మీరు ,మీ పిల్లలు జీవితంలో ఆర్ధికంగా ఎదిగి మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆర్ధిక విషయాలు part -1
డబ్బు గురుంచి మిలియనీర్లు , బిలియనీర్లు వాళ్ళ పిల్లలకు నేర్పేది , పేద , మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ పిల్లలకు నేర్పలేనిది ఏమిటో తెలుసుకుందాం.
సాదారణంగా మీరు ఏ ఇంట్లో చూసిన ఏ తల్లిదండ్రులు అయినా వారి పిల్లలకు పై క్రింది నేర్పిస్తారు.మీరు జీవితంలో కనుక ధనవంతులు , మిలియనీర్లు , బిలియనీర్లు కావాలి అంటే మాత్రం కొన్ని ఆర్ధిక విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
MIDDLE CLASS TEACH
|
RICH TEACH
|
GO TO SCHOOL
|
FINANCIAL STATEMENTS
|
WORK HARD
|
ASSETS
|
GET GOOD GRADES
|
LAIBILITIES
|
GET A JAB
|
CASH FLOW
|
JOB SECURITY
|
GOOD & BAD DEBT
|
DO IT YOUR SELF
|
BUSINESS
|
NEVER THINK OF MONEY
|
INVESTMENTS
|
BUSINESS IS RISKY
|
CREATE JOBS
|
INVESTMENT IS RISKY
|
PASSIVE INCOME
|
అందరూ వారి జీవితంలో ఏదో ఒక్కరోజు ధనవంతులు కావాలి అని ఆశ పడుతూ కలలు కంటారు. ఆశపడటం , కలలు కనడంలో ఎలాంటి తప్పు లేదు.కాని దురద్రుస్టావశాత్తు మన విద్యా వ్యవస్థ డబ్బు గురుంచి ఎలాంటి భోదన చేయడం లేదు. అందువల్లనే చాలా మంది విద్యార్థులు వారి కళాశాల విద్య అనంతరం జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. చివరకు వారం ప్రారంభంలో సాలరీ కొరకు ఎదిరి చూడాల్సి వస్తుంది.పోనీ కనీసం తల్లిదండ్రులు అయినా పిల్లలకు డబ్బు గురుంచి, ఆర్ధిక విషయాల గురుంచి చిన్నప్పటి నుండి నేర్పిస్తారా అంటే అది ఉండదు. ఇందులో పాపం వారి తప్పేం ఉంది. ముందుగా వారికి అవగాహన ఉండాలి కదా ?. అదే మిలియనీర్లు , బిలియనీర్లు వారి పిల్లలకు చిన్నప్పటి నుండి డబ్బు గురుంచి, ఆర్ధిక విషయాల గురుంచి చిన్నప్పటి నుండి నేర్పిస్తారు. ఎందుకంటె వారికి ఆర్ధిక విషయాల పట్ల పూర్తీ అవగాహన ఉంటుంది కాబట్టి. మీరు జీవితంలో ఆర్ధికంగా ఎదగాలి అంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఇక్కడ చెప్పే విషయాలను తప్పనిసరిగా నేర్చుకోవాలి. ముందుగా మీరు మధ్యతరగతి, మిలియనీర్లు, బిలియనీర్ల ఆలోచనా విధానాలలో గల తేడా తెలుసుకోండి.
మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం కష్టపడతారు.
మధ్యతరగతి వారి ఆలోచనా విధానం సాదారణంగా సెక్యూరిటీ గా ఉండే ఉద్యోగం సంపాదించడం , ఆ ఉద్యోగంలో నెలవారీ జీతం కోసం కష్టపడటం , కొంత వయస్సు వచ్చాక అంటే అరవై , అరవై ఐదేళ్ళ వయస్సు వచ్చాకా రిటైర్ కావడం అనే విధంగా ఉంటుంది.
ఈ ఆలోచన విధానం వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల నుండి వస్తుంది. ఇప్పటికి కూడా వారి ఆలోచన విధానంలో తేడా ఎంత మాత్రం ఉండదు. ఉద్యోగం లేకపోవడం లేదా ఉన్న ఉద్యోగం పోవడం అనే ఆలోచనే వారికి భరింపరానిదిగా ఉంటుంది. వీరికి డబ్బు సంపాదించడానికి చేతనైనది ఒక్కటే అది ఉద్యోగం చేయడం. వారి విలువైన జీవితాన్ని ఉద్యోగానికి అంకితం చేస్తూ ప్రతినెల మొదటి వారం రాగానే సాలరీ కొరకు ఎదిరిచూడటం మాత్రమే చేస్తారు.
మిలియనీర్లు వారి మనీని వారి కోసం పనిచేసే విధంగా చేస్తారు.
సాదారణంగా మిలియనీర్లు వారి మనీ ని వారి కోసం పనిచేసే విధంగా చేస్తారు.అంటే వారూ అధికంగా కష్టపడకుండా వారూ ఇదివరకే సంపాదించిన మనీ , ఇంకా వారి కోసం సంపాదించే విధంగా చేసుకుంటారు.వీరూ మనీని మానేజ్ చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు.అంటే మనీని పెట్టుబడి పెట్టడం . వీరూ సాదారణంగా అనేక రకాలైన పెట్టుబడులు పెడతారు. అంటే షేర్స్ , రియల్ ఎస్టేట్ , గోల్డ్, బాండ్స్, మ్యుచవల్ ఫండ్స్, బిజినెస్ , వెబ్సైట్స్ మొదలగునవి. వీరికి ఇన్వెస్ట్మెంట్ చేయడం నైపుణ్యంతో కూడుకున్నది అనే విషయం బాగా తెలుసు, దాని వలన ఆర్ధికంగా చాలా త్వరగా ఎదగవచ్చు అనే విషయం కూడా బాగా తెలుసు. అందువల్లనే వారూ వారి యుక్త వయస్సులో అంటే సంపాదన మొదలైన తొలినాళ్ళ లోనే వీరూ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారు. వీరి ఆలోచన విధానం ఒక్కటే .ఇన్వెస్ట్ చేసిన మొదటి రోజు నుండే వారి మనీ ,వారి కోసం పని చేయడం మొదలు పెట్టి కొంత కాలానికి వారిని ఆర్ధికంగా ఉన్నత స్థితిలో నిలబెట్టి ధనవంతులు చేస్తుంది అని. అంతే కాకుండా వీరూ ,వారి పిల్లలకు చిన్నప్పటి నుండి ఆర్ధికపరమైన పాఠాలు , ఇన్వెస్ట్మెంట్ నైపుణ్యాలు నేర్పుతారు. అదే సమయంలో మధ్యతరగతి వారూ మాత్రం వారి పిల్లలకు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే , సెక్యురిటీ ఉన్న మంచి ఉద్యోగం వస్తుంది.దానితో పాటు మంచి సాలరీ వస్తుంది అని పిల్లలకు నేర్పుతారు.