మీరు ఆర్ధికంగా ఎదగాలన్న , ఆర్ధికంగా దివాళా తీయాలన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ (చక్రవడ్డీ ) ఏ విధంగా ముఖ్య పాత్ర వహిస్తుందో తెలుసుకోండి


మీరు  ఆర్ధికంగా ఎదగాలన్న , ఆర్ధికంగా దివాళా తీయాలన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ (చక్రవడ్డీ )  ఏ విధంగా ముఖ్య పాత్ర వహిస్తుందో   తెలుసుకోండి?   
ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ మాటల్లో చక్రవడ్డీ  ఆర్ధిక అభివృద్దికి తోడ్పడే ప్రపంచంలోనే  అత్యుత్తమ సాధనం.అంతేకాకుండా  మరొక సందర్భంలో  చక్రవడ్డీ గురించి   అల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తూ ఇది ప్రపంచంలోనే ఎనిమిదవ వండర్  అనడం జరిగినది.   
చక్రవడ్డీ యొక్క బేసిక్స్ ముందుగా మీరు అర్ధం చేసుకుంటే ఈ చక్రవడ్డీ ఆర్ధిక అభివృద్దికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుస్తుంది.ముందుగా చక్రవడ్డీ అంటే ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం. అయితే చక్రవడ్డీ గురించి తెలుసుకోవడానికంటే ముందు సాదారణ వడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ మీరు చిన్నప్పుడు చదువుకొని ఉండవచ్చు. కాని అవి నిత్య జీవితంలో  మన ఆర్ధిక అభివృద్దికి ఏ విధంగా  తోడ్పాటు అందిస్తాయో తెలుసుకోవాలి.  సాదారణ వడ్డీ లో , వడ్డీ మీరు మొదట ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై మాత్రమే వడ్డీ పొందుతారు. ఉదాహరణకు మీరు    రూ. 100 లను  10% సాదారణ వడ్డీకి ఇన్వెస్ట్ చేస్తే మీరు సంవత్సరం తర్వాత తిరిగి పొందే వడ్డీ రూ 10.  అంటే మీరు సంవత్సరం తర్వాత తిరిగి పొందే మొత్తం రూ 110 (రూ 100 అసలు  + రూ 10వడ్డీ ). రెండు సంవత్సరాల తర్వాత ఐతే రూ 110+10 = రూ 120.  అదే పది సంవత్సరాల తర్వాత అయితే  మీరు పొందే మొత్తం రూ .100 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 + 10 = రూ .200 .సాదారణ వడ్డీ లో మీరు 10% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరం రూ 10 లను వడ్డీ రూపంలో పొందుతున్నారు.
చక్రవడ్డీ విషయానికి వస్తే  ప్రతి సంవత్సరం అంతకు ముందు ఉన్న బ్యాలన్స్ అమౌంట్ పై వడ్డీ పొందుతారు. అంతే కాని మొదట ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై కాదు. దీనిని సాదారణ పరిబాష లో  వడ్డీ పై వడ్డీ అని కూడా అంటారు.
ఉదాహరణకి మీరు  రూ. 100 లను  10%  చక్ర వడ్డీకి సంవత్సరానికి ఒక్కసారి లెక్కించే విధంగా ఇన్వెస్ట్ చేస్తే మీరు సంవత్సరం తర్వాత తిరిగి పొందే వడ్డీ రూ 10. అంటే సంవత్సరం తర్వాత మీ వద్ద  గల బ్యాలన్స్  రూ 110 (రూ 100 అసలు  + రూ 10వడ్డీ). రెండవ సంవత్సరం తర్వాత మీ వడ్డీ లెక్కించడానికి మీరు ముందు ఇన్వెస్ట్ చేసిన రూ. 100  ను కాకుండా  ఇప్పుడు ఉన్న బ్యాలన్స్  రూ 110 ని పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు. అంటే రెండో సంవత్సరం తర్వాత మీరు పొందే మొత్తం రూ .110 + రూ .11 (10% of 110) = రూ .121.  మూడు సంవత్సరాల తర్వాత  మీరు పొందే మొత్తం రూ  121 +రూ . 12.1 (10% of 121) =రూ . 133.1, నాలుగు సంవత్సరాల తర్వాత పొందే మొత్తం రూ .133.1 + రూ 13.31 (10% of 133.1) = రూ 146.41 మిగితా సంవత్సరాలు కూడా ఇదే విధంగా వడ్డీని లెక్కిస్తారు.పది సంవత్సరాల తర్వాతః పొందే మొత్తం రూ 285.31. మీరు రూ. 100 లను  10%  సాదారణ వడ్డీ కి పది సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే, పది సంవత్సరాల తర్వాత  పొందే మొత్తం  రూ 200.  అదే రూ. 100 లను  10% చక్రవడ్డీకి పది సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే, పది సంవత్సరాల తర్వాత  పొందే మొత్తం  రూ 285.31  అంటే మీరు    రూ. 100 లను  సాదారణ వడ్డీ మరియు చక్రవడ్డీ లలో ఇన్వెస్ట్ చేస్తే సాదారణ వడ్డీ కంటే చక్రవడ్డీ ద్వారా  రూ .85.31 ఎక్కువగా రాబడి పొందుతున్నారు .ఇదే చక్రవడ్డీ యొక్క మహత్యం .ప్రారంభం లో వడ్డీ లో పెరుగుదల తక్కువగా ఉన్నప్పటికీ కాలం గడుస్తున్న కొలది ఈ వడ్డీ లో పెరుగుదల చాలా భారీగా ఉంటుంది. మీరు  ఉదాహరణలో కేవలం  సంవత్సరానికి ఒక్కసారి లెక్కించే విధానాన్ని మాత్రమే చూసారు. కొన్ని ఆర్ధిక సాధనాలు మూడు నెలలకు ఒక్కసారి, ఆరునెలలకు ఒక్కసారి లేక్కిస్తాయి. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వలన రాబడి అధికంగా ఉంటుంది.

