మీ దీపావళి బోనస్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
రాజేష్ ముప్పై సంవత్సరాల యువకుడు . మంచి MNC కంపెనీలో ఉద్యోగం.ఈ దీపావళికి కి సుమారు లక్ష రూపాయలు బోనస్ అందుకోబోతున్నాడు.ఐతే అతడు ఈ బోనస్ ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక తికమకపడుతున్నాడు. ఏదైనా వృద్దికి అవకాశం ఉండే వాటిలో ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఒకవేళ మీరూ కూడా రాజేష్ లాగే ఎలాంటి నిర్ణయం తీసుకోలేని అవస్థలో ఉంటే ఈ ఆర్టికల్ మీకూ తప్పకుండా ఉపయోగపడగలదు.
ముందుగా మీ బోనస్ ద్వారా ఏవైనా క్రెడిట్ కార్డ్స్ డ్యూ అమౌంట్ ఉంటే వెంటనే చెల్లించండి.ఎందుకంటె అత్యధికంగా వడ్డీ వసూలు చేస్తున్న దానిలో అన్నిటికంటే ముందు వరుసలో ఉండేది ఈ క్రెడిట్ కార్డ్స్. తర్వాత పర్సనల్ లోన్స్, లేక ఇతర లోన్స్ ఏవైనా ఉంటే వాటిని చెల్లించి మీ రుణభారాన్ని తగ్గించుకోండి.
మీకు సరిపడా ఇన్సురెన్స్ ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి.వాటిలో టర్మ్ ఇన్సురెన్స్ ,హెల్త్ ఇన్సురెన్స్ తప్పకుండా ఉండేలా జాగ్రత్త వహించండి.ఒకవేళ మీకు సరిపడా ఇన్సురెన్స్ లేనట్టు ఐతే ఈ బోనస్ అమౌంట్ లో నుండి కొద్ది మొత్తం ఇన్సురెన్స్ కొరకు కేటాయించండి.మిగిలినది ఎమర్జెన్సీ ఫండ్ క్రింద కేటాయించండి.మీరు మీ బోనస్ ని ఇన్వెస్ట్ చేయడానికి కంటే ముందు సరిపడా ఇన్సురెన్స్ , ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రమే మిగితా వాటి గురించి ఆలోచించాలి. ఒకవేళ మీకు ఎలాంటి అప్పులు మరియు సరిపడా ఇన్సురెన్స్ , ఎమర్జెన్సీ ఫండ్ మొదలగునవి ఉంటే మీ బోనస్ ను క్రింద తెలియచేసిన చార్ట్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు
మీరూ ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కవిషయం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి.మీ ఇన్వెస్ట్మెంట్ మీ పోర్ట్ఫోలియో ని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్ మీరూ భరించగలిగే రిస్కు సామర్ద్యంనకు అనుగుణంగా చేసుకోవాలి. మీకూ రిస్క్ భరించే సామర్ద్యం తక్కువగా ఉంటే సురక్షితమైన సాధనాలలో ఇన్వెస్ట్ చేయాలి. రిటర్న్ కూడా అదేవిధంగా ఉంటుంది. ఒకవేళ రిస్క్ అధికంగా తీసుకొనే సామర్ధ్యం ఉంటే దానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయాలి .మీరూ ఒక్కవేళ బ్యాంకు లో ఫిక్సుడ్ డిపాజిట్ చేస్తే tds వసూలు చేస్తారూ అనే విషయం గుర్తుపెట్టుకోండి.మీరూ దీర్ఘాకాలం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈక్వీటీ లలో ఇన్వెస్ట్ చేయడం ఎంత మాత్రం మర్చిపోవద్దు. అదే విధంగా బంగారం , వెండిలో కూడా ఇన్వెస్ట్ చేయాలి.