స్టాక్ మార్కెట్ పై అవగాహన
స్టాకు మార్కెట్ ఈ మాట వినగానే చాలామంది దానిని ఒక భూతంలాగా, లేదంటే ఒక జూదశాలగా చూస్తారు తప్ప దానిని ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనంగా అసలు చూడరు. ఎందుకంటే చాల మంది దానిలో ప్రవేశించి రాత్రి కి రాత్రే డబ్బులు సంపాదించాలి అనే అత్యాశ ,అవగాహనా లోపం, మరియు సరియైన పరిజ్ఞానం లేకుండా ప్రవేశించి నష్టాల పాలు అవుతుంటారు. నిజం చెప్పాలంటే తగు పరిజ్ఞానం, మంచి ప్రణాళిక తో స్టాకు మార్కెట్ లో ప్రవేశిస్తే దీనిలో పొందిన రాబడి ఇక మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనం లో పొందలేరు. మార్కెట్ అనలిస్టు గా నా ప్రత్యక్ష అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమనగా స్టాకు మార్కెట్ లో ప్రవేశిస్తూన్న వారిలో చాలా మంది కనీస అవగాహన లేకుండానే ప్రవేశిస్తున్నారు.దానితో వారు మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకొని అప్పుడు దానిని అది ఒక జూదశాల అని నిందిస్తూ అది మనకు అర్థం కాదు అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు,మీరు పది రూపాయలు ఖర్చు పెట్టి టమాటలు కొనేటప్పుడు ఐదు నిమిషాలు దానిలో పుచ్చులు ఉన్నాయా లేవా అని చూడటానికి కేటాయించిన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించాలి అంటే దానికి కూడా సమయం కేటాయించి కావలసిన విజ్ఞానం పొందాలి అనే విషయం గుర్తుంచుకోవాలి..మీరు స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించాలి అంటే ముందుగా మీరు లెర్నింగ్ స్టార్ట్ చేయాలి , లెర్నింగ్ చేస్తే ఏర్నింగ్ వస్తుంది.లెర్నింగ్ లేకుండా ఏర్నింగ్ ఉండదు.ఏదో పొద్దున్న లేచాం కంప్యూటర్ ముందు కూర్చున్నాం ట్రేడింగ్ చేసాం అంటే తప్పకుండా నష్టపోవలసి ఉంటుంది. ఈ బ్లాగ్ మీకు షేరు మార్కెట్ లో బేసిక్ నుండి మొదలు పెట్టి షేరు మార్కెట్ మీద పూర్తీ అవగాహనను కలుగచేస్తుంది. షేరు మార్కెట్ లో మీరు ప్రవేశించినది మొదలు మీకు కలిగే అనేక సందేహాలకు సమాధానం చెప్పుతుంది. షేరు మార్కెట్లో మీరు షేర్లు ఎలా కొనాలి , ఎప్పుడు కొనాలి ,ఎప్పుడు అమ్మాలి, IPO గురించి ,లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూడవలసిన ఫండ మెంటల్ విషయాలు,డే ట్రేడింగ్ నందు జరిగే పొరపాటులను ఏ విధంగా నివారించవచ్చో తెలుపుతుంది. సిప్ ఇన్వెస్ట్మెంట్ .మ్యూచవల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురుంచి తెలుపుతుంది.స్టాక్ మార్కెట్ లో సాధారణంగా చేసే పొరపాట్లు , వాటి వలన సంభవించే నష్టాల నుండి ఏ విధంగా బయటపడాలో వివరంగా తెలుపుతుంది. ఈ బ్లాగ్ లో మీ సౌలభ్యం కొరకు కొంత వరకు సాధారణంగా ట్రేడర్స్ ఉపయోగించే ఇంగ్లీషు పదాలనే వాడటం జరిగినది. ,ఈ బ్లాగ్ లో నేర్చు కొనే విషయాలు నిరంతరం మననం చేసుకొంటూ స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు ఏ విధంగా అందుకోవాలో తెలియచేస్తుంది. ముందుగా మీరూ స్టాక్ మార్కెట్ పైన మీకూ ఉండే అపోహలు వీడనాడండి. ఒక విషయం మీరూ తప్పక గుర్తుపెట్టుకోండి. ఈ బ్లాగ్ మీకూ అర్దిక విషయాలపై కేవలం అవగాహన కలుగచేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.మీరూ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోగలరు.అంతేకాని తెలిసితెలియని వ్యక్తుల సలహాలు మాత్రం వద్దు.