మీ బ్యాంక్ అకౌంట్స్ ప్రాడ్స్ నుండి ఎలా కాపాడుకోవాలి.?
Crime patrol అనేది సోనీ టి వి లో ప్రసారమయ్యే పాపులర్ క్రైం షో . ఈ షో వాస్తవంగా జరిగిన క్రైం వెనుక గల సంఘటనలను తెలియచేస్తుంది.ఇందులో ఇటివలే చెన్నయ్ లో జరిగిన e-fruad ప్రసారం చేయడం జరిగినది.ఈ వాస్తవ సంఘటన వెనుక ఉన్న అసలు విషయం మరియు దాని వలన మనం నేర్చుకోవలసినది ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.
ప్రతీక్ష చెన్నయ్ కి చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ . ఆమె గత ఏడు సంవత్సరాల నుండి TCS e-serve లో ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ అయినటువంటి సిటి బ్యాంక్ కి చెందిన బ్యాక్ ఎండ్ ఆపరేషన్ చూసే విభాగంలో పని చేస్తుంది. ప్రతీక్ష వివాహం కొన్ని నెలల క్రితమే జరిగినది. ఆమె భర్త కూడా సాప్ట్ వేర్ ఇంజనీర్. ఆమె చిన్ననాటి స్నేహితుడు చాలా అత్యవసరమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి ప్రతీక్షని ఏదైనా నాన్ ఆపరేటివ్ అకౌంట్ లో నుండి డబ్బు దొందిలించవలసినదిగా ప్రోత్సహించేవాడు. ప్రతీక్ష సంవత్సరం నుండి ఎలాంటి ఆపరేటివ్ లేని కొన్ని నాన్ ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్ గుర్తించి వాటి అకౌంట్ హాల్దర్ అడ్రస్ మార్పు చేసింది.అటుపిమ్మట బ్యాంక్ వారికి డెబిట్ , క్రెడిట్ కార్డ్ కోసం రిక్వెస్ట్ పంపించడం జరిగినది.బ్యాంక్ వారూ మార్పు చేసినటువంటి కొత్త అడ్రస్ కి డెబిట్ , క్రెడిట్ కార్డ్ పంపించడం జరిగినది.వాటిని ఆమె స్నేహితుడు తీసుకొని వాటి ద్వారా బ్యాంక్ అకౌంట్ నుండి నలబై తొమ్మిది లక్షలు డ్రా చేయడం జరిగినది.
ఒకానొక సమయంలో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి అకౌంట్ హాల్దార్ ను సంప్రదించడం జరిగినది.అతను ఎలాంటి రిక్వెస్ట్ లు పంపించడం కాని, డబ్బు డ్రా చేయడం కాని చేయలేదని తెలియచేయడం జరిగినది. బ్యాంక్ అధికారులు TCS e-serve విభాగం వారికి ఫిర్యాదు చేయడం జరిగినది.వారూ వారి విచారణలో ప్రతీక్ష కంప్యుటర్ నుండి బ్యాంక్ డేటా మార్పు జరిగినట్టుగా గుర్తించారు. ప్రతీక్ష కూడా ఈ విషయం ఒప్పుకోవడం జరిగినది. ఆమె స్నేహితుడు ప్రస్తుతం పరారీలో ఉండటం జరిగినది.
పై స్టోరీ నుండి ఏమి నేర్చుకోవాలో ఒక్కసారి తెలుసుకుందాం.
