డీమ్యాట్ ఖాతా తెరవడం ఎలా?


డీమ్యాట్ ఖాతా తెరవడం ఎలా?
డీమ్యాట్ ఖాతా తెరవటానికి ముందుగా మీరు మీ పేరున బ్యాంకు ఖాతా  తెరవండి. బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయందే డీమ్యాట్ ఖాతా తెరిచే అవకాశం ఉండదు. బ్యాంకు ఖాతా   తెరవడం వల్ల మీకే లాభం. భవిష్యత్తులో మీరు అందుకునే  డివిడెండు, వడ్డీ వారెంట్లపైనే  మీ ఖాతా సంఖ్యను ముద్రిస్తారు. ఇవి పోస్టులో మిస్సయినా  ఇతరులేవ్వరు మార్చుకోవటానికి  వీలుండదు. డీమ్యాట్ ఖాతా తెరిచిన తర్వాతా బ్యాంకు ఖాతాను మూసివేసినా, మరో ఊరికి  లేదా శాఖకు మార్చుకున్నా డిపాజిటరీ  పార్టిసిపెంట్  కు   తప్పకుండా వెంటనే  తెలియచేయండి.
బ్యాంకు ఖాతా తెరిచినా అనంతరం డీమ్యాట్ ఖాతా తెరవటానికి డిపాజిటరి పార్టిసిపెంట్స్ దగ్గరకు వెళ్ళండి.బ్యాంకులు లేదా బ్రోకరేజీ సంస్థలు డిపాజిటరి పార్టిసిపెంట్స్ గా వ్యవహరిస్తాయి.డీపీ దగ్గర దరఖాస్తు  పత్రంలో అన్ని వివరాలు  పూర్తిచేసి ఇవ్వాలి. దరఖాస్తుతో పాటు గుర్తింపు , చిరునామా దృవీకరణ పత్రాలు జతచేయాలి.సంతకం , ఫోటోలను నిర్ధారించడానికి  ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉన్నవారు సంతకం చేయాలి.ద్రువీకరించే వారు లేకుంటే పాసపోర్ట్, ఫోటో గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసన్స్ , పాన్ కార్డు ఉన్న చాలు.  ఇవి మీకు చిరునామా దృవీకరణకు కూడా ఉపయోగపడతాయి. దరఖాస్తు చేసుకునే సమయంలో అసలు పత్రాలను తీసుకవెల్లడం  మరచిపోవద్దు..

పరిశీలన పూర్తీ చేసిన  తర్వాత నిర్దారిత  ఒప్పంద పత్రాలపై  సంతకాలు చేయాలి.మీ హక్కులు , బాధ్యతలు వివరంగా ఈ ఒప్పంద పత్రంలో ఉంటాయి.ఒప్పంద పత్రం ప్రతిని అడిగి తీసుకోవాలి.తర్వాత మీకు ఖాతా నంబరు ఇస్తారు .దీన్ని బెనిఫిషియరి వొనర్ ఐడెంటీకేషన్ నంబర్  అంటారు.
డీమ్యాట్ ఖాతా ఒక్కటే తెరవాలా?
ఒక్క వ్యక్తీ ఒక్క డీమ్యాట్ ఖాతానే తెరవాలన్న నిబందనేమి లేదు . అదే డీపీ వద్ద లేదా వేరే డీపీ ల వద్ద ఎన్ని ఖాతాలను ఐనా తెరవవచ్చు. మీ బ్రోకరుకు ఖాతా ఉన్న చోటనే తెరవాలి అన్న పట్టింపు లేదు. మీ భార్య /భర్త  లేదా పిల్లలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలనుకుంటీ మీ ఒక్కరి పేరునే ఖాతా ఉంటె సరిపోదు.మీరు ఎవ్వరి ఎవ్వరి పేరుమీదా  షేర్లు పొందాలి అనుకుంటే  వారి వారి పేర్లతో ఖాతా తెరవాలి.నామినేషన్  ఇవ్వడం కూడా చాలా ముఖ్యమే. ఇన్వెస్టర్ చనిపోయిన సందర్భంలో  చాలా మంది  డీమ్యాట్ ఖాతాదారులు నామినేషన్ లేక వారసత్వ పత్రాల కొరకు  నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉంటుంది..కావున నామినేషన్ అనేది చాలా ముఖ్యం.
చార్జీలు
డీమ్యాట్ ఖాతా నిర్వహణకు , ముందుగా ఖాతా తెరవటానికి  కొంత చార్జీలు చెల్లించాలి. కొందరు డీపీ లు ఎలాంటి చార్జీలు  వసూలు చేయడం లేదు. కొన్ని సంస్థలు ఖాతాదారులకు ఉచితంగా  డీమ్యాట్ ఖాతా  తెరిచే అవకాశాన్ని కల్పిస్తున్నాయి..డాక్యుమెంటేషన్ చార్జీలు. ప్రతి ఏటా ఖాతా  నిర్వహణకు  చార్జీలు చెల్లించాలి.ఈ చార్జీలు  ముందుగా చెల్లించాలి. దీనికి అదనంగా ప్రతి నెల కస్టోడియన్ ఫీజు చెల్లించాలి .ఖాతా లో ఉన్న సెక్కురిటీల సంఖ్య ( అంతర్జాతీయ సెక్కురిటీల గుర్తింపు సంఖ్య ఐ స్ ఐ న్ ) ను  బట్టి  ఈ ఫీజు ఆధారపడి ఉంటుంది. ఇక సెక్కురిటీలు అమ్మిన , కొన్న ప్రతి సారి కొంత చార్జీ చెల్లించాలి. నెలలో నిర్వహించిన లావాదేవీలకు కలిపి ఒక్కసారే వసూలు చేస్తారు. సర్వీసు చార్జీ అదనం. డీపీ తో పని లేకుండా ఇంటర్నెట్లో మీరే స్వయం గా   మీ లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు.