Stock Market


షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.?
చాలా మందికి షేర్లు లేదా షేర్ మార్కెట్ అంటే చాలా దురభిప్రాయం ఉంది.గుర్రపు పందాలు.పెకాటలాగే అదికూడా  ఒక వ్యసనం అనుకుంటూ ఉంటారు.నిజానికి అది సరికాదు. రేసులూ, పెకాటాలు గెలవటం, ఓడటం అనేది కేవలం అదృష్టం మీదా మాత్రమే అధారపడి  ఉంటుంది.కానీ  ఈ షేర్ల బిజినెస్ లో కాసింత జ్ఞానం తో పాటు మెలకువతో ముందే రిస్కులను వూహించగలిగితే  లాభాన్ని సంపాదించవచ్చు.షేర్లలో ఉండే లాభాలు సాదరన్మగా రెండు రకాలుగా ఉంటాయి.మనం కొన్న షేరు ధర పెరగడం వలన వచ్చే లాభం మొదటిది.రెండవది కంపెనీ వచ్చిన లాభాలాలో నుండి మనకి కొత్త శాతం పంచి ఇవ్వడం . దానినే  డివిడెండ్ అంటారు.ఒక షేరు ని మనం పది రూపాయలకు కొని ఆర్నెల్ల తర్వాత దాని ధర ఇరవై రూపాయలకు పెరిగినప్పుడు అమ్మితే మనకి వచ్చిన లాభం పది రూపాయలు.రియల్ ఎస్టేట్ కంటే కూడా అధిక లాభాలు అందించే సాధనం షేర్ మార్కెట్ . కాని దానిపై పూర్తీ అవగాహన మాత్రం తప్పనిసరి.బ్యాంకుల్లో డబ్బూ ని ఫిక్సుడ్ డిపాజిట్ చేయడం వలన వచ్చే వడ్డీ శాతం కేవలం ఆరు నుండి ఎనిమిది శాతం మాత్రమే.దానిని మెట్యురిటీ అయ్యే వరకు తీయలెం కూడా.తీసుకున్నా వడ్డీ నష్టం తప్పదు.అదే షేర్ మార్కెట్ లో ఐతే మీ షేర్లు మీ ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు.ఈ విధంగా భూమూలు, స్తిరాస్తులూ కాపాడుకోవటం, అమ్ముకోవటం, లాభం తీసుకోవడం కన్నా ఈ వ్యాపారం చాలా సులభం.

షేర్ ధర ఎందుకు పెరుగుతుంది. ?
దీనికి చాలా చిన్న సమాధానం. మనదేశంలో బ్యాంక్ వడ్డీ రేటు కన్నా మిగితా వస్తువుల ధరలు  విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి.ఉదాహరణకు వంద మంది కలిసి తలా పదివేలు వేసుకొని పది లక్షలకి భూమి కొన్నారు అనుకోండి. అదే భూమి ఆర్నెల్ల తర్వాత పన్నెండు   లక్షలు ఐతే అప్పుడు ఒక్కొక్కరి షేరు విలువ  పన్నెండు వేలు అవుతుంది. ఈ లోపులో ఒకవేళ ఆ భూమి లో వేసిన వరి పైరు చేతికి వచ్చి లక్ష రూపాయల ధర అయిందనుకోండి.ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల డివిడెండు వస్తుంది.   మొత్తం మీదా మూడు వేలు లాభం కదా? ఒక్కొక్కరికి. అదే విధంగా కంపెనీ అతుల విలువ కూడా పెరుగుతుంది.ప్రతి కంపెనీ తన  లాభాలన్నింటిని వాటాదారులకు పంచాడు. కొంత వరకూ రిజర్వులో దాస్తుంది. అది కూడా మన అస్తే.పైన చెప్పుకున్న ఉదాహరణలో మన కంపెనీ గత ఐదు సంవత్సరాలుగా వచ్చిన లాభాలను రిజర్వు లో యాభై లక్షల వరకు దాచి పెట్టినది అనుకోండి.అప్పుడు మన పది రూపాయల షేరు ధర అరవై రూపాయలు అవుతుంది.కొన్నిసమయాలలో కంపెనీ రిజర్వు అమౌంట్ లో నుండి  కొంత  మొత్తం మనకి పంచుతుంది. వాటిని మనం బోనస్ షేర్లు అంటారు. 
కంపెనీ కొత్తగా షేర్లను ఇవ్వడాన్ని  పబ్లిక్ ఇష్యూ అంటారు. కంపెనీ తన వ్యాపరం గురించి, ఇంతకు ముందు కంపెనీ ఉన్నట్టు ఐతే పూర్వపు లాభాల గురించి , తన ఆస్తులు మొదలగు వాటితో కూడిన వివరాలతో దిన పత్రికలో ప్రకటన ఇస్తుంది.అప్పుడు మనకు ఆ కంపెనీ గురించిన సమాచారం నచ్చి , నమ్మకం కుదిరితే  అప్లయ్ చేయవచ్చు.కొనేవారి సంఖ్యా ఎక్కువగా ఉంటే లాటరీ తీసి పంచుతారు.పెద్ద కంపెనీ షేర్లు ఈ విధంగా లాటరీ ద్వారా సంపాదించటం కొద్దిగా కష్టం..ఈ విధంగా పంపకం జరిగాక తమకి సంక్రమించిన షేర్లని కొందరు అమ్మజూపుతారు.కావలసినవాళ్ళు హెచ్చు ధరకి దాన్ని కొనుక్కోవడాన్ని  సెకండరీ మార్కెట్ అంటారు.క్యూ లైన్ లో సినిమా టికెట్స్ దొరక్కపోతే బ్లాకులో ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్నట్టు .
షేరు ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచాగానే ఎక్స్  కెమికల్ కంపెనీ షేర్ల ధర పెరగవచ్చు.దానికి కారణాలు అన్వేషించాలి అంటే చాలా లింకులు ఆలోచించాలి.పెట్రోలు ధర పెరిగితే బైక్ లకన్నా లూనాల  డిమాండ్ పెరుగుతుంది. లూనాల టైర్లలో వాడే రసాయనాన్ని ఈ  ఎక్స్  కెమికల్ కంపెనీ తయారు చేస్తుంది.అందువలన వచ్చే సంవత్సరం దీనికి లాభాలు ఎక్కువగా వస్తాయి అన్న ఉద్దేశంతో ఈ కంపెనీ షేరు ధర పెరుగుతుంది.
ప్రధానమంత్రి  , వాణిజ్య మంత్రిని పదవి నుంచి తొలగించాగానే ఒక చెప్పుల కంపెనీ ధర విపరీతంగా పడిపోవచ్చు.దానికి , దీనికి లింక్ ఏమిటని ఆలోచిస్తే సదరు మంత్రి బావమరిదికి  అరబ్ దేశాలకు  చెప్పులు ఎగుమతి చేసే లైసన్స్ ఉండి ఉండవచ్చు.దాని క్రింద లోపాయికారిగా కోట్ల విలువచేసే చెప్పులు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తూ ఉండవచ్చు.ఇకముందు ఈ ఆటలు సాగవు కదా ? అందుకే ఆ కంపెనీ షేరు ధర పడిపోయింది. ఈ విధంగా దేశంలో ఎక్కడో ఏదో జరిగితే మరెక్కడో షేరు ధరలు పెరగడమో, తరగాడమో  జరుగుతుంది.కేరళలో  వర్షాలు పడితే బొంబాయి కొబ్బరి నూనె కంపెనీ షేరు ధరపై ఆ ప్రాభావం  ఉంటుంది.కార్మిక సంఘాల స్ట్రయికులు , రాజకీయ అనిశ్చితి, పంటలు, యుద్ధం  మొదలగునవి అన్ని కూడా షేర్ల ధరలపై ప్రభావం చూపెడతాయి.దేశంలో ఒక చిన్న కదలిక రాగానే అది ఏ కంపెనీ  మీదా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కరెక్ట్ గా అంచనా వేసి అందరికన్నా  ముందుగా దాన్ని పట్టుకొని దాంతో వ్యాపారం చేసే బ్రోకర్లని స్పెక్యులేటర్లు అంటారు. మనిషి తెలివి తేటలకు వీరి మెదళ్ళు పరాకాష్ట. వీరిలో రెండు రకాలు. బుల్ల్స్, బెర్స్.
స్టాక్ మార్కెట్ లో లో వ్యాపారం చేసే వాళ్ళు సాదరణంగా  ఈ రెండు రకాల్లో ఏదో ఒక రకానికి చెందినవారూ అయి ఉంటారు. మార్కెట్ లో వీళ్ళిద్దరూ ఎప్పుడు యుద్దానికి తలపడే యోదుల్లా ఉంటారు. బుల్ ఆశాజీవి. దేశంలో ఏ చిన్న పరిమాణం జరిగిన షేరు ధర విపరీతంగా పెరుగుతుంది అనుకొనేవాడు.బెర నిరాశాజీవి.ధర అనుకున్నంతగా పెరగదని , కొండకచో తగ్గిపోతుంది అని  భావించేవాడు . ఉదాహరణకు జనవరి 1వ తారీఖున కిలో పంచదార  10 రూపాయలు ఉందనుకొందాం. ఆ సంవత్సరం చెరకు సరిగ్గా పండలేదు అనుకుందాం.మార్చి   31 వ తారీఖు వీరిద్దరూ ఉహించే ధరలు ఈ విధంగా ఉంటాయి.
జనవరి  1 ధర      మార్చి 31ధర  
       బుల్   10              16
      బేర్   10              12
జనవరి ఒకటో తారీఖు పొద్దున్నే బుల్ స్వీట్స్ తీసుకొని బేర్  కి నూతన సంవత్సర శుబాకాంక్షలు చెప్పి బేరం మొదలు పెడతాడు. బ్రదర్   మార్చి 31 వ తారీఖు నాటికి నాకు లక్ష కిలోల పంచాదార కావాలి . కిలో పద్నాలుగు రూపాయల చొప్పున  ఆ రోజు నాటికి ఇవ్వగలవా ? అని అడుగుతాడు.
కొత్త సంవత్సరం మొదట్లో భలే బేరం తగిలిందని బేర్ సంతోషిస్తాడు.మార్చి  31నాటికి అతడు ఉహిస్తున్న ధర  కిలో  12   మాత్రమే. ఆ రోజు   పన్నెండుకి కొని పద్నాలుగికి అమ్మితే రెండు లక్షలు లాభం వస్తుంది అని ఆలోచిస్తాడు.బుల్ ఆలోచనలు వేరు . ఆ రోజు ధర పదహారు రూపాయలు ఉంటే అతడికి రెండు లక్షలు లాభం.ఈ విధంగా ఇద్దరి మధ్య ఒక్క పంచదార పలుకు లేకుండా లక్షల వ్యాపారం చేస్తారు.
మరుసటి ఆర్టికల్ లో షేర్ మార్కెట్ లో మోసాలు ఎలా జరుగుతాయి . హర్షద్ మెహతా  చేసిన మోసం ఎలాంటిదో  తెలుసుకుందాం.

