ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఏమి చేయాలి part 2

ఆర్ధికంగా ఎదాగాలి డబ్బు సంపాదించాలి అంటే ఏమి చేయాలి    part 2

బ్యాంక్స్ తర్వాత అధిక శాతం మందికి నమ్మకమైనది భీమా . జీవిత భీమా పైననే అధిక  శాతం  నమ్మకాన్ని కలిగి ఉంటున్నారు.ఈ విషయం లో క్రెడిట్ అంతా కూడా భారత జీవిత బీమా సంస్థ కే   చెందుతుంది. తాను మరణించినప్పుడు కుటుంబానికి ఆర్ధిక రక్షణ కల్పించేందుకే  బీమాను  చాలా మంది ఎన్నుకుంటున్నారు.బీమాను పెట్టుబడి సాదనంగా చూస్తున్నవారు కూడా చాలా తక్కువ . ఒకవేళ భీమా   సంస్థలో పెట్టుబడి పెట్టిన కూడా అది కేవలం టాక్స్ మినహాయింపుల కోసమే చేస్తున్నారు తప్పు  అది నిజమైన పెట్టుబడి కాదు.

బ్యాంకులపై ప్రజలకు చాలా నమ్మకం ఉంది.చాలా మంది బ్యాంక్ లో పెట్టుబడులకు డోకా ఉండదు అనే భావనతోనే చాలా మంది ఉన్నారు. జాతీయ బ్యాంకు లలో ని మొత్తం డిపాజిట్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అని నమ్మే వారు చాలా ఎక్కువ . కాని ఇది తప్పు . ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఇవ్వదు . ఏ బ్యాంక్ డిపాజిట్లకు ఐనా డిపాజిట్ ఇన్సురెన్స్ కార్పోరేషనే   భీమా రక్షణ కల్పిస్తుంది. ఆది  కూడా  కేవలం లక్ష రూపాయల వరకే పరిమితం అనే విషయం గుర్తుంచుకోవాలి.
రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవనాన్ని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తారు.చాలా మంది   రిటైర్మెంట్ తర్వాత తమ పిల్లలు వారి భాద్యత తీసుకుంటారు అనే భావనతోనే ఉంటున్నారు తప్ప వారి జీవితానికి ఎలాంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం లేదు.
ఇక చాలా మంది కి పెట్టుబడులపై ఎలాంటి అవగాహనా ఉండటం లేదు. పెట్టుబడుల విషయంలో ఎవరి సలహాలు , సూచనలు లేకుండా నిర్ణయాలు తీసుకొనే వారు కొందరైతే , స్నేహితులు , ఏజెంట్ల వల్ల కొంత మంది నిర్ణయాలు తీసుకుంటూన్నారు. మీరు మీ పెట్టుబడుల పై తప్పనిసరిగా మీ ఫై నాన్సియాల్ ప్లానర్ లేదా ఆర్ధిక నిపుణులను ను సంప్రదించడం  చాలా మంచిది.  


మీకు పొదుపు చేయాలి  అని ఉంది . అదే విధంగా దాని ప్రాధాన్యం కూడా మీకు తెలుసు . భవిష్యత్తును బాగు చేసుకోవాలన్న ఆలోచన ఉంది .అదే విధంగా ఆర్ధిక లక్ష్యం కూడా   ఉంది.కాని వచ్చిన చిక్కల్లా వచ్చే  నెలా  జీతం మీదనే .వచ్చే జీతం మొత్తం నెల వారి ఇంటి ఖర్చులకే పూర్తిగా సరిపోవడం లేదు . ఇక పొదుపు చేయడానికి మా దగ్గర ఏం  మిగులుతుంది  అనే వారే చాలా ఎక్కువ . ఈ పొదుపుగిదిపు  అనేది లక్షలు  సంపాదించే వారికి కాని మాలాంటి వారికి ఎందుకు అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు.  బిందువు , బిందువు కలిస్తేనే  సింధువు అన్నట్టుగా కాస్తంత పొదుపు వల్ల ఎంతో ప్రయోజనం .   పెద్ద ఉద్యోగాలు , భారీ ఆదాయం ఉంటే ఎవరైనా పొదుపు చేయవచ్చన్న మాట ఎంత నిజమో , మిగులు ఆదాయం లేకపోయినంత మాత్రాన పొదుపు అసాధ్యం మాత్రం కాదు. పొదుపు చేయాలన్న దృడ సంకల్పం ఉంటే చాలు అనేక మార్గాలు కన్పిస్తాయి. మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా.  మీరు పొదుపు చేయాలి అంటే ముందు మీరు మీ ఆదాయ వ్యయాల వివరాలతో బడ్జెట్ తయారుచేసుకోండి.  దాని వల్ల మీరు ఆదాయాన్ని  పెంచుకోలేకపోయిన కనీసం ఎలాంటి ఖర్చులు తగ్గించుకోవచ్చో, ఎలాంటి వృదా ఖర్చులు చేస్తున్నారో తెలుస్తుంది.   వృదా ఖర్చులు పూర్తిగా అరికట్టడం , ఖర్చులు తగ్గించుకోవడం అనేది మీ చేతిలోని పని .అవసరమైన ఖర్చుల్లో కొంత మిగులు సాధించటం , అనవసర ఖర్చులు పూర్తిగా తగ్గించటం . అవసరమైన ఖర్చులు అంటే కాఫీ , టీ, సినిమాలు , బట్టలు  ఈ కోవలోకి వస్తాయి. మీ కోరికలను కొద్దిగా అదుపులో పెట్టుకుంటే చాలు దానితో పొదుపు చేయవచ్చు.ఇక అనవసరమైన  ఖర్చులు . మీరు మీ బడ్జెట్ ను పరిశీలిస్తే దాని వలన తక్షణావసరాలు , తప్పించుకొనే లేదా వాయిదా వేసుకొనే  ఖర్చులు  సులభంగా గుర్తించవచ్చు.కనీసం కొన్ని ఐనా అనవసరపు ఖర్చులు తేలుతాయి.సిగరెట్ , వక్కపొడి, పాన్ మసాలా  ,మందు లాంటి వ్యసనాలు వీటిలో తప్పకుండా కన్పిస్తాయి.వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా అనవసరపు ఖర్చు , అనారోగ్యం  దానితో వైద్యానికి ఖర్చులు.   వీటిని కనుక మీరు మానేయగలిగితే ఎంతో సొమ్మూ మిగులుతుంది ఆరోగ్యమూ బాగుపడుతుంది. కొన్ని సంవత్సరాలనుండి  ఉన్న అలవాట్లు మానుకోవాలి అంటే కొంచెం కష్టమే కాని , ప్రయత్నిస్తే , పొదుపు చేయాలి అనే ఆలోచన కూడా ఉంటే తప్పకుండా సాధ్యం అవుతుంది.కనీసం మీ వినియోగాన్ని సగానికి సగం తగ్గించి దానిని పొదుపు చేసిన చాలు.  మీరు ఇప్పుడు భావిస్తున్న చిన్న మొత్తమే కదా అని భావిస్తున్న ఈ డబ్బూ సక్రమ పద్దతిలో పొదుపు చేస్తే మీకు వచ్చే రాబడి ఎంతో చూస్తే మీరు నమ్మలేరు.ఈ డబ్బూ మీ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా  అండగా    నిలుస్తుంది.