T20 క్రికెట్ కి, మరియు
ఇన్వెస్ట్మెంట్ కి మధ్యగల ఆసక్తికర
సారూప్యతలు part2
Strategic break
T20 క్రికెట్ లో పది ఓవర్ల తర్వాత విరామం
తీసుకొని తర్వాత ఆటలో అనుసరించవలసిన
వ్యహాల గురుంచి ఏ విధంగా చర్చించుకుంటారో
అదే విధంగా మీరూ కూడా మీ ఫైనాన్సియల్ ప్లానింగ్ ను
మధ్య మధ్యలో సమీక్షీంచుకుంటూ మీ
ఆర్ధిక లక్ష్యాలు చేరుకోవడానికి కావలసిన
విధంగా మీ ఆర్ధిక ప్రణాళికను ఏర్పాటు
చేసుకోవాలి.
Balance
మీరూ 11 మంది బ్యాట్స్ మెన్ లేదా 11
మంది బౌలర్లతో క్రికెట్ అడలేరు. ఆటకి అనుగుణంగా
బ్యాట్స్ మెన్ మరియు బౌలర్లతో ఆటకి
అనుగుణంగా జట్టును ఏర్పాటు చేసుకుంటారు. అదే విధంగా మీరూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్
ను కూడా బ్యాలన్సేడ్ పోర్ట్పోలియో ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇన్వెస్ట్మెంట్ సాధనం కూడా కొన్ని అనూకూల
, ప్రతికూల లక్షణాలను కలిగి ఉంటుంది.
One bad over
కొన్ని సార్లు క్రికెట్ లో ఏ విధంగా బ్యాడ్
ఓవర్ వస్తుందో అదే విధంగా మన జీవితంలో కూడా బ్యాడ్ పీరియడ్ ఉంటుంది. ఆక్సిడెంట్
కావడం ,వైద్యపరంగా అత్యవసర పరిస్థితి రావడం, ఉద్యోగం కోల్పోవడం ,ఇంట్లో సంపాదించే
వ్యక్తీ మరణం మొదలగు సంఘటనల వలన ఆర్ధిక
పరిస్థితి తలక్రిందులు అవుతుంది. అందువలన అలాంటి
సంఘటనలు సంభవించినప్పుడు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి.
Consistency gets rewarded
క్రమం
తప్పకుండా సిస్టామేటిక్ గా
దీర్ఘాకాలం చేసే ఇన్వెస్ట్మెంట్
మంచి లాభాలు అందించగలదు..
Coaching helps
ఒక క్రికెట్ అటగాడు మంచి క్రీడాకారుడిగా
రూపొందడానికి కోచింగ్ ఏ విధంగా సహాయం చేస్తుందో
మీకు తెలుసుకదా ? అర్దిక పరమైన విషయాలాలో ఎవ్వరికీ వారూ స్వంత నిర్ణయాలు
తీసుకొనే శక్తి ఉండదు. అందువలన తప్పనిసరిగా
ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సహాయం తప్పకుండా తీసుకోవాలి.
Distractions can be entertaining but
ultimately the score matters
వ్యక్తీ గత జీవితంలో భావోద్వేగాలు చాలా సహజం
. కాని మీరు మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కి వచ్చే సరికి తప్పనిసరిగా మీరు అత్యాశ,
భయం. ఒకే ఇన్వెస్ట్మెంట్ సాధనం పై ప్రేమ మొదలగు వాటిని మాత్రం తప్పకుండా నియంత్రించుకోవాలి.
Winning attitude
క్రికెటర్కి మ్యాచ్ గెలవాలి అనే దృక్పథం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీకు
ఇన్వెస్ట్మెంట్ లో తప్పనిసరిగా లాభాలు అందుకోవాలి
అనే దృక్పథం ఉండాలి. దానితో మీరు సరియైన ఆలోచనతో మంచి ఇన్వెస్ట్మెంట్
సాధనాలలో ఇన్వెస్ట్ చేయగలుగుతారు.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.