ఈక్వీటీ మరియు డేట్ కి మధ్యగల తేడా ఏమిటి ?

ఈక్వీటీ మరియు డేట్ కి మధ్యగల తేడా ఏమిటి ? 
ఆర్ధిక అక్షరాస్యత సాదించే సమయంలో ఎదుర్కొనే చాలా  బేసిక్ ప్రశ్న ఇది. చాలా మంది షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాని వారికి కూడా చాలా మందికి అతి బేసిక్ ప్రశ్న ఈక్విటీ అంటే ఏమిటి ? డేట్ లేదా ఋణ పత్రం అంటే ఏమిటో తెలియదు.ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఈక్వీటీ మరియు డేట్ అంటే ఏమిటి? వాటి మధ్య గల తేడా ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.
ఈక్వీటీ అనగా షేర్లు లేదా వాటా అని అర్ధం అంటే మీరు ఒక కంపెనీలో ఈక్వీటీ తీసుకుంటున్నారు అంటే మీ ఈక్వీటీ విలువకి అనుగుణంగా మీరు ఆ కంపెనీలో యాజమాన్యుపు హక్కును పొందుతారు. మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు అనుకోండి. దానిని వంద సమానభాగాలు లేదా ముక్కలుగా  చేసి మీ వద్ద 51% భాగాలు లేదా ముక్కలు ఉంచుకొని మిగితా భాగాలు లేదా ముక్కలు ఇతరులకు ఇచ్చేసారు అనుకోండి. ఈ ముక్కలు లేదా భాగాలనే ఈక్వీటీ , షేర్లు లేదా వాటాలు అంటారు.ఈ విధంగా వాటాలు తీసుకున్న వారందరూ మీ కంపెనీలో మీతో పాటు వారి వాటా విలువకి అనుగుణంగా యాజమాన్యుపు హక్కును పొందుతారు.మీరు ఈక్వీటీ లేదా షేర్ గురుంచి మరింత  వివరంగా తెలుసుకోవాడానికి  షేర్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ? అని నేను ఇది వరకు వ్రాసిన ఆర్టికల్ క్రింది లింక్ ద్వారా చదవండి.పూర్తీగా అర్ధం అవుతుంది.
ఇప్పుడు డేట్ అంటే ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. డేట్ అనగా ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ బ్యాంక్స్ , ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూట్స్  లేదా పబ్లిక్ నుండి అప్పు తీసుకోవడం ,ఈ విధంగా తీసుకున్న అప్పుకి   డేట్ సర్టిఫికేట్ లేదా ఋణ పత్రం ఇస్తాయి. మీరు  కంపెనీకి ఇచ్చే అప్పులనే డేట్ పేపర్స్ అంటారు. మీరు సాదారణంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వాటా తీసుకొంటే మీరు కంపెనీలో భాగస్వాములు అవుతారు. ఇది మీరు ఈక్వీటీలు కనుగోలు చేయడం ద్వారా సాధ్యం అవుతుంది.అదే మీరు డేట్ పేపర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు కేవలం కంపెనీ కి అప్పు ఇచ్చినట్టు. మీరు ఇచ్చిన అప్పుకి కంపెనీ నిర్ణీత రేటు ప్రకారం వడ్డీ ఇస్తుంది.ఎందుకంటె కంపెనీ తన అవసరాలకు అనుగుణంగా మీ వద్ద డేట్ పేపర్ రూపంలో అప్పు తీసుకున్నది కావున.కొన్ని సమయాలలో ప్రభుత్వాలు కూడా ప్రజల వద్ద నుండి అప్పు సేకరిస్తుంటాయి.వాటినే మనం సాధారణంగా బాండ్స్ అని పిలుస్తుంటాం..ఈ డేట్ పేపర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు బ్యాంక్స్ అందించే వడ్డీ కంటే అధిక వడ్డీ పొందవచ్చు.మరియు పూర్తీ సురక్షితం.