ధనవంతులు కావడానికి ఉన్న అవకాశాలు

ధనవంతులు కావడానికి ఉన్న అవకాశాలు
ధనవంతులు  ఏ విధంగా కావచ్చు అని ఎవ్వరిని అడిగిన చెప్పే సమాధానం . బాగా సంపాదించు  లేదా కోరికలను తక్కువగా కలిగి ఉండి  అధికంగా అదా చేయడం అని చెప్తారు. కాని చాలా మంది రెండిటిలో దేనిలో కూడా ప్రావీణ్యం కలిగి ఉండలేరు.చాలా  మందికి  అధిక కోరికలు  ఉంటాయి కాని అధిక సంపాదన మాత్రం ఉండదు. చాలా మంది ఇతర  మార్గాలా ద్వారా ధనవంతులు  కావడం జరుగుతుంది.  మనం ఒక్కసారి ఆ మార్గాలు ఏమిటో పరిశీలిద్దాం.
మీరు ధనవంతులైన  అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. 
చాలా మందికి ధనవంతులు కావడానికి సులభంగా ఎన్నుకొనే మార్గం. ఈ రోజుల్లో దాదాపుగా ప్రతి పెళ్లి వెనుక డబ్బు ప్రముఖ పాత్ర వహిస్తుంది.కాని ఇక్కడ ఒక్క విషయం కేవలం డబ్బుపై ప్రేమతో అమ్మాయి లేదా అబ్బాయి పై ప్రేమ లేకుండా  పెళ్లి చేసుకోవడం వలన  జీవితంలో  ఇబ్బందుల పాలు తప్పకుండా పడతారు.
మోసగాడు లేదా నిజాయితీ లేని వ్యక్తిగా మారడం.
చాలా మంది లీగల్ గా నిజాయితీ తో ధనవంతులు కాలేము అనే ఉద్దేశంతో  ఇల్లీగల్ మారగాన్ని అంటే మోసపూరిత మార్గాన్ని ఎన్నుకుంటారు.  కాని ఈ మార్గంలో ఎప్పటికైనా జైలు కి వెళ్ళాక తప్పదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.ఈ మార్గం ఎన్నటికి అనుసరణీయం కాదు.
వంశ పారంపర్యంగా ధనవంతులు కావడం. 
ఉదాహరణకు మీ తాత లేదా తండ్రిగారు ధనవంతులు ఐతే  , ఆ ఆస్థి వారసత్వంగా మీ వద్దకు చేరుకోవడం వలన కూడా ధనవంతులు  కావచ్చు. కాని  మీ సంపాదన ద్వారా  మీరు ధనవంతులు ఐతే ఉండే ఆనందం దీనిలో ఉండదు.అంతే కాకుండా ఇలా వారసత్వంగా ధనవంతులు కావడం అనేది అందరికి ఉండే అవకాశం మాత్రం కాదు.
లాటరీ గెలుపొందడం వలన ధనవంతులు కావడం.
ఈ మార్గం ద్వారా ధనవంతులు కావడం  మంచిదే. కాని ఈ విధంగా ధనవంతులు కావాలి అని మీరు ఎదిరి చూడటం గాలిలో దీపం లాంటిది.చాలా మంది లాటరీ గెలుస్తాం అనే ఆశతో లాటరీ టిక్కెట్లు కొనడం చూస్తేనే ఉంటాం. కాని  ఈ విధంగా ధనవంతులు కావదానికి ఉండే అవకాశం చాలా తక్కువ..
సినిమా స్టార్ లేదా గొప్ప స్పోర్ట్ స్టార్  కావడం
మీరు చాలా అందంగా ఉండి  మీ వద్ద టాలెంట్ ఉంటే మీరు సినిమా స్టార్ లేదా టి వి స్టార్  కావడం లేదా మీకు ఏదైనా ఆటలో మంచి ప్రావీణ్యం ఉంటే  గొప్ప స్పోర్ట్ స్టార్  కావడం వలన కూడా మీరు ధనవంతులు కావచ్చు.
ధనవంతులు కావాలి కోరిక మీలో అధికంగా ఉండటం.
కొంత మందికి ధనవంతులు కావలి అనే కోరిక చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి వారూ ,వారి లక్ష్యాల కోసం చాలా కష్టపడతారు. వారి లక్ష్యం కోసమా వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేయవలసి ఉంటుంది.
ఆర్ధికంగా పూర్తీ అవగాహన కలిగి  ఉండటం. 
కొంత మంది ఆర్ధిక విషయాల పట్ల పూర్తీ అవగాహన కలిగి ఉండి  సరియైన సమయంలో , సరియైన విధంగా ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకొని ధనవంతులు కావడం జరుగుతుంది. దీని కోసం మీరు ఆర్ధిక విషయాలు నేర్చు కోవలసి ఉంటుంది.
చాలా మందికి సేవ చేయడం.
ఇక్కడ సేవ చేయడం అంటే  సామాజిక సేవ చేయడం కాదు. మీరు ఉద్యోగస్తులూ  ఐతే మీ సర్వీసు కొంత మందికే మాత్రమే అందించ బడుతుంది దానికి మీరు జీతం అందుకుంటారు .అదే మీరు వ్యాపారస్తులూ ఐతే చాలా మందికి సేవ చేయవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారం సులభంగా అభివ్రుద్ది చెందడంతో మీ కోరిక నెరవేరుతుంది.కాని ఈ పద్దతిలో మీరు ధనవంతులో కావాలి అంటే మాత్రం మీరు మీ ఉద్యోగాన్ని వదిలి మీ స్వంత బిజినెస్ ప్రారంభం చేయాల్సి ఉంటుంది.