ  కరెక్ట్ గానే ఉంది.  3.30 లక్షల కిలోల  పంచదార   కోటీ రూపాయలు అనుకునాడు . దాని ధర కిలో 30 రూపాయలు అనుకున్నాడు. దాని అసలు ధర కిలో పది రూపాయలు అని, మీ వలెనే కిలో  30 రూపాయలకి పెరిగినది అనే విషయం మర్చిపోయాడు.ఒకరోజు దురద్రుస్టావశాత్తు  ఈ విషయం రిజర్వు బ్యాంక్ నోటిసుకి వచ్చినది.కంగారు పది లెక్కలు సరిచూసుకుంటే కిలో పది రూపాయల చొప్పున 6000 కోట్ల నికర విలువగల పంచాదారకి బ్యాంక్ 11480కోట్లు అప్పు ఇచ్చినట్టు తేలింది. తేడా 5480. ఈ విధంగా  చేతిలో నయా పైసాలేకుండా  ఒక వ్యక్తీ పంచాదారలాంటి షేర్లతో  ఐదు సంవత్సరాలాలో  5480 కోట్లు సంపాదించాడు. ఆ వ్యక్తే   హర్షద్ మెహతా THE BIG BULL. 
కొన్నేళ్ళ క్రితం  చుక్కాని లేని నావలా బొంబాయి వీధుల్లో తిరిగిన హర్షద్ మెహతా , పన్నెండు  వందల రూపాయలకి చిన్న అసిస్టెంట్ గా ఉద్యోగం చేసిన మెహతా , కోట్ల విలువ చేసే బంగాళాలో  ఉంటూ , ఖరీదైన కారలలో తిరుగుతూ  చివరకు జైలు పాలు అయ్యి  జైలులోనే గుండె పోటూతో మరణించడం జరిగినది.ఇక్కడ పంచదార కేవలం మీకు సాదారణ బాషలో సులభంగా అర్ధం కావడానికి తీసుకోవడం జరిగినది. వాస్తవంగా పంచదార బదులు షేర్లు లెక్కలోకి తీసుకోవాలి. మీకు ఈ విషయం పూర్తీగా అర్ధం కావలి అంటే ఇంతకు ముందు రెండు భాగాలు కూడా చదివితే సులభంగా అర్ధం అవుతుంది.