షేర్ మార్కెట్ లో హర్షద్ మెహతా చేసిన మోసం ఏమిటి ?
షేర్ మార్కెట్ లో షేర్ ధరలు ఎందుకు పెరుగుతాయి.?
 మీరు ఇంతకు ముందు  బుల్ మరియు బేర్ ఒక్క పంచదార పలుకు లేకుండా లక్షల వ్యాపారరం చేసారు అని తెలుసుకున్నారు కదా ? అయితే దీని మీదనే షేర్ల ధర ఆధారపడి ఉంటుంది. ఫలానా బుల్  మార్చి 31 వ తారీఖు నాడు పద్నాలుగు రూపాయలకు  లక్ష కిలోల పంచదార కొంటున్నాడన్న  వార్త  మార్కెట్ లోకి  పొక్కగానే  అతడు ఏయే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రేటు నిర్ణయించడా  అన్నది అందరూ  పరిశీలిస్తారు. ఆ విధంగానే బేర్ లు ఏ నమ్మకం తో ఆ అమ్మకానికి వప్పుకున్నడన్న  విషయం లెక్కలు వేస్తారు.ఇరుపక్షాల వైపు అటూ ఇటూగా విడిపోతారు.ఈ విధంగా ఒక షేరు ధర బుల్ల్స్ మరియు బెర్స్ మధ్య లావాదేవీలవల్ల  నిర్ణయించబడుతుంది. ముందే చెప్పినట్టు దీని వెనుక అపూర్వమైన తెలివితేటలు , దేశ రాజకీయ , సామాజిక ఆర్ధిక పరిస్థితులు  ఉంటాయి.

మోసం ఎలా జరుగుతుంది.
జనవరి ఒకటో తారీఖున మీరు వెళ్లి బేర్ ని మార్చి  31 న నాకు కిలో  పద్నాలుగు రూపాయల చొప్పున లక్ష కిలోల పంచదార కావాలి అన్నారు అనుకోండి. బేర్ దానికి ఒప్పుకున్నారు అనుకోండి. బయట ఎక్కడో స్నేహితుడి దగ్గర  పది లక్షలు అప్పు తెచ్చి ఆ డబ్బుతో లక్ష కిలోల పంచదార కొనేసి ఆ స్టాక్ బ్యాంక్ లో పెట్టి దాని మీదా పది లక్షలు అప్పు తీసుకున్నారు అనుకోండి. దాంతో మళ్ళీ ఇంకో లక్ష కిలోల పంచదార కొన్నారు అనుకోండి. బ్యాంక్ మార్జిన్ లేకుండా అప్పు ఇచ్చినది అనుకుందాం.మీ చర్య వలన ఈ లోపులో పంచదార డిమాండ్ పెరిగి వారం రోజుల్లో కిలో పంచదార  పద్నాలుగు రూపాయలు అవుతుంది. ప్రస్తుతం మీ దగ్గర  రెండు లక్షల కిలోల పంచదార ఉంది. స్నేహితుడి దగ్గర అప్పుచేసి లక్ష  కిలోల  పంచదార కొంటే , దానిని బ్యాంక్ లో కుదవ పెట్టి మరో లక్ష  కిలోల  పంచదార కొనడం జరిగినది.ప్రస్తుతం ఈ రెండు లక్షల కిలోల పంచదార విలువ ఇరవై ఎనిమిది లక్షలు.మీ బ్యాంక్ అప్పు పది లక్షలు.మిగితా విలువకి బ్యాంక్ మళ్ళీ అప్పు ఇస్తుంది.ఆ డబ్బుతో  మీరు మరో 1.25 లక్షల  కిలోల పంచదార కొంటారు. మార్కెట్ లో పంచదార దొరకటం లేదు. కిలో ధర ఇరవై ఐదు రూపాయలు అయింది. ఇంతలో    మార్చి  31మీకు గుర్తుందా ? ఆ రోజు మీకు లక్ష కిలోల పంచదార పద్నాలుగు రూపాయల చొప్పున మీకు సప్లయ్ చేస్తానని బేర్ మీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగినది.ప్రస్తుతం ధర ఇరవై ఐదు రూపాయలు. మీతో బేరం కుదుర్చుకున్న బేర్  బావురుమని ఏడుస్తూ మీకు పదకొండు లక్షల రూపాయలు ఇచ్చాడు.(25-14  రూపాయలు x లక్ష కిలోలు ) . దాంతో మీరూ మీ స్నేహితుడు అప్పు తీర్చేసారు. ప్రస్తతం మీ దగ్గర 3.25 లక్ష కిలోల పంచదార ఉంది. దాని ధర కిలోకి 25  చొప్పున 81,25,000 . మీరూ చేస్తున్న వ్యాపారం చూసి బ్యాంక్ చైర్మన్స్ కూడా విస్తూపోయారు.  మీరూ తమ బ్యాంక్ లో లావాదేవీలు పెట్టుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నారు. మీరు వడ్డీ కరెక్ట్ గా చెల్లిస్తున్నారు. మూడు నెలలో పంచదార కిల్ప్ పది రూపాయలనుండి , పాతిక రూపాయలు కావడం తో జనం బంగారం దాచుకోవడం బదులు పంచదార వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. పెళ్లాల మంగళ సూత్రాలు అమ్మి పంచదార కొంటున్నారు.దాంతో పంచదార ధర 30 రూపాయలు అయింది .అంటే ప్రస్తుతం మీ దగ్గర  కోటి రూపాయల విలువగల స్టాక్ ఉంది.దానిని కుదువ పెట్టుకొని బ్యాంక్ మీకు మరో కోటి రూపాయలు అప్పు ఇచ్చినది.మీరు మరో 3.30 లక్షల కిలోల  పంచదార కొన్నారు.దానిని కూడా బ్యాంక్ కి కుదవ పెట్టారు. కానీ బ్యాంక్ చైర్మన్ ఇక్కడే పొరపాటు చేసాడు. సెక్యురిటీ  కరెక్ట్ గానే ఉంది.  3.30 లక్షల కిలోల  పంచదార   కోటీ రూపాయలు అనుకునాడు . దాని ధర కిలో 30 రూపాయలు అనుకున్నాడు. దాని అసలు ధర కిలో పది రూపాయలు అని, మీ వలెనే కిలో  30 రూపాయలకి పెరిగినది అనే విషయం మర్చిపోయాడు.ఒకరోజు దురద్రుస్టావశాత్తు  ఈ విషయం రిజర్వు బ్యాంక్ నోటిసుకి వచ్చినది.కంగారు పది లెక్కలు సరిచూసుకుంటే కిలో పది రూపాయల చొప్పున 6000 కోట్ల నికర విలువగల పంచాదారకి బ్యాంక్ 11480కోట్లు అప్పు ఇచ్చినట్టు తేలింది. తేడా 5480. ఈ విధంగా  చేతిలో నయా పైసాలేకుండా  ఒక వ్యక్తీ పంచాదారలాంటి షేర్లతో  ఐదు సంవత్సరాలాలో  5480 కోట్లు సంపాదించాడు. ఆ వ్యక్తే   హర్షద్ మెహతా THE BIG BULL. 
కొన్నేళ్ళ క్రితం  చుక్కాని లేని నావలా బొంబాయి వీధుల్లో తిరిగిన హర్షద్ మెహతా , పన్నెండు  వందల రూపాయలకి చిన్న అసిస్టెంట్ గా ఉద్యోగం చేసిన మెహతా , కోట్ల విలువ చేసే బంగాళాలో  ఉంటూ , ఖరీదైన కారలలో తిరుగుతూ  చివరకు జైలు పాలు అయ్యి  జైలులోనే గుండె పోటూతో మరణించడం జరిగినది.ఇక్కడ పంచదార కేవలం మీకు సాదారణ బాషలో సులభంగా అర్ధం కావడానికి తీసుకోవడం జరిగినది. వాస్తవంగా పంచదార బదులు షేర్లు లెక్కలోకి తీసుకోవాలి. మీకు ఈ విషయం పూర్తీగా అర్ధం కావలి అంటే ఇంతకు ముందు రెండు భాగాలు కూడా చదివితే సులభంగా అర్ధం అవుతుంది.          


ఈ రోజు స్టాక్ మార్కెట్.
మీకు రెండు రోజుల క్రితం తెలియచేయడం జరిగినది.నిఫ్టీ 5700 క్రింద ఉన్నంత వరకు మార్కెట్ క్రిందకు దిగజారడానికి అవకాశం ఉంది అని తెలియచేయడం జరిగినది.అదే విధంగా   5650-5683 వద్ద ఏర్పాటు కాబడిన గ్యాప్ కూడా నింప బడుతుంది అంటే , 5650 వరకు నిఫ్టీ సులభంగా పడిపోతుంది అని తెలియచేయడం జరిగినది. నిన్న అదే విధంగా జరిగి నిఫ్టీ  5648 వరకు దిగజారడం జరిగినది కూడా. ప్రస్తుతం నిఫ్టీ కి 20 sma వద్ద సపోర్ట్ కలదు. అదే విధంగా  5620, 5600 వద్ద కూడా సపోర్ట్ కలదు.రెసిస్టన్స్ 5684, 5700 వద్ద కలదు. 5684 దాటి నిలదోక్కుకున్నట్టు ఐతే లాంగ్ పోజిశాన్స్ తీసుకోవచ్చు. లేదంటే ప్రతి పెరుగుదలలో సెల్ చేయడం మంచిది. 


