పోదుపు, పెట్టుబడి అంటే ఏమిటి?


పోదుపు, పెట్టుబడి  అంటే ఏమిటి?
మీలో చాలా మందికి డబ్బును అదా చేయాలి  అని ఉంటుంది. ఒక వేళ అదా చేసిన దానిని సాదారణంగా  సేవింగ్ బ్యాంక్ ఖాతాలో ఉంచుతారు.అసలు  ముందుగా మీకు  సేవింగ్ కి , ఇన్వెస్ట్మెంట్ కి గల తేడా ఏమిటి.అనే విషయం తెలియాలి. ఈ  రెండింటి మధ్య గల కీలకమైన తేడా తెలిస్తేనే మీరు చేస్తుంది సేవింగ్ న లేక ఇన్వెస్ట్మెంట్ న అనే విషయం తెలుస్తుంది.సేవింగ్ అనగానే పొదుపు అని ,ఇన్వెస్ట్మెంట్ అనగా పెట్టుబడి అని దానికి అర్ధం తెలియడం కాదు . రెండింటి మధ్య గల వాస్తవిక తేడా తెలియాలి.సాదరణంగా మీరు ప్రతి నెల మీ బడ్జెట్ రూపొందించుకోవడం అలవాటు చేసుకోండి.. బడ్జెట్ అంటే ఏదో బ్రహ్మాండమైన విషయం ఏమికాదు. మీకు వస్తున్న ఆదాయం ఎంత  ? మీ ఖర్చులు ఎంత ? మీకు మిగులుతున్నది ఎంత ?  అదాయానికి  , వ్యయానికి మధ్య గల తేడా మీ మిగులు బడ్జెట్ . సాధారణంగా మీ మిగులు బడ్జెట్ ను క్రమ పద్దతిలో పక్కన పెట్టడం సేవింగ్ . దీనిని మీరు సాదారణంగా బ్యాంక్ ఖాతాలో ఉంచుతారు ఇక్కడ మీరు పొదుపు చేసిన డబ్బులో పెరుగుదల ఉండదు . ఒకవేళ ఉన్నా అది అతిస్వల్పం  . వీటిని భద్రత  అధికం గల  పథకాలలో మాత్రమె ఇన్వెస్ట్ చేస్తారు.వీటిలో నష్టభయం చాలా తక్కువ.ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు పొదుపు చేసిన డబ్బును మంచి రాబడి అందివ్వగల సాధనాలలో పెట్టుబడిగా పెట్టడం.ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏ ఏయే సాధనాలలో ఇన్వెస్ట్ చేయాలి  అనే విషయం తెలుసుకోవాలి.సేవింగ్ లో ఎప్పుడు రిస్క్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ లో రిస్కు ఉంటుంది. కాని ఒక్క  విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి  రిస్కు లేకుండా రాబడి మాత్రం ఉండదు.ప్రతి వ్యాపారంలో లాభనష్టాలు అనేవి సహజం అంత మాత్రాన వ్యాపారం చేయడం మానేస్తారా! కాకపోతే మీరు చేయాల్సినది  మీరే స్వయంగా  మార్కెట్లోని వివిధ విభాగాలలో అవగాహన  పెంపొందించుకొని  , మంచి పెట్టుబడి విధానాన్ని క్రమశిక్షణతో అనుసరించాలి.    ఇక్కడ మీరు చేయాల్సినది రిస్కును బేరీజు వేసుకుంటూ మంచి రాబడి అందివ్వగల  సాధనాలలో పెట్టుబడి  చేయడం. సేవింగ్ అనేది చిన్నవయస్సు నుండే అలవాటు కావాలి . ఇన్వెస్ట్మెంట్ అనేది మీ సంపాదన మొదలైన రోజు నుండే ప్రారంభం కావాలి. ఇన్వెస్ట్మెంట్స్ ని ఎక్కువగా స్టాక్ మార్కెట్, బాండ్స్ , మ్యుచవల్   ఫండ్స్ , రియల్ ఎస్టేట్, బంగారం మరియు కమోడిటీస్  వంటి వాట్లో ఎక్కువగా చేస్తారు.

