ఈవారం స్టాక్ మార్కెట్ 22-10-2012to26-10-2012
నిఫ్టీ 5815 వద్ద టాప్ ఏర్పాటు కాబడిన అనంతరం గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్స్ నుండి కేవలం 5635-5725 క మధ్య 100 పాయింట్ల
రేంజ్ లో మాత్రమే కదలాడటం జరుగుతున్నది.నిఫ్టీ 5217 నుండి 5815 చాలా వేగంగా ర్యాలీ జరిగిన అనంతరం ఇప్పుడు
కన్సోలిడేషన్ కావడం జరుగుతున్నది. 5635-5725 రేంజ్
బ్రేక్ కానంత వరకు రెసిస్టన్స్
వద్ద అమ్మడం, సపోర్ట్ వద్ద కనుగోలు చహేయడం చాలా ఉత్తమం. ఒకవేళ క్రింది వైపు సపోర్ట్ 5635
బ్రేక్ కావడం జరిగితే అంతకు ముందు 5554-5575 మధ్య గల గ్యాప్
ను నింపే అవకాశం కూడా కలదు,.రాబోయే వారం డెరివేటివ్స్
కాంట్రాక్ట్ ఎక్స్ఫైరీ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.నిఫ్టీ 5830 బ్రేక్ కావడం జరిగితే 5940 వరకు ర్యాలీ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ 5635 బ్రేక్ జరిగితే 5585 వరకు అది కూడా బ్రేక్ కావడం జరిగితే నిఫ్టీ సులభంగా 5554-5575 మధ్య ఏర్పాటు కాబడిన గ్యాప్ నింపే అవకాశం ఉంది.