షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?


షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?
షేర్ అంటే వాటా లేదా భాగం అని అర్ధం. అంటే మీరు ఏదైనా ఒక కంపెనీ షేర్  కొంటున్నారు అంటే ఆ కంపెనీలో భాగం కొంటున్నారు అని అర్ధం.దీనిని  మనం ఒక ఉదాహరణ ద్వారా అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.
ఒక యువ జంట ఒక వ్యాపారం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. వారికి మంచి రుచికరమైన , రకరకాలైన ఐస్ క్రీం లు తయారు చేయడంలో  మంచి ప్రావీణ్యం ఉంది. కాబట్టి వారూ ఐస్ క్రీం పార్లర్ ప్రారంభించారు. దానికి వారూ రోజీ ఐస్ క్రీం పార్లర్ అనే పేరు పెట్టడం జరిగినది. వారూ ఈ వ్యాపారం చేయడానికి కావలసిన డబ్బు బ్యాంక్ వద్ద అప్పు తీసుకొని ప్రారంభించడం జరిగినది. వారి వ్యాపారం వారూ అనుకున్నట్టుగానే  బాగా వృద్ది లోకి రావడం జరిగినది.మంచి లాభాలు కూడా పొందుతున్నారు. వస్తున్న లాభాలతో పెరుగుతున్న కస్టమర్లకు అనుగుణంగా  ఐస్ క్రీం లు తయారు చేయడానికి కావలసిన  మేటిరీయల్ కొనడానికి వస్తున్న లాభాలు ఉపయోగిస్తున్నారు.

వారూ వ్యాపారం ప్రారంభించి సుమారు  పది సంవత్సరాల కాలం గడిచిపోయింది. వారూ చేసిన బ్యాంక్ అప్పు కూడా తీర్చివేయడం జరిగినది.వారూ  ఇప్పుడు సంవత్సరానికి  రూ. 10 లక్షలు లాభం పొందుతున్నారు. అంతే కాకుండా  వారి రోజీ ఐస్ క్రీం పార్లర్” యొక్క బుక్ వాల్యూ కూడా రూ.50 లక్షల వరకూ ఉంది.( బుక్ వాల్యూ అంటే రోజీ ఐస్ క్రీం పార్లర్” వాస్తవిక విలువ  machinery, furniture, building less any loans ).వారూ ఇప్పుడు వారి వ్యాపారాన్ని ప్రక్కన ఉన్న పట్టణాలకు కూడా విస్తరించాలి అనుకుంటున్నారు. అందువలన ప్రక్కన గల పట్టణంలో రెండు బ్రాంచీలు ప్రారంభించాలి అనుకున్నారు.దానికి వారూ తగిన రిసెర్చ్ చేస్తే మరో రెండు బ్రాంచీలు ప్రారంభించడానికి  రూ .52 లక్షలు అవసరం అవుతున్నాయి.ఈ విధంగా వారికి కావలసిన రూ .52 లక్షలు సమకూర్చుకోవడానికి వారికి రెండు అవకాశాలు  అందుబాటులో ఉన్నాయి.మొదటిది బ్యాంక్ ల నుండి అప్పు తీసుకోవడం , రెండవది వారి వ్యాపారం నుండి కొంత వాటా ఇతరులకు అమ్మడం.బ్యాంక్ వడ్డీ రెట్లు అధికంగా ఉన్నందున వారూ వారి వ్యాపారంలో వాటా అమ్మడానికే  మొగ్గు చూపారు. కాని వారి మదిలో ఎన్నో అనుమానాలు . ఏవిధంగా వాటా అమ్మాలి. “రోజీ ఐస్ క్రీం పార్లర్యొక్క విలువ యే విధంగా లెక్కించాలి. షేర్ ధర యే విధంగా నిర్ణయించాలి.ఎవరు వాల్యుయేషన్ చేస్తారు మొదలగు సందేహాలు కలవు.
రోజీ ఐస్ క్రీం పార్లర్లో కొంత వాటా అమ్మాలి  అంటే  ఆ పార్లర్  యొక్క విలువ లెక్కించాలి. కంపెనీ విలువ లెక్కించే వ్యక్తిని underwriter’.అంటారు .అతను రోజీ ఐస్ క్రీం పార్లర్ యొక్క గత రికార్డులు. భవిష్యత్ అవకాశాలు, ఆ పార్లర్ ఓనర్స్ ఇంటువంటి యువజంట యొక్క బ్యాక్ గ్రౌండ్ మొదలగునవి పరిశీలించి ఈ పార్లర్ దాని సంవత్సర లాబాలకంటే పది రెట్లు విలువ చేస్తుంది అని నిర్దారించడం జరిగినది, అంటే దాని అర్ధం పార్లర్ పొందుతున్న లాభం రూ 10 లక్షలు కాబట్టి దానికి పది రెట్లు అంటే పార్లర్ కోటి రూపాయల విలువ చేస్తుంది అని దాని అర్ధం.దానికి బుక్ వాల్యూ అదనం. అంటే రోజీ ఐస్ క్రీం పార్లర్మొత్తం కోటి యాభై లక్షల విలువ లేదా 150 లక్షల విలువ చేస్తుంది అని నిపుణుడి అభిప్రాయం. రూ 150 లక్షలలో 40% అంటే 60లక్షలు కాబట్టి వారూ వారికి కావలసిన   52 లక్షలు పొందడానికి రోజీ ఐస్ క్రీం పార్లర్లో  40% వాటా పబ్లిక్ కి  అమ్మడానికి నిర్ణయించుకున్నారు. ఈ విధంగా  మొదటి సారిగా ఒక కంపెనీ పబ్లిక్ కి వారా అమ్మడాన్ని ఐ పి ఒ  అంటారు. ఈ విధంగా వారి  రోజీ ఐస్ క్రీం పార్లర్లో  40% వాటా పబ్లిక్ కి  అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు  60లక్షల నుండి రూ 52 లక్షలు రెండు రోజీ ఐస్ క్రీం పార్లర్” బ్రాంచీలు ఓపెన్ చేయడానికి ఉపయోగించి మిగితా రూ 8 లక్షలు రోజు వారి వ్యవహారాలు సజావుగా నడవడానికి ఉపయోగించేవారు. “రోజీ ఐస్ క్రీం పార్లర్లో మెజారిటీ వాటా 60% యువ జంట చేతిలోనే ఉండటంతో పార్లర్ పై అజమాయిషీ కూడా వారి వద్దనే ఉంటుంది. ఈ విధంగా మొదటి సారి ఒక కంపెనీ పబ్లిక్ కి వాటా అమ్మడాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు.

ఇప్పుడు  “రోజీ ఐస్ క్రీం పార్లర్మూడు బ్రాంచీలను కలిగి ఉండి  ప్రతి బ్రాంచీ  రూ 10 లక్షల లాభం సంపాదిస్తుంది. అంటే మూడు బ్రాంచీలు కలిపి సంవత్సరానికి 30 లక్షల లాభం రోజీ ఐస్ క్రీం పార్లర్” పొందుతుంది.ఇప్పుడు రోజీ ఐస్ క్రీం పార్లర్” విలువ 450 లక్షలు. ఇది వరకే ఒక రోజీ ఐస్ క్రీం పార్లర్యొక్క విలువ 150 లక్షలు గా లెక్కించడం జరిగినది.ఇప్పుడు మూడు బ్రాంచీల విలువ కలిపి 450 లక్షలు (3 shops x 10 lakhs x 10 times + 50 lakhs x 3). అదే విధంగా యువ జంట 60% వాటా మొత్తం  270 లక్షలు (450 x 60%). అదే విధంగా 60 లక్షలు పెట్టి 40% వాటా కొన్న పబ్లిక్ వాటా విలువ రూ 180 లక్షలు. అంటే వారి వాటా విలువ కూడా మూడు రెట్లు పెరగడం జరిగినది.