ఒక తాత తన మనవడైన శ్రీ రాం కి , వాడి   బర్త్ డే సందర్భంగా వంద రూపాయలు బహుమతిగా ఇచ్చెను . అప్పుడు శ్రీ రాం సంతోషంగా తన తల్లి వద్దకు వెళ్లి నేను ఈ డబ్బుతో చాక్లెట్లు  కొనుకుంటాను  అని చెప్తాడు. అప్పుడు  శ్రీ రాం వాళ్ళా  అమ్మ  చాక్లెట్ల వల్ల దంతాలు యేవిధంగా  పాడు అవుతాయో వివరించి ఆ డబ్బులు చాక్లెట్ల కొనుక్కోవడానికి బదులుగా గల్లాగురిగి లో దాచోకోమని చెప్తుంది. దానికి శ్రీరం అయిష్టంగానే అంగీకరిస్తాడు.ఈ విధంగా శ్రీ రాం తనకి ఎవ్వరూ చాక్లెట్లు  కొనుక్కోవడానికి  డబ్బులు ఇచ్చిన వాటిని గల్లాగురిగి లోనే దాచుకోనేవాడు. కొన్నాళ్ళకి ఈ గల్లాగురిగి  నిండి పోవడంతో  శ్రీ రాం మరియు శ్రీ రాం తల్లి దానిని పగులగొట్టి  అందులోని డబ్బులు లెక్కించగా వారు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉండటంతో చాలా సంతోషపడతారు.ఇప్పుడు శ్రీ రాం తల్లి ఈ డబ్బులు బ్యాంక్ లో వేయడం వలన శ్రీ రాం కి బ్యాంక్ గురుంచి కూడా వివరంగా తెలుస్తుంది అని , బ్యాంక్ కి వెళ్లి ఆ డబ్బును బ్యాంక్ లో డిపాజిట్ చేపిస్తుంది.అప్పుటి   నుండి శ్రీ రాం  బ్యాంక్ లో డబ్బు  డిపాజిట్  చేయడం మొదలు పెడతాడు. శ్రీ రాంకి    ఎ విధంగా  సేవింగ్  చేయడం అలవాటు కావడం  అతని తల్లి ఎంతో గర్వ పడుతుంది.ఒక భాద్యత గల తల్లిగా  తన కొడుక్కి సేవింగ్ చేయడం అలవాటు చేసినది.ఇది సాదారణంగా చాలా ఇళ్లలో జరుగుతున్నదే. ప్రపంచంలో అత్యధికంగా సేవింగ్ చేస్తున్నది మనదేశంలోనే .భారతీయుల్లో సేవింగ్ చేయడం అనేది వారి జీవితంలో ఒక భాగం .ఇంతగా  పొదుపు చేసే అలవాటు ఉన్న  మన దేశం  ఇంకా పేద దేశంగా ఉండటానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసా !  మీ దగ్గర ఉన్న ఈ పొదుపు చేసిన మొత్తాన్ని మంచి రాబడి అందివ్వ గల పెట్టుబడి సాధనాలలోకి మళ్ళించకపోవడమే.
ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.htmlఈ రోజు స్టాక్ మార్కెట్ 06-09-2012


ఈ రోజు స్టాక్ మార్కెట్ 06-09-2012
ఈ రోజు సాయత్రం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశం ఉన్నందున మార్కెటులో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అవకాశం కలదు.  కాకపోతే నిఫ్టీ 50sma ఐనటువంటి  5263 క్రింద  క్లోజ్ కావడం జరిగినది. ఏది ఏది ఏమైనప్పటికీ నిఫ్టీ పరిమిత శ్రేణిలో మాత్రమే కదలాడటం జరుగుతుంది.పై లెవల్లో 5265 లేదా 5288   స్టాప్ లాస్ తో సెల్ చేయడం క్రింది లెవల్లో  5190 బై చేయడం మంచిది. తప్పనిసరిగా స్టాప్ లాస్ పాటించండి. రెసిస్టన్స్ 5265,5288 వద్ద , సపోర్ట్   5190, 5166కలదు. వీలయినంత వరకు లో  లెవల్లో బై  చేయడం మంచిది. నిఫ్టీ 5190 క్రింద నిలదోక్కుకున్నట్టు ఐతేనే మరింత క్రిందకు దిగాజారడానికి అవకాశం కలదు 5190  కంటే క్రిందకు  దిగాజారనంతవరకు లాంగ్ పోజిషన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు