స్టాక్ మార్కెట్ టిప్స్ ప్రొవైడర్స్ ప్రజలను ఏవిధంగా మోసం చేస్తారో చూద్దాం.



స్టాక్ మార్కెట్ టిప్స్ ప్రొవైడర్స్ ప్రజలను ఏవిధంగా మోసం చేస్తారో చూద్దాం.
స్టాక్ మార్కెట్ టిప్స్ పోవైడర్స్  దగ్గర  సుమారు పదివేల మంది ఈమెయిల్స్ లేదా సెల్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఈ పదివేల మందిని రెండు గ్రూపులు గా విభజించి  వాటిలో ఒక గ్రూప్ కి  బైకాల్   , రెండవ గ్రూప్ కి సెల్ కాల్  ఇస్తారు. ఈ విధంగా పంపించిన కాల్స్ లో ఒక గ్రూప్ కి  తప్పనిసరిగా కరెక్ట్  కాల్స్  వేళ్ళుతాయి
.కరెక్ట్ ఐనా   గ్రూప్ ను  మరల రెండు గ్రూప్ లుగా విభజించి ఒక గ్రూప్ కి  బైకాల్   , రెండవ గ్రూప్ కి సెల్ కాల్  ఇస్తారు .ఈ విధంగా ఆరుసార్లు చేయడం వలన  అన్ని సార్లు కేవలం  నూట యాభై ఆరు మంది మాత్రమే  కరెక్ట్ కాల్స్ పొందుతారు.ఇప్పడు ఈ నూట యాభై ఆరు మంది కి టిప్స్ పోవైడర్స్  మీదా చాలా నమ్మకం ఏర్పడి  వారిలో కనీసం ఇరవై , ముప్పై శాతం మంది  వారి టిప్స్ కోసం తప్పకుండా మనీ చెల్లిస్తారు.టిప్స్ ఇవ్వడానికి వారు చార్జీలు సుమారు పదివేల నుండి యాభైవేల వరకు తీసుకుంటారు.కేవలం ఆరు రోజులు ఈ విధంగా టిప్స్ ఇచ్చి అమాయకులను , అవగాహన లేని వాళ్ళను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి  మీరు ఇలాంటి వారి మాయలో  పడి  నష్టాల పాలు మాత్రం కావద్దు.అందరూ అలాగే ఉంటారు అని కాదు కాని ఎక్కువ శాతం ఇలాగే ఉంటారు.  అందుకే మీరు  ఆర్ధిక విషయాలపై   ఇతరుల పైన అధారాపడకుండా   మీరు అవగాహన కల్పించుకోవడం మంచిది. నా వద్ద  కనీసం మన దేశంలో  1000 మంది టిప్స్ అందించే వారి జాబితా కలదు. అందులో  కేవలం పది శాతం మంది మాత్రమే మార్కెట్ పై అవగాహన  కలిగిన వారూ  మాత్రమే. మిగితా వారూ కేవలం అమాయక ప్రజలతో ఆటలాడుకునే వారు మాత్రమే.మీరూ ఒక్క విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సాదారణంగా మనుషుల మనస్తత్వాలు ఒక్కో రకంగా ఉంటాయి. అందులో డబ్బూ సంగతి దగ్గరికి వచ్చే సరికి చెప్పవలసిన పని లేదు.వాస్తవ ట్రేడింగ్ సమయంలో ఒక్కో మనిషి ఎమోషన్స్ ఒక్కో రకంగా ఉంటాయి. టిప్స్ అందించే వారూ ఎంత సమర్ధవంతమైన వ్యక్తీ ఐనప్పటికీ  మీరూ ఆ టిప్స్ ద్వారా లాభాలు అందుకోవడం అనేది చాలా కష్టం. నేను నా  పన్నెండు సంవత్సరాల అనుభవంలో ఎందరో ట్రేడర్స్  నెలకు 500-100000 (లక్ష)  టిప్స్ కోసం చెల్లించి కూడా నష్టపోయిన వారిని చూడటం జరిగినది. అందులో ఎంతో పేరొందిన అనలిస్టుల వద్ద కూడా టిప్స్ పొందడం జరిగినది. దురదృష్టం  కొలది ఎంతో పేరొందిన వారూ అనుకున్న వారూ కూడా మార్కెట్ పై ఎలాంటి అవగాహన లేకుండా టిప్స్ అందించడం జరిగినది.అందుకే దయచేసి ఎవ్వరిని కూడా టిప్స్ పై ఆధారపడకుండా మీ స్వంతంగా , మీ స్వయం నిర్ణయాలపై  అధారపడండి .  ఎప్పుడూ కూడా ఇతరులపై అధారపడకండి.. మీకూ తెలివి ఉంది. మార్కెట్ గురించి నేర్చుకోండి. ఎంత కాలం పరాన్న జీవుల వలె బ్రతుకుతారు.మీ స్వయం శక్తి పై మార్కెట్ లో నిలబడండి. టెక్నికల్ అనాలసిస్   మీదా పేరొందిన వ్యక్తుల వద్ద నేర్చుకోండి. మంచి ట్రేడింగ్ సాప్ట్ వేర్  మన  మన రాష్ట్రానికి చెందిన ఐ చార్ట్ కంపెనీ కొన్ని సంవత్సరాల నుండి అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది.మీకూ  టెక్నికల్ అనాలసిస్ వస్తే  మీరూ ఏ సాప్ట్ వేర్   ఉపయోగించిన దాని వలన లాభ పడవచ్చు. ఎందుకంటె లెక్కల సూత్రం ఏ మాస్టారు చెప్పిన ఒక్కటే. ఆ లెక్కల ప్రాథమిక సూత్రం తెలిస్తే మీరూ సులభంగా లెక్కలు చేయవచ్చు.

ఈ ఆర్టికల్ వ్రాయడానికి ముఖ్య కారణం చాలా మంది నుండి వస్తున్న మెయిల్స్ . మేము ఫలానా టిప్స్ అందించే వారికి డబ్బూ చెల్లించాలి అనుకుంటున్నాం మీ సలహా ఏంటి.కొంత మంది ఎలాంటి బ్రోకరేజి లేదు మీరూ ఎంతయినా ట్రెడింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు దయచేసి మీ సలహా చెప్పండి అని అడుగుతున్నారు. నా ప్రయత్నం కేవలం  మీరెవరూ స్టాక్ మార్కెట్ మోసగాళ్ళ వలలో పడకుండా మీరూ స్వయంగా స్టాక్ మార్కెట్ నిర్ణయాలు తీసుకొనేలా ఎదిగేలా మీకూ తోడ్పాటు అందించడమే.నేను మీకూ చెప్పేది ఒక్కటే  learn to earn , earn to learn