నా పుస్తకాలపై అధిక ఆదరణ చూపిన వారందరికి ధన్యవాదాలు.



 నా పుస్తకాలపై అధిక ఆదరణ చూపిన వారందరికి ధన్యవాదాలు.


నాలుగు నెలల క్రితం విడుదలైన నా పుస్తకాలు  A TO Z  ఇన్వెస్ట్మెంట్  గైడ్ , ఇన్కంటాక్స్ గైడ్ , మ్యుచవల్  ఫండ్స్ గైడ్ , స్టాక్ మార్కెట్ లో లాభాలు పొందటం ఎలా ? స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ చార్ట్ పాటర్న్స్ , స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ క్యాండిల్ స్టిక్ చార్ట్ పాటర్న్స్-1 ,స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ క్యాండిల్ స్టిక్ చార్ట్ పాటర్న్స్-2 మొదలగు పుస్తకాలు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిన కొద్ది కాలంలోనే  అధిక ప్రజాదరణ పొందటమే కాకుండా స్వల్పకాలంలో మలి ముద్రణకు కూడా వెళ్లటం జరిగినది.సాదారణంగా తెలుగు పుస్తకాల మార్కెట్ తక్కువగానే ఉంటుంది. అందులో ఆర్ధిక విషయాలపై అవగాహన కలుగచేసే పుస్తకాలపై  ఆదరణ మరీ తక్కువగా ఉంటుంది. కాని నేను ఉహించిన దానికన్నా అధిక ఆదరణ నా పుస్తకాలపై చూపటమే కాకుండా కొన్ని ఏరియాలలో  పుస్తకాలు దొరకలేని పరిస్థితి కూడా  ఉంది. ఈ విధంగా నా పుస్తకాలను  మార్కెట్ లో విజయవంతం చేయటమే కాకుండా అధిక ఆదరణ చూపిన వారందరికి ధన్యవాదాలు.
sriniwaas

ఈ- వారం స్టాక్ మార్కెట్ -24-06-2013 to 28-06-2013



- వారం స్టాక్ మార్కెట్  -24-06-2013 to 28-06-2013
  
 
  
 గత వారం తెలియచేసినట్టుగా ఈ వారం కూడా మార్కెట్ బెరిష్ ట్రెండ్ లో కొనసాగాటానికే అధిక అవకాశం కాలదు. మీరూ  నిఫ్టీ వీక్లీ చార్ట్ లో ప్రైస్   రైసింగ్  ట్రెండ్ లైన్ వద్ద  మరియు  మీకూ ఇదివరకే తెలియచేసిన సపోర్ట్ 5610 వద్ద సపోర్ట్ తీసుకోవటం జరిగినది. ఇతర ఇండికేటర్స్ కూడా పరిశీలించినట్టు ఐతే రైసింగ్  ట్రెండ్ లైన్ సపోర్ట్ బ్రేక్ కావటానికే అధిక అవకాశం కలదు. నిఫ్టీ కి ప్రస్తుతం రెసిస్టన్స్ 5683,5750 వద్ద కలదు. 5683 పైన నిలదోక్కుకుంటే  5750 వరకు వెళ్ళటానికి అవకాశం కలదు. అదే విధంగా సపోర్ట్ 5610 వద్ద కలదు. ఈ సపోర్ట్ బ్రేక్ జరిగితే 5475-5500 సులభంగా చేరుకొనే అవకాశం కూడా కలదు.పై లెవల్లో అవకాశం దొరికితే  రెసిస్టన్స్ ఏరియాలో సెల్లింగ్ చేయటమే మంచిది.