ఈ వారం స్టాక్ మార్కెట్ 17-12-2012 to 21-12-2012



ఈ వారం స్టాక్ మార్కెట్ 17-12-2012 to 21-12-2012



 





 గత వారం కూడా మార్కెట్  లో  కన్సోలిదేషన్ జరగటం జరిగినది.కాకపోతే మార్కెట్ కి సానుకూల  పరిమాణం ఏమిటంటే నిఫ్టీ  5825 పైన  ఉండటమే. నిఫ్టీ 50hsma ఐనటువంటి  5900కంటే క్రింద ట్రేడ్ కావడం జరుగుతుంది. ఈ రోజు నిఫ్టీ  50hsma పైన నిలదొక్కు కోవడానికి అధిక అవకాశం కలదు.నిఫ్టీ గత కొద్ది రోజులుగా 5950-5980 మరియు  5820-40 మధ్య ఎక్కువగా చలించడం జరుగుతుంది. గత వారం కూడా నిఫ్టీ 5965 వరకు చేరుకోవడం అక్కడి నుండి క్రిందకు దిగజారడం జరిగినది.10-12 ట్రేడింగ్ షెషన్స్ కన్సోలిదేషన్ జరగటం ,తర్వాత 3-4  షెషన్స్ నిఫ్టీ 200 పాయింట్లు పెరగటం చాలా సాదారణంగా జరుగుతుంది.ఒకవేళ ఈ వారంలో కనుక 5950-5980పైన  నిలదోక్కుకోనట్టు ఐతే  కొద్ది కరెక్షన్ రావడానికి అవకాశం కూడా కలదు. కరెక్షన్ కూడా 5715వరకే పరిమితం కాగలదు. 5715 వద్ద  బలమైన సపోర్ట్ ఉంది అనే విషయం మర్చిపోవద్దు. నిఫ్టీ ఒక రెంజీ లో మాత్రమే కదలాడుతున్నది కావున పై లెవల్లో సెల్ చేయడం , క్రింది లెవల్లో బై చేయడం చాలా మంచిది. 5820-40 బ్రేక్ కానప్పటివరకు తగిన స్టాప్ లాస్ తో బై చేయడం మంచిది.  అదే విధంగా పై లెవల్లో  రెసిస్టన్స్ బ్రేక్ కానప్పటివరకు తగిన స్టాప్ లాస్ తో సెల్ చేయడం చాలా మంచిది. రెసిస్టన్స్ 5900, 5925, 5965 సపోర్ట్ 5840-20, 5770