బంగారం గురించి బంగారం లాంటి నిజాలు.
క్రింద ఇవ్వబడిన చిత్రంలో బంగారం గురుంచి బంగారం లాంటి నిజాలు ఉన్నాయి . అవి ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.ఇప్పటివరకు బంగారు మైన్స్ నుండి వెలికితీసిన బంగారం ఎంతో తెలుసా ? 167,000 టన్నులు అంటే సుమారు 120 షిప్పింగ్ కంటెయినర్స్ లలో నింపడానికి సరిపోతుంది. ఈ బంగారం బరువు మొత్తం కలిపి ఈఫిల్ టవర్ బరువుకంటే 16.5 రేట్లు అధికంగా బరువు ఉంటుంది.ప్రపంచంలో అత్యంత పెద్దది ఐనటువంటి సూపర్ ట్యాంకర్ ఈ బంగారం కంటే మూడూ రెట్ల అధిక బరువును మోస్తుంది.ఈ బంగారం యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ అమెరికా డాలర్లలో 8 ట్రిలియన్లు అంటే 8,000,000,000,000,అమెరికా డాలర్లు.అంటే ఇది అమెరికాకి గల అప్పులలో సగానికి సమానం.మన రూపాయలలోఅయితే 416,000,000,000,000 లకి సమానం. ఈ బంగారంతో బంగారు ఆకులూ తయారు చేస్తే వాటితో స్విట్జర్లాండు మొత్తం పరచవచ్చు లేదంటే న్యూజెర్సీ కంటే రెండు రేట్లు అధిక ప్రదేశంపై పరచవచ్చు.కేవలం 60 టన్నుల బంగారంతో తీగ తయారు చేస్తే ఆ తీగ భూమి నుండి సూర్యుడికి గల దూరాన్ని కొలవడానికి సరిపోతుంది. ప్రతి సంవత్సరం 1960 టన్నుల బంగారం జ్వెల్లరీ కొరకు 1640 టన్నుల బంగారం ఇన్వెస్ట్మెంట్ కొరకు 460 టన్నుల బంగారం టెక్నాలజీ కొరకు వాడుచున్నారు.