బంగారం స్వచ్చత ఏ విధంగా తెలుసుకోవాలి ?part -1
మన తాత ,
ముత్తాతల కాలం నుండి మాత్రమే కాకుండా కొన్ని వందల సంవత్సరాలుగా పల్లె , పట్నం ,
పేదా , ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బంగారాన్ని విలువైన వస్తువుగా గుర్తించారు.ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం
కనుగోలు చేయాలి అనే ఆలోచనతో ఉండేవారూ ,
ఉంటున్నారు.ఇక ఆడపడుచుల గురించి అయితే
చెప్పవలసిన పనిలేదు. వారూ బంగారాన్ని ముఖ్యంగా నగల కోసం అధికంగా ఇష్టపడతారు.
సాదారణంగా
బంగారం కనుగోలు చేయాలి అంటే ముందుగా ఆలోచించేది బంగారం స్వచ్చత గురించే. అది నగల
రూపంలో కావచ్చు. లేదా కడ్డీల రూపంలో కూడా కావచ్చు. ఐతే ఇక్కడ తలెత్తే ప్రశ్న బంగారం స్వచ్చత ఏ
విధంగా తెలుసుకోవాలి.వినియోగదారుల
శ్రేయస్సు కోరి బంగారు నగలపై హాల్
మార్కింగ్ తప్పనిసరి చేయడం జరిగినది. ఐతే కేవలం
హాల్ మార్కింగ్ మాత్రమే బంగారం స్వచ్చత తెలుసుకోవాడానికి ఉపయోపడదు.ఇక్కడ
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS)ఇచ్చిన మార్గదర్శకాలు ఒకసారి తెలుసుకొండి.. బంగారం గురించి
ప్రాథమిక నిజాలు , బంగారం కొనే ముందు చూడవలసినవి ఏమిటో తెలుసుకోండి.