ఈ వారం స్టాక్ మార్కెట్


ఈ వారం స్టాక్ మార్కెట్























గత వారం మనం  అనుకున్న విధంగానే నిఫ్టీ  50 sma ఐనటువంటి 5255 వద్ద సపోర్ట్ తీసుకోవడమే కాకుండా దాని పైననే క్లోజ్ కావడం జరిగినది. ఇక ప్రస్తుత వారానికి వస్తే శని వారం రోజు జనరల్ యాంటీ అవాయిడేన్స్ రూల్స్ ( గార్) పై ఏర్పాటు ఐన నిపుణుల సంఘం పన్ను ప్రతిపాదనలను వాయిదా వేయాలి అని కోరడం మార్కెట్ కి ఉత్సాహం అందించే వార్తనే. అదే విధంగా ఫేడ్ బ్యాంక్ చైర్మన్  బెర్నంకే జాక్ అండ్ హోల్ మీటింగ్ లో quantitative easing, or "QE3."  గురుంచి ఎలాంటి ప్రకటన చేయకపోవడం నిరుత్సాహకరమే.కాని దాని గురుంచి పూర్తిగా కొట్టిపడవేయలేదు.అంటే సమీప భవిష్యత్తులో ఉద్దీపన చర్యలు ప్రకటించే ఆవకాశం కలదు. అదే విధంగా GDP డేటా అంచనా వేసినదానికంటే ఎక్కువగానే వచ్చింది కాబట్టి మరోసారి రిజర్వు బ్యాంక్ వడ్డీ రెట్లు తగ్గిస్తుంది అని ఆశించవచ్చు.  అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వివాదస్పద బొగ్గు గనులను కేటాయింపును రద్దు చేసే అవకాశం కూడా కలదు. 
ఇక నిఫ్టీ  టెక్నికల్ అనాలసిస్ గురుంచి చర్చించాల్సి వస్తే గత వారం నిఫ్టీ గ్యాప్ డౌన్ ప్రారంభం జరిగి 5400 వద్ద హై ప్రైస్ ఏర్పాటు కాబడి   5238 వద్ద లో ప్రైస్ ఏర్పాటు కావడం జరిగినది.నిఫ్టీ 50 sma ఐనటువంటి 5255 వద్ద గత వారపు చివరి రెండు  ట్రేడింగ్ రోజులలో   సపోర్ట్ తీసుకుంటున్నది అని తెలుస్తుంది. అంటే, లోయర్ లెవల్లో బయ్యింగ్ రావడం జరుగుతుంది,.  అదే విధంగా 5200-5220 రేంజ్ లో కూడా సపోర్ట్ ఉంది. ఫిబోనస్సీ రేషియో అనాలసిస్ ప్రకారం కూడా 50% రేషియో  రూపంలో  5200 వద్ద సపోర్ట్ కలదు. అదే విధంగా రైజింగ్ ట్రెండ్ లైన్ రూపంలో కూడా   5200 వద్ద సపోర్ట్ వస్తుంది.ఈ సెప్టెంబర్ నెలలో నిఫ్టీ 5200-5400 రేంజ్ లో కదలాడే అవకాశం కలదు అని అంచనా వేయడం  జరిగినది. కావున లోయర్ లెవల్లో 5190 సపోర్ట్ తో బై చేయడం మంచిది. సపోర్ట్ 5220, 5190, 5160 రెసిస్టన్స్ 5302,5348,ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం జరుగుతుంది.
ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.