 రోజు స్టాక్ మార్కెట్ 09-10-2012
నిన్న నిఫ్టీ  5676  వద్ద క్లోజ్ కావడం జరిగినది. అంటే గత వారం  ఏర్పాటు చేసిన  గ్యాప్ 5650-5683  ఏరియాలో ప్రవేశించడం జరిగినది.ఈ రోజు ఆ గ్యాప్ పూర్తీగా నింపబడటం పూర్తీ కావచ్చు. అంటే నిఫ్టీ 5650 వరకు సులభంగా వస్తుంది.ప్రస్తుతం రెసిస్టన్స్ 5700, 5715 వద్ద  సపోర్ట్  5650,5638 వద్ద కలవు . 5700 పైన నిఫ్టీ నిలదోక్కుకోనంతవరకు  పై లెవల్లో  సెల్లింగ్ చేయడం మంచిది. 5700 పైన  నిలదోక్కుకుంటే మాత్రం  లాంగ్ పోజిషన్స్ తీసుకోవచ్చు.


ఈవారం స్టాక్ మార్కెట్ 01-10-2012to05-10-2012 గత వారం నిఫ్టీ 52 వారాల గరిష్ట స్థాయి  5735  నమోదు కావడం జరిగినది.ఇక ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మంగళవారం గాంధీ జయంతీ రోజున సెలవు కావడం , ఈ వారం మొత్తం చైనా మార్కెట్స్ కి నేషనల్ డే సెలవులు  ఉండటం ,హాంకాంగ్ మార్కెట్ కి కూడా రెండు రోజులు సెలవులు ఉండటం వలన మన మార్కెట్ కూడా కాస్తంత బోర్ గా ఉండే అవకాశం మాత్రం కలదు.గతవారం నిఫ్టీ కాన్సాలిడేషన్  జరిగి నిఫ్టీ ఫిబోనస్సీ గోల్డెన్  రేషియో 61.8% ఐనటువంటి 5648 వద్ద మరియు  5638 వద్ద డబల్ బాటం పాటర్న్ ఏర్పాటు జరిగి అక్కడ సపోర్ట్ తీసుకొని నిఫ్టీ 5735 వరకు వెళ్లి april 2011తర్వాత మొదటిసారిగా 5700 పైన క్లోజ్ కావడం జరిగినది.కాని రెసిస్టన్స్ ఐనటువంటి 5740  మాత్రం దాటలేకపోయినది.నిఫ్టీ డెయిలీ చార్ట్ లో షూటింగ్ స్టార్ లాంటి పాటర్న్, వీక్లీ చార్ట్ లో దోజి పాటర్న్ ఏర్పాటు కావడం జరిగాయి. రెండు కూడా బెరిష్ పాటర్న్స్ . కాని కన్ఫర్మేషన్ మాత్రం తప్పనిసరి. 5740 పైన నిఫ్టీ నిలదోక్కుకున్నట్టు ఐతే మాత్రం నిఫ్టీ వీక్లీ చార్ట్ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ 5850 , తర్వత 5940    వరకు ర్యాలీ జరగవచ్చు.గత నెల లో వచ్చిన ర్యాలీ తర్వాత ఈ నెలలో ఎక్కువ ర్యాలీ జరగకపోవచ్చు. ఈ నేలాలో నిఫ్టీ 5500-5850 మధ్యలో చలించడానికి అవకాశం ఉంది.  ప్రస్తుతానికి నిఫ్టీకి మద్దతు 5635, 5580 5535  వద్ద కలదు.  నిఫ్టీ గురుంచి డెయిలీ అప్ డేట్ చేయండి అని చాలా మంది అడుగుతున్నారు.ఈ పోస్ట్ లో నిఫ్టీ ఈ వారం గురుంచి వివరించడం జరిగినది.ఈ పోస్ట్ లో వివరించిన  వ్యూ ఈ వారం గురుంచి. ఒకవేళ ఏవైనా మార్పులు , చేర్పులు ఉంటే తప్పకుండా అప్ డేట్ చేయగలం. ఈ బ్లాగ్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వారందరికి తెలుసు . నిఫ్టీ గురుంచి ఎంత ఖచ్చితంగా తెలియచేయడం జరుగుతున్నదో.


ఈ రోజు స్టాక్ మార్కెట్ 28-09-2012
సెప్టెంబర్ సీరీస్ కాంట్రాక్ట్ ముగియడం జరిగినది. ఈ వారంలో నిఫ్టీ అటు ఇంతకు ముందు ఏర్పాటు చేసినటువంటి హై 5720 ను కాని, క్రింది వైపు మీకు ఇదివరకే తెలియచేసిన సపోర్ట్ 5648క్రింద ముగియడం కాని జరగలేదు.కాకపోతే  5640 వద్ద డబల్ బాటం పాటర్న్ ఏర్పాటు కావడం జరిగినది.ఇది బుల్లిష్ పాటర్న్ .నిఫ్టీకి తక్షణ మద్దతు 5640, 5618  వద్ద కలదు. నిఫ్టీ 5600  కంటే క్రిందికి క్లోసింగ్ కానంత వరకు  లాంగ్ పొజిషన్స్ కి  ఎలాంటి  ఇబ్బంది లేదు. రెసిస్టన్స్   5680, 5700, 5720  వద్ద కలదు


 స్టాక్ మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్
RAJIV GANDHI EQUITY SAVINGS SCHEME (RGESS)

కేంద్ర ఆర్ధిక మంత్రి  కొత్త గా ఆదాయపు  పన్ను పథకాన్ని 21 sep 2012నాడు ఆమోదించడం జరిగినది. ఆ పథకం పేరే  రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్. ఈ పథకం ప్రకారం కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు ఆదాయపు పన్నుమినహాయింపు  పొందడానికి ఉపయోగపడుతుంది. వార్షిక ఆదాయం పది లక్షల లోపు ఉండి, తొలిసారిగా స్టాక్ మార్కెట్ లో యాభై వేలు ఇన్వెస్ట్ చేస్తారో  వారూ ఈ పథకం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దేశీయ స్టాక్ మార్కెట్ లో కి ఇన్వెస్టర్లను ఇన్వెస్ట్ చేయడానికి ప్రోత్సహించడం  , దేశంలో  ఈక్విటీ సంస్కృతి' పెరిగేలా చూడటం.ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్షణాలను ఒక్క సారి పరిశీలిద్దాం.

ఈ పథకం కొత్తగా మార్కెట్ లో కి ప్రవేశించే వారి కోసం ఉద్దేశించిన పథకం.వారిని వారి పాన్ నంబర్ ఆధారంగా గుర్తిస్తారు.ఎవరైనా ఇప్పటికే డిమ్యాట్ ఖాతా ప్రారంభించి ఎలాంటి లావాదేవీలు జరపకపోతే వారూ కూడా ఈ పథకం క్రింద ఇన్వెస్ట్ చేయవచ్చు.
పన్ను పరిధిలోకి వచ్చే వార్షిక ఆదాయం పది లక్షల కంటే తక్కువగా ఉంటుందో వారూ ఈ పథకం ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి అర్హులు.

ఈ పథకం క్రింద గరిష్టంగా రూ 50,000 పెట్టుబడి పెట్టడానికి అవకాశం కలదు. ఇన్వెస్ట్ చేసిన మొత్తం లో    50% అమౌంట్ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి మినహాయింపు పొందుతారు.

ఈ పథకం క్రింద ఇన్వెస్ట్ చేయడానికి  BSE 100,  CNX100 లో ఉన్న కంపెనీలలో  , ప్రభుత్వ రంగసంస్థలలో   నవరత్న , మహానవరత్న, మినీ నవరత్న హోదా కలిగిన కంపెనీలు , పైన  పేర్కొనబడిన కంపెనీలలో ఫాలో అన్ పబ్లిక్ ఇష్యూ (   FPOs)లలో ,ప్రభుత్వరంగ కంపెనీలు  IPOకి వచ్చినప్పుడు ఆ ఆర్ధిక సంవత్సరం కంటే ముందు మూడు సంవత్సరాలు వరుసగా   4,000  కోట్ల కంటే అధిక టర్నోవర్ కలిగి ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేయవచ్చు.అంటే ఏ కంపెనీలలో పడితే ఆ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం వలన ఈ పథకం యొక్క లాభాలు కలగవు.

వివిధ వర్గాల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు   Exchange Traded Funds (ETFs) , Mutual Funds (MFs) ఈ పథకం క్రింద పేర్కొనబడిన కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయో వాటిని కూడా ఈ పథకం క్రింద పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

చిన్న ఇన్వెస్టర్లకు , ప్రయోజనం కల్పించడానికి ఈ పథకంలో వాయిదా పద్దతిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం కలిపించడం జరిగినది.పన్ను ప్రయోజనాలు పొండుతున్న ఆర్ధిక సంవత్సరం లోనే ఇన్వెస్ట్ చేయాలి.

ఈ పథకం యొక్క లాక్ ఇన్ పిరియడ్ మూడు సంవత్సరములు. మీరు చివరిసారిగా ఇన్వెస్ట్ చేసిన తేది నుండి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది..  

ఇన్వెస్ట్ చేసిన సంవత్సరం తరవాత  ఇన్వెస్ట్ చేసిన షేర్లలో ట్రేడింగ్ చేయడానికి అవకాశం కల్పించబడుతుంది.

మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఈ పథకంలో గల ఒక కంపెనీ  షేర్లు అమ్మినట్టు ఐతే మీరు అంతే విలువగల ఈ పథకంలో అనుమతి ఇవ్వబడిన మరో కంపెనీ షేర్లు కొనవలసి ఉంటుంది.

ఈ పథకం క్రింద ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి   ఆదాయపు పన్ను సెక్షన్ 80CCG ను చేర్చడం జరిగినది.

కేంద్ర రెవిన్యూ డిపార్ట్ మెంట్ మరియు సెబీ రాబోవు రెండు వారాలలో  పూర్తీ వివరాలతో కూడిన సర్క్యులర్  ఇవ్వగలవు

స్టాక్ మార్కెట్ లో బుల్ రన్ ప్రారంభమైనట్టేనా ?
బుల్ మార్కెటులో సాదారణంగా ప్రతి గుడ్ న్యూస్ మార్కెట్ పెరగడానికి తోడ్పాటు అందిస్తే  , ప్రతి బ్యాడ్ న్యూస్ మార్కెట్ లో చిన్న చిన్న కరేక్షన్స్ రావడానికి సహాయపడతాయి. మమతాబెనర్జీ  UPA ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినప్పుడు నిఫ్టీ లో 50  పాయింట్ల కరెక్షన్ వస్తే , ఎప్పుడయితే మూలాయం సింగ్ యాదవ్   UPA ప్రభుత్వానికి మద్దతు తెలియచేయడంతో  నిఫ్టీ 2012 లోనే అత్యధిక పాయింట్ల ర్యాలీ చేయడం జరిగినది. కేవలం పన్నెండు రోజుల ట్రేడింగ్ సెషన్స్ లో 502 పాయింట్ల ర్యాలీ నిఫ్టీ లో జరిగినది.  అంతే కాకుండా మార్కెట్ 14 నెలల గరిష్ట  స్థాయిల వద్ద ఉంది. దీనికి ముఖ్య కారణం UPA ప్రభుత్వం సంస్కరణల బాట పట్టడంతో మార్కట్ సానుకూలంగా స్పందిస్తుంది. అంత మాత్రాన దేశ ఆర్ధిక వ్యవస్థ బాగున్నట్టు కాదు. ఇంకా ఇన్ఫ్లేషన్ అధిక స్థాయిల వద్దనే ఉంది. యూరోప్ మరియు అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఇంకా ప్రశ్నార్థకంగానే  ఉంది. అక్కడి నుండి వచ్చే ఎలాంటి నెగిటివ్ న్యూస్ అయిన మార్కెట్ పై తప్పకుండా ప్రభావం చూపెడతాయి. నిఫ్టీ ప్రస్తుత ర్యాలీ మరియు వీక్లీ క్లోజ్ ను బట్టి చూస్తే ర్యాలీ మరింత కొనసాగి బుల్ రన్ లో ప్రవేశించవచ్చు. ఒకవేళ బుల్ రన్ నిర్ధారణ జరిగినట్టు ఐతే  తెలియచేస్తాం. ఎవరైనా సరే మార్కెట్ లో ఎప్పుడూ కూడా మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా వెళ్ళాలి. అంతే కాని ట్రెండ్ కి వ్యతిరేక దిశలో వెళ్తే మీ కాపిటల్ మొత్తం నష్టపోతారు. అప్పుడు మీరు ఏమి చేయలేరు.గత పక్షం రోజుల  నుండి ఎవ్వరయితే  ట్రెండ్ కి వ్యతిరేకంగా వెళ్ళారో వారూ అధికంగా నష్టపోవడం జరిగినది. మేము  మాత్రం ఖచ్చితమైన  అనాలసిస్ తో మార్కెట్ ర్యాలీ అంచనా వేయడం జరిగినది. మీకు ఏ విధమైన అనుమానాలు ఉన్న పాత పోస్టులు ఒక్కసారి చదవండి.  
 మీకు గత వారం నుండి తెలియచేయడం జరిగినది. నిఫ్టీ 5648 పైన నిలదోక్కుకున్నట్టు ఐతే ర్యాలీ వస్తుంది అని తెలియచేయడం జరిగినది.అనుకున్నట్టుగానే  5648 పైన నిఫ్టీ  నిమిషాల వ్యవధి లోనే 5720 వరకు చేరుకోవడం జరిగినది.ఇక ఈ వారానికి వస్తే  ఇక్కడి నుండి కనీసం ఇంకా  నిఫ్టీ 150-200 పాయింట్ల వరకు ర్యాలీ జరగడానికి అవకాశం కలదు.  నిఫ్టీ  5700, 5648 పైన  ఉన్నంత వరకు  లాంగ్ పొజిషన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. నిఫ్టీ కి రెసిస్టన్స్  5750, 5810, 5850, 5958   , సపోర్ట్ 5648 , 5580 , వద్ద కలదు. ఈ వారంలో డేరివేటివ్స్ ఎక్స్ ఫైరీ ఉన్నందున జాగ్రత్త వహించడం  మంచిది.  స్టాక్ మార్కెట్ లో మీరు సక్సెస్ కావాలి అంటే స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో అవగాహన తప్పనిసరి. ఈ మధ్య చాలా మంది ప్రతి రోజు మార్కెట్ అప్ డేట్స్ ఇవవంది. ఫ్రీ టిప్స్ ఇవ్వండి అని అడగడం జరుగుతుంది.   మేము ప్రతి  సోమవారం  తెలియచేసే నిఫ్టీ అనాలసిస్ ఆ వారానికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా మార్పులు , చేర్పులు ఉంటే తప్పకుండా తెలియచేస్తాం. ఇక ఫ్రీ టిప్స్ అడిగేవారికి మాది ఒక్కటే మనవి. మా ప్రయత్నం అంత టిప్స్ కోసం మీరు ఇతరుల పై  ఆధారపడకుండా స్వయంగా మార్కెట్ పై  పూర్తీ అవగాహాన పెంచుకొని మీ కాళ్ళపై మీరు మార్కెట్ లో నిలబడాలి అని. మీము ప్రీ టిప్స్ కి పూర్తీ గా వ్యతిరేకం . మీరు మార్కెట్ గురుంచి నేర్చుకొనే సమయంలో ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నిసందేహంగా తీరుస్తాం.  అంతే కాని మా వద్ద నుండి ఫ్రీ టిప్స్ మాత్రం  ఆశించకండి. ఈ బ్లాగ్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మార్కెట్ పై మా విశ్లేషణ , నిఫ్టీ అనాలసిస్ ఇంత వరకు తప్పలేదు అనే విషయం మీరు రెగ్యులర్ గా మా బ్లాగ్ చదివితే మీకే  ఈ పాటికి అర్ధం అయ్యి ఉంటుంది.
ముఖ్య గమనిక :మీరు  స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.

షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు అందరూ చూసే వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్  అనగా ఏమి ?
వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్  అనగా ఒక ఆర్ధిక సంవత్సరంలో  ఏదేని కంపెనీ  లేదా వ్యాపారం యొక్క  ఆదాయం, ఖర్చులు, ఆ  ఆర్ధిక సంవత్సరంలో  జరిగిన కొత్త ఒప్పందాలు , చేరుకున్న మైలు రాళ్ళు ,మేనేజ్మెంట్ లో మార్పులు చేర్పులు, ముఖ్యమైన సిబ్బంది మార్పులు చేర్పులు, భవిష్యత్తు ప్రణాళికలు  మొదలగునవి పొందుపర్చినటువంటి  నివేదిక . ఈ నివేదికను మేనేజ్మెంట్  రూపొందించి దానిని  షేర్  హోల్డర్స్, అంటే వాటా దారులకు, ప్రమోటర్లకు , వివిధ ప్రభుత్వ  విభాగాలకు , సెబీ కి,  అందచేస్తుంది.సాదారణ ప్రజానీకానికి మరియు  ఆ కంపెనీ లేదా వ్యాపారం పై ఆసక్తి ఉన్న వారందరికి అందుబాటులో ఉంటుంది. సాదారణంగా వార్షిక  నివేదిక ను   పుస్తక రూపంలో రూపొందిస్తారు. దానిలో చైర్మన్ సందేశం మొదలుకొని  భవిష్యత్తు  ప్రణాళికలు  ఉంటాయి.

సాధారణంగా వార్షిక నివేదిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నుండి వాటాదారులకు ఒక లేఖ అన్నమాట. దీనిలో  అందరూ  బోర్డు సభ్యులు, ఆడిటర్లు, సెక్రటరీ  మొదలగు వారీ  యొక్క ఫోన్  నంబర్లు ఒక జాబితా రూపంలో ఉంటాయి.తదుపరి పేజీలలో  బ్యాలెన్స్ షీట్ వంటి వివరణాత్మక ఆర్థిక నివేదికలు, ఆదాయ ప్రకటన, సహాయక షెడ్యూళ్లు సంస్థ కార్యకలాపాల మీద ఒక సాధారణ నివేదిక, ఒక స్వతంత్ర ఆడిటర్ యొక్క నివేదిక మొదలగునవి పొందుపరుస్తారు. అంతే కాకుండా కంపెనీ లో వివిధ వర్గాల వాటా ఏ విధంగా ఉంది మొదలగు వివరాలు ఉంటాయి. అంటే కంపెనీలో ఎవరేవ్వరికి ఎంత భాగస్వామ్య వాటా ఉంది అనే వివరాలు. కంపెనీ యొక్క షేరు ధర చరిత్ర మొత్తం అంటే షేరు యొక్క గరిష్ట , కనిష్ట ధరల వివరాలు ఉంటాయి. సంస్థ సాధించిన అన్ని మైలురాళ్ళు మరియు విజయాలు వివరిస్తూ చిత్రాలు మరియు గ్రాఫ్లు మొదలగునవి కూడా ఉంటాయి.
సాధారణంగా ఒక వార్షిక నివేదికలో  వ్యాపార అనుకూల అంశాలు ద్విగుణీకృతం చేస్తూ అంటే గొప్పగా చెప్తూ , ప్రతికూల అంశాలపై   తక్కువ శ్రద్ధ చూపెడతాయి.కాబట్టి,  మీరు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వార్షిక  నివేదికను చదవ వలసి ఉంటుంది. చైర్మన్ తన సందేశంలో పరోక్షంగా లక్ష్యాలు సాధించలేనందుకు  క్షమాపణలు కూడా చెప్పి ఉండవచ్చు. మీరు  గతంలో చెప్పిన భవిష్యత్ ప్రణాళికలు సాధించారా లేదా అని తెలుసుకోవడానికి గత ఆర్ధిక సంవత్సర వార్షిక నివేదికతో పోల్చి చూస్తే లక్ష్యాలు చేరుకున్నది లేనిది సులభంగా తెలిసిపోతుంది.  పూర్తిగా ఒక వార్షిక నివేదికను  చదివి అర్థం చేసుకోవాలి అంటే కొంత  నైపుణ్యం మరియు సహనం అవసరం అవుతుంది. మీరు  ఒక కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఆ వార్షిక నివేదిక ద్వారా ఆ సంస్థ యొక్క కార్యకలాపాలను మరింత  లోతుగా అర్ధం చేసుకోవడానికి సహాయ పడుతుంది.మీరు వార్షిక నివేదిక ద్వారా  క్రింది విషయాలపై ఒక అవగాహన కు రాగలుగుతారు.
Letter from the CEO
Summary of the operations-milestones, achievements, prospects.
Past Annual summary of all financial figures.
Management discussion and analysis of the performance of the company
The balance sheet
The income statement
Auditor’s report
Subsidiaries, brands, addresses, registered office, head quarters etc..
Names of directors
Stock price history
తదుపరి ఆర్టికల్ లో   వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్  ఏ విధంగా చదవాలో తెలుసుకుందాం.


ఈ రోజు స్టాక్ మార్కెట్ 20-09-2012
మమత బెనర్జీ UPA  ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో కేంద్ర ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడం జరిగినది. ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ , మాయావతి నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ములాయం సింగ్ యాదవ్  ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా , వద్దా అనే తన నిర్ణయాన్ని ఈ రోజు వెలువరించానున్నారు.ఈ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ప్రారంభం అవుతుంది.నేను ఇదివరకే మీకు తెలియచేసినట్టుగా కొత్తగా ఏర్పాటు కాబడిన స్వింగ్ హై 5652 పైన నిఫ్టీ నిలదొక్కుకున్నట్టు ఐతేనే  మార్కెట్ లో  మరింత ర్యాలీ రావడానికి అవకాశం కలదు. మంగళవారం మొత్తం నిఫ్టీ 5586-5621 మధ్యనే కదలాడటం జరిగినది.ప్రస్తుతం నిఫ్టీ కి తక్షణ మద్దతు  5554, 5528,5465  వద్ద కలదు .ఒకవేళ  గ్యాప్ డౌన్ లో నిఫ్టీ   5554 క్రింద నిలదోక్కుకున్నట్టు 5528,5465  వరకు పతనం  కావడానికి అవకాశం కలదు. లాంగ్ పొజిషన్స్ కి మాత్రం 5466  బ్రేక్ కానంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. 


ఈ రోజు స్టాక్ మార్కెట్ 18-09-2012

మీకు నిన్నటి పోస్టులో నిఫ్టీ తక్షణ ర్యాలీ 5648 వరకు వెళ్ళగలదు . 5648 పైన నిఫ్టీ నిలదోక్కుకున్నట్టు ఐతే మరింత పైకి వెళ్ళగలదు అని తెలియచేయడం జరిగినది.నిఫ్టీ 5652 హై ఏర్పాటు ఐనది కాని రెసిస్టన్స్ ఐనటువంటి 5648 పైన నిలదోక్కుకోలేకపోయినది. ప్రస్తుతం నిఫ్టీ 5500-5650 మధ్య చలించడానికి అధిక అవకాశం కలదు. నిఫ్టీ 5648 పైన నిలదోక్కుకుంటేనే మరింత ర్యాలీ జరగడానికి అవకాశం కలదు. ఒక వేళ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్  వచ్చినా  పై చార్ట్ లో చూపించిన ట్రెండ్ లైన్ లేదా 5440 వరకు రావడానికి అవకాశం కలదు. నిఫ్టీ 5440 పైన ఉన్నంత వరకు లాంగ్ పొజిషన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు.  సపోర్ట్ 5585, 5550 రెసిస్టన్స్  5648 .ఖచ్చితమైన  మార్కెట్ అనాలసిస్ కొరకు ఈ బ్లాగ్  రెగ్యులర్ గా ఫాలో అవండి.


స్టాక్ మార్కెట్ ఇంకా ఎంత వరకు పరిగెత్తగలదు.
ఈవారం స్టాక్ మార్కెట్17-09-2012to21-09-2012 

గత వారం ఫెడరల్  బ్యాంక్ , ఈసిబి  మీటింగ్ , జర్మనీ కోర్టు తీర్పు మరియు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు తెరదీస్తూ  డీజిల్   ధరలు పెంచడం మొదలగు కారణాల వలన మార్కెట్ లో ర్యాలీ రావడం జరిగినది.అదే విధంగా శుక్రవారం సాయంత్రం  విదేశీ నిధులను రిటైల్ రంగంలోకి అనువదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం  వలన మార్కెట్ ఈ రోజు కూడా గ్యాప్ అప్ లోనే ప్రారంభం జరుగును.  అదే విధంగా  ఈ రోజు రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న ర్యాలీకి మరింత సానుకూల  అవకాశం దొరికినట్టు అవుతుంది.ఒకవేళ రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో కనుక ప్రతికూల నిర్ణయం తీసుకుంటే మాత్రం పై లెవల్లో లాభాల స్వీకరణకు అవకాశం కలదు. సానుకూల నిర్ణయం వేలువడటానికే  అధిక అవకాశం మాత్రం కలదు.  మీరు కనుక  రెగ్యులర్ గా ఈ బ్లాగ్ ఫాలో అవుతున్నట్టు ఐతే మీకు ఇదివరకే చాలా సార్లు చార్ట్స్ ద్వారా తెలియచేయడం  జరిగినది. నిఫ్టీ 5190-5200  కంటే క్రిందికి దిగాజారనంత వరకు మీ లాంగ్ పోజిషన్  కు ఎలాంటి ఇబ్బంది లేదు , 5190-5200  స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్స్ కొనసాగించవచ్చు  అని తెలియచేయడం జరిగినది. అదే విధంగా నిఫ్టీ లాంగ్ సైడ్ టార్గెట్ 5520 అని కూడా మీకు తెలియచేయడం జరిగినది. ఇంకా వివరాల కోసం గత పోస్టులను చదవవచ్చు.  అదే విధంగా ఇప్పుడు మార్కెట్ కి అనుకూలమైన వార్తలు వెలువడుతున్నందున  మార్కెట్ ఇంకా ఎంత వరకు పరిగెత్తగలదు అని చాలా మంది అడుగుతున్నారు. మీకు మార్కెట్ లో నిఫ్టీ  తక్షణ ర్యాలీ  5648 వరకు చేరుకోగలదు.ఇది ఫిబోనస్సీ గోల్డెన్ రేషియో . ఒకవేళ  నిఫ్టీ  5648 పైన నిలదోక్కుకున్నట్టు ఐతే  ర్యాలీ 5850 ,5910, 5950 వరకు కూడా కొనసాగగలదు.. నిఫ్టీ 5435 పైన ఉన్నంత వరకు ఈ ర్యాలీ కొనసాగడానికి అధిక అవకాశం కలదు. ఏది ఎమైనప్పటికి నిఫ్టీ ఇంకా కనీసం రెండు వందల పాయింట్లు ర్యాలీ జరపడానికి అవకాశం మాత్రం కలదు. అయినప్పటికీ మీ లాంగ్ పొజిషన్స్ కి  5435 స్టాప్ లాస్ ఉపయోగించండి.  ఒకవేళ ఏమైన మార్పులు చేర్పులు ఉంటే మీకు వెంటవెంటనే తెలియచేయడం జరుగుతుంది.
ముఖ్య గమనిక :మీరు  స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  

ఈ రోజు స్టాక్ మార్కెట్ 13-09-2012

ఈవారం ప్రారంభంలోనే మీకు తెలియచేయడం జరిగినది.నిఫ్టీ 5330 కంటే క్రిందకు దిగనంత వరకు లాంగ్ పోజిషన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలియచేయడం జరిగినది. అదే విధంగా నిఫ్టీ కూడా 5330 సపోర్ట్ తెసుకొనే పెరగడం జరిగినది. ఇప్పుడు  నిఫ్టీ  5450 కంటే పైన నిలదోక్కుకున్నట్టు ఐతే మరింత ర్యాలీ జరుగగలదు.సపోర్ట్ 5390, 5355  రెసిస్టన్స్ 5480,5500 వద్ద కలదు.ఈక్వీటీ మరియు డేట్ కి మధ్యగల తేడా ఏమిటి ? 
ఆర్ధిక అక్షరాస్యత సాదించే సమయంలో ఎదుర్కొనే చాలా  బేసిక్ ప్రశ్న ఇది. చాలా మంది షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాని వారికి కూడా చాలా మందికి అతి బేసిక్ ప్రశ్న ఈక్విటీ అంటే ఏమిటి ? డేట్ లేదా ఋణ పత్రం అంటే ఏమిటో తెలియదు.ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఈక్వీటీ మరియు డేట్ అంటే ఏమిటి? వాటి మధ్య గల తేడా ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.
ఈక్వీటీ అనగా షేర్లు లేదా వాటా అని అర్ధం అంటే మీరు ఒక కంపెనీలో ఈక్వీటీ తీసుకుంటున్నారు అంటే మీ ఈక్వీటీ విలువకి అనుగుణంగా మీరు ఆ కంపెనీలో యాజమాన్యుపు హక్కును పొందుతారు. మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు అనుకోండి. దానిని వంద సమానభాగాలు లేదా ముక్కలుగా  చేసి మీ వద్ద 51% భాగాలు లేదా ముక్కలు ఉంచుకొని మిగితా భాగాలు లేదా ముక్కలు ఇతరులకు ఇచ్చేసారు అనుకోండి. ఈ ముక్కలు లేదా భాగాలనే ఈక్వీటీ , షేర్లు లేదా వాటాలు అంటారు.ఈ విధంగా వాటాలు తీసుకున్న వారందరూ మీ కంపెనీలో మీతో పాటు వారి వాటా విలువకి అనుగుణంగా యాజమాన్యుపు హక్కును పొందుతారు.మీరు ఈక్వీటీ లేదా షేర్ గురుంచి మరింత  వివరంగా తెలుసుకోవాడానికి  షేర్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ? అని నేను ఇది వరకు వ్రాసిన ఆర్టికల్ క్రింది లింక్ ద్వారా చదవండి.పూర్తీగా అర్ధం అవుతుంది.
ఇప్పుడు డేట్ అంటే ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. డేట్ అనగా ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ బ్యాంక్స్ , ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూట్స్  లేదా పబ్లిక్ నుండి అప్పు తీసుకోవడం ,ఈ విధంగా తీసుకున్న అప్పుకి   డేట్ సర్టిఫికేట్ లేదా ఋణ పత్రం ఇస్తాయి. మీరు  కంపెనీకి ఇచ్చే అప్పులనే డేట్ పేపర్స్ అంటారు. మీరు సాదారణంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వాటా తీసుకొంటే మీరు కంపెనీలో భాగస్వాములు అవుతారు. ఇది మీరు ఈక్వీటీలు కనుగోలు చేయడం ద్వారా సాధ్యం అవుతుంది.అదే మీరు డేట్ పేపర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు కేవలం కంపెనీ కి అప్పు ఇచ్చినట్టు. మీరు ఇచ్చిన అప్పుకి కంపెనీ నిర్ణీత రేటు ప్రకారం వడ్డీ ఇస్తుంది.ఎందుకంటె కంపెనీ తన అవసరాలకు అనుగుణంగా మీ వద్ద డేట్ పేపర్ రూపంలో అప్పు తీసుకున్నది కావున.కొన్ని సమయాలలో ప్రభుత్వాలు కూడా ప్రజల వద్ద నుండి అప్పు సేకరిస్తుంటాయి.వాటినే మనం సాధారణంగా బాండ్స్ అని పిలుస్తుంటాం..ఈ డేట్ పేపర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు బ్యాంక్స్ అందించే వడ్డీ కంటే అధిక వడ్డీ పొందవచ్చు.మరియు పూర్తీ సురక్షితం.


