TDS అంటే ఏమిటి ?


TDS అంటే ఏమిటి ?
TDS అంటే మీరు పొందుతున్న ఆదాయం మూలం వద్దనే  ఆదాయపు పన్ను కోత  విధించడం .ఒకరకంగా చెప్పాలి  అంటే  పరోక్షంగా ఆదాయపు పన్ను వసూలు చేయడం . అంటే ఇది  pay as you earn అనే పద్దతిలో జరుగుతుంది.సాదారణంగా మీరు ఉద్యోగాస్తులతే మీ ఆదాయం పన్ను మినహాయింపు పరిధి కంటే అధికంగా ఉంటే  మీ యాజమాన్యం మీ వద్ద  TDS వసూలు చేస్తుంది. మీ యాజమాన్యం TDS వసూలు చేసే ముందు మీరు ఆదాయపు పన్ను మినహాయింపు అర్హత గల వాటిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మీ ఆదాయం లో నుండి తగ్గించుకొని మీ ఆదాయానికి వర్తించే స్లాబ్స్ కి అనుగుణంగా  TDS వసూలు చేస్తారు. కాబట్టి మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ వివరాలు మీ యాజమాన్యం కు తెలియచేయడం తప్పనిసరి. ఒకవేళ మీరు బ్యాంక్ వడ్డీ ఆదాయం Rs 10000 కంటే అధికంగా వడ్డీ పొందితే ,వడ్డీ ఆదాయంలో 10 % TDS రూపంలో మీ వద్ద  బ్యాంక్ వసూలు చేస్తుంది. మీకు కేవలం బ్యాంక్ వడ్డీ ఆదాయం మాత్రమే ఉన్న  లేదా మీ మొత్తం   ఆదాయం  పన్ను పరిధి కంటే తక్కువగా ఉంటే మీరు బ్యాంక్ వారికి 15G & 15 H అందచేసి మీ వద్ద TDS వసూలు చేయకుండా చూసుకోవచ్చు. ఆదాయపు పన్ను విషయంలో పెన్షన్ ను కూడా సాలరీగానే పరిగణిస్తారు. .ఈ విధంగా వసూలు చేసిన TDS ను ఆదాయపు పన్ను శాఖ వారికి చెల్లిస్తారు. అదే విధంగా మీకు TDS సర్టిపికేట్ కూడా అందచేస్తారు. మీ దగ్గర  TDS వసూలు చేస్తే మీరు  TDS  సర్టిపికేట్ తీసుకోవడం మీ భాద్యత  అదే విధంగా  TDS  సర్టిపికేట్ ఇవ్వడం TDS వసూలు చేసిన వారి బాధ్యత . TDS   కేవలం సాలరీ , బ్యాంక్ వడ్డీ ఆదాయం మాత్రమే కాకుండా మీ ఆదాయం క్రింద ఇవ్వబడిన దానిలో యే విధంగా ఉన్న TDS వసూలు చేస్తారు.