REC టాక్స్ సేవింగ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా ? లేక బ్యాంక్ ఫిక్సుడ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా ?
మార్చి 31, 2013 లోపు పది ప్రభుత్వ అధీనంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు రూ 53500 కోట్ల విలువైన టాక్స్ సేవింగ్ బాండ్స్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై వచ్చే వడ్డీ మీదా ఎలాంటి టాక్స్ ఉండదు.ఏయే కంపెనీలు టాక్స్ సేవింగ్ బాండ్స్ జారీ చేస్తున్నాయో క్రింద ఇవ్వబడినవి.
ఈ బాండ్స్ ను టాక్స్ సేవింగ్ బాండ్స్ అంటారు . వీటిపై వచ్చే వడ్డీ మీదా మీరూ ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదు.పై వాటిలో REC బాండ్స్ జారీ ఈ నెల మూడవ తేది నుండి జారీ చేయబడుతున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వలన నిజంగా లాభం ఉందా ? అని చాలా మంది అడగటం జరుగుతుంది. అందువలన వీటి గురించి ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. REC బాండ్స్ 10, 15 సంవత్సరాల కాల పరిమితితో 7.22% , 7.38% కూపన్ రేటు అందిస్తున్నాయి .వీటిని స్టాక్ మార్కెట్ లో కూడా , కొనడం , అమ్మడం చేయవచ్చు. వడ్డీ పై ఎలాంటి పన్ను లేదు .కాని, కాపిటల్ గెయిన్ టాక్స్ ఉంటుంది.ప్రస్తుతం పది సంవత్సరాల కాలపరిమితి గల బాండ్స్ స్టాక్ మార్కెట్ లో 7.22% వద్ద ట్రేడ్ కాబడుతున్నాయి.
అదే విధంగా ఇప్పుడు దీర్ఘకాల బ్యాంక్ ఫిక్సుడ్ డిపాజిట్లపై వడ్డీ రేటు సుమారుగా 8.5% to 8.75%వరకు అందిస్తున్నాయి.సాదారణంగా చాలా మంది బ్యాంక్ డిపాజిట్ల లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు.కాని వాస్తవంగా మీరు బ్యాంక్ ఫిక్సుడ్ డిపాజిట్లపై పొందిన వడ్డీ పై టాక్స్ చెల్లించవలసి ఉంటుంది అనే విషయం మర్చిపోవద్దు.మీరూ పొందిన వడ్డీ ని మీ ఆదాయానికి కలిపి ఆదాయపు పన్ను లెక్కించవలసి ఉంటుంది.మీ ఆదాయం కనుక అధిక పన్ను స్లాబ్ రేటులో ఉంటె మీ రాబడి తక్కువగా ఉంటుంది.ఒకవేళ మీ ఆదాయం కనుక అధిక స్లాబ్ రేటు అంటే 30% స్లాబ్ లో కనుక ఉండి మీ బ్యాంక్ ఫిక్సుడ్ డిపాజిట్లపై టాక్స్ ముందు వడ్డీ 8.5% ఉంటె మీకూ వాస్తవంగా వచ్చే వడ్డీ కేవలం 5.9% మాత్రమే .
ఉదాహరణకు మీరూ 8.5% వడ్డీ తో పది వేల రూపాయలు బ్యాంక్ లో ఫిక్సుడ్ డిపాజిట్ చేస్తే సంవత్సరం తర్వాత మీకూ వచ్చే రాబడి రూ 10850 ఐతే మీరూ కనుక 10% ఆదాయపు పన్ను స్లాబ్ లో కనుక ఉంటె మీకు వాస్తవంగా వచ్చే మొత్తం రూ 10765 అంటే మీ రాబడి 7.6% మాత్రమే. ఒకవేళ మీరూ 20% ఆదాయపు పన్ను స్లాబులో ఉంటె వచ్చే మొత్తం రూ 10680 ఇది 6.8%.మీరూ 30% ఆదాయపు పన్ను స్లాబులో ఉంటె వచ్చే మొత్తం రూ 10595 ఇది 5.9% మాత్రమే.
పై విషయాలను బట్టి చూస్తె ఒక్క విషయం మాత్రం స్ప్రుస్టంగా అర్ధం అవుతుంది. మీరూ కనుక అధిక ఆదాయపు పన్ను స్లాబ్ లో ఉంటె టాక్స్ ప్రీ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడమ వలన ఉపయోగం ఉంటుంది. మీరూ తక్కువ ఆదాయపు పన్ను గల స్లాబ్ లో ఉంటె ఎలాంటి ఉపయోగం ఉండదు.