మీరు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా లోన్  తీసుకుంటే  చక్రవడ్డీ ద్వారా వడ్డీ లెక్కించడం వలన మీరు ఆర్ధికంగా  చాలా దెబ్బతినడమే కాకుండా చివరకు దివాళా కూడా తీయవలసి వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు చక్రవడ్డీ వలన మీరు  ఆర్ధికంగా ఎదగడానికి ఎంత  లాభం పొందుతారో క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా లోన్   అంతే నష్టపోతారు.
మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం పై చక్రవడ్డీ ద్వారా కాలక్రమేణా ఆసాదరణ లాభాలు అందుకుంటారు.. చక్రవడ్డీ వలనే  ప్రపంచంలో ధనవంతులు ఇంకా ధనవంతులు కావడం జరుగుతుంది.

చివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరూ ఎప్పుడయితే చక్రవడ్డీ ద్వారా పొదుపు లేదా పెట్టుబడి చేయడం మొదలు పెడతారో  మీ డబ్బే మీ కోసం కష్టపడటం ద్వారా కొంత కాలానికి మీరూ ఆర్ధికంగా ఎదగడానికి  ఎంతో సహాయపడుతుంది. మీరూ  ఎప్పుడయితే లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారో అప్పుడు అదే చక్రవడ్డీ మిమ్ములను అర్దికంగా పతనం చేసి చివరకు దివాళా కూడా తీయుస్తుంది. అందుకే ఆర్ధిక వేత్తలు. ఫైనాన్సియల్ అడ్వయిజర్ ఇచ్చే సలహా ఏమిటంటే మీ చిన్న వయస్సులో  అంటే సంపాదన మొదలైన తొలినాళ్ళలోనే మీరు సేవింగ్ , ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే  కొంత కాలంలో మీరు ఆర్ధికంగా ఉన్నత స్థితికి చాలా సులభంగా ఎదగవచ్చు. మీరూ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కాదు ముఖ్యం . ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చాలా  చాలా ముఖ్యం. అందుకే ఇన్వెస్ట్ వెంటనే ప్రారంభించండి.