ఇప్పుడు రెండేళ్ళ వయస్సున్న మీ కూతురి వివాహం ఇరవై సంవత్సరాల తర్వాత చేయడానికి అప్పుడు కావాల్సిన మొత్తం ఎంత ? దానిని ఏ విధంగా సమకూర్చుకోవాలి ?

ఇప్పుడు రెండేళ్ళ వయస్సున్న మీ కూతురి వివాహం ఇరవై సంవత్సరాల తర్వాత చేయడానికి అప్పుడు కావాల్సిన మొత్తం ఎంత ? దానిని ఏ విధంగా సమకూర్చుకోవాలి ?

మనదేశంలో సాదారణంగా కూతురి వివాహం చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నదే.మీకు ఇష్టం ఉన్నా , లేకపోయినా  ఆడపిల్ల వివాహసమయంలో వరకట్నం ఇవ్వడం అనేది చాలా సహజం. ఈ విషయంలో ఎవ్వరూ ఎన్ని మొత్తుకున్న  సమాజంలో  వరకట్నం అనే జాడ్యాన్ని
 రూపుమాపలేకపోతున్నారు. అంతేకాకుండా రోజురోజుకి ఈ వరకట్నాలు ,వివాహ ఖర్చులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇంకా చెప్పాలి  అంటే ఒకరికిమించి ఒకరూ పోటిపడి వీటిని పెంచుతున్నారు. సరే దాని గురుంచి మనం వదిలేద్దాం  అసలు విషయానికి వద్దాం.ఈ రోజు రెండు సంవత్సరాల వయస్సు ఉన్న మీ పాప వివాహం ఇరవై సంవత్సరాల తర్వాత చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి చూద్దాం. మీరనవచ్చు మా పాప వయస్సు రెండు సంవత్సరాలే కదా ?  ఇప్పుడే వివాహం గురించి ఆలోచన అవసరమా ? అని. అవసరమా ? కాదా ? అనేది మొత్తం చదివిన తర్వాత నిర్ణయం మీరే నిర్ణయం తీసుకోండి.
ముందుగా మీరు ప్రస్తుత పరిస్థితితులలలో మీ పాప వివాహం ఈ రోజు చేస్తే ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచించండి.మీ సామాజిక పరంగా , మీ కుటుంబ పరంగా  అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని ఆలోచించండి. అంటే కొన్ని వర్గాలలో వరకట్నం తక్కువగా ఉంటుంది. మరికొన్ని వర్గాలలో అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ పాప వివాహం చేసి, అన్ని లాంచనాలతో ,   వరకట్నంతో సహా ఇచ్చి అత్తవారింటికి పంపించడానికి  పది లక్షలు ఖర్చు ఆయితే  ఇదే వివాహం ఇదే స్థాయిలో చేస్తే  ఎంత ఖర్చుఅవుతుందో తెలుసా ?  రూ . 3869685 అవును సుమారు ముప్పై తొమ్మిది లక్షలరూపాయలు . అది కూడా ఇన్ఫ్లేషన్  7% తీసుకొని లెక్కించడం వలన . ఒకవేళ ఇన్ఫ్లేషన్ 8% ఐతే కావాల్సిన మొత్తం రూ 4660958.మీకు ఇన్ఫ్లేషన్ మరియు అది మనపై ఏ విధమైన ప్రభావం చూపెడుతున్నదో తెలియకపోతే క్రింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి చదవండి.


ఇరవై సంవత్సరాల తర్వాత  మీ కూతురి వివాహం చేయడానికి   రూ . 3869685 కావలి అని తెలిసినది కదా ఇంత మొత్తం ఎలా సమకూర్చుకోవడం అంటారా ?  అందుకే మీ పాప వయస్సు ప్రస్తుతం  రెండు సంవత్సరాలు మాత్రమే అని చూడకుండా ఇరవై ఏళ్ళ తర్వాత కావాల్సిన మొత్తం ఏవిధంగా ఏర్పాటు చేసుకోవాలో ఆలోచించుకోండి.. మీరు ఇప్పటి నుండే సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడం చేయాలి. సేవినగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ కి గల తేడా ఇంతకు ముందు పోస్టులో  తెలియచేయడం జరిగినది. బ్యాంక్స్ సాదారణంగా 8% వడ్డీ అందిస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పటి నుండి ప్రతినెల రూ.7861 లు పొదుపు చేస్తే ఇరవై ఏళ్ళ తర్వాత మీకు కావాల్సిన మొత్తం అందుతుంది.లేదంటే మీరు షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతినెల ఇన్వెస్ట్ చేయండి. షేర్ మార్కట్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవగాహన చాలా అవసరం. దాని బదులు మీరు మ్యుచవల్  ఫండ్స్ లో ప్రతినెల SIP  పద్ధతి ద్వారా ఇన్వెస్ట్ చేయండి.ఇరవై సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘకాలం  కాబట్టి మీ రాబడి 15% నుండి 18% వరకు వస్తుంది. కనీసం మీరు15% రాబడి వస్తుంది అనుకున్న మీకు కావాల్సిన మొత్తం  ఇరవై సంవత్సరాల తర్వాత అందుకోవాలి అంటే మీరు ప్రతి నెల  రూ .3075  ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అదే 18% రాబడి వస్తుంది అనుకుంటే మీరు ప్రతినెల ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తం కేవలం రూ. 2000 మాత్రమే. కాని ముందు జాగ్రత్తగా కొద్ది తక్కువగా రాబడి శాతం అంచనా వేయడం మంచిది. ఒకవేళ మీరు మీ పాప రెండేళ్ళ వయస్సు నుండి కాకుండా ఏడేళ్ళ వయస్సునుండి అంటే  ఐదు సంవత్సరాలు ఆలస్యంగా సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే బ్యాంక్ లో ఐతే మీరు ప్రతినెల రూ 9100 మ్యుచవల్ ఫండ్ లో ఐతే  15% రాబడి అంచనా వేస్తె రూ 4700 ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. మీరు ఆలస్యం చేసిన కొలది మీరు ప్రతినెల ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తం కూడా  పెరుగుతుంది.అందుకే వీలయినంత త్వరగా అంటే పాప మొదటి పుట్టిన రోజు కంటే ముందే ఈ విధంగా చేయడం మంచిది. చాలా తక్కువ మొత్తం ప్రతినెల ఇన్వెస్ట్ చేయడం వలన , సుదీర్ఘకాలం కాబట్టి రాబడి కూడా చాలా బాగుటుంది.