ఈవారం స్టాక్ మార్కెట్10-09-2012to14-09-2012
గత వారం ఆరో తేదిన సమావేశమైన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాండ్ల  కనుగోలుకు సంభందించి కీలక నిర్ణయం తీసుకోవడం మరియు క్రింది లెవల్లో నిఫ్టీ కి మదతు రావడంతో  కనుగోల్లు జరిగి  నిఫ్టీ కీలక  రెసిస్టన్స్ 5348  మరియు 20 sma 5330 పైననే ముగియడం జరిగినది.అంతే కాకుండా కీలకమైన 20 sma 5330 పైన శుక్రవారం రోజు ముగిస్తే  మార్కెట్ లో ర్యాలీ మరింత కొనసాగడానికి అవకాశం కలదు అనే విషయం మీకు తెలియచేడం జరిగినది.ఇక ఈ వారానికి వస్తే మార్కెట్ ను ప్రభావిత చేసే అంశాలు పన్నెండో తేదీ  బుధవారం నాడు వెలువడనున్న IIP డేటా , తదుపరి ద్రవ్యోల్భణం మొదలగునవి మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి. అదే విధంగా  వచ్చే సోమవారం జరుగనున్న  రిజర్వు బ్యాంక్  సమావేశం కూడా కీలకమే.  నిఫ్టీ టెక్నికల్ అనాలసిస్ విషయానికి  వస్తే  పై చార్ట్ లో మార్క్ చేసిన పాయింట్ల వద్ద ట్రెండ్ లైన్ సపోర్ట్ పొందిన ప్రతిసారి మంచి ర్యాలీ రావడం జరిగినది. ఈ సారి కూడా నిఫ్టీ ట్రెండ్ లైన్ వద్ద సపోర్ట్ తీసుకోవడం జరిగినది. గత చరిత్ర ప్రకారం చూస్తే  నిఫ్టీ లో ర్యాలీ ఈ సారీ కనీసం 5520 వరకు జరుగగలదు అని అంచనా వేయడం జరుగుతుంది.అంటే ఇది ఒక్కరోజు లో జరిగే పని కాదు. ఈ  నెల చివరి వరకు  చేరుకోవచ్చు. అదే అదే విధంగా లాంగ్ టర్మ్  ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ 5331 పైన నిఫ్టీ ట్రేడ్ జరుగుతున్నంత వరకు బుల్ల్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు.


అదే విధంగా పై చార్ట్ గమనిస్తీ నిఫ్టీ కీలకమైన 5190-5200 సపోర్ట్ పైననే ముగియడం జరిగినది. ఇది 50%  ఫిబోనసీ రేషియో . అదే విధంగా మార్కెట్ లో ర్యాలీ జరగాలి అంటే ఎప్పుడూ కూడా నిఫ్టీ 50%  ఫిబోనసీ రేషియో పైననే  ఉండటం జరగాలి. అందుకోసమే మీకు గత వారం 5190-5200 కంటే నిఫ్టీ కిందకు దిగాజారనంత వరకు లాంగ్ పోజిశాన్స్ తీసుకోవడానికి ఎలాంటి భయం అవసరం లేదు, క్రింది లెవల్లో కనుగోలు చేయండి అని  తెలియచేయడం  జరిగినది.ఈ వారం ప్రతి డిప్ లో బై చేయడం మంచిది. ఈ వారం రెసిస్టన్స్  5400, 5450, 5520 సపోర్ట్  5330, 5300.  నిఫ్టీ లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అప్ డేట్ చేయగలం.    
ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html

ఈ రోజు స్టాక్ మార్కెట్ 24-8-2012
నిన్న చెప్పుకున్నట్టుగా నిఫ్టీ రెసిస్టన్స్ ఐనటువంటి 5445 కంటే రెండు పాయిట్లు పైకి వెళ్లి క్రిందకు దిగజారడం గమనించవచ్చు. మొన్న , మరియు నిన్న ఏర్పాటు ఐనటువంటి లో ప్రైస్  5395 వద్ద సపోర్ట్ ఏర్పాటు కావడం జరిగినది . అదే విధంగా ఒకవేళ నిఫ్టీ కనుక ఈ రోజు కూడా రెడ్ లో క్లోజ్ కావడం లేదా  5400 కంటే దిగువన క్లోజ్ కాబడితే ఈ అప్ ట్రెండ్ పై అనుమానం కలగడమే కాకుండా వీక్లీ చార్ట్ లో ఇన్వర్తేడ్ క్యాండిల్ స్టిక్ పాటర్న్ ఏర్పాటు అయ్యే అవకాశం కలదు ఇది బెరిష్ పాటర్న్ .. ప్రస్తుతం నిఫ్టీ కి రెసిస్టన్స్ 5445, 5470 వద్ద సపోర్ట్  5395, 5365 వద్ద కలదు.నిఫ్టీ 5365 క్రింద క్లోజ్ కానతంత వరకు డిప్ లో బై చేయడం మంచిది. 

ఈ రోజు స్టాక్ మార్కెట్  23-08-2012

నిఫ్టీ  5400పై ట్రేడ్ ట్రేడ్ కావడమే కాకుండా క్లోసింగ్ కావడం కూడా జరిగినది.  ఇంత కు ముందు  100 wsma వద్ద నిఫ్టీ బలమైన నిరోధాన్ని ఎదుర్కొని  అక్కడి నుండి క్రిందికి దిగజారుతుంది. కాని ఈ సారి 100 wsma బ్రేక్ జరిగి పైన ట్రేడ్ కావడం జరుగుతుంది. ఈ వారం  క్లోసింగ్  కనుక 100 wsma   పై జరిగితేనే అప్ ట్రెండ్ మరింత కొనసాగాడానికి అవకాశం కలదు లేదంటే ఈ బ్రేక్ ఫాల్స్ బ్రేక్ గా మాత్రమే మిగిలిపోగలదు. ప్రస్తుతం నిఫ్టీ కి  5365 వద్ద సపోర్ట్ కలదు . ఈ లెవల్ కంటే నిఫ్టీ క్రిందకు దిగజారితే మరింత పతనం కావడానికి అవకాశం కలదు. రెసిస్టన్స్ 5445, 5468  వద్ద కలదు.


ఈ వారం స్టాక్ మార్కెట్ 21-08-2012


స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ట్రైనింగ్ గత వారం ట్రేడింగ్ చివరి రోజు వెలువడిన  కాగ్ రిపోర్ట్ వలన నిఫ్టీ పై లెవల్స్ లో నిలదోక్కుకోలేకపోయినది.ప్రభుత్వం పారదర్శకత లేకుండా 1.86 లక్ష కోట్ల విలువైన బోగ్గు గనులను ఇరవై ఐదు పెద్ద కంపెనీలకు కట్టబెట్టడం జరిగినది . వాటిలో  హిందాల్కో, రిలయన్స్ పవర్, టాటా పవర్, ఎస్సార్   పవర్, టాటా స్టీల్  , జిందాల్ స్టీల్ మొదలగు కంపెనీలు కలవు. ఇది వరకే ప్రభుత్వం 2 G టెలికాం ద్వారా చాలా అప్రతిష్ట మూటగట్టుకుంది. ఇప్పుడు ఈ బొగ్గుగనుల కుంభకోణం ద్వారా  ప్రభుత్వం తన విశ్వసనీయతను కోల్పోయింది. ఏది ఏమైనప్పటికీ కూడా నిఫ్టీకి 5400వద్ద తీవ్రమైన నిరోధం ఎదురవుతుంది. నిఫ్టీ 5400 వద్ద కేవలం వీక్లీ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ మాత్రమే కాకుండా గత సంవత్సరం అక్టోబర్ లో ఏర్పాటు కాబడిన స్వింగ్ హై కూడా.అంతే  కాకుండా రెసిస్టన్స్ లేవల్లో దోజి పాటర్న్ ఏర్పాటు కావడం వలన పై లెవల్లో జాగ్రత్త పడటం మంచిది . నిఫ్టీ 5400  పైన నిలదోక్కుకున్నట్టు ఐతే ఒకేసారి మార్కెట్లో  ర్యాలీ రాగలదు.ప్రస్తుతం నిఫ్టీకి తక్షణ మద్దతు 5340 మరియు  5290-5300 వద్ద కలదు. ప్రస్తుతానికి నిఫ్టీ ఒక రేంజ్ లో కదలాడటం జరుగుతుంది. అంటే పై లెవల్లో సెల్లింగ్ రావడం మరియు క్రింది లెవల్లో బయ్యింగ్ రావడం జరుగుతుంది. నిఫ్టీ కి  5300 వద్ద   61.8%  ఫిబోనస్సీ గోల్డెన్ రేషియో రూపంలో సపోర్ట్ కూడా కలదు. అదే విధంగా 5216-5260 వద్ద గ్యాప్ కూడా కలదు.ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం  నిఫ్టీ 5290-5300 మరియు  5400 మధ్య చలిస్తుంది.కావున ట్రేడింగ్ సమయంలో ఈ సపోర్ట్ మరియు రెసిస్టన్స్ గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయగలరు. ఏమైన మార్పులు ఉన్నచో  ఎప్పటికప్పుడు  అప్ డేట్ చేయగలను. 

