స్టాక్ మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే సెన్సెక్స్ అంటే ఏమిటి?స్టాక్  మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే  సెన్సెక్స్ అంటే ఏమిటి?
సెన్సెక్స్ లేదా సెన్సిటివ్ ఇండెక్స్  ( SENSEX-or SENSitve index ) ను జనవరి 1 1986 రొజూ ముంబాయి స్టాక్ ఎక్సేంజీ ద్వారా పరిచయం చేసారు.ఇది ఇండియా లో గల ప్రముఖ ఇండేక్స్లలో ఒకటి .ఈ సెన్సెక్స్ మొత్తం మార్కెట్ ను ప్రతిబంబించేలా రూపొందించబడినది.దీనిలో బాగా పేరొందిన , స్థిరపడిన , ఆర్ధికంగా బాగా బలమైన పునాదులు కలిగినటువంటి  ముప్పై  పెద్ద కంపెనీలతో ఏర్పాటు చేయడం జరిగినది.సెన్సెక్స్ లెక్కించడం కోసం ఆ కంపీనీ మార్కెట్ కాపిటలైజేషన్ లెక్కలోకి తీసుకోవడం జరిగినది. అధిక కాపిటలైజేషన్ కలిగిన కంపెనీకి అధిక వెయిటేజీ ఇవ్వడం జరిగినది.అదే విధంగా 1978-79వ సంవత్సరం ను బెస్ సంవత్సరంగా , 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా పరిగణలోకో తీసుకోవడం జరిగినది.అంటే సెన్సెక్స్ నిర్మాణ సమయంలో మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ విలువ  100 తీసుకోవడం వలన మరుసటి రోజూ మార్కెట్ కాపిటలైజేషన్  10% పెరిగితే ఇండెక్స్ కూడా   10% పెరిగి 100 నుండి  110 అవుతుంది. 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశం లెక్కించడానికి సులభంగా ఉంటుంది అనే ఆలోచనే. సెన్సెక్స్ లో ఎన్నుకొనే కంపెనీలు క్వాలిటీ పరంగా మరియు క్వాంటిటీ పరంగా మంచి లక్షణాలు కలిగిఉంటాయి.
ఇప్పుడు సెన్సెక్స్ ఇండెక్స్ యే విధంగా నిర్మిస్తారో ఒక్కసారి చూద్దాం.మార్కెట్ లో ఒక స్టాక్ మాత్రమే ఉంటే దానిలో పెరుగుదల కాని, పతనం కాని సులభంగా అర్ధం చేసుకోవచ్చు. బెస్ ఇండెక్స్ విలువ  100 కాబట్టి ఒక స్టాక్ యొక్క ధర 200 నుండి 240 వరకు పెరిగితే ఆ స్టాక్ లో పెరుగుదల  20% నమోదు ఐతే ఇండెక్స్ లో కూడా పెరుగుదల 20% ఉండి ఇండెక్స్  100 నుండి 120 కి చేరుకుంటుంది. మరుసటి రోజు ఆ స్టాక్ యొక్క ధర  10% పతనం జరిగి  216 కు చేరుకుంటే సెన్సెక్స్ ఇండెక్స్ కూడా 10%  తగ్గడంతో   110 కి చేరుకుంటుంది.ఈ విధంగా సెన్సెక్స్ లో ఒకే స్టాక్ ఉండటం వలన ఇండెక్స్ విలువ  మనం లెక్కించడం సులభంగా జరిగినది. మరి ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు స్టాక్ లు ఉంటే యే విధంగా లెక్కించాలో చూద్దాం.
ఇప్పుడు ఇండెక్స్ లో A మరియు B అనే రెండు కంపెనీల స్టాక్స్ ఉన్నాయి అనుకోండి. A స్టాక్ ధర 200 వద్ద ఉంది , B స్టాక్ ధర  150 వద్ద ఉంది.సెన్సెక్స్ ఇండెక్స్ ఏర్పాటు చేయడంలో స్టాక్స్ యొక్క మార్కెట్ కాపిటలైజేషన్ పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా ఆ కంపెనీకి ఇండెక్స్ లో వెయిటేజీ ఇస్తారు అని మనం ఇది వరకే తెలుసుకున్నాం. మరి ఇప్పు ఈ రెండు స్టాక్ ల యొక్క వెయిటేజీ ఏవిధంగా తెలుసుకోవాలో ఒక్కసారి చూద్దాం. ఒక కంపీనీ లో గల మొత్తం షేర్లను ఆ కంపెనీ షేరు లేదా స్టాక్ ధరతో గుణించగా వచ్చేదే మార్కెట్ కాపిటలైజేషన్ . కంపెనీ  A వద్ద  100,000 షేర్లు మరియు కంపెనీ  Bవద్ద  200,000 షేర్లు ఉంటే కంపెనీ  A కాపిటలైజేషన్  200 x 100000 =20000000 మరియు కంపెనీ  B కాపిటలైజేషన్ 150 x 200000 = 30000000 అవుతుంది. మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ (200 x 100000 + 150 x 200000) Rs 500 lakhs అవుతుంది. ఈ మొత్తం  సెన్సెక్స్ ఇండెక్స్ బెస్ విలువ   100 కి సమానం  అవుతుంది.ఇప్పుడు కంపెనీ  A స్టాక్ ధర  260 (30% increase in price) కి చేరుకుంది.కంపెనీ  B స్టాక్ ధర  135. (10% drop in price)కి చేరుకుంది.ఇప్పుడు మార్కెట్ కాపిటలైజేషన్  260 x 100000 +135 x 200000= Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే స్టాక్స్ ధరలలో మార్పు వల్ల మార్కెట్ కాపిటలైజేషన్ ) Rs 500 lakhs నుండి Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే 6% పెరుగుదల నమోదు కావడం జరిగినది కావున సెన్సెక్స్ ఇండెక్స్ లో కూడా పెరుగుదల 6% నమోదు కావడం జరుగుతుంది కాబట్టి సెన్సెక్స్ ఇండెక్స్ 100 to 106 మార్పు చెందడం జరుగుతుంది.ఈ విధమైన లాజిక్ ను సెన్సెక్స్ లో ఎంచుకున్న స్టాక్స్ అన్నిటికి విస్తరించి లెక్కించడం జరుగుతుంది. అందుకే స్టాక్స్ యొక్క ధరల మార్పు కి అనుగుణంగా సెన్సెక్స్ కూడా మార్పు చెందడం జరుగుతుంది. ఐతే సెన్సెక్స్ ఇండెక్స్  ముప్పై ఆర్ధికంగా బలంగా ఉన్న పెద్ద కంపెనీలను చేర్చడం ద్వారా లెక్కిస్తాయు అని తెలుసుకున్నాం. కాని ఒక్క విషయం ఈ విధంగా లెక్కించడానికి  కంపెనీ యొక్క అన్ని షేర్లను పరిగణలోకి తీసుకోరు. కేవలం ఫ్రీ ప్లోటింగ్ ఉన్న షేర్ల విలువను  మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.ప్రీ ప్లోటింగ్ అంటే ఏమిటో మనం ఒక్క సారి తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లో ప్రజలూ ట్రేడ్ చేయడానికి అందుబాటులో ఉన్న షేర్లను ప్రీ ప్లోటింగ్ షేర్లు అంటారు.అంటే కంపెనీ ప్రమోటర్లు, FDIs , ప్రభుత్వం వద్ద ఉన్న షేర్లు మినహాయించి మిగిలిన షేర్లను ప్రీ ప్లోటింగ్ షేర్లు అంటారు.ఒక కంపెనీ యొక్క    ప్రీ ప్లోటింగ్ విలువను లెక్కించాలి అంటే ఒక కంపెనీ మొత్తం కాపిటలైజేషన్లో  ఎంత శాతం పబ్లిక్ వద్ద ఉందో ఆ మొత్తం ను పరిగణలోకి తీసుకుంటారు.. పబ్లిక్  వద్ద  ఎంత శాతం షేర్లు అందుబాటులో ఉంటే ఆ కంపెనీ యొక్క ప్రీ ప్లోటింగ్ విలువ ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు ఒక కంపెనీ యొక్క మార్కెట్ విలువ  Rs 100,000 కోట్లు అనుకుంటే ఒక్క షేర్ విలువ Rs 1,000 ఐతే కంపెనీ వద్ద ఉన్న మొత్తం షేర్ల సంఖ్యా 100 అవుతాయి. కాని కేవలం 20% షేర్లు మాత్రమే పబ్లిక్ కి అందుబాటులో ఉంటే అప్పుడు కంపెనీ యొక్క ఫ్రీ ప్లోటింగ్ మార్కెట్ విలువ మొత్తం కంపెనీ యొక్క మార్కెట్ విలువ లో  20% మాత్రమే అవుతుంది. అంటే  Rs 100,000x20% =20,000అవుతుంది.మీరు ఈ ఫ్రీ ప్లోటింగ్ విలువ ఎప్పటికప్పుడు క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.


ఇప్పుడు సెన్సెక్స్  లో గల ముప్పై కంపెనీల ఫ్రీ ప్లోటింగ్ విలువ ప్రకారం సెన్సెక్స్ ఇండెక్స్ పెరగడం లేదా తగగ్డం జరుగుతుంది.
ఉదాహరణకు  Rs 10,00,000కోట్ల ఫ్రీ ప్లోట్   మార్కెట్ కాపిటలైజేషన్  ఉన్నప్పుడు సెన్సెక్స్ ఇండెక్స్  12500 ఉంటే , ఫ్రీ ప్లోట్   మార్కెట్ కాపిటలైజేషన్ పెరిగి   Rs 11,50,000 కోట్లకు చేరుకుంటే సెన్సెక్స్ ఇండెక్స్  ఎంత ఉండగలదో లేక్కగట్టండి.తెలియడం లేదా ఐతే సమాధానం ఏంతో తెలుసా 14,375. ఎలాగో తెలియడం లేదా చిన్నప్పుడు లెక్కల్లో నేర్చుకున్న  ratios and proportionsగుర్తుతెచ్చుకోండి.ఐనా సాధ్యం కాకపోతే మాకు మెయిల్ చేయండి.