ఇక్కడ వారూ ప్రాడ్ చేయడానికి ఎన్నుకున్న అకౌంట్ ,నాన్ ఆపరేటివ్ అకౌంట్ అంటే కొంత కాలం నుండి ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం లేనటువంటి అకౌంట్.సంవత్సరం కంటే ఎక్కువకాలం మీరు మీ అకౌంట్ లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే దానిని నాన్ ఆపరేటివ్ అకౌంట్ . కొన్ని బ్యాంక్స్ సంవత్సర కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే మరికొన్ని రెండు సంవత్సరాల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటాయి.అందువలన మీ బ్యాంక్ అకౌంట్ ని ఎక్కువ కాలంఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా ఉంచకండి.ఆ విధంగా ఉంచడం వలన మీ అకౌంట్ ని ఇలాంటి ప్రాడ్స్ కోసం ఎన్నుకోవడానికి అధిక అవకాశం ఉంటుంది.మీ అకౌంట్ నాన్ ఆపరేటివ్ అకౌంట్ గా మారడానికి ఎక్కువగా మీకు సమయం లేకపోవడం, లేదంటే అకౌంట్ లో ఉన్న డబ్బూ పై వడ్డీ వస్తుంది అని ఆశించడం ఏదైనా కావచ్చు.ఒకవేళ మీకు వడ్డీ కావలి అనున్కుంటే బ్యాంక్ అకౌంట్ లో ఉంచే బదులు ఫిక్సుడ్ డిపాజిట్ చేయడం చాలా మంచిది.ఒకవేళ మీ అకౌంట్ ఆపరేటివ్ అకౌంట్ అయినా కూడా తరచుగా మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ చెక్ చేసుకోవడం మంచిది.
మీరు మీ డబ్బూ బ్యాంక్ అకౌంట్ లో ఉంచడం కన్నాఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది.పైన చెప్పినట్టుగా నలభై తొమ్మిది లక్షలు నాన్ ఆపరేటివ్ అకౌంట్ లో ఉంచుకోవడం కంటే బుడి తక్కువ పని మరొకటిలేదు కదా ? బ్యాంక్ అకౌంట్ లో ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కంటే ఎక్కువగా డబ్బూ మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంచకూడదు.బ్యాంక్ అకౌంట్ లో ఈ డబ్బూ ఉంచడం వలన మీరూ మీ డబ్బూ ఇన్వెస్ట్ చేయడానికి గల చాలా అవకాశాలను కోల్పోతుంది.
సాదారణంగా బ్యాంక్స్ వారి వద్ద నుండి హోం లోన్స్, క్రెడిట్ కార్డ్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ కోసం మాతరం చాలా ఫోన్స్ వస్తాయి. కాని ఏ బ్యాంక్ వారూ కూడా మీ అకౌంట్ నా ఆపరేటివ్ అకౌంట్ గా మారుతుంది అని మాత్రం తెలియచేయారు. ఈ విషయంలో బ్యాంక్ వారూ కాస్త శ్రద్ద చూపిస్తే ఇలాంటి ప్రాడ్స్ జరగకుండా చూసుకోవచ్చు.
ఇలాంటి ప్రాడ్స్ ఎక్కువగా సెక్యూరిటీ ఉల్లంఘన వలెనే అధికంగా జరుగుతాయి. చాలా బ్యాంక్స్ కూడా వారి బ్యాక్ ఎండ్ ఆపరేషన్ కోసం థర్డ్ పార్టీ ని నియమించుకోవడం లేదా వారి సాప్ట్ వేర్ వాడటం చేస్తుంటాయి.కస్టమర్ యొక్క సున్నితమైన డేటా విషయంలో బ్యాంక్స్ వారూ అధిక శ్రద్ద తీసుకోవడం మంచిది.బ్యాంక్స్ ఒకటికి రెండు సార్లు ఇలాంటి విషయాలు జరగకుండా రక్షణ చర్యలు లేదా బయోమెట్రిక్ రక్షణ చర్యలు చేపట్టడం మంచిది. కస్టమర్స్ కష్టపడి సంపాదించిన వారి సొమ్మూ బ్యాంక్ లో అయితే భద్రంగా ఉంటుంది అనే నమ్మకంతో మాత్రమే బ్యాంక్స వద్దకు వస్తున్నారు. ఇలాంటి సంఘటన వలన బ్యాంక్స్ పై కూడా నమ్మకం సడలే అవకాశం కూడా కలదు.