ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఎమి చేయాలి part 3


ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఎమి చేయాలి    part 3
ప్రస్తుతం మీ వయస్సు ముప్పై సంవత్సరాలు అనుకుంటే మీరు అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ అవుతారు అనుకుంటే మీరు తక్షణం బయట తాగే టీ ఒక్కటే మానేస్తే ఎంత మిగులుతుందో చూద్దాం. టీ ఒక్కటి ఖరీదు  ఐదు రూపాయలు అనుకున్న  నెలకు  నూట యాభై రూపాయలు మిగులుతుంది. ఈ డబ్బును ప్రతి నెల ఎనిమిది శాతం వడ్డీ వచ్చేలా కనీసం బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్ పథకంలో  మీ  రిటైర్మెంట్ వరకు ఎంత అవుతుందో తెలుసా !    Rs 222639 అవుతుంది . నిజమే ఇది క్రమం తప్పకుండా పొదుపు చేయడం వలన సాధ్యం అవుతుంది.మీరు కేవలం టీ మానివేయడం వల్ల వచ్చిన మొత్తం . ఇంతకంటే పెద్ద పెద్ద అనవసరమైన ఖర్చులు మానేస్తే ఎంత మొత్తం మిగులుతుందో చూద్దాం .  
రోజుకి ఒక సిగరేటు ప్యాకెట్ ఖరీదు Rs  50
నెలకు       Rs 1500 
ఈ డబ్బును మీరు ప్రతి నెల క్రమం తప్పకుండా బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ చేస్తే, వడ్డీ ఎనిమిది  శాతం వస్తుంది అనుకుంటే మీ రిటైర్మెంట్ నాటికి  మీకు చేతికి వచ్చే మొత్తం Rs 2226392.

 ఒక వేళ మీరు దీనిని ఏదైనా మ్యుచవల్ ఫండ్ పథకంలో సిప్ పద్ధతి ద్వారా పెట్టుబడిగా  క్రమం తప్పకుండా ప్రతి నెల మీరు సిగరెట్ మానేయడం వలన  అదా చేసిన Rs 1500    లను మీ రిటైర్మెంట్  వరకు కొనసాగించినచో  ఎంత వస్తుందో చూద్దాం . స్టాక్ మార్కెట్ దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తుంది అనే విషయం మీ అందరికి తెలిసిన విషయమే కదా !స్టాక్ మార్కెట్ సాలీనా   సుమారు  18 % వృద్ది కనబరుస్తుంది . మనం ఇక్కడ మరీ అత్యాశకి పోకుండా  కేవలం  12%  మాత్రమే  వృద్ది సాధిస్తుంది అనుకుంటే మీరు సిప్ పద్ధతి లో  Rs 1500  పెట్టుబడిగా  మీ రిటైర్మెంట్   సమయానికి మీరు అందుకొనే డబ్బూ Rs 4578019 . అవును అక్షరాల ఇది మూమ్మటికి  నిజం .
అదే విధంగా ఒక కుటుంబం ఈ రోజుల్లో ఒక సినిమాకు వెళ్తే ఎంత లేదన్న కనీసంరెండు వందల రూపాయలు అవుతుంది.ఈ రెండు వందలను కూడా   క్రమం తప్పకుండా బ్యాంక్ లో రికరింగ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ చేస్తే, వడ్డీ ఎనిమిది  శాతం వస్తుంది అనుకుంటే మీ రిటైర్మెంట్ నాటికి  మీకు చేతికి వచ్చే మొత్తం  Rs .296852 ఈ రెండు వందలను బ్యాంక్ లో కాకుండా  సిప్ పద్ధతి ద్వారా క్రమం తప్పకుండా మ్యుచవల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే  మీ రిటైర్మెంట్ నాటికి  మీకు చేతికి వచ్చే మొత్తం    Rs 610402  . అదే విధంగా కొంత మంది అదే పనిగా షాపింగ్ కి తిరగడం  అవసరం లేకున్న దుస్తులు కొనడం చేస్తుంటారు. మీరు ఖర్చు చేస్తున్నప్పుడు చాలా  చిన్నమొత్తం డబ్బే కదా అనుకుంటారు . కాని, ఈ చిన్న మొత్తమే కొన్ని సంవత్సరాల తర్వాత ఎంత  పెద్ద మొత్తం  అవుతుందో తెలియచేయాడమే నా ఉద్దేశం.  ఇక్కడ నేను మీ కోరికలు చంపు కోమని చెప్పడం కాదు నా  ఉద్దేశం .కొన్ని అనవసరమైన  ఖర్చులను  తగ్గించుకోని దానిని సరియైన పద్దతిలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభం కలుగుతుందో మీకు తెలియచేయడమే నా ఉద్దేశం  . ముందు మీకు కావలసినది అవగాహన    . అవగాహన  ఉంటే ఆలోచన అదే వస్తుంది. ఆ మంచి ఆలోచనతో పొదుపు చేయడం ప్రారంభించండి. చేసిన పొదుపును  మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనాలలో ఇన్వెస్ట్ చేయండి. మన దేశంలో ప్రజలు   సంప్రాదాయ పథకాలో  పొదుపు చేస్తున్నారే తప్ప ఇన్వెస్ట్మెంట్ సాధనాల వైపు చూడలేకపోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఆర్ధిక అంశాల పట్ల సరియైన అవగాహన లేకపోవడమే.

ముఖ్య గమనిక :మీరు స్టాక్ మార్కెట్   టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html