ఇప్పటి వరకు మీకు వివరంగా అర్ధం అయింది అనుకుంటాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్ దగ్గరకు వద్దాం..ఇప్పుడు పబ్లిక్ వద్ద ఉన్న  40% వాటా తరుచుగా చేతులు మారడం జరుగుతుంది. ఈ విధంగా చేతులు మారే ప్రదేశాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. సెకండరీ మార్కెట్ లో రోజీ ఐస్ క్రీం పార్లర్యొక్క వాటాలను అధిక ధరకు కొనడానికి కూడా పబ్లిక్ తయారుగా ఉన్నారు. ఎందుకంటె అది మంచి పనితీరు కనబరుస్తుంది కాబట్టి. మీరు ఒక ఇన్వెస్టర్ గా  రోజీ ఐస్ క్రీం పార్లర్లో ఇన్వెస్ట్ చేయడం అంటే వాటా కనుగోలు చేయడం వలన లాభం యే విధంగా కలుగుతుందో ఒక్కసారి చూద్దాం.  రోజీ ఐస్ క్రీం పార్లర్మొత్తం  వాటాలను 50000 విభజించారు అనుకుందాం . దానిలో 40% వాటాలను  పబ్లిక్ కి అంటే 20000  వాటాలను కేటాయించారు. పబ్లిక్ దగ్గర  నుండి  ఈ 20000 వాటా ల ద్వారా సేకరించిన మొత్తం రూ 60 లక్షలు కదా ? అంటే ఒక వాటా ద్వారా సేకరించిన మొత్తం రూ 300 (60 lakhs/20000) కాని ఇప్పుడు ఒక్కో వాటా విలువ రూ 900 ఎందుకంటె ఇప్పుడు పబ్లిక్ వాటా విలువ రూ 180 లక్షలు ( 180 lakhs / 20000) ఇప్పుడు మొత్తం  రోజీ ఐస్ క్రీం పార్లర్” విలువ 450 లక్షలు (3 shops x 10 lakhs x 10 times + 50 lakhs x 3). అదే విధంగా యువ జంట 60% వాటా మొత్తం  రూ 270 లక్షలు (450 x 60%). అదే విధంగా రూ 60 లక్షలు పెట్టి 40% వాటా కొన్న పబ్లిక్ వాటా విలువ రూ 180 లక్షలు.అని మీరు ఇదివరకే తెలుసుకున్నారు.ఈ విధంగా  రోజీ ఐస్ క్రీం పార్లర్వాటా విలువ  పార్లర్ పనితీరు ఆధారంగా పెరుగుతుంది.పని తేరు బాగా లేకపోతే తగగ్డం కూడా సర్వ సాదారణం.
ఒకవేళ  రోజీ ఐస్ క్రీం పార్లర్వాటా లేదా షేర్  విలువ రూ 1250 కి చేరితే మీరు వాటా కొనుగోలు చేస్తారా ? చేయవద్దు. ఎందుకంటె మనం ఇది వరకే తెలుసుకున్నాం. “ రోజీ ఐస్ క్రీం పార్లర్వాస్తవ విలువ రూ 900 మాత్రమే అనుకున్నాం.దీనినే రియల్ వాల్యూ లేదా ఇంట్రిస్టిక్ వాల్యూ అంటారు. అంత కంటే అధిక ధర ఉంటే కంపెనీ షేర్ అధిక ధర ఉన్నట్టుగా భావించాలి.
ఒకవేళ  రోజీ ఐస్ క్రీం పార్లర్వాటా లేదా షేర్  విలువ 750 కి చేరితే మీరు వాటా కొనుగోలు చేస్తారా ? తప్పకుండా చేయాలి. ఎందుకంటారా ? స్టాక్ మార్కెట్ పతనం ద్వారా వాటా విలువ తగ్గిపోయి తక్కువ ధరకు దొరుకుతుంది కాని , షేర్ వాస్తవిక విలువ  రూ 900 కాబట్టి కొనడంలో ఎలాంటి తప్పు లేదు.ఐతే మల్లె ఎక్కడ అమ్మాలి అంటారు. వాస్తవిక విలువ ఐనటువంటి  రూ 900 లేదా దాని పైన అమ్మాలి . ఇక్కడ నేను మీకు ఉదాహరణగా   రోజీ ఐస్ క్రీం పార్లర్” తీసుకోవడం జరిగినది. మీరు ఏదైనా కంపెనీ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ విధంగా వాస్తవికి విలువ కంటే తక్కువగా ఉండి  మంచి పని తీరు కనబరుస్తున్న షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడూ కూడా మంచిది. మరో సారి మరొక్క టాపిక్ గురుంచి తెలుసుకుందాం. 

ఈ రోజు స్టాక్ మార్కెట్ 07-09-2012


ఈ రోజు స్టాక్ మార్కెట్ 07-09-2012
నిన్న  సాయత్రం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశం ఉన్నంది అనే విషయం మీకు తెలియచేయడం జరిగినది.ఈ సమావేశంలో  యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాండ్ల  కనుగోలుకు సంభందించి కీలక నిర్ణయం తీసుకున్నందున ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా ఉంటుంది. నేను మీకు గత వారం రోజుల నుండి తెలియచేస్తూనే ఉన్నాను.  నిఫ్టీ 5220 క్రింద క్లోజ్ కావడం లేదా 5190 బ్రేక్ కానంతవరకు డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం చాలా తక్కువగా కలదు.అదే విధంగా జరుగుతూనే ఉంది. రెసిస్టన్స్ వద్ద సెల్ చేయమని , సపోర్ట్ వద్ద బై చేయమని ప్రతిసారి చెప్పడం జరుగుతూనే ఉంది.మేము చెప్పిన నిఫ్టీ విలువల వద్ద నే నిఫ్టీ సపోర్ట్ కాని, రెసిస్టన్స్ కాని తీసుకోవడం మీరు గమనిస్తూనే ఉండవచ్చు.అదే విధంగా ఈ రోజు మార్కెట్ పైకి వెళ్ళడమే జరుగుతుంది . పై లెవల్లో నిఫ్టీ కి 20 sma 5330 మరియు   5348 వద్ద రెసిస్టన్స్ కలదు. ఒకవేళ ఈ రోజు ముగింపు 20 sma 5330 పైన జరిగితే తదుపరి రోజు నిఫ్టీ మరింత పెరగడానికి కూడా అవకాశం కలదు.
ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html