బంగారం లో పెట్టుబడి పెడుతున్నప్పుడు ఏ గోల్డ్ ETF లో పెట్టుబడి పెట్టడం మంచిది?
ఇది వరకు నేను బంగారంపై వ్రాసిన ఆర్టికల్స్ చదివిన తర్వాత కొంత మంది మిత్రులు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి వివిధ గోల్డ్ ETF లు అందుబాటులో ఉన్నాయి కదా ? అందులో వేటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది ? వాటి రాబడి ఏ విధంగా ఉంది ? అని అడగడం జరిగినది. ఇప్పుడు వాటి గురుంచి ఒక్కసారి వివవరంగా తెలుసుకుందాం. గోల్డ్ ETF కనుగోలు చేస్తున్నాం అంటే బంగారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో కనుగోలు చేయడం . గోల్డ్ ETFలు అందుబాటులోకి వచ్చాక బంగారంలో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభతరం అయింది. గోల్డ్ ETF లో రాబడి సాదారణంగా ఫిజికల్ గోల్డ్ ధరపై ఆధారపడిఉంటుంది.ఒక గోల్డ్ ETF సుమారు ఒక గ్రాం బంగారం తో సమానం. గోల్డ్ ETF లో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం . అంతేకాకుండా మీరు ఒక గ్రాం బంగారం కూడా కనుగోలు చేయవచ్చు. దాని వల్ల మీరు కొంత కాలంలో మీకు కావలసిన బంగారం జమ అయ్యే వరకు ప్రతినెల ఇన్వెస్ట్ చేయవచ్చు.వివిధ రకాల గోల్డ్ ETF ల రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయో క్రింది పట్టిక ద్వారా చూడండి.
S.No
|
ETF Name
|
% of Returns For 1 Year
|
1
|
Axis
|
12.82
|
2
|
Birla sun life
|
13.15
|
3
|
Gs gold bees
|
12.98
|
4
|
HDFC
|
13.04
|
5
|
ICICI-pru
|
12.86
|
6
|
Kotak
|
12.99
|
7
|
Quantam
|
13.03
|
8
|
Reliance
|
13.08
|
9
|
Religare
|
13.12
|
10
|
Sbi
|
13.19
|
11
|
Uti
|
13.04
|
12
|
Physical gold
|
14.88
|
మీరు పై పట్టికను పరిశీలిస్తే వివిధ రకాల గోల్డ్ ETF లో రాబడిలో తేడా చాలా స్వల్పలంగా ఉంది. దాదాపు గా అన్ని గోల్డ్ ETF లు ఒకే రకమైన రాబడి అందచేసాయి. రాబడిలో స్వల్ప తేడా కూడా నిర్వహణపరమైన ఖర్చుల వలన సంభవించినదే. అందువలన ఏ గోల్డ్ ETF లో అయిన ఇన్వెస్ట్ చేయవచ్చు.కాకపోతే ఇప్పుడూ కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయవవచ్చా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాని గురుంచి బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ? అనే ఆర్టికల్ వివరంగా చదవండి.