T20 క్రికెట్ కి, మరియు
ఇన్వెస్ట్మెంట్ కి మధ్యగల ఆసక్తికర
సారూప్యతలు
T20 క్రికెట్ కి, ఇన్వెస్ట్మెంట్ మధ్యన సారూప్యతలు
ఏంటి ? అని అచ్చర్యపోకండి .ఫైనాన్సియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ మరియు T20 క్రికెట్ కి మధ్యన ఉమ్మడి వ్యూహాలు చాలా ఉన్నాయి.క్రికెట్
మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీద
అనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ T20 ప్రారంభం అయ్యాక చాలా ప్రజాదరణ పొందడమే
కాకుండా అధిక లాభాలు కూడా అందుకొంటుంది. T20 క్రికెట్ లో ఆటగాళ్ళు అడే ఆటకి , వారూ
తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు చేయడానికి పడే తపనకి , మీ ఇన్వెస్ట్మెంట్ , మీ రిటైర్మెంట్ అనంతర జీవితం సాఫీగా గడపడానికి మీరు చేసుకునే ఆర్ధిక ప్రణాళికకి మధ్య గల సారూప్యతలు చాలా ఉన్నాయి. ప్రముఖ ఆర్ధిక
నిపుణులు కార్తీక్ వర్మ చక్కని ఆసక్తి కరమైన విశ్గ్లేషణ చేయడం జరిగినది. అవి
ఏంటో మనం కూడా ఒక్కసారి వివరంగా పరిశీలిద్దాం.అవి
1. Start early
2. Risk and Reward tradeoff
3. Be ready for the unexpected
4. Strategic break
5. Balance
6. One bad over
7. Consistency gets rewarded
8. Coaching helps
9. Distractions can be entertaining but ultimately the score matters
10. Winning attitude
ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురుంచి వివరంగా
తెలుసుకుందాం.
Start early
T20 క్రికెట్ లో బ్యాట్స్ మెన్ బాదడం లేదా బౌలర్ వికెట్లు తీసి మ్యాచ్ పై పట్టు
సాధించడానికి ప్రారంభంలోనే
ప్రయత్నిస్తారు. అదే విధంగా మీరు కూడా మీ జీవితంలో ఆర్ధికంగా ఎదగాలి అంటే మీరూ
పొదుపు చేయడం ,చేసిన పొదుపును ఇన్వెస్ట్మెంట్ గా మార్చడం ఎంత త్వరగా చేస్తే అంత
మంచిది. మీరూ క్రమం తప్పకుండా , త్వరగా
ఇన్వెస్ట్ చేస్తూ సరియైన ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవడం వలన కౌమ్పౌన్డింగ్ గ్రోత్ వలన మంచి లాభాలు అందుకోవచ్చు.
Start now, Save more, Retire rich.
Risk and Reward tradeoff
క్రికెట్ అట యొక్క ఫలితం కెప్టెన్ మరియు
ఆటగాళ్ళు తీసుకొనే రిస్కు పై అధారపడి
ఉంటుంది అనే విషయం మీకు తెలుసుకదా ? మీకు వచ్చే లాభాలు ఎప్పుడూ కూడా మీరు తీసుకొనే
రిస్కుపై , మీరూ చేసే ఇన్వెస్ట్మెంట్ పై ఆధారపడి ఉంటుంది.మీరూ ఎలాంటి
ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కూడా మీరూ రిస్కుకి సిద్దపడి లేకపోతే మీరూ మంచి
రిటర్న్స్ అందుకోలేరు. అందుకే ముందుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు రిస్కు ఎంత
వరకూ తీసుకోగలరు , ఆ రిస్కు వలన సంభవించే పరిణామాలను ఎంత వరకు తట్టుకోగలరూ మొదలగు వాటిని
నిర్ణయించుకోవాలి. రిస్కు లేకపోతే రిటర్న్ లేదని తెలుసుకోండి.
Be ready for the unexpected
ఉహించని సంఘటనలు జరిగిన కూడా తట్టుకోవడానికి
సిద్దంగా ఉండాలి. క్రీజ్ లో నిలదొక్కుకొని బాగా ఆడుతున్న అటగాడు ఉహించని
విధంగా ఔట్ ఐనప్పటికి తర్వాత బ్యాట్స్
మెన్ తనపని తనూ చేసుకుంటాడు.
ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడూ సాదారణంగా
మనుషులకు రెండు లక్షణాలు ఉంటాయి. వాటిలో ఒక్కటి భయం అంటే పెట్టిన ఇన్వెస్ట్ ఏమవుతుందో అని, ఇక
రెండోది అత్యాశ అంటే కొన్నాళ్ళు ఆగితే ఇప్పటికంటే అధిక లాభం వస్తుంది అనే అత్యాశ ద్వారా మొత్తం పోగోడుతారు. అందుకే మన
పెట్టుబడి ఉహించని సంఘటనల ద్వారా నష్టపోయిన తట్టుకోవడానికి సిద్దంగా ఉండాలి.