ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఎమి చేయాలి part 4
మీరు
ఎప్పుడైనా రాష్ట్ర బడ్జెట్ , లేదా కేంద్ర
బడ్జెట్ ప్రకటించినప్పుడు ఎప్పుడైనా దానిని చదివి అర్ధం చేసుకొనే ప్రయత్నం చేసారా
! రూపాయి రాకా లేదా రూపాయి పోక గురుంచి. చాలా మంది దీని గురుంచి మాకు ఏమి అర్ధం
అవుతుంది అనే ఉద్దేశంతో ఆ పేజీలు కూడా కనీసం
చూడరు. చివరకు పేపర్లో , కాని టీవీ లో వచ్చ్చే బిజినెస్ న్యూస్ చూడటం వలన
ఐనా అర్దికంశాల పట్ల అవగాహన కలుగుతుంది. చాలా మంది పేపర్ రాగానే మొదట చేసేది రాజకీయ వార్తలు ,
సినిమా వార్తలు లేదంటే క్రికెట్ గురించిన వార్తలు మాత్రమే చూస్తారు. రాజకీయాల
గురుంచి భాద్యత గల పౌరుడిగా ఎలక్షన్
సమయంలో మంచి నాయకుడిని
ఎన్నుకోవడానికి ఆలోచించండి. మీ అభిమాన హీరో సినిమా మంచిగా ఉన్నా
, లేకున్న అతనికి మాత్రం డబ్బులు వస్తాయి . మీకు డబ్బులు దండగ పైగా తలనొప్పి ఒక్కటి.ఇంకా చెప్పాలి అంటే అతని
డైలాగ్ అతనిది కాదు , అతని పాట అతనిది కాదు, అతని డాన్స్ అతనిది కాదు.ఏది ఆ
హీరోది కానప్పుడు అతని సినిమా చూడటం
అవసరమా !ఇకా కొంత మంది ఉంటారు క్రికెట్ వస్తుంటే నోళ్ళు వెళ్ళబెట్టి దాన్ని
చూస్తారు తప్ప కనీసం బిజినెస్ న్యూస్ చూడటానికి కూడా ఇష్టపడరు. క్రికేట్ అంటే
ఇష్టం ఉంటే చూడటం కాదు ఆడండి. దానివల్ల కనీసం బాడీ లో ఉన్న కొవ్వు కరుగుతుంది
.ఆరోగ్యంగా ఉంటారు. మానవ సంభందాలన్ని ఆర్ధిక సంభాదాలైన ఈ రోజుల్లో మీరు ఆర్ధికంగా ఉన్నత స్థితికి
ఎదగడానికి ప్రయత్నం చేయాలి. దానికి మీరు ఆర్ధిక అంశాల పట్ల అవగాహన కలుగచేసుకోవాలి. మీకు అవగాహన ఉంటేనె మంచి రాబడి అందించే సాధనాలలో ఇన్వెస్ట్ చేయగలుగుతారు లేదంటే ఇంకా సంప్రదాయ పొదుపు పథకాల పట్టుకొని వేలాడుతూనే ఉంటారు.రానున్న కాలంలో
ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్
ఏవిధంగా ఉన్నారో అదే విధంగా ప్రతి కుటుంబానికి ఆర్ధిక నిపుణుడి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆర్ధిక విషయాల పట్ల అవగాహన తప్పనిసరి.
ముఖ్య గమనిక :మీరు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా
ఒక పద్ధతి ఎంచుకొని దానినే స్థిరంగా మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు
సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై
అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం
అవుతుంది.