బంగారం నగలు కొనే ముందు స్వచ్చత ఏ విధంగా తెలుసుకోవాలి?




బంగారం నగలు కొనే ముందు స్వచ్చత ఏ విధంగా  తెలుసుకోవాలి?


బంగారం  నగలు కొనే ముందు హాల్ మార్కింగ్  వివరాలు  తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ హల్ మార్క్ లో ఐదు భాగాలు ఉంటాయి.
1 BIS STANDARD MARK

BIS STANDARD MARK   క్రింది విధంగా ఉంటుంది.










2 PURITY GRADE

999-24 carrt- pure gold
958-23 carrt
916-22 carrt
875-21 carrt
750-18 carrt
708-17 carrt
585-14 carrt
417-10 carrt
375-9    carrt
338-8   carrt

3.MARK OF HALLMARKING CENTRES


హాల్ మార్కింగ్ చేసిన హాల్ మార్కింగ్ సెంటర్స్ యొక్క లోగో  కూడా చెక్ చేయాలి. మార్కింగ్ సెంటర్స్ యొక్క లోగో  క్రింది విధంగా ఉంటుంది.
 



 
మీరూ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా హాల్ మార్క్ కేంద్రాల గురించి వివరంగా తెలుసుకోవచ్చు.   
http://www.bis.org.in/cert/hallmarkass.htm

YEAR OF MARKING


నగలను  ఏ సంవత్సరంలో హల్ మార్కింగ్ చేసినారో ఆల్ఫా బేట్స్  ద్వారా తెలుసుకోవచ్చు. దీనిని  BIS  నిర్ణయిస్తుంది.  ఉదాహరణకు  Aఉంటె 2000 సంవత్సరంలో ,  Jఉంటె 2008 సంవత్సరంలో,  Nఉంటె 2010 సంవత్సరంలో ,Mఉంటె 2011 సంవత్సరంలో హల్ మార్కింగ్ జరిగినట్టు తెలియచేస్తుంది.

JEWELERS INDENTIFICATION MARK


 BIS  సర్టిఫైడ్ నగల షాపు వాళ్ళు నగల మీదా వారి స్వంత  గుర్తులు లేదా ఐడేన్టిఫికేషణ్ మార్క్స్ ముద్రిస్తారు.
నగలు తీసుకొనే ముందు క్రింది విషయాలు కూడా  గుర్తుపెట్టుకోండి.
BIS హల్ మార్కింగ్ నగలు అమ్ముతున్న షోరూమ్స్  లో మాత్రమే కొనండి.
హాల్ మార్క్ నగలనే కొనండి.
రశీదు, ఇన్ వాయిస్  తప్పకుండా తీసుకోండి.అదే విధంగా ఒక నగపై హల్ మార్కింగ్ చార్జీ కేవలం ఇరవై  ఐదు రూపాలు మాత్రమే. అంతకంటే ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదు.KDM నగలంటే ,హాల్  మార్కింగ్ నగలు కాదు. KDM బంగారం గురించి ఎలాంటి స్వచ్చత గురించి తెలియచేయదు..