ఇన్ఫ్లేషన్ అనగా ఏమి ? దాని ప్రభావం మనపై ఏ విధం గా ఉంటుంది? part -2
ఇన్ఫ్లేషన్ మీ ఆర్ధిక స్థితి గతులపై చాలా తీవ్రమైన ప్రభావం చూపెడుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది ధరలలో పెరుగుదలను కొలిచే ఒక సాధనం. ఇన్ఫ్లేషన్ కనుక 6% ఉంది అంటే సగటున ధరలలో 6% పెరుగుదల నమోదు ఐనట్టు అంటే ఏ వస్తువు కాని గత సంవత్సరం రూ 100 ఉంటే అదే వస్తువు ప్రస్తుతం రూ 106 లభ్యమవుతుంది. ఇన్ఫ్లేషన్ 6% మాత్రమే నమోదు అవుతుంది అనుకుంటే ఈ రోజు రూ 100 విలువ పది సంవత్సరాల తర్వాత Rs 53.86 గానూ ,ఇరవై సంవత్సరాల తర్వాత రూ 29.01 గానూ మాత్రమె ఉంటుంది. అంటే రూపాయి విలువ దారుణంగా తగ్గిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ పై రాబడి ఇన్ఫ్లేషన్ కంటే అధికంగా ఉన్నప్పుడే మీరు నిజమైన రాబడి అందుకున్నట్టు.
సాదారణంగా మీరందరూ బ్యాంక్ లో ఫిక్సెడ్ డిపాజిట్ చేసి దాని మీదా 8.5 % నుండి 9.0% వడ్డీ వస్తుంది అని చాలా మంది సంతోషపడుతుంటారు . మీకు 9.0% వడ్డీ వస్తుంది అంటే సంవత్సరం తర్వాత మీ రూ 100 వడ్డీ తో కలిపి రూ 109 అవుతుంది బాగానే ఉంది మీ వంద పై తొమ్మిది రూపాయల రాబడి వచ్చినది అనుకుంటున్నారు . కాని, మీ బ్యాంక్ వడ్డీ పై సాదారణంగా 3% నుండి 3.5% టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఇక మిగిలినది రూ . 106 కాని, ఇన్ఫ్లేషన్ ఉండనే ఉంది. అంటే మీరు గత సంవత్సరం వంద రూపాయలకు కొన్న వస్తువు ఈ రోజు నూట ఆరు రూపాయలు . ఇక మీకు వచ్చిన రాబడి ఎక్కడ ?
ఇన్ఫ్లేషన్ మీ కొనుగోలు సామర్ధ్యం ను తగ్గించి వేస్తుంది.సాదారణంగా సంప్రదాయ ఇన్వెస్టర్స్ రిస్కు లేకుండా ఉండటానికి అని బ్యాంక్ లేదా డేట్ సాధనాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీకు వచ్చే రాబడి కేవలం ఆరు నుండి ఏడు శాతం ఉండి , ఇన్ఫ్లేషన్ కూడా ఏడు శాతం వరకు ఉంటే మీకు వచ్చే రాబడి ఎమి ఉండదు. అదే విధంగా సేవింగ్ ఖాతా లో చాలా మంది సొమ్మూ ఉంచేస్తారు. ఇది కూడా పద్ధతి కాదు . ఈ విధంగా చేయడం వలన మీ సొమ్మూ యొక్క విలువ తగ్గి పోతుంది తప్ప ఎట్టి పరిస్తుతులల్లో విలువ పెరుగదు. కేవలం సేవింగ్ ఖాతాలో మీ ఎమర్జేన్సీ ఫండ్ తప్ప అంతకంటే అధిక సొమ్మూ ఉంచరాదు.