క్రమం తప్పకుండా ఆదాయం పొందడానికి మార్గాలు.


క్రమం తప్పకుండా ఆదాయం పొందడానికి   మార్గాలు.

సాదారణంగా ఇన్వెస్టర్ల లో  షార్ట్ టర్మ్ , మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, కాకుండా మరొక రకం ఇన్వెస్టర్లు కూడా ఉంటారు. వారు  ఒకేసారి పెద్ద మొత్తం సొమ్మూ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సాధనాలలో   ఇన్వెస్ట్ చేసి దానిపై  క్రమం తప్పకుండా ఆదాయం పొందాలి అనుకునేవారు . చాలా వరకు ఇలాంటి ఆలోచన ఎక్కువగా రిటైర్మేంట్  అయిన వారికి ఉంటుంది. రిటైర్మేంట్  అయిన వారే కాకుండా  ఎవరైనా సరే క్రమం  తప్పని ఆదాయం పొందడానికి గల మార్గాలు  ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాం  .

పోస్టాపీసు మంత్లీ ఇన్ కమ్  స్కీమ్స్  

ఈ పథకంలో వ్యకిగతంగా Rs  4.5 Lakhs వరకు జాయింట్ గా ఐతే  Rs 9 Lakhs వరకు  ఇన్వెస్ట్ చేయవచ్చు. కాల పరిమితి ఐదు సంవత్సరాలు. ప్రస్తుతం అందచేస్తున్న వడ్డీ    8.2% శాతం . ఈ వడ్డీ ని మీరు ఇన్వెస్ట్ చేసిన నెల రోజుల తర్వాత నుండి  క్రమం తప్పకుండా చెల్లిస్తారు.ఇంకా ఈ పథకం పూర్తీ వివరాల కొరకు పోస్టాపీసు మంత్లీ ఇన్ కమ్  స్కీమ్స్  చాప్టర్ లో చూడండి.    

ఫిక్సెడ్ డీపాజిట్ల  నుండి నెలవారీ గా వడ్డీ పొందడం.

ఈ పథకం గురుంచి చాలా మందికి తెలిసిన విషయమే . ఎందుకంటె  ఈ పథకం సురక్షితమైన పథకం అని భావించడమే. ఈ పథకంలో  సాదారణంగా వడ్డీ  శాతం అనేది మీ డీపాజిట్  కాల పరిమితిపై  ఆధారపడి ఉంటుంది.మీరు  వడ్డీ 7-8%    వరకు వస్తుంది అని ఆశించవచ్చు. కాని ఇక్కడ వడ్డీ ఆదాయం పై టాక్సు చెల్లించవలసి ఉంటుంది.

ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లు.

 సాదారణంగా ఈ బాండ్ల కాల వ్యవధి 25-30 వరకు ఉంటుంది.  వడ్డీ ఆరు నెలలకు ఒక్క సారి చెల్లిస్తారు .వడ్డీ సుమారు  8%  వరకు పొందవచ్చు. ఇది సమయానుకూలంగా మారుతుంది. ఇది కూడా సురక్షితమైన పెట్టుబడి . ఈ బాండ్స్ సెకండరీ మార్కెట్ లో ట్రేడ్ అవుతాయి కాబట్టి  వీటిని మీరు అవసరమైతే సెకండరీ మార్కెట్ లో అమ్ముకోవచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (Senior citizen Saving Scheme)

 అరవై సంవత్సరాల పై బడిన  వారు ఇన్వెస్ట్ చేయతగిన మంచి పథకం . ఇందులో వడ్డీ సుమారు 9.3% వరకు వస్తుంది దానిని మూడు నెలలకు ఒక్కసారి చెల్లిస్తారు. ఐదు సంవత్సరాల కాల వ్యవధి కలిగి ఉంటుంది . గడువు తర్వాత మరల మూడు సంవత్సరాలు పొడగించుకోవచ్చు.ఐతే 55-60 మధ్య వయసుగల వారు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. కాని వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం వలన ఈ  సొమ్మూ వచ్చినట్టుగా  తెలియచేయవలసి ఉంటుంది.