ఈ రోజూ మార్కెట్ 17-08-2012
ఈ  రోజు కూడా నిఫ్టీ ఒక ధోరణిలోనే చలించవచ్చు. 5380-5390  వద్ద నిఫ్టీ తీవ్రమైన నిరోధకాన్ని ఎదుర్కొంటుంది . ఇలాంటి నిరోధం కొన్ని సమయాలలో గ్యాప్ అప్ ప్రారంభం ద్వారా దాటుతుంది. సపోర్ట్ 5340  మరియు 5320 వద్ద  ఉంది. ఈ రోజు నిఫ్టీ వీక్లీ క్లోసింగ్ 5320 పైన జరిగినచో  లాంగ్ పోజిషన్స్ కొనసాగించవచ్చు.బ్యాంక్ నిఫ్టీ లో ట్రాయంగిల్  పాటర్న్ ఏర్పాటు కావడం జరిగినది.పాతర్న్ బ్రేక్ అవుట్ యే డైరెక్షన్ లో జరిగితే మూమెంట్ అదే డైరెక్షన్ వైపు ఉండగలదు. కాని బ్యాంక్ నిఫ్టీ 50 sma  వద్ద సపోర్ట్ కూడా ఉంది.   50 smaమరియు ట్రయాంగిల్ లోయర్ ట్రెండ్ లైన్ బ్రేక్  జరిగితేనే బ్యాంక్ నిఫ్టీ ఇంకా  క్రింది కి  పడిపోగలదు. లేనిచే బ్యాంక్ నిఫ్టీ  లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు.  
ఈ వారం స్టాక్ మార్కెట్ .13-08-2012   
ఈ వారం నిఫ్టీ వీక్లీ చార్ట్ లో గత వారం ఎదురైన ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ 5378  బ్రేక్ చేసి నిలదోక్కుకున్నట్టు ఐతే  మార్కెట్ బుల్లిష్ ధోరణి లోకి ప్రవేశించే అవకాశం అత్యదికంగా కలదు. ప్రస్తుతం సపోర్ట్  5285   వద్ద ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ ఐనచో  గత వారం ఏర్పాటు జరిగిన గ్యాప్  పూర్తికావడం జరుగుతుంది. అంటే  5215   వద్ద మరల సపోర్ట్ ఉంటుంది.  అందువలన 5210  స్టాప్ లాస్ తో  డిప్స్   లో బై చేయడం  లేదా   5285  స్టాప్ లాస్ తో బై చేయడం మంచిది.  trend line resistens and 100 sma 5378-5385    వద్ద నిరోధం ఎదురవుతుంది. 
5285 స్టాప్ లాస్ తో బై చేసిన వారూ  వారి లాంగ్ పొజిషన్  రేపటికి కూడా కొనసాగించవచ్చు.  బుధవారం నిఫ్టీ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ ఐనటువంటి 5380 పైన క్లోజ్ కావడం జరిగినది.అదే విధంగా  100 wsma  కూడా దాని దరిదాపులోనే ఉండటం జరిగినది. నిఫ్టీ 5380 పైన నిలదోక్కుకున్నట్టు ఐతే టార్గెట్ 5450 వరకు కలదు.సపోర్ట్ 5335 వద్ద కలదు. అప్ ట్రెండ్ కొనసాగాడానికే  ఎక్కువ అవకాశం కలదు. కావున ప్రతి డిప్లో బై చేయడం మంచిది. స్టాక్ మార్కెట్ పరిచయం
రేపటి జీవనం ఎలాంటి ఒడిదోడుకులులేకుండా సాగాలంటే భవిష్యత్తు లో వచ్చే ఆదాయం కోసం  మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను  పెట్టుబడిగా పెట్టి మరింత సంపదను పొందడమే పెట్టుబడి . ఈ పెట్టుబడి అనునది మనం స్తిరాస్తి , బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం , అద్దె ఆదాయం , షేర్స్ ,మ్యూచువల్ ఫండ్స్,బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్ట్ ఆఫీసు ఫథకాలు, బంగారారం  మొదలగు వాటిలో పెడతాం .
మన పెట్టుబడి ఒక్క ముఖ్య ఉద్దేశం  సంపద సృష్టించడం , దానితో పిల్లల కళాశాల ఫీజులు. పెళ్ళిల్లు, సెలవులలో  సరదాగా  గడపడం, మంచి జీవన ప్రమాణానికి,రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరుగుటకు , మీ అనంతరం ఈ సంపద మీ తరాల వారికి  చేర్చటం.ఈ పెట్టుబడి వల్ల వచ్చే  రాబడి పెరుగుతున్న  ద్రవ్యోల్బణం  కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపదను కాపాడటం మరియు దానిని అభివృద్ధి చేయడం అనేది ఒక్క కళ.

స్టాకు మార్కెట్ లో పెట్టుబడి వల్ల మీరు మిగితా వాటిలో  పొందిన రాబడి కంటే అధిక రాబడి పొందగలరు.కాని దీనికి మీకు స్టాకు మార్కెట్ పై  పరిపూర్ణ జ్ఞానం, దీర్గాకాలిక  పెట్టుబడి వ్యూహం ,సరియైన స్టాకు ను ఎన్నుకోవడం మొదలగు వాటి మీద ఆధారపడి ఉంటుంది. మీరు పెట్టుబడి  అనునది మీ సంపాదన మొదలైన తొలినాళ్ల నుండే  క్రమ పద్దతిలో దీర్గాకాలిక  వ్యూహంతో  మొదలు పెట్టాలి.మీరు తొలినాళ్ళ నుండే మొదలు పెడితే అనుకోకుండా జరిగే ఎలాంటి రిస్కులను ఐనా తట్టుకోగలరు .అంతే కాకుండా ఒక్కవేళ  మీరు మీ రిటైర్మెంట్ నాటికి యాభై లక్షలు సంపాదించడం మీ లక్ష్యం ఐతే మీరు  మీ సంపాదన తొలినాళ్ల  నుండే  పెట్టుబడి మొదలు పెడితే  మీ లక్ష్యం  చేరుకోవటం చాలా సులభం అవుతుంది.మార్కెట్లో పెట్టుబడులు అంటే రిస్క్ అంటారు.స్తిరాస్తి , బంగారం  , చివరకు మనకు అన్నం పెట్టె రైతన్న చేసే వ్యవసాయం లో కూడా ఎంతో రిస్కు ఉంది.పండించే పంట చేతికి వచ్చే వరకు అనుక్షణం రిస్కు వానలు లేకపోవడం . అధిక వానలు, విద్యుత్తు సమస్య ,పురుగులు పట్టడం , మద్దతు ధర మొదలగు రూపాలలో రిస్కు  ఉంటుంది. ఇదే విధంగా మీరు  ఏ రంగం తీసుకున్న రిస్కు అనేది తప్పకుండా ఉంటుంది.

 స్టాకు మార్కెట్ లో పెట్టుబడులంటే ఏమిటి? అనిసాదారణ పౌరుడిని ప్రశ్నిస్తే  జూదం , లాటరీ , పేకాట గుర్రపు పందెం లాంటి సమాధానాలు రావచ్చు.కాని నిజానికి అది అపోహ మాత్రమే . లాటరీ , గుర్రపు పందేలు గెలవడానికి  అదృష్టం కావాలి కాని స్టాకు మార్కెట్లో  డబ్బు సంపాదించడానికి అవగాహన ,మార్కెట్ రిస్కులను ముందే పసిగట్టగల కాసింత జ్ఞానం కావాలి. స్టాకు మార్కెట్ అనేది మంచి పెట్టుబడి సాధనం . చక్కటి ప్రణాళిక ద్వారా , క్రమపద్దతిలో సమర్దవంతంగా  పెట్టుబడి పెడితే చట్టబద్ధంగా స్టాకు మార్కెట్ లో సంపాదించిన సంపదను ఇంకా దేనిలోనూ సంపాదించలేము.స్టాకు మార్కెట్ అంటే జూదం అన్న భావన విడనాడి పెట్టుబడులకు ఉపయోగమైన వేదికగా భావించాలి. కాని  మీకు  స్టాక్ మార్కెట్ గురుంచి  అవగాహన లేకపోవడం ,అవగాహన ఉన్నా సమయం లేకపోవడం ,మరే ఇతర కారణం చేతనైన మార్కెట్ ను నిత్యం విశ్లేశించలేకపోతే  మీలాంటి వారందరూ మ్యూచవల్   ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.అనగా మీరు స్టాక్ మార్కెట్లో  డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయకుండా  మ్యూచవల్   ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట.


షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?

షేర్ అంటే వాటా లేదా భాగం అని అర్ధం. అంటే మీరు ఏదైనా ఒక కంపెనీ షేర్  కొంటున్నారు అంటే ఆ కంపెనీలో భాగం కొంటున్నారు అని అర్ధం.దీనిని  మనం ఒక ఉదాహరణ ద్వారా అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.

ఒక యువ జంట ఒక వ్యాపారం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. వారికి మంచి రుచికరమైన , రకరకాలైన ఐస్ క్రీం లు తయారు చేయడంలో  మంచి ప్రావీణ్యం ఉంది. కాబట్టి వారూ ఐస్ క్రీం పార్లర్ ప్రారంభించారు. దానికి వారూ రోజీ ఐస్ క్రీం పార్లర్ అనే పేరు పెట్టడం జరిగినది. వారూ ఈ వ్యాపారం చేయడానికి కావలసిన డబ్బు బ్యాంక్ వద్ద అప్పు తీసుకొని ప్రారంభించడం జరిగినది. వారి వ్యాపారం వారూ అనుకున్నట్టుగానే  బాగా వృద్ది లోకి రావడం జరిగినది.మంచి లాభాలు కూడా పొందుతున్నారు. వస్తున్న లాభాలతో పెరుగుతున్న కస్టమర్లకు అనుగుణంగా  ఐస్ క్రీం లు తయారు చేయడానికి కావలసిన  మేటిరీయల్ కొనడానికి వస్తున్న లాభాలు ఉపయోగిస్తున్నారు.వారూ వ్యాపారం ప్రారంభించి సుమారు  పది సంవత్సరాల కాలం గడిచిపోయింది. వారూ చేసిన బ్యాంక్ అప్పు కూడా తీర్చివేయడం జరిగినది.వారూ  ఇప్పుడు సంవత్సరానికి  రూ. 10 లక్షలు లాభం పొందుతున్నారు. అంతే కాకుండా  వారి రోజీ ఐస్ క్రీం పార్లర్యొక్క బుక్ వాల్యూ కూడా రూ.50 లక్షల వరకూ ఉంది.( బుక్ వాల్యూ అంటే రోజీ ఐస్ క్రీం పార్లర్వాస్తవిక విలువ  machinery, furniture, building less any loans ).వారూ ఇప్పుడు వారి వ్యాపారాన్ని ప్రక్కన ఉన్న పట్టణాలకు కూడా విస్తరించాలి అనుకుంటున్నారు. అందువలన ప్రక్కన గల పట్టణంలో రెండు బ్రాంచీలు ప్రారంభించాలి అనుకున్నారు.దానికి వారూ తగిన రిసెర్చ్ చేస్తే మరో రెండు బ్రాంచీలు ప్రారంభించడానికి  రూ .52 లక్షలు అవసరం అవుతున్నాయి.ఈ విధంగా వారికి కావలసిన రూ .52 లక్షలు సమకూర్చుకోవడానికి వారికి రెండు అవకాశాలు  అందుబాటులో ఉన్నాయి.మొదటిది బ్యాంక్ ల నుండి అప్పు తీసుకోవడం , రెండవది వారి వ్యాపారం నుండి కొంత వాటా ఇతరులకు అమ్మడం.బ్యాంక్ వడ్డీ రెట్లు అధికంగా ఉన్నందున వారూ వారి వ్యాపారంలో వాటా అమ్మడానికే  మొగ్గు చూపారు. కాని వారి మదిలో ఎన్నో అనుమానాలు . ఏవిధంగా వాటా అమ్మాలి.రోజీ ఐస్ క్రీం పార్లర్యొక్క విలువ యే విధంగా లెక్కించాలి. షేర్ ధర యే విధంగా నిర్ణయించాలి.ఎవరు వాల్యుయేషన్ చేస్తారు మొదలగు సందేహాలు కలవు.రోజీ ఐస్ క్రీం పార్లర్లో కొంత వాటా అమ్మాలి  అంటే  ఆ పార్లర్  యొక్క విలువ లెక్కించాలి. కంపెనీ విలువ లెక్కించే వ్యక్తిని underwriter’.అంటారు .అతను రోజీ ఐస్ క్రీం పార్లర్ యొక్క గత రికార్డులు. భవిష్యత్ అవకాశాలు, ఆ పార్లర్ ఓనర్స్ ఇంటువంటి యువజంట యొక్క బ్యాక్ గ్రౌండ్ మొదలగునవి పరిశీలించి ఈ పార్లర్ దాని సంవత్సర లాబాలకంటే పది రెట్లు విలువ చేస్తుంది అని నిర్దారించడం జరిగినది, అంటే దాని అర్ధం పార్లర్ పొందుతున్న లాభం రూ 10 లక్షలు కాబట్టి దానికి పది రెట్లు అంటే పార్లర్ కోటి రూపాయల విలువ చేస్తుంది అని దాని అర్ధం.దానికి బుక్ వాల్యూ అదనం. అంటే రోజీ ఐస్ క్రీం పార్లర్మొత్తం కోటి యాభై లక్షల విలువ లేదా 150 లక్షల విలువ చేస్తుంది అని నిపుణుడి అభిప్రాయం. రూ 150 లక్షలలో 40% అంటే 60లక్షలు కాబట్టి వారూ వారికి కావలసిన   52 లక్షలు పొందడానికి రోజీ ఐస్ క్రీం పార్లర్లో  40% వాటా పబ్లిక్ కి  అమ్మడానికి నిర్ణయించుకున్నారు. ఈ విధంగా  మొదటి సారిగా ఒక కంపెనీ పబ్లిక్ కి వారా అమ్మడాన్ని ఐ పి ఒ  అంటారు. ఈ విధంగా వారి  రోజీ ఐస్ క్రీం పార్లర్లో  40% వాటా పబ్లిక్ కి  అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు  60లక్షల నుండి రూ 52 లక్షలు రెండు రోజీ ఐస్ క్రీం పార్లర్బ్రాంచీలు ఓపెన్ చేయడానికి ఉపయోగించి మిగితా రూ 8 లక్షలు రోజు వారి వ్యవహారాలు సజావుగా నడవడానికి ఉపయోగించేవారు.రోజీ ఐస్ క్రీం పార్లర్లో మెజారిటీ వాటా 60% యువ జంట చేతిలోనే ఉండటంతో పార్లర్ పై అజమాయిషీ కూడా వారి వద్దనే ఉంటుంది. ఈ విధంగా మొదటి సారి ఒక కంపెనీ పబ్లిక్ కి వాటా అమ్మడాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు.ఇప్పుడు  “రోజీ ఐస్ క్రీం పార్లర్మూడు బ్రాంచీలను కలిగి ఉండి  ప్రతి బ్రాంచీ  రూ 10 లక్షల లాభం సంపాదిస్తుంది. అంటే మూడు బ్రాంచీలు కలిపి సంవత్సరానికి 30 లక్షల లాభం రోజీ ఐస్ క్రీం పార్లర్పొందుతుంది.ఇప్పుడు రోజీ ఐస్ క్రీం పార్లర్విలువ 450 లక్షలు. ఇది వరకే ఒక రోజీ ఐస్ క్రీం పార్లర్యొక్క విలువ 150 లక్షలు గా లెక్కించడం జరిగినది.ఇప్పుడు మూడు బ్రాంచీల విలువ కలిపి 450 లక్షలు (3 shops x 10 lakhs x 10 times + 50 lakhs x 3). అదే విధంగా యువ జంట 60% వాటా మొత్తం  270 లక్షలు (450 x 60%). అదే విధంగా 60 లక్షలు పెట్టి 40% వాటా కొన్న పబ్లిక్ వాటా విలువ రూ 180 లక్షలు. అంటే వారి వాటా విలువ కూడా మూడు రెట్లు పెరగడం జరిగినది.ఇప్పటి వరకు మీకు వివరంగా అర్ధం అయింది అనుకుంటాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్ దగ్గరకు వద్దాం..ఇప్పుడు పబ్లిక్ వద్ద ఉన్న  40% వాటా తరుచుగా చేతులు మారడం జరుగుతుంది. ఈ విధంగా చేతులు మారే ప్రదేశాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. సెకండరీ మార్కెట్ లో రోజీ ఐస్ క్రీం పార్లర్యొక్క వాటాలను అధిక ధరకు కొనడానికి కూడా పబ్లిక్ తయారుగా ఉన్నారు. ఎందుకంటె అది మంచి పనితీరు కనబరుస్తుంది కాబట్టి. మీరు ఒక ఇన్వెస్టర్ గా రోజీ ఐస్ క్రీం పార్లర్లో ఇన్వెస్ట్ చేయడం అంటే వాటా కనుగోలు చేయడం వలన లాభం యే విధంగా కలుగుతుందో ఒక్కసారి చూద్దాం. రోజీ ఐస్ క్రీం పార్లర్మొత్తం  వాటాలను 50000 విభజించారు అనుకుందాం . దానిలో 40% వాటాలను  పబ్లిక్ కి అంటే 20000  వాటాలను కేటాయించారు. పబ్లిక్ దగ్గర  నుండి  ఈ 20000 వాటా ల ద్వారా సేకరించిన మొత్తం రూ 60 లక్షలు కదా ? అంటే ఒక వాటా ద్వారా సేకరించిన మొత్తం రూ 300 (60 lakhs/20000) కాని ఇప్పుడు ఒక్కో వాటా విలువ రూ 900 ఎందుకంటె ఇప్పుడు పబ్లిక్ వాటా విలువ రూ 180 లక్షలు ( 180 lakhs / 20000) ఇప్పుడు మొత్తం రోజీ ఐస్ క్రీం పార్లర్విలువ 450 లక్షలు (3 shops x 10 lakhs x 10 times + 50 lakhs x 3). అదే విధంగా యువ జంట 60% వాటా మొత్తం  రూ 270 లక్షలు (450 x 60%). అదే విధంగా రూ 60 లక్షలు పెట్టి 40% వాటా కొన్న పబ్లిక్ వాటా విలువ రూ 180 లక్షలు.అని మీరు ఇదివరకే తెలుసుకున్నారు.ఈ విధంగా రోజీ ఐస్ క్రీం పార్లర్వాటా విలువ  పార్లర్ పనితీరు ఆధారంగా పెరుగుతుంది.పని తేరు బాగా లేకపోతే తగగ్డం కూడా సర్వ సాదారణం.

ఒకవేళ రోజీ ఐస్ క్రీం పార్లర్వాటా లేదా షేర్  విలువ రూ 1250 కి చేరితే మీరు వాటా కొనుగోలు చేస్తారా ? చేయవద్దు. ఎందుకంటె మనం ఇది వరకే తెలుసుకున్నాం. రోజీ ఐస్ క్రీం పార్లర్వాస్తవ విలువ రూ 900 మాత్రమే అనుకున్నాం.దీనినే రియల్ వాల్యూ లేదా ఇంట్రిస్టిక్ వాల్యూ అంటారు. అంత కంటే అధిక ధర ఉంటే కంపెనీ షేర్ అధిక ధర ఉన్నట్టుగా భావించాలి.

ఒకవేళ రోజీ ఐస్ క్రీం పార్లర్వాటా లేదా షేర్  విలువ 750 కి చేరితే మీరు వాటా కొనుగోలు చేస్తారా ? తప్పకుండా చేయాలి. ఎందుకంటారా ? స్టాక్ మార్కెట్ పతనం ద్వారా వాటా విలువ తగ్గిపోయి తక్కువ ధరకు దొరుకుతుంది కాని , షేర్ వాస్తవిక విలువ  రూ 900 కాబట్టి కొనడంలో ఎలాంటి తప్పు లేదు.ఐతే మల్లె ఎక్కడ అమ్మాలి అంటారు. వాస్తవిక విలువ ఐనటువంటి  రూ 900 లేదా దాని పైన అమ్మాలి . ఇక్కడ నేను మీకు ఉదాహరణగా  రోజీ ఐస్ క్రీం పార్లర్తీసుకోవడం జరిగినది. మీరు ఏదైనా కంపెనీ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ విధంగా వాస్తవికి విలువ కంటే తక్కువగా ఉండి  మంచి పని తీరు కనబరుస్తున్న షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడూ కూడా మంచిది. మరో సారి మరొక్క టాపిక్ గురుంచి తెలుసుకుందాం. 17 comments:

 1. i want to know how can get profit monthly or depends on value of share?

  ReplyDelete
 2. xlent info sir,,,u made it very clear abt basics....

  ReplyDelete
 3. nice to see somebody from Hyderabad doing great work, definitely I would like to contribute to this blog to help our telgu people.
  Md Jamil
  www.multibaggerstockideas.com

  ReplyDelete
 4. wow very useful information

  ReplyDelete
 5. very useful information for new investers....

  ReplyDelete
 6. really good analysis and very usefull information........

  ReplyDelete
 7. please explain in detail about call and put options

  ReplyDelete
 8. Very useful information.
  Sir, please explain about futures and options in stock market.

  ReplyDelete
 9. Very useful information.
  Sir, please explain about futures and options in stock market.

  ReplyDelete
 10. thanks sir very usefull jnformation

  ReplyDelete
 11. షేర్ మార్కెట లో ఒక కంపెని రియల్ వాల్యూ / ఇంట్రిస్ట్రిక్ వాల్యూ ఎలా తెలుసుకోవచ్చు?

  ReplyDelete

Note: only a member of this blog may post a comment.