బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ?


బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే రానున్న మూడేళ్లలో రెట్టింపు కావడం నిజమేనా ?

రానున్న మూడేళ్ళ కాలంలో బంగారం ధర  రెట్టింపు అవుతుంది అంటే అచ్చర్యపోతున్నారా ? మీరు బంగారం ధర గత కాలంలో ఎలా పెరిగినదో మీకు తెలుసుకదా ? మీరు బంగారం ధర ఒక్కసారి  పరిశీలిస్తే ఇండియా లో డిశంబర్ 2007  10gr బంగారం ధర  రూ .10,000  ఉంటే  డిశంబర్   2010 లో రూ 20,000 లకు చేరుకుంది.అంటే కేవలం మూడు సంవత్సరాలలో రెట్టింపు ధరకు చేరుకుంది . సెప్టెంబర్ 2009లో  రూ.16500 ఉంటే మూడు సంవత్సరాలో  అంటే 2012లో రూ.32500 కు చేరుకుంది ఇప్పుడు కూడా మూడు సంవత్సరాలలో రెట్టింపు ధరకు చేరుకుంది.
మనదేశం బంగారాన్ని అధిక శాతం విదేశాలనుండే  దిగుమతి చేసుకుంటుంది. అందువలన మన దేశంలో బంగారం ధర అంతార్జాతీయ ధర కి  అనుగుణంగా ఉండదు.
అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం 23 Aug 2011 $1900 గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మన దేశంలో బంగారం ధర రూ. 28600 ఉంటే ఇప్పుడు  అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం $ 1730 చేరుకుంటే  మనదేశంలో మాత్రం బంగారం రూ .32500 చేరుకుంది. అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం ధర తగ్గిన మనదేశంలో బంగారం ధర పెరగడానికి ముఖ్య కారణం డాలర్ బలపడటం , రూపాయి బలహీనపడటమే . అంతే కాకుండా రోజురోజుకి బంగారం పై ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరుగుతుండటం.

రెండు సంవత్సరాల క్రితం డాలర్ కి రూపయాయి మారకపు విలువ రూ 45ఉంటే ఇప్పుడు రూ   55 గా ఉంది.కేవలం రూ. 10తేడా  అంతార్జాతీయ మార్కెట్ లో  బంగారం ధర తగ్గిన మనదేశంలో బంగారం ధర పెరగడానికి కారణమైనది.అంతే కాకుండా అంతార్జాతీయంగా ఆర్ధికమాంద్యం , యూరో జోన్ పరిస్థితులు  హెడ్జ్ ఫండ్స్ ను బంగారంలో అధికంగా ఇన్వెస్ట్ చేయడానికి కారణమవుతున్నాయి.
ఈ బంగారం ధర పెరగడం ఫిజికల్ గా బంగారు అమ్మకాల పై ప్రభావం  చూపినప్పటికీ  గోల్డ్ ETF లో   ఇన్వెస్ట్ చేయడం మాత్రం తగ్గడం లేదు.అంతే కాకుండా దేశంలో వర్షాభావ పరిస్థితులు సాదరణంగానే నమోదు కావడం  నవరాత్రుల తర్వాత మంచి రోజులు ఉండటం .దీపావళి  మొదలగు పండుగల వలన మళ్ళీ బంగారం ఆభరణాలకు గిరాకీ పెరిగే అవకాశం కూడా ఉంది.బంగారం ప్రస్తుతం అధిక స్థాయిల వద్ద ఉన్నప్పటికీ కూడా  అంతార్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక పరిస్థితులు, ఇన్వెస్టర్ల నుండి ఉన్న డిమాండ్ , రూపాయి బలహీనత మొదలగు అంశాల ఆధారంగా బంగారం ధర ఇంకా పెరగడానికే అవకాశం ఉంది. మీరు చూస్తూ ఉండగానే బంగారం రూ .32500 నుండి రూ 65000 లకు 2015  కల్లా చేరుకునే అవకాశం అధికంగా ఉంది.
గమనిక : ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనం లో ఐనా సరే రిస్కు అనేది తప్పకుండా ఉంటుంది. రిస్కు లేకుండా రిటర్న్ అనేది ఉండదు. అందుకే ఎవరికి వారూ , వారూ భరించగలిగే రిస్కు  కి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడం చేయాలి. పైన బంగారం పై కేవలం నా  అభిప్రాయం తెలియచేయడం జరిగినది.
telugufinancialschool@gmail.com

ఈ రోజు స్టాక్ మార్కెట్ 20-09-2012


ఈ రోజు స్టాక్ మార్కెట్ 20-09-2012
మమత బెనర్జీ UPA  ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో కేంద్ర ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడం జరిగినది. ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ , మాయావతి నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ములాయం సింగ్ యాదవ్  ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా , వద్దా అనే తన నిర్ణయాన్ని ఈ రోజు వెలువరించానున్నారు.ఈ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ప్రారంభం అవుతుంది.నేను ఇదివరకే మీకు తెలియచేసినట్టుగా కొత్తగా ఏర్పాటు కాబడిన స్వింగ్ హై 5652 పైన నిఫ్టీ నిలదొక్కుకున్నట్టు ఐతేనే  మార్కెట్ లో  మరింత ర్యాలీ రావడానికి అవకాశం కలదు. మంగళవారం మొత్తం నిఫ్టీ 5586-5621 మధ్యనే కదలాడటం జరిగినది.ప్రస్తుతం నిఫ్టీ కి తక్షణ మద్దతు  5554, 5528,5465  వద్ద కలదు .ఒకవేళ  గ్యాప్ డౌన్ లో నిఫ్టీ   5554 క్రింద నిలదోక్కుకున్నట్టు 5528,5465  వరకు పతనం  కావడానికి అవకాశం కలదు. లాంగ్ పొజిషన్స్ కి మాత్రం 5466  బ్రేక్ కానంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు.