స్టాక్ మార్కెట్
లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారా ? ఐతే మీరూ
తప్పనిసరిగా చదవండి.?
మీరూ స్టాక్
మార్కెట్ లోకి ప్రవేశించి ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారా? అంటే ఈక్విటీ
మార్కెట్,కమోడిటీ మార్కెట్ , కరెన్సీ , ఫారెక్స్ మార్కెట్ ఏదైనా కావచ్చు. మీరూ ట్రేడింగ్ చేయాలి అనుకుంటేమాత్రం మీరూ ఇతరుల
సలహాలపై లేదా టిప్స్ పై ఎట్టి పరిస్థుతులలో ఆధారపడవద్దు. మీరూ స్వయంగా స్టాక్
మార్కెట్ పై పూర్తీ అవగాహన కలుగచేసుకొని , మీరూ స్టాక్ మార్కెట్ లో స్వయం
నిర్ణయాలు తీసుకొనే శక్తి,అవగాహన,పరిజ్ఞానం సంపాదించిన తర్వాత మాత్రమే మీరూ స్టాక్
మార్కెట్ లోకి ప్రవేశించడం లేదా ట్రేడింగ్ చేయడం ప్రారంభం చేయండి. దీనికి కొంత
సాధన,కొంతసమయం పడుతుంది.అయినా సరే స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన కలుగ
చేసుకోవడం తప్పనిసరి.స్టాక్ మార్కెట్ నిన్న ఉంది, నేడు ఉంది , రేపు ఉంటుంది. కాని
మీరూ ఎలాంటి అనుభవం లేకుండా ఇతరుల సలహాల, టిప్స్ పై ఆధారపడి కనుక మార్కెట్ లోకి
ప్రవేశిస్తే మీవద్ద గల కాపిటల్ ఒక్కసారి నష్టపోతే మీరూ జీవితంలో మళ్ళీ స్టాక్
మార్కెట్ లో వచ్చే మంచి లాభాలు అందుకొనే అవకాశం ఎంత మాత్రం ఉండదు. ముఖ్యంగా స్టాక్
మార్కెట్ లో టిప్స్ పై ఎత్తి పరిస్థుతులలో అధారపడవద్దు. స్టాక్ మార్కెట్ లో నా
అనుభవం సుమారు పన్నెండు సంవత్సరాల పైననే. నా అనుభవంలో కొన్ని వేల మంది టిప్స్
అందించే వారిని చూడటం జరిగినది. అందులో చాలా మంది కనీసం మార్కెట్ పై సరియైన అవగాహన
లేని వారే. ఏ టిప్ ఏ కారణం చేత ఇస్తున్నారో కూడా కనీసం సమాధానం చెప్పలేని
వారే. అందరూ అలాంటి వారే అని చెప్పలేను
కాని అధిక శాతం మంది అలాంటి వారే అని
చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఒకవేళ
టిప్స్ అందించే వారూ సమర్దులైనప్పటికి కూడా ట్రేడింగ్ సమయంలో మార్కెట్ కదలికలకి అనుగుణంగా స్పందిచే తత్త్వం ఒక్కొక్కరికి ,
ఒక్కోవిధమగా ఉంటుంది. టిప్స్ అందించే వారూ చెప్పేది ఒక్కటే గుడ్డిగా నేను చెప్పే
టిప్స్ ను ఫాలో అవ్వండి అని. కాని అది ఎంత మాత్రం మంచిది కాదు. లైవ్ మార్కెట్ లోకి
వచ్చే సరికి ప్రతి ఒక్కరిని వారి ఎమోషన్స్ , రిస్క్ తీసుకొనే సామర్ధ్యం తప్పనిసరిగా
ప్రభావితం చేస్తాయి. మార్కెట్ లో ఒక్కో వ్యక్తీ రిస్కు తీసుకొనే సామర్ధ్యం కూడా
ఒక్కో విధంగా ఉంటుంది. అందువలన మీరూ
టిప్స్ అందించే వారూ ప్రతి రోజూ ఇంత లాభం , అంత లాభం అని చెప్పే మాయా మాటలు నమ్మి
మోసపోకండి. వారికి లాభం వచ్చినది అని మీకూ రావాలి అని లేదు. అది మీ ట్రేడింగ్
సైకాలజీ పై ఆధారపడి ఉంటుంది. అందువలన వీలయినంత వరకు మీరీ స్వయంగా మార్కెట్ పై
అవగాహన కలుగ చేసుకొనే ప్రయత్నం చేయండి. వీలయినంత వరకు పత్రికలలో వచ్చే బిజినెస్ న్యూస్ , మంచి స్టాక్ మార్కెట్
పుస్తకాలు లేదంటే తెలుగులో మొదటిసారిగా స్టాక్ మార్కెట్ పై నేను వ్రాసిన పుస్తకాలు
కాని చదివి మార్కెట్ పై పూర్తీ అవగాహన పొందిన తర్వాత మాత్రమే మీరూ కస్టపడి
సంపాదించిన డబ్బూ తో ట్రేడింగ్ చేయండి. స్టాక్ మార్కెట్ అంటే రిస్కు తో
కూడుకున్నది అనే విషయం మర్చిపోవద్దు. కొన్ని సమయలాలో మీ డబ్బూ మొత్తం నష్టపోయే
అవకాశం ఉంది అని మాత్రం మర్చి పోవద్దు.