లోన్స్ ద్వారా సంపద ఎలా స్ప్రుస్టించు కోవచ్చు?
లోన్స్ తీసుకొని కూడా సంపద స్ప్రుస్టించు కోవచ్చు అనే విషయం మీకు తెలుసా ? ఈ విషయం మీకు వినడానికి అచ్చర్యంగా ఉండవచ్చు.అప్పు ద్వారా ఎలా సంపద స్ప్రుస్టించుకోవడం సాధ్యం అవుతుంది అని ఆలోచిస్తున్నారా ? వాస్తవానికి అప్పులకు దూరంగా ఉండటం , ఉన్న అప్పులను వదిలించుకోవడం , క్రెడిట్ కార్డ్స్ డ్యూ ఉన్న కూడా వాటిని వదిలించుకోవడం మీరు తప్పనిసరిగా చేయాలి అనే విషయం మీ అందరికి తెలిసిన విషయమే .పైన చెప్పిన సలహా సాదారణంగా ఆర్ధిక క్రమశిక్షణ ,ఆర్ధిక అక్షరాస్యత లేని వారికి వర్తిస్తుంది. అదే మీరూ ఆర్ధిక అక్షరాస్యత కలిగి ఉండి , ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్ చదవగలిగి ఉంది ఉంటే మీకు లోన్స్ కూడా రెండు రకాలు ఉంటాయి అనే విషయం తెలిసి ఉంటుంది. అవి గుడ్ లోన్స్ మరియు బ్యాడ్ లోన్స్ .
సాదారణంగా బ్యాడ్ లోన్స్ వలన మీ ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది తప్ప వాటి వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ఉదాహరణకు లోన్స్ తీసుకొని విహర యాత్రలకు వెళ్లడం,కార్స్ , లాప్ టాప్స్ , ఖరీదైన మొబైల్స్ , ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం, ఇక గుడ్ లోన్స్ అంటే లోన్స్ తీసుకొని వాటి ద్వారా బిజినెస్ ప్రారంబించడం , ఎడ్యుకేషన్ కొరకు ఉపయోగించడం , అద్దె ఆదాయం పొందడం కొరకు ఉపయోగించడం లేదా ఏదైనా ఆస్థి ఏర్పాటు కొరకు ఉపయోగించేవి గుడ్ లోన్స్.అంతే కాకుండా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ ను కాపాడుకోవడానికి తీసుకొనే లోన్స్ కూడా గుడ్ లోన్స్. ఒక ఉదాహరణ ద్వారా వివరంగా తెలుసుకుందాం.
ఉదాహరణకు మీరూ పది సంవత్సరాల పాటు మీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించేలా ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ లో ఇన్వెస్ట్ చేసారు అనుకుందాం. సుమారు ఐదు సంవత్సరాల అనంతరం మీకు గుండె పోటూ వచ్చి మీకూ డబ్బు అత్యవసరమై మీ ప్లాట్ కనుక అమ్మివేస్తే మీరూ కాపిటల్ గెయిన్ టాక్స్ చెల్లించడమే కాకుండా భవిష్యత్తులో మీ ప్లాట్ ద్వారా పెరిగే కాపిటల్ గెయిన్ నష్టపోవడమే కాకుండా మీరూ మీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించలనుకున్న కాలం కంటే ముందే అమ్మివేయడం వలన మీ లక్ష్యం కూడా నెరవేరే అవకాశం కూడా లేదు.అందువలన ఇలాంటి సమయంలో మీరూ షార్ట్ టర్మ్ లోన్స్ ఏదైనా తీసుకొని మీ దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ ఐనటువంటి మీ ప్లాట్ ను అమ్మకుండా కాపాడుకోగలుగుతారు కాబట్టి ఇది గుడ్ లోన్స్ .
మీరూ ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటారు కాని మీ వద్ద డబ్బూ లేకపోవడంతో బ్యాంక్స్ నుండి, స్నేహితులనుండి అప్పు తీసుకొని వ్యాపారం ప్రారంభం చేసారు అనుకుందాం. మీరూ ఈ విధంగా అప్పు తీసుకొని వ్యాపారం ప్రారంభం చేయడంలో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటె మీరూ చేసే వ్యాపారం మీకూ ఆదాయాన్ని అందివ్వగలుగుతుంది కాబట్టి ఇది గుడ్ లోన్స్.
మీరూ ఒక విలాసవంతమైన కారు కొనాలి అనుకొని లోన్ తీసుకొని కారు కొనడం బ్యాడ్ లోన్స్ క్రిందకు వస్తుంది.మీరూ కొత్తగా తీసుకున్న కారు ఖరీదు మొదటి నాలుగు సంవత్సరాలలోనే అరవై శాతం వరకు తరుగుదల ఉంటుంది.అంతే కాకుండా మీరూ కారు కోసం తీసుకున్న లోన్స్ వలన మీ ఆదాయం వృద్ది చెందటం కాని , కారు విలువ పెరగటం కాని జరగక పోగా మీ కారు విలువ ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది.
ఇప్పుడు మీకూ గుడ్ లోన్స్ కి మరియు బ్యాడ్ లోన్స్ కి మధ్యగల తేడా అర్ధం అయినది అనుకుంటాను. ఎప్పుడూ కూడా మీరూ తీసుకొనే లోన్స్ ద్వారా మీ ఆదాయం లేదా మీ ఆస్థి వృద్ది చెందడానికి ఉపయోగపడేలా ఉండాలి . అంతేకాని విలువ కోల్పోయే వాటి కోసం లోన్స్ తీసుకోవద్దు. బ్యాంకు లు వారి లాభాలు పెంచుకోవడానికి సాదారణ ప్రజానీకాన్ని ప్రలోభపెట్టె విధంగానే వారి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి.కాబట్టి లోన్స్ తీసుకొనే సమయంలో విచక్షణతో మెలగండి.