మీరూ
ఇన్సురెన్స్ చేసే సమయంలో జరిగే పొరపాటు వలన మీ మరణానంతరం మీ కుటుంబం ఏ విధంగా
ఇబ్బంది పడుతుందో తెలుసుకోండి.
కొన్ని రోజుల క్రితం ‘Crime Patrol’ అనే ప్రోగ్రాం
సోనీ టి వి లో చూడటం జరిగినది. కథ విషయానికి వస్తే గుజరాత్ లోని ఒక యువ
వ్యాపారవేత్త తన తెలివితేటలతో తన కుటుంబానికి ఉన్న ఆర్ధిక ఇబ్బందులను
తొలగించే ప్రయత్నంలో తన కుటుంబాన్నే ఏ విధంగా ఇబ్బందుల్లోకి నేట్టివేసిందో
తెలియచేస్తుంది. ఆ యువ వ్యాపారవేత్త తనకున్న ఆర్ధిక ఇబ్బందులనుండి కనీసం తన కుటుంబాన్ని ఐనా భయటపడేయాలి అనే ఉద్దేశంతో తన కోసం భీమా చేయించి తనని ఎవరైనా చంపివేస్తే భీమా ద్వారా వచ్చే సొమ్ముతో తన కుటుంభం ఎలాంటి
ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది కదా అనే ఆలోచనతో Rs. 1.25 కోట్ల రూపాయలకి భీమా చేయించుకున్నాడు.
దీని కోసం అతను Rs. 20-30 లక్షల మధ్య గల వేరువేరు భీమా పాలసీలు తీసుకోవడం జరిగినది. ఈ
భీమా పాలసీల అన్నింటికీ సక్రమంగా భీమా
ప్రీమియం చెల్లించడం చేసాడు. ఒకానొక రోజు హైవే రోడ్డు పై ఆ యువ వ్యాపారవేత్త తన కారులోనే హత్యగావించబడినాడు...కట్ చేస్తే అతను తన
స్నేహితుడిని తనతో పాటు కారులో ప్రయాణించి తనని హత్య చేస్తే తన కుటుంబం ఎలాంటి
ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనే ఆలోచించాడు. ఎందుకంటె తను మర్డర్ చేయబడితే తన కుటుంబానికి తను బీమా
చేసిన సొమ్మూ మొత్తం అందుతుంది అనుకున్నాడు కాని అతను చేసిన పొరపాట్లు ఏమిటో
చూద్దాం.అదే ఆత్మహత్య ఐతే పాలసీ చేసిన సంవత్సరం లోపు ఐతే ఎటువంటి భీమా పరిహారం
రాదు అనే విషయం తెలుసుకాబట్టి మర్డర్ ప్లాన్ ఎన్నుకోవడం జరిగినది. ఐతే అతడు Rs. 20-30 లక్షల
మధ్య గల వేరువేరు భీమా పాలసీలు తీసుకోవడం
జరిగినది అని అనుకున్నాం కదా ? కాని ఈ విధంగా వివిధ పాలసీలు
తీసుకుంటున్నప్పుడు వాటి వివరాలు మిగితా
ఇన్సురెన్స్ కంపెనీలకు తెలియచేయవలసిన భాద్యత అతనిపై ఉంది.అతనికి Rs. 20 లేదా Rs. 30
లక్షల భీమా పాలసీ అతనికి ఇస్తున్నప్పుడు
ఇన్సురెన్స్ కంపెనీకి అతనికి గల వివిధ రకాల పాలసీల గురించి తెలియదు కదా ? ఇదే
అందరూ చేసే చాలా చాలా పెద్ద పొరపాటు. మీరూ ఏ కొత్త భీమా పాలసీ తీసుకున్న మీకు గల ఇతర భీమా పాలసీల వివరాలు తెలియచేయడం చాలా మంచిది.అతను
మరోక విషయం కూడా మర్చి పోవడం జరిగినది. లైఫ్ పాలసీలు
తొందరగా అంటే పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాలలోపు క్లైమ్ కొరకు వస్తే వాటిపై తప్పనిసరిగా
విచారణ జరుగుతుంది.ఇది మీకు ఎందుకు చెప్పడం జరుగుతున్నది అంటే ఆ యువకుడు తన ఆర్ధిక ఇబ్బందుల గురించి తన
కుటుంబానికి తెలియచేసి ఉంటే ఏదో విధంగా
సహాయం అందేది. ఇప్పుఉద్ అతని వలన అతనకి సహాయం చేసిన స్నేహితుడు కూడా జైలు పాలు
కావడం జరిగినది. ఆ యువకుడు ఒక విషయం మర్చిపోయాడు. ఇన్సురెన్స్ కంపెనీలు చారిటీ
సంష్టాలు కాదు అనే విషయం.మీరూ నిజాయితీతో అన్ని వివరాలు తెలియచేస్తే మీ క్లైమ్ తిరస్కరించే అవకాశం ఎంత మాత్రం
ఉండేదికాదు. ఆ యువకుడి భీమా పాలసీలలో ఒక బీమా పాలసీ ఐదు సంవత్సరాల క్రితం నాటిది
కాబట్టి, ఆ పాలసీ భీమా అమౌంట్ మాత్రమే అతని కుటుంబానికి రావడం జరిగినది. అందువలన
ఎవ్వరైనా సరే మీరూ కొత్త పాలసీ తీసుకుంటున్నప్పుడు మీ పాత భీమా పాలసీల వివరాలు
తప్పక అందచేయండి.