డబ్బుని అదా
చేసే విధానం.
ఈ టాపిక్ ని చాలా జాగ్రత్తగా చదవండి ఎందుకంటే
ఇది డబ్బుని ఏ విధంగా అదా చేయాలో తెలియచేస్తుంది.ఒక్కసారి ఉహించుకోండి.మీరు మీ
షెల్ప్స్ సర్దుతున్నసమయంలో పాత పుస్తకాల మడతలలో ఎప్పుడో కొన్ని నెలల క్రితం పెట్టి మరిచిపోయిన Rs 1000 ల నోటు
కనబడితే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. చాలా ఎగ్జయిట్మెంట్ గా ఉంటుంది కదూ ! మీరు
ఆ డబ్బూ ఎప్పటికి కనగోనక పోయినప్పటికీ కూడా
మీరు మీ పర్సులో ఉన్న డబ్బూతో
ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ జీవితం సాఫీగా సాగేది కదా ?
ఇదంతా మీకు ఎందుకు చెప్పుతున్నాను అంటే మీ
ఆదాయం నుండి పొదుపు చేయడానికి వెనుక ఉన్న
మూల సూత్రం. మీరు మీ ఆదాయం లో నుండి ఎంత మొత్తం పొదుపు చేయాలి అనుకున్నారో అంత
మొత్తం ప్రక్కన పెట్టి దాని గురుంచి మర్చి పోయి మిగిలిన దానితో మీ జీవితం వేల్లదీయండి. ఇది ఆలోచించడానికి మీకు కొద్దిగా
కష్టంగానే ఉండవచ్చు. కాని అసాధ్యం మాత్రం కాదు. ఇప్పటికయినా మించిపోయినది ఏమిలేదు ప్రయత్నించండి. ఇప్పటికి
చాలా మంది పొదుపు అంటే ఆదాయం (జీతం ) – ఖర్చులు
( పొదుపు=ఆదాయం –ఖర్చులు ) అని మాత్రమే
అనుకుంటారు. మీరు ఇలా భావిస్తే మీరు ఎన్నటికి పొదుపు చేయలేరు. మీ జేబులో డబ్బు
ఉన్నప్పటికీ కూడా మీరు పొదుపు చేయలేకపోవడం మీకు ఇదివరకే అనుభంలోకి వచ్చి ఉంటుంది.
ఎందుకంటె మీరు వివిధ రకాల అడ్వర్టయిజ్మెంట్ లేదా వివిధ రకాల డిస్కౌంట్ పథకాల
ద్వారా బట్టల మీదా , గాడ్జెట్స్ మీదా వివిధ రకాలుగా టెంప్ట్ అయ్యి ప్రతి సారి అవసారానికంటే
ఎక్కువగానే ఖర్చు పెడుతూ ఖర్చులను నియంత్రించుకోలేకపోతున్నారు.అందువన మీరు పొదుపు
చేయాలి అనుకున్న చేయలేకపోతున్నారు. మీరు వాస్తవంగా ప్రతి నెల కనీసం మీ అదాయంలో పది
నుండి ఇరవై శాతం తప్పనిసరిగా అదా చేయాలి అంటే మీరు రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అనే పుస్తకంలో రాబర్ట్ కియోసకి చెప్పిన విధంగా
చేయక తప్పదు.అతను ఆ పుస్తకంలో చెప్పిన దాని ప్రకారం మీరు మీ ఖర్చులను నియంత్రించే
బదులు ముందుగా మీ ఆదాయం లో నుండి మీరు చేయాలి అనుకుంటున్న పొదుపు చేయగా మిగిలిన మొత్తం
మాత్రమే ఖర్చు చేయాలి. అంటే ఆదాయం –పొదుపు
= ఖర్చులు ఈ ఫార్మూలా ప్రకారం మీరు తప్పనిసారిగా పొదుపు చేయాలి కాబట్టి మిగిలిన
మొత్తం లో నుండే మీ ఖర్చులు చేసుకోవాలి కాబట్టి మీకు కొంత కాలానికి ఆర్ధిక
క్రమశిక్షణ అలవాటు తప్పకుండా అలవాటు అవుతుంది.ఈ విధంగా మీరు కేవలం పొదుపు చేయగానే
సరిపోదు. మీ పొదుపు మొత్తాన్ని పెట్టుబడికి అవకాశం గల వాటిలో ఇన్వెస్ట్
చేసినప్పుడు మాత్రమే మీరు చేసిన పోడుపుకి అర్ధం ఉంటుంది.వివిధ రకాల పెట్టుబడి
అవకాశాలను, మీ ఖర్చులను ఏ విధంగా నియంత్రిన్చుకోవాలో మరొక్క సారి తెలుసుకుందాం.