పర్సనల్ లోన్స్ కి ఎందుకు దూరంగా ఉండాలి?

పర్సనల్ లోన్స్ కి ఎందుకు దూరంగా ఉండాలి?
ప్రస్తుత ప్రపంచంలో ఆదాయం పరిమితం కాని కోరికలు అనంతం . ఈ కోరికలను తీర్చుకోవడానికి మనకు ఉన్న దారులలో ముఖ్యమైనది పర్సనల్ లోన్స్ తీసుకోవడం లేదా క్రెడిట్   కార్డ్స్ వాడటం.ఒక్క విషయం మీరూ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి . మీరూ ఏవిధమైన అప్పు తీసుకున్న కూడా  దానిని తీర్చవలసిన భాద్యత మీపై ఉంటుంది అంతేకాకుండా అది మిమ్ములను ఆర్ధికంగా ఇబ్బందులపాలు తప్పకుండా చేస్తుంది.అందువలన పర్సనల్ లోన్స్ తప్పని పరిస్థితి , అత్యవసరం ఐతే తప్ప వాటిని తీసుకోకూడదు. మీరు పర్సనల్ లోన్స్ తీసుకోవడం అనేది మీ చిట్టా చివరి అవకాశంగా ఉండాలి.
పర్సనల్ లోన్స్ సాదారణంగా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అంటే వైద్య ఖర్చులు, వివాహ ఖర్చులు, గృహోపకరణ వస్తువులు , క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చడం మొదలగు వాటిలో దేనికైనా వాడుకోవచ్చు.మీరూ పర్సనల్ లోన్స్ తీసుకొనేటప్పుడు  దానిని ఎందుకు వినియోగిస్తున్నారో బ్యాంక్ వారికి తెలియచేయవలసిన అవసరం లేదు కాబట్టి పర్సనల్ లోన్స్ అంటే అన్ని రకాల అవసరాలకి ఉపయోగించే లోన్స్.సాదారణంగా హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్ , ఎడ్యుకేషనల్ లోన్స్ అంటే మీరూ వాటిని ప్రత్యేకంగా  వాటి గురించి మాత్రమే ఉపయోగించాలి. మీరూ బ్యాంక్ నుండి పర్సనల్ లోన్స్ తీసుకోవడం కూడా చాలా సులభం . అంతేకాకుండా చాలా బ్యాంకులు పర్సనల్ లోన్స్ కోసం గ్యారంటర్  లేదా సెక్యూరిటీ కూడా అడగరు. అందువలన చాలా మంది పర్సనల్ లోన్స్ తీసుకోవడం చాలా మంచిది ఆనే ఉద్దేశంతో ఉంటారూ కాని పర్సనల్ లోన్స్ తీసుకోవడం అంత పెద్ద  తప్పు ఇంకోటి లేదు. అని రకాల లోన్స్ లోకెల్లా అత్యంత వరస్ట్ లోన్స్ పర్సనల్ లోన్స్ .వీటిలో వసూలు చేసే వడ్డీ రేటు కూడా సాదారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది.సుమారు 14-18% వరకు వడ్డీ వసూలు చేస్తారు.
మనం ఒక ఉదాహరణ ద్వారా  అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.ఒక వ్యక్తీ అత్యవసర నిమిత్తమై రూ   5,00,000 బ్యాంక్ నుండి అప్పు తీసుకుంటే 17%  వడ్డీ రేటుతో  5సంవత్సరాలలో తిరిగి చెల్లించటానికి ప్రతి నెల చెల్లించే  emi  రూ 12,426 తీసుకున్న లోన్ పై సుమారు  రూ 2,45,560 వడ్డీ  చెల్లించవలసి వస్తుంది.   అంటే లోన్ పై 50% అధికంగా వడ్డీ రూపంలో చెల్లించవలసి వస్తుంది.


సాదారణంగా చాలా బ్యాంకులు ముందస్తూ చెల్లింపులకు ఒప్పుకోవు. దాని వలన మీ లోన్ కాలపరిమితి తీరేటంత వరకు వాయిదాలు చెల్లించవలసి ఉంటుంది. మీరు చెల్లించే వాయిదాలలో మొదటి రెండు సంవత్సరాలు ఎక్కువగా  వడ్డీ చెల్లించడానికే  వెళ్ళిపోతుంది.కొన్ని బ్యాంకులు ముందస్తూ చెల్లింపులకు అనుమతించిన ఎక్కువ పెనాల్టీ విదిస్తాయి.
ఇవి సాదారణంగా మీ ఆర్ధిక సానర్ద్యం బాగుండి తిరిగి చెల్లించే సామర్ధ్యం బాగుంటే మాత్రమే ఈ లోన్స్ మీకూ ఇస్తాయి.అదే విధంగా కొన్ని బ్యాంకులు హిడ్డేన్ చార్జీలు విధిస్తూ మీకూ ఇంకా భారాన్ని కలుగచేస్తాయి.చాలా మందికి లోన్ ఆఫర్ డాక్యుమెంట్స్ , అగ్రిమెంట్స్ కనీసం చదవకుండానే సంతకం పెడతారు. దానికి అధిక మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.మీ లోన్ వాయిదాలు నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే పెనాల్టీ చెల్లించ వలసి ఉంటుంది.ఒకవేళ మీరూ లోన్స్ చెల్లించడంలో విఫలమయి , డిఫాల్ట్ అయితే మీరూ భవిష్యత్తులో లోన్స్ పొందడం చాలా చాలా కష్టం అవుతుంది. అందువలన వీలు అయినంతవరకు పర్సనల్ లోన్స్ కి చాలా చాలా దూరంగా ఉండండి.ఒకవేళ అత్యవసర నిమిత్తమై డబ్బులు అవసరమైతే గోల్డ్ లోన్స్ ఏవైనా తీసుకోండి.తప్పని పరిస్థుతులలో వైద్యం కోసం ఐతే పర్సనల్ లోన్స్ తీసుకోవడంలో తప్పులేదు కాని విహర యాత్రలకి , వస్తువులకి  మొదలగు వాటికి మాత్రం పర్సనల్ లోన్స్ ఎలాంటి పరిస్థుతులలో కూడా తీసుకోవద్దు.