బంగారం ధర ఎప్పుడు ఎందుకు పెరుగుతుంది. ఎప్పుడు ఎందుకు తగ్గుతుంది.?.
మీరూ ఇదివరకే గోల్డ్ స్టాండర్ట్ గురించి తెలుసుకున్నారు కదా ? ఇప్పుడు US మానిటరీ బేస్ గురించి తెలుసుకోండి. సాదారణ పరిబాషలో సులభంగా అర్ధం అయ్యేలా చెప్పాలి అంటే మానిటరీ బేస్ అనగా చలామణిలో ఉన్న కరెన్సీ లేదా మనీ సప్లై . US మానిటరీ బేస్ అనగా ఆ దేశ ప్రభుత్వం కాలానుగుణంగా ముద్రించినటువంటి కరెన్సీ.
మీరు పై చార్ట్ గమనించినట్టు ఐతే 2007 వరకు US మానిటరీ బేస్ 800 బిలియన్ డాలర్లు మాత్రమే. కాని 2011 వచ్చే సరికి US మానిటరీ బేస్ 2.6 ట్రిలియన్లు లేదా 2600 బిలియన్ డాలర్ల కు చేరుకుంది. అంటే కేవలం నాలుగు సంవత్సరాలలో 1.8 ట్రిలియన్లు లేదా 1800 బిలియన్ల డాలర్లు ముద్రించడం జరిగినది.1970 తర్వాత ఎప్పుడయితే గోల్డ్ స్టాండర్డ్ తీసివేయడం జరిగినదో అప్పటి నుండి US వారి అవసరానికి అనుగుణంగా కరెన్సీ నోట్లు ముద్రించుకుంటుంది. 1970 నుండి వాస్తవంగా బంగారానికి , డాలర్ కి మధ్య ఎలాంటి సంభందం లేదు. నిజం చెప్పాలి అంటే బంగారం నిజమైన మనీ. దీని ధర US మానిటరీ బేస్ కి అనుగుణంగా మారుతుంది. మీకు ఇది వరకే తెలియచేయడం జరిగినది కదా ?. US ప్రభుత్వం ఎప్పుడూ కావాలి అంటే అప్పుడు కరెన్సీ నోట్లను ముద్రించుకుంటుంది కదా ? ఈ విధంగా ముద్రించిన కరెన్సీ నోట్లు చలామణిలోకి రావడంతో వాటి కనుగోలు శక్తి తగ్గిపోతుంది కదా ? అప్పుడు బంగారం ధర ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అంటే డాలర్ బలహీనపడటం. బంగారం బలపడటం జరుగుతుంది. ఎప్పుడయితే US మానిటరీ బేస్ పెరుగుతుందో అప్పుడు ప్రపంచంలో డాలర్ల చలామణీ అధికం కావడం వలన దానికి అనుగుణంగా బంగారం ధర పెరుగుతుంది. US మానిటరీ బేస్ పెరగడం వలన ప్రజల వద్ద అధిక డాలర్లు ఉండటంతో బంగారాన్ని అధిక ధరల వద్ద కనుగోలు చేస్తారు. దానితో బంగారం ధర పెరుగుతుంది.వాస్తవంగా చెప్పాలి అంటే బంగారం ధర పెరగడం లేదు.డాలర్ మరియు ఇతర కరెన్సీల విలువ తగ్గుతుండటం జరుగుతుంది. ప్రభుత్వాలు కొత్తగా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకరావడం వలన కరెన్సీ కనుగోలు శక్తి తగ్గిపోతుంది దాని వలన బంగారం ధర పెరుగుతుంది అనే విషయం మీకు తెలిసినది కదా ? అదే విధంగా బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. చలామణి లో ఉన్న అధిక కరెన్సీ నోట్లను ప్రభుత్వం ఎప్పుడైతే ఉపసంహరించుకుంటుందో ఆప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి.కరెన్సీ నోట్లను ప్రభుత్వం ఉపహరించుకోవడం వలన ప్రజల వద్ద తక్కువ మనీ ఉండటంతో బంగారాన్ని కనుగోలు చేయడం తగ్గుతుంది. దాని వలన బంగారం ధర తగ్గుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. US మానిటరీ బేస్ కి , బంగారం ధరకి అవినాభావ సంభందం ఉంది. US మానిటరీ బేస్ పై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి.అంతే కాని పెళ్ళిళ్ళ సీజన్, పండుగల సీజన్ , దీపావళి , అక్షయ తృతీయ ఇలాంటివి ఏవి బంగారం ధరను ప్రభావితం చేయలేవు.చేసినా ఒక్కశాతం మించి చేయలేవు. తర్వాతి ఆర్టికల్స్ లో బంగారం ధర ఏవిధంగా అంచనా వేస్తారో , ఎంత వరకు ధర పెరగడానికి అవకాశం ఉందో తెలుసుకుందాం.