స్టాక్ మార్కెట్ అంటే భయం ఎందుకు ?


స్టాక్ మార్కెట్ అంటే భయం ఎందుకు ?
ఈక్వీటీ లేదా షేర్ అంటే అర్ధం ఏమిటి ? ఈ ప్రశ్న చాలా మంది మన దేశ ఇన్వెస్టర్ల  మదిని తోలిచివేస్తుంది.ఈక్వేటీ మార్కెట గత పది, ఇరవై , ముప్పై సంవత్సరాల నుండి  మంచి రాబడిని అందిస్తుంది. కాని మన దేశ ఇన్వెస్టర్లు మాత్రం ఈక్వీటీ మార్కెట్ లో మంచి రాబడి అందుకోవడం లో మాత్రం విఫలమవుతున్నారు. మన దేశ స్టాక్ మార్కెట్ లో మన దేశ ఇన్వెస్టర్ల కంటే కూడా విదేశీ ఇన్వెస్టర్లు  మంచి రాబడి అందుకుంటున్నారు.ఈ ఆర్టికల్ లో మీరూ స్టాక్ మార్కెట్ ఉపయోగించి  మీ సంపద ఎలా వృద్ది చేసుకోవాలో తెలియచేయడం జరుగుతుంది.
ఒక ఫైనాన్షియల్ అడ్వయిజర్ గా మిమ్ములను ఈక్వీటీ లలో లేదా ఈక్వీటీ సంభందిత మ్యుచవల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయమని మీకు చెప్తే  మీ దగ్గర నుండి వచ్చే మొదటి సమాధానం  మేము మా  అమౌంట్ తో ఎలాంటి రిస్కు తీసుకోలేము కాని మా అమౌంట్ పై మంచి రాబడి రావాలి అని మాత్రం చెప్తారు. ఇది వరకటి ఆర్టికల్స్ లో దీర్ఘకాలంలో అధిక రాబడి  యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందో మీకు తెలియచేయడం జరిగినది.అదే విధంగా స్టాక్ మార్కెట్ కూడా దీర్ఘకాలంలో మనదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అధిక రాబడి ఏ విధంగా అందించడం జరిగినదో మీకూ తెలుసు .కాని  మన దేశ ప్రజలూ మాత్రం ఈక్వీటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. మనదేశంలో  కేవలం  5-6% మాత్రమే  డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా  ఈక్వీటీలలో  ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. క్రింద ఇవ్వబడిన చార్ట్ ను ఒక్కసారి పరిశీలించండి .గత ముప్పై సంవత్సరాల  క్రితం మీరూ  Rs100 లను వివిధ రకాల అసెట్ తరగతులలో ఇన్వెస్ట్ చేస్తే వాటి రాబడి ఏ విధంగా ఉందొ ఒక్కసారి చూడండి..


ఈక్వీటీ అంటే మీకూ తెలుసుకదా ? ఒక వ్యాపారం లో  భాగస్వామ్యం లేదా వాటా అని.1000 షేర్లు ఉన్న XYZ  అనే కంపెనీలో మీకు 10 షేర్లు ఉన్నాయి అంటే మీరూ ఆ కంపెనీలో 1 % వాటా కలిగి ఉన్నారు అని అర్ధం. XYZ   కంపనీ లాభాలు పొందుతుంటే మీ వాటకి అనుగుణంగా డివిడెండ్ అందుకోవడం మరియు మీ షేర్ల  ధరలో పెరుగుదల వలన మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా పెరుగుతుంది . ఒకవేళ కంపెనీ నష్టాలలో ఉంటె మీ షేర్ల ధరలో తగ్గుదల వలన మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా తగ్గుతుంది. 
మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. మీరూ ఒక వ్యాపారం ప్రారంభం చేసి అది మంచి లాభాలు గడించాలి అంటే మీరే కాదు ఎవ్వరైనా చెప్పే సమాధానం ఒక్కటే . కొంత కాలం తప్పకుండా పడుతుంది అనేది. ఇంకా చెప్పాలి అంటే మంచి వృద్దిలోకి రావడానికి దీర్ఘకాలం పడుతుంది అంతవరకు ఓపిక పట్టాలి  అనే  విషయం మీకు తెలుసుకదా ? ఇంత చిన్న సాదరణ విషయాన్ని మనం వేరే వాళ్ళ వ్యాపారంలో షేర్ల రూపంలో పెట్టుబడి పెడుతున్నప్పుడు ఎందుకు మర్చిపోతాం.  మనం షేర్లలో ఇన్వెస్ట్ చేయగానే మరుసటి రోజు నుండే లాభాలు వచ్చాయా లేదా అని చూడటం చేస్తూ ఉంటాం. ఇంకా కొంత మంది చెప్తూ ఉంటారూ మేము లాంగ్ టర్మ్  ఇన్వెస్ట్ చేస్తుంటాం. వారి దృష్టిలో లాంగ్ టర్మ్  అంటే ఒకనెల లేదా ఒక సంవత్సరం  మాత్రమే. నిజంగా మీరూ చేసే వ్యాపారం అంత త్వరగా అభవృద్ధి చెందుతుంది అని భావిస్తున్నారా ? కాదు కదా ? మరి అంత త్వరగా మీరూ ఇన్వెస్ట్ చేసిన షేర్ల ధరలు పెరగాలి అని అనుకుంటారు.
మీరూ ఆపిల్  లేదా ఏ ఇతర అనే పండ్లను పండించాలి  అంటే మీరూ తప్పకుండా  క్రింది విధంగా ఉండాలి?
ముందుగా మీరూ విత్తనాలను నాటాలి
అది పెరగడానికి సరిపడా నీళ్ళు పోయాలి
కొంత కాలం ఓపికతో వేచి చూడాలి 

కొంత కాలం తర్వాత మీ హార్డ్ వర్క్ , మీ ఓపికకి ప్రతిఫలంగా  పండ్లను అందుకోగలుగుతారు. నిజమే కదా ? అదే ఈక్వీటీ ల విషయానికి వస్తే మాత్రం తొందరగా లాభాలు అందుకోవాలి అని చూస్తారు.మీలో ఎంత మంది నిజంగా అర్ధం చేసుకుంటున్నారు చెప్పండి. ఈక్వీటీలలో  పెట్టుబడి అంటే దీర్గకాలం కొనసాగితే మంచి లాభాలు వస్తాయి అనే విషయం తెలిసి కూడా ఎదురుచూడలేకపోతున్నారు. మీలో చాలా మంది బంగారం తరతరాలుగా దాచుకోవడం చేస్తుంటారు. తాతలు మనవళ్ళు, మనవరాళ్ళ కోసం బ్యాంక్ లో ఫిక్సుడ్ డిపాజిట్ చేయడం  చేస్తునేఉంటారు . కాని ఎంత మంది  అదే బ్యాంక్ ఈక్వీటీ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు బ్యాంక్ మీదా అంతనమ్మకం ఉన్నప్పుడు కనీసం ఆ బ్యాంక్ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం వలన ఎలాంటి  భయం లేదు కదా ?
సాదారణంగా ఈక్వీటీలు రెండు రకాలుగా లాభాలు అందిస్తాయి.ఒకటి స్పెక్యులేటివ్ పరంగా , రెండవది ఫండమెంటల్ గ్రోత్ పరంగా .95% ఇన్వెస్టర్లు కేవలం  స్పెక్యులేటివ్ పరంగా తక్కువ కాలంలో లాబాలు అందుకోవడానికే  ప్రయత్నిస్తున్నారు.అంటే స్వల్ప కాలంలో షేర్ల ధరల మార్పు ఆధారంగా లాభాలు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ విధంగా అతి తక్కువకాలంలో లాభాలు అందుకోవడానికి ప్రయత్నించే సమయంలోనే నష్టాల పాలు కావడం జరుగుతుంది. స్వల్పవ్యవధిలో మార్కెట్ ను అంచానా వేయాలి అంటే చాలా  టెక్నికల్ అనాలసిస్ లో చాలా అనుభవం కావలసి ఉంటుంది.ఈక్వీటీలలో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయడం వలన కేవలం లాభాలు అందుకోవడం మాత్రమే కాదు సంపద కూడా వృద్ది చెందుతుంది. మీరూ ఏదైనా వ్యాపారం కాని, భారత ఆర్ధిక వ్యవస్థ కాని రాబోయే నెలరోజులలో ఎలా ఉండబోతుందో చెప్పండి అంటే చెప్పగలరా లేదు కదా ? అదే ఐదు, పది సంవత్సరాలలో ఎలా ఉండబోతుంది అంటే తప్పకుండా జవాబు చెప్పగలరు. ఏవి ఏ విధంగా రాబడి అందించాయో తెలుస్తుంది.
ఇక రిస్కు విషయానికి వస్తే తప్పకుండా స్వల్పకాలంలో షేర్ల ధరల హెచ్చుతగ్గుల వలన ఏర్పడే రిస్కు తప్పకుండా ఉంటుంది .కాని మీరు దీర్ఘకాలం కొరకు ఇన్వెస్ట్ చేస్తే  ఉండే రిస్కు చాలా స్వల్పం.మీరూ పైన ఇచ్చిన చార్ట్ ఒక్కసారి చూడండి.  ఈక్వీటీలు అందించిన రాబడి మరే ఇతర సాధనాలు అందించలేదు.ఈక్వీటీలు అంత మంచి రాబడి అందించినప్పుడు  ఎందుకు చాలా మంది ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు  అంటే దీర్ఘకాలం కోసం కాకుండా స్వల్ప కాలంలో లాభాలు అందుకోవాలి  అనే అత్యాశతో వచ్చిన వాళ్ళు , సగం అవగాహన తో స్టాక్ మార్కెట్ అంటే జూదం అనే అభిప్రాయంతో ఉండే వారూ , సరియైన  పరిజ్ఞానం లేకుండా సలహాలు ఇచ్చే వారి వాళ్ళ స్టాక్ మార్కెట్ అంటే ఒక తప్పుడు అభిప్రాయం  నెలకొంది.అందువలన మీరూ దీర్ఘాకాలం కోసం ఇన్వెస్ట్ చేయండి. మీరూ స్టాక్ మార్కెట్ లో సంభవించే హెచ్చుతగ్గులను చూసి భయపడుతూ  ప్రతిరోజు మీరూ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ షేర్ల ధరలు చూసి భయపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు.మీరూ మంచి ఆర్ధిక నిపుణల సలహలు మాత్రమే తీసుకోండి. అంతే కాని మిడిమిడి జ్ఞానం తో ఉండే వారి సలహాలు ఎట్టి పరిస్థితులలో వద్దు. చివరగా మీకు చెప్పేది ఒక్కటే. ఈక్వీటీలలో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయండి. మీరూ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ , దేశ అభివృద్దితో పాటు మీరూ అభివృద్ధి చెందండి.స్టాక్ మార్కెట్ పై మీకూ ఉండే భయాన్ని వీడనాడండి .