ఇన్సురెన్స్  కంపెనీల నుండి అన్యూటీ ప్లాన్స్ కనుగోలు చేయడం

.మీరు ఎల్ ఐ సి లేదా ఇతర ప్రవేట్ ఇన్సురెన్స్ కంపెనీల నుండి అన్యూటీ ప్లాన్స్ కనుగోలు చేయవచ్చు.కాని వీటి మీదా రాబడి మీరు ప్లాన్స్ కనుగోలు సమయంలో ఎంచుకున్న పద్ధతి పై ఆధారపడి ఉంటుంది.  ఎవరైనా సరే దీనిలో ఇన్వెస్ట్ చేయక పోవడం చాలా మంచిది. 

ఇప్పటి వరకు పైన చెప్పుకున్న పథకాలు అన్ని కూడా  సురక్షితమైనవి . ఇప్పుడు చెప్పుకోబోయే పథకాలు  రిస్కు ను కలిగి ఉంటాయి. కాని ఈ పథకాలలో వచ్చే రాబడి కూడా అధికంగానే   ఉంటుంది.  రిస్క్ భరించే వారు ఎవరైనా సరే ఈ పథకాల లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.

SWP (systematic withdrawal plan)

మీరు ఈక్వీటీ మ్యుచవల్  ఫండ్ పథకాలలో  లేదా డేట్  మ్యుచవల్  ఫండ్ పథకాలలో ఇన్వెస్ట్ చేసి మీరు SWP  పద్దతిని ఎన్నుకోండి. ఈ పద్ధతి  సిప్  పద్ధతి కి వ్యతిరేకంగా ఉంటుంది. సిప్ లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే ఈ  SWP లో మాత్రం  క్రమం తప్పకుండా  ఆదాయం పొందడం జరుగుతుంది. ఈక్వీటీ మ్యుచవల్  ఫండ్స్ లో   రిస్కు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది .  రిస్కు తక్కువగా ఉండాలి అనుకునే వారు డేట్ మ్యుచవల్  ఫండ్ పథకాలలో  ఇన్వెస్ట్ చేయడం మంచిది.

మంత్లీ ఇన్ కమ్ ప్లాన్స్ (MIP).

కొన్ని మ్యుచవల్ ఫండ్స్ పథకాలు  రెగ్యులర్ గా ఆదాయం అందిచడానికి ఏర్పడ్డాయి . కాని వీటిలో ఆదాయం అనేది కేవలం డివిడెండ్ ప్రకటించినప్పుడు మాత్రమె వస్తుంది.   డివిడెండ్  అనేది  లాభం వచ్చినప్పుడు మాత్రమె ప్రకటిస్తారు.  అందువలన రెగ్యులర్ గా ఆదాయం వస్తుంది  అని ఆశించలేం.

షేర్ల నుండి డివిడెండ్ రూపం లో ఆదాయం పొందడం.

 మీరు  కనుక షేర్ మార్కెట్ పై అవగాహన    కలిగి ఉంటే క్రమం తప్పకుండా డివిడెండ్ ప్రకటించే మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ఒక కంపెనీ ఎప్పుడూ డివిడెండ్ ప్రకటిస్తుంది అని ఆశించలేం కాబట్టి  ఒక పది  మంచి కంపెనీలను ఎన్నుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయండి.  అదే విధంగా మీరు ఓపిక తో  వేచి చూస్తె మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా పెరుగుతుంది.

 

మ్యుచవల్  ఫండ్స్ నుండి డివిడెండ్ రూపం లో ఆదాయం పొందడం.

ఎవరైతే డైరెక్ట్ గా ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయలేరో వారు మ్యుచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి  దానిలో డివిడెండ్ ఆప్షన్ ఎన్నుకోవడం మంచిది.రెంటల్ ఆదాయం పొందడం. 

 అద్దె ఆదాయం పొందడం.

 మీరు  ఇంటిపై    ఇన్వెస్ట్ చేసి   దానిని రెంట్ కి ఇవవ్డం ద్వారా అద్దె ఆదాయం పొందవచ్చు. కాని ఇందులో కూడా  కొద్దిగా రిస్క్  ఉంది. మంచి  కిరాయి దారులు దొరకపోవడం లేదా  రెగ్యులర్ గా అద్దె చెల్లించకపోవడం.క్రమం తప్పకుండా   ఆదాయం అందించే కొన్ని మ్యుచవల్ ఫండ్ పథకాలు

Birla asset allocation conservative, DSPML savings plus aggressive, magnum monthly income plan for SBI, and HDFC MIP long term.