స్టాక్ మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్


స్టాక్ మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్
RAJIV GANDHI EQUITY SAVINGS SCHEME (RGESS)

కేంద్ర ఆర్ధిక మంత్రి  కొత్త గా ఆదాయపు  పన్ను పథకాన్ని 21 sep 2012నాడు ఆమోదించడం జరిగినది. ఆ పథకం పేరే  రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్. ఈ పథకం ప్రకారం కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు ఆదాయపు పన్నుమినహాయింపు  పొందడానికి ఉపయోగపడుతుంది. వార్షిక ఆదాయం పది లక్షల లోపు ఉండి, తొలిసారిగా స్టాక్ మార్కెట్ లో యాభై వేలు ఇన్వెస్ట్ చేస్తారో  వారూ ఈ పథకం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దేశీయ స్టాక్ మార్కెట్ లో కి ఇన్వెస్టర్లను ఇన్వెస్ట్ చేయడానికి ప్రోత్సహించడం  , దేశంలో  ఈక్విటీ సంస్కృతి' పెరిగేలా చూడటం.ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్షణాలను ఒక్క సారి పరిశీలిద్దాం.

ఈ పథకం కొత్తగా మార్కెట్ లో కి ప్రవేశించే వారి కోసం ఉద్దేశించిన పథకం.వారిని వారి పాన్ నంబర్ ఆధారంగా గుర్తిస్తారు.ఎవరైనా ఇప్పటికే డిమ్యాట్ ఖాతా ప్రారంభించి ఎలాంటి లావాదేవీలు జరపకపోతే వారూ కూడా ఈ పథకం క్రింద ఇన్వెస్ట్ చేయవచ్చు.
పన్ను పరిధిలోకి వచ్చే వార్షిక ఆదాయం పది లక్షల కంటే తక్కువగా ఉంటుందో వారూ ఈ పథకం ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి అర్హులు.

ఈ పథకం క్రింద గరిష్టంగా రూ 50,000 పెట్టుబడి పెట్టడానికి అవకాశం కలదు. ఇన్వెస్ట్ చేసిన మొత్తం లో    50% అమౌంట్ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి మినహాయింపు పొందుతారు.

ఈ పథకం క్రింద ఇన్వెస్ట్ చేయడానికి  BSE 100,  CNX100 లో ఉన్న కంపెనీలలో  , ప్రభుత్వ రంగసంస్థలలో   నవరత్న , మహానవరత్న, మినీ నవరత్న హోదా కలిగిన కంపెనీలు , పైన  పేర్కొనబడిన కంపెనీలలో ఫాలో అన్ పబ్లిక్ ఇష్యూ (   FPOs)లలో ,ప్రభుత్వరంగ కంపెనీలు  IPOకి వచ్చినప్పుడు ఆ ఆర్ధిక సంవత్సరం కంటే ముందు మూడు సంవత్సరాలు వరుసగా   4,000  కోట్ల కంటే అధిక టర్నోవర్ కలిగి ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేయవచ్చు.అంటే ఏ కంపెనీలలో పడితే ఆ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం వలన ఈ పథకం యొక్క లాభాలు కలగవు.

వివిధ వర్గాల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు   Exchange Traded Funds (ETFs) , Mutual Funds (MFs) ఈ పథకం క్రింద పేర్కొనబడిన కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయో వాటిని కూడా ఈ పథకం క్రింద పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

చిన్న ఇన్వెస్టర్లకు , ప్రయోజనం కల్పించడానికి ఈ పథకంలో వాయిదా పద్దతిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం కలిపించడం జరిగినది.పన్ను ప్రయోజనాలు పొండుతున్న ఆర్ధిక సంవత్సరం లోనే ఇన్వెస్ట్ చేయాలి.

ఈ పథకం యొక్క లాక్ ఇన్ పిరియడ్ మూడు సంవత్సరములు. మీరు చివరిసారిగా ఇన్వెస్ట్ చేసిన తేది నుండి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది..  

ఇన్వెస్ట్ చేసిన సంవత్సరం తరవాత  ఇన్వెస్ట్ చేసిన షేర్లలో ట్రేడింగ్ చేయడానికి అవకాశం కల్పించబడుతుంది.

మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఈ పథకంలో గల ఒక కంపెనీ  షేర్లు అమ్మినట్టు ఐతే మీరు అంతే విలువగల ఈ పథకంలో అనుమతి ఇవ్వబడిన మరో కంపెనీ షేర్లు కొనవలసి ఉంటుంది.

ఈ పథకం క్రింద ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి   ఆదాయపు పన్ను సెక్షన్ 80CCG ను చేర్చడం జరిగినది.
కేంద్ర రెవిన్యూ డిపార్ట్ మెంట్ మరియు సెబీ రాబోవు రెండు వారాలలో  పూర్తీ వివరాలతో కూడిన సర్క్యులర్  ఇవ